🅺🅳🆁 Profile picture
వెనక పడేయబడ్డ దక్షిణ తెలంగాణ బిడ్డ | Hindu - Not BJP | Cricket Freak | ఎదిరించేవాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం | Regional Parties Mukt Bharat |

Mar 6, 2020, 6 tweets

రాత్రికి రాత్రే సింహాచలం ధర్మకర్త అశోకగజపతి రాజు గారిని తొలగించి మాన్సాస్ ట్రస్టును ఆయన అన్న కూతురు సంచైతకు కట్టబెట్టడం వెనుక కేవలం రాజకీయ కోణం మాత్రమే కాదు. మత కోణం, భూమాఫియా ప్రమేయం కూడా ఉంది. కాకపోతే ఈవిషయం ధైర్యంగా చెప్పడానికి తెదేపా నేతలు, రాజకుటుంబీకులు కూడా జంకుతున్నారు.

ఆనందగజపతిరాజు గారు బతికి ఉన్నప్పుడే ఆయన తన భార్య ఉమాగజపతిరాజుకు విడాకులు ఇచ్చారు. ఆయన మరణానంతరం తన తమ్ముడు అశోకగజపతి రాజుగారు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ధర్మకర్త అయ్యారు. రాజవంశ పెద్దదిక్కు / వారసుడినే ధర్మకర్తగా ప్రభుత్వం నియమించడం ఇప్పటివరకు వస్తున్న ఆచారం.

దానిని తుంగలో తొక్కి అశోకగజపతి రాజుగారు బతికుండగానే ఆయనను తొలగించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రహస్య జీవోలతో సంచైతను నియమించింది.

ఆనందగజపతిరాజు గారి నుంచి విడాకులు తీసుకున్న ఉమాగజపతిరాజు తరువాత రమేష్ శర్మ అనే దర్శకుడిని ద్వితీయ వివాహం చేసుకున్నారు అని సమాచారం.

ఉమా తన ఇద్దరు పిల్లలతో సహా రమేష్ శర్మతో ఉంటున్నారు. ఆయన క్రైస్తవుడు. వీరిది పేజ్ 3కుటుంబం. రమేష్ శర్మ తరచుగా విదేశాల్లో చర్చిలను, పాస్టర్లను దర్శించుకుంటారు. అలాంటి వ్యక్తి పెంపకంలో పెరిగిన సంచైత ఇప్పుడు సింహాచలం ధర్మకర్త!

వీరి కుటుంబం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది.

మాన్సాస్ ట్రస్టు ఆధీనంలో సింహాచలంతో సహా 105 ఆలయాలు, సుమారు 13,000 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో అధికశాతం విశాఖ నగర పరిధిలో ఉన్నాయి.

విశాఖపట్నం రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో, దీని వెనుక ఉన్న కారణాలు మనం తేలిగ్గా ఊహించవచ్చు.

సంచైత గత ఎన్నికల ముందు భాజపాలో చేరారు తప్ప, పార్టీ కార్యక్రమాల్లో ఏనాడూ చురుకుగా లేరు. సుజనాచౌదరి ఎందుకు చేరారో ఈమె కూడా అందుకే చేరినట్లు కనబడుతోంది.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling