తిరుపతి, న్యూస్‌టుడే: ఆమె పేరు ఎస్తర్(32). రష్యా వనిత. ఫిజియోథెరపీ వైద్యురాలు. ఆలయాల అలంకరణలోనూ ప్రావీణ్యముంది. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తల్లి ఒలివియాతో (55) కలిసి ఫిబ్రవరి 6న భారత్‌కు వచ్చారు. లాక్‌డౌన్ సమయంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో గడిపి ఆంక్షలు సడలించాక
@JaiTDP
తిరుపతి శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చారు. ప్రస్తుతం విదేశీయులకు దర్శన భాగ్యం లేదని తెలిసి నిరాశకు గురయ్యారు. చేతిలో డబ్బులు కరిగిపోగా... ఎవరైనా తమను ఆదుకుంటారనే ఆశతో రష్యన్లు ఎక్కువగా వచ్చే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావనం పట్టణానికి ఎస్తర్ తల్లి వెళ్లారు.
అక్కడ ఎలాంటి సాయమూ అందలేదు. పైగా తిరిగి రాలేక అక్కడే ఇరుక్కుపోయారు. ఎస్తర్ అవస్థలను చూసిన కపిల తీర్థం సమీపంలోని ఓ రెసిడెన్సీ యజమాని ఆమెకు ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’తో ఆమె మాట్లాడుతూ... ‘మా కష్టాలు, కన్నీళ్ల నుంచి భారత్‌లోని దైవభక్తి, కళలు ఉపశమనం కల్పిస్తాయనే,
నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. అప్పుడు మా చేతిలో వెయ్యి డాలర్లు ఉండేవి. ప్రస్తుతం రూ.వెయ్యి, పాస్‌పోర్టు మాత్రమే మిగిలాయి. అమ్మ బృందావనంలో ఇరుక్కుపోయింది. మాకు ఉచిత సాయం వద్దు. నాకు ఫిజియో థెరపీ, వెన్నెముక వైద్యం, ఆలయాల అలంకరణ తెలుసు. ఎవరైనా పెద్ద మనసుతో అవకాశమిస్తే కడుపు నింపుకుంటా
అమ్మను రప్పించుకుంటా.తర్వాత రష్యా వెళ్లిపోతాం. కరోనా భయం, భాష సమస్యతో నన్ను ఎవరూ నమ్మడంలేదు. దయచేసి ఆదుకోండి’ అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
✓ఇలాంటి వారిని ఆదుకోవాల్సింది, ఆదుకో కలిగింది కూడా
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే!
#MinistryOfExternalAffairs #govtofindia
#APGovt #GovtofAp
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
