బారువ :
Baruva /Baruaa
శ్రీకాకుళం జిల్లా , సోంపేట మండలంలోని గ్రామం . ఇది మండల కేంద్రమైన సోంపేట నుండి 8 కి . మీ . దూరం లోను , సమీప పట్టణమైన ఇచ్ఛాపురం నుండి 14 కి . మీ . దూరంలోనూ ఉంది . ఈ ఊరిని ఆలయాల గ్రామంగా చెపుతారు . ఇక్కడ ఎటు చూసినా దేవాలయాలే కనిపిస్తాయి .
1/n
వీటికి తోడు అందమైన ప్రకృతి శోభలతో కూడిన ఈ ప్రదేశం అభివృద్ధి చేయగల మంచి పర్యాటక ప్రాంతం.ఇక్కడ ఆలయాలలో ప్రసిద్ధి చెందినవి శ్రీ కోటిలింగేశ్వర ఆలయం మరియు జనార్ధనస్వామి ఆలయాలు.ప్రకృతి శోభతో అలరారే కవిటి అనే ప్రదేశం ఇక్కడ బహు ప్రసిద్ధం.బారువ సముద్ర తీరము:ఇక్కడ తీరము బహు అందముగాను,
2/n
ఆహ్లాదకరముగాను ఉంటుంది . ఉదయిస్తున్న సూర్యుడ్ని సుముద్రతీరముంలో నిలుచుని చూడటం అద్భుతం.మహాభారతమ్, స్కన్దపురాణమ్ వంటి ధార్మిక గ్రంథాలలో బారువ తీరానికి ఓ ప్రత్యేకత ఉంది.ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కర మహోదయానికి ఈ స్థలము ప్రఖ్యాతి గాంచింది .మహోదయ పుష్కర స్నానాలు బారువ తీరాన
3/n
తూర్పుకనుమల నుంచి మొదలై ఒడిషా , ఆంధ్ర రాష్ట్రాలగుండా ప్రవహిస్తూ , బంగాళాఖాతములో కలుస్తున్న పవిత్ర మహేంద్రతనయ నదీ సంగమ స్థలమే ఈ బారువ గ్రామము . ఆంధ్ర , ఒడిషా రాష్ట్రాలనుండి అనేకమంది భక్తులు పుణ్యస్నానాలకు ఇక్కడకు వస్తారు .
4/n
చరిత్ర : స్కంధపురాణం ఆధారముగా పలువురు సిద్ధాంతులు ఇలా పేర్కొంటున్నారు . సుమారు 16 వేల సంవత్సరాల క్రితము తూర్పు కనుమలలో సంచరించిన పాండవులు ఒక అడవి జంతువుని
5/n
ఎత్తున యజ్ఞాన్ని నిర్వహించారు . ఈ మేరకు ఆ గ్రామాన్ని ' బారాహరాపురం ' గా పిలిచేవారు , కాలక్రమేణా అది బారువగా మారినది . బారువ గ్రామము పుణ్యక్షేత్రాల నిలయముగా గుర్తింపు పొందినది
6/n
పాండవులు వేటాడిన గోవును కర్మకాండ కోసం సముద్ర తీరానికి తీసుకువస్తుండగా గ్రామానికి పశ్చిమభాగములో ఆ గోవు నుండి ఒకటి తక్కువ కోటి రక్తపుచుక్కలు ఒకే చోట నేలపై పడినట్లు చారిత్రిక కదనము . అందువలన ఈ స్థలాన్ని గుప్తకాశీగా పిలుస్తున్నారు .
7/n
ఈ ప్రదేశములోనే పాండవులు కోటిలింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతారు . దీనికి దక్షిణం వైపున బ్రహ్మజనార్ధన స్వామి ఆలయము , ఊరిమధ్యలో జగన్నాధస్వామి ఆలయం , వేణుగోపాలస్వామి ఆలయమ్ , మహంకాళీ , కనకదుర్గ ఆలయాలు ఇక్కడ వెలసి ఉన్నాయి
8/n
నాటి నుంచి ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుణ్యఘడియల్లో ఇలా అధిక సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు చేపట్టడము సంప్రదాయముగా వస్తూ ఉంది.
9/9 end.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.