Varaprasad Daitha Profile picture
Sep 19, 2020 9 tweets 2 min read Read on X
ధర్మసందేహం

“హస్త భూషణం”

అక్కా ఆగవే ఏంటీ కంగారు నాకు సమాదానం చెప్పి వెళ్ళు

అబ్బా...ఒరేయ్ ప్రొద్దుటే బొల్డ్ పని వుంటుంది.... పనులు చక్కపెట్టుకోవాలి కదా....కూసేపు ఆగి నీతో మాట్లాడతాను.

ఈ పెద్దవాళ్లు అందరూ అంతేనమ్మా.... అడిగితే చెప్పరు.... పొరపాటు చేస్తే మమ్మల్నే నిందిస్తారు....
ఒరేయ్ అంత మాట అనకు.... నీ తరవాతే పని.... చెప్పు నీ సందేహం....ఆ అర్ధం అయింది.

మనిషి భౌతిక శరీరం తోలు మాంసం ముద్దల సమాహారం. దానికి వస్త్ర, ఆభరణాల అలంకరణతో అందం ఇనుమడిస్తుంది. కదా....

అందుకనే పాపం ఆడవారు.... క్రొత్త వస్తువులు ధరించి అందరిని అడుగుతారు...ఎలా వుంది అని. వాళ్ళు
పిచ్చివాళ్లు కాదు.... ఆ ఆభరణం తాను వేసుకుంటే... తనకే కాకుండా ...ఆ ఆభరణం అందం కూడా ఇనుమడించాలనే చిరు కోరిక.... కానీ మీ మగవారికి అర్ధం కాదు. సర్లే....

అలాగే మన చేతులలో నిరంతరం ఒక పుస్తకం ఆభరణంగా వుంది అనుకో..... బాహ్య, అంతర సౌందర్యంతో బాటు, మానసిక వికాసం, బుద్ది కుశలత,
మేధా శక్తి పెరుగుతాయి....

ఒసే...మా స్కూల్ పుస్తకాలు చదువుతూ వుంటాము కదే.... ఇక కాళీ ఎక్కడ ???

అకడమిక్ చదువు నీకు మంచి కొలువుకు అర్హత కలిగిస్తుంది.... ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది.

కానీ మంచి పుస్తకం ... నీవు పదవిలో ఉన్నత స్థాయికి చేరుకున్న.....సమాజంలో ఉన్నత విలువలు కలిగిన
ఒక మంచి మనిషిగా తీర్చి దిద్దుతుంది....

ఒరేయ్.... పొన్నారి...దౌర్భాగ్యం ఎమిటంటే... మీరు ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ రీడింగ్ కు అలవాటు పడి... భౌతిక పుస్తక పఠనం విస్మరిస్తున్నారు.... లాభాలు చెపుతా వినుకో.....

1. ఫిజికల్ బుక్ రీడింగ్ వలన ఏకాగ్రత, ఆలోచన శక్తి పెరుగుతుంది
2. కదాంశం చదువుతున్నప్పుడు నీవు కూడా వూహాలోకంలో విహరిస్తూ....ఆ ఆనందకర స్థితిని వర్చువల్గా ఫీల్ అవుతావు. నీలో ఎనలైటికల్ థింకింగ్ ,రీజనింగ్, ఎవాల్యుఎషన్ కాపాబిలిటీస్ పెరిగి .... నిత్య జీవితంలో ఎటువంటి ఒదుదుడుకులకైనా నిగ్రహంగా నిలబడే శక్తి పొందగలవ్....
3. కానీ...ఎంచుకునే పుస్తకం... నీ ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ప్రతీ పుట లోని అక్షరం నీకు క్రొత్త ఉత్తేజాన్ని ప్రసాదించేదిగా వుండాలి ....

కానీ... ఒరేయ్ .... నిష్ణాతులైన వారి ఆటోబయోగ్రఫీ, వారి సామాజిక స్పృహతో రాసే రచనలు ఎందరినో ప్రభావితం చేస్తాయి....ఎహ్... మంచి సినిమా థియేటర్
లో డిజిటల్ సౌండ్ సిస్టమ్ లో చూచిన దానికి, మొబైల్ లో యుట్యూబ్ లో చూచినదానికి తేడా లేదూ???......

అమ్మయ్యా ....ఇప్పుడు నీకు అర్ధం అయివుంటుంది.....

అల్ ది బెస్ట్.... ఈ రోజూ నుండే కాళీ దొరికితే.... మొబైల్ రీడింగ్ కి కాకుండా .....మంచి పుస్తకం చేతికి తీసుకో....ఆ మజాయే వేరు....
ఉంటా రా.... మళ్ళీ నీకు కేరెజ్ రెడీ చేయాలి ....

అక్కోయ్ మర్చిపోయావ్ ...మాకు స్కూల్ లేదు కదా.... అదేరా...ఆన్లైన్ క్లాసుకి. ఎంత ఇంట్లో వుండి క్లాసుకి అటండ్ చేసినా....స్కూల్ లో వున్నట్లే ఫీల్ అయితే ఫలితం వుంటుంది....

మీ...జ్ఞాన కేంద్ర కుటుంబ చిట్టి చిన్నారి.... (Whats app msg)

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

Jul 12, 2023
రోజుకు 12 గంటలు చదివాక కూడా కొడుకు చరిత్ర పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు.

నా కొడుకు ఎందుకు తప్పాడా అని తండ్రికి అనుమానం వచ్చింది.

స్కూల్ కి వెళ్లి కొడుకు రాసిన ఆన్సర్ షీట్ చెక్ చేసాడు.

ప్రశ్న : భారత దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది ?
కొడుకు సమాధానం : 2014
ప్రశ్న : పాల విప్లవం ఎప్పుడు మొదలైంది ?
కొడుకు సమాధానం : 2014

ప్రశ్న : హరిత విప్లవం ఎప్పుడు మొదలైంది ?
కొడుకు సమాధానం : 2014

ప్రశ్న : దేశంలో పౌర విమానయాన సేవలు ఎప్పుడు మొదలయ్యాయి ?
కొడుకు సమాధానం : 2014

ప్రశ్న : దేశంలో రైలు సేవలు ఎప్పుడు మొదలయ్యాయి ?
కొడుకు సమాధానం : 2014
ప్రశ్న : దేశంలో ఐఐటీ, ఐఐఎం,ఇస్రో, ఎయిమ్స్ ఎప్పుడు మొదలయ్యాయి ?
కొడుకు సమాధానం : 2014 నుండి

ప్రశ్న : భారత సైనిక విభాగాలు సీఆర్పేఎఫ్, సిఐఎసెఫ్, ఐటిబిటి వంటివి ఎప్పుడు ఏర్పడ్డాయి ?
కొడుకు సమాధానం : 2014

ప్రశ్న : భారత దేశంలో పారిశ్రామిక విప్లవం ఎప్పుడు మొదలైంది ?
Read 6 tweets
Jun 19, 2023
అత్తయ్య గారూ ! ఎలా వున్నారూ"? ఆషాడమాసంలో పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేసి కుశలమడిగింది.

"నేను బావున్నానమ్మా! నువ్వెలా వున్నావు?"

"నేనూ బాగున్నానండీ! అత్తయ్య గారూ! మా అమ్మ నేనూ చీరలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళుతున్నామండీ! ఆషాడమాసం కదా చీరలకి
డిస్కౌంట్ పెట్టారు. మీకు కూడా చీర కొందామను కుంటున్నాను. మీకు ఎలాంటి చీర కొనమంటారు ?"

"అలాగా! మంచిదమ్మా! నాకు షాపింగ్ కు వెళ్లే శ్రమ తగ్గించావు.  నువ్వు అడిగావు కాబట్టి చెపుతున్నాను. చీర మీద నా అభిప్రాయాలు నా ఇష్టాఇష్టాలు చెపుతాను. దాన్ని బట్టి ఒక చీర సెలెక్ట్ చేయమ్మా.
అందరూ ఆ చీర చూసి ఆహా! ఓహో! అనాలి. ఏ షాప్ లో కొన్నారు ? 'ఏ కాలేజీలో చదువు తున్నారు' ? అనే లెవెల్ లో ఉండాలి.

చీర మరీ ఎక్కువ ఖరీదు వుండకూడదు. ఎందుకంటే, అంత ఖరీదైన చీర కట్టుకుని బిగుసుకుపోయి, జీవితంలో మొట్ట మొదటి సారి ఫొటో తీయించుకునే వాళ్ల లాగా, ఎక్కడ కూర్చుంటే ఏమి అంటుకుంటుందో
Read 22 tweets
Jun 19, 2023
*'మానవులు' గా బతకటం కాదు.. # 'మానవత్వం' తో బతకాలి!*

@ _*'ఐకమత్యం' - అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే... తేనెతుట్ట మీద రాయి విసిరితే మనమే పారిపోవాలి !*_

# _*ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !*_
@ _దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె' లోనేవున్నాడు._

@ _సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._

@ _కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు.
ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు.. గుర్తుంచుకో!_

@ _'జ్ఞానం'.. ఆలోచించి మాట్లాడుతుంది. 'అజ్ఞానం'.. మాట జారాక ఆలోచిస్తుంది.
Read 13 tweets
Jun 19, 2023
*మౌనం : Silence*

_వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది._

_అయిదు విధాల ‘శాంతి’ లలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు._
_‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత.   *‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’* అన్నారు స్వామి వివేకానంద._

_మౌనం మూడు రకాలు._
1. _*ఒకటవది: వాక్‌మౌనం.* వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు.
ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి._
2. _*రెండోది అక్షమౌనం.* అంటే ఇంద్రియాలను నిగ్రహించడం._

3. _*మూడోది కాష్ఠమౌనం*. దీనినే ‘మానసిక మౌనం’ అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది.
Read 9 tweets
Jun 11, 2023
*_ఇది సోమరిపోతుల_* *_కర్మాగారం!_*

_______________________

పని చేయని వాడు
సోమరిపోతనేది పాతమాట..
ఇప్పుడు వాడే
సర్కారు ముద్దుబిడ్డ..
వాడికి తెల్ల కార్డిచ్చి
దానికి జతగా
బోలెడు స్కీములిచ్చి
ఆపై పించనిచ్చి
సోమరిపోతును
సొమ్మరిపోతుగా
తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం..
ఓటుమారి స్కీములు
దండగమారి స్కాములు..
వారు వీరు అంతా
స్వాహాస్వాములు..!

నిజానికి మన వ్యవస్థలే
సోమరిపోతుల
కర్మాగారాలు..
ఎవరికి ఎప్పుడు
ఏమిస్తాయో తెలియదు..
కులవృత్తులను
సబ్సిడీలకు
అనుకూలవృత్తులుగా మార్చి
పంచేస్తున్నాయి సొమ్ములు..
పెంచేస్తున్నాయి అప్పులు..
ప్రతి కులానికి
ఓ కార్పొరేషన్..
డబ్బులు పంచడం..
పంచుకోడమే
వాటి మిషన్..
*_ఇదో రకం వైరల్ ట్రాన్స్మిషన్..!_*
అన్నామంటే
అన్నామంటారు గాని
ఎవడికైనా ఏదైనా
ఎందుకివ్వాలి ప్రభుత్వం..
ఎవడిని వాడు
పోషించుకోలేడా ఏమి..
కుదిరితే ఉద్యోగమివ్వు..
శ్రమ పడి పరిశ్రమ పెడతానంటే..
బుర్ర పెట్టి వ్యాపారం
చేస్తానంటే అప్పివ్వు..
Read 6 tweets
Jun 11, 2023
*శంకర నారాయణ డిక్షనరి* కథ

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.
ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....
వాడి భాష మనకి రాదు...
వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.
మనకి అది "గాడిద గుడ్డు" గా అర్థమైంది.
మనం "రాజమహేంద్రి" అన్నాం...
వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.
మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.
వ్యాపారం, పరిపాలన వాళ్ళ అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు.
1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో
Read 15 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(