Telugu Tribe Profile picture

Aug 20, 2020, 8 tweets

సడన్ స్టార్లు అంతే సడన్ గానే అంతర్దానమవుతున్నారు..

ఇంకొకాయన రాజధాని ప్రాంతానికి చెందిన మంత్రి..
ఎప్పటి నుండో పార్టీ జెండా మోసి..వరుసగా ఐదుసార్లు ఎన్నికయి...ప్రతిపక్షం లో ఉన్నా గట్టిగా నిలబడిన వారికి అడ్డంగా నిలబడి మంత్రి పదవి లాగేసారు..

#TDPTwitter

టోల్ గేట్ చెల్లింపుల దగ్గర నుండి అగ్రిగోల్డ్ ఆరోపణల దాకా...

పార్టీ అండగా నిలిచింది..ప్రత్యర్దుల ఆరోపణలు తిప్పికొట్టింది.

పార్టీ ఎంతో అప్రతిష్ఢ మూటగట్డుకుంది..

మరి ఓటమి అనంతరం ఈయనేమి చేస్తున్నారు!?
మౌనవ్రతం పాటిస్తున్నారు...

ఆయన మీద వచ్చిన ఆరోపణలకు కూడా పార్టీ కవచంలా నిలవాల్సి వస్తుంది.

పార్టీ కార్యక్రమాలకు తూతూ మంత్రంగా నిర్వహిస్తూ..ఎక్కువగా తెరవెనుక ఉండటానికే ఇష్టడుతున్నారు...

ఒక దశలో జంపింగ్ చేస్తారేమో అన్న అనుమానాలు కూడా వచ్చాయి..

మళ్ళీ ఎన్నికలు దగ్గర కొచ్చే సమయానికి ఏక్టివ్ అవుతారేమో..!?

పుంగనూరు అమర్నాధ్ గారు మంచి ఫైర్ ఉన్న నాయకుడు వారు కూడా దీపావళి ముగిసిన తర్వాత..రాత్రి పేలకుండా మిగిలిన బాణాసంచా లాగ ఉండుండి మాట్లాడతారు.

అంతకు ముందు పార్టీకి హేండిచ్చినా పార్టీ మారి వచ్చినా స్వాగతం పలికి..మంత్రి పదవి కట్టబెడితే
వారు కూడా..అమాస కి పున్నానికి స్పందిస్తున్నారు.

వీరు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే...

పదవుల కోసం కొట్లాడిన వారున్నారు..అలిగిన వారున్నారు..
పదవులు పొంది కూడా సైలెంటుగా ఉన్న వారున్నారు..

ఎవరి పేరు చెబితే సీమ గడగడలాడిపోతుందని అభిమానులు నమ్ముతారో వారు కూడా పార్టీ మీద శీతకన్ను వేసినట్డు అనిపిస్తుంది..

పార్టీ ని..అధినేత ను ..దారుణంగా దూషిస్తుంటే..వ్యక్తిగతంగా..బూతులతో దాడి చేస్తుంటే...

అధికారంలో ఉన్నపుడు ఫ్రంట్ లైన్ లో ఉండి ఇప్పుడు నోర్మూసుకోవటం కేడర్ కి అసహనం కలుగుతున్నది.

అసహనం ఆగ్రహం గా మారితే..రాజకీయ ముఖ చిత్రం మీద కొత్త మొఖాలు కనిపిస్తాయి..

ఎంతటి మొనగాళ్ళయిన పార్టీ...కేడరు బలం లేక పోతే జీరోలు గా మిగులుతారు.

కడుపు చించు కుంటే కాళ్ళ మీద పడుతుంది.

అధినేత కూడా గుర్తిస్తున్నారని అనుకోవచ్చు..

అధికారం లేని సమయంలో ఎవరు ఎలా మసలుతున్నారన్నది ఆయన బాగా గమనిస్తూ ఉండి ఉండవచ్చు..

కేడరు మాత్రం కచ్చితంగా గమనిస్తున్నారు..

ప్రత్యర్దులతో పాటు పార్టీ ద్రోహులకు ..సరైన సమయంలో ..సరైనా గుణపాఠం చెప్పటానికి సిద్దంగా ఉన్నారు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling