Satya Kumar Yadav Profile picture
Member @BJP4India | Minister for Health, Family Welfare & Medical Education, GoAP | MLA - Dharmavaram | Founder, NGO-@Sanskriti_Helps

Sep 18, 2020, 5 tweets

వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో ఏదోచోట హిందూ దేవాలయాలపై, ఆస్తులపై,కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ప్రశ్నిస్తూ తలపెట్టిన చలో అమలాపురం ధర్నాకి రానివ్వకుండా వైసీపీ ప్రభుత్వం,రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిజెపి నాయకులను గృహనిర్బంధం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

హిందూ దేవాలయాలను కేవలం ఆదాయ వనరులుగా మాత్రమే చూస్తూ, దేవాదాయ శాఖ నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారు..

కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా జరుగుతున్న దారుణ సంఘటనలను ప్రశ్నిస్తున్న
భక్తులపైనా, బిజెపి కార్యకర్తలపైన ఉక్కుపాదం మోపి హిందూ ధర్మంపై విషాన్ని చిమ్ముతున్నారు.

మొన్న గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడిన ఒక వర్గం వారిపై కేసులన్నీ ఎత్తివేసారు.

నిన్న ఒక ప్రార్థన మందిరంపై 43 మంది కలిసి 4 రాళ్లు రువ్వారని రాత్రికి రాత్రి తప్పుడు కేసులు బనాయించి మహిళల్ని సైతం జైలుపాలు చేసారు.

ప్రశ్నిస్తే ఇవాళ అధికార మదంతో అక్రమ అరెస్టులు చేస్తున్నారు.

నెలల తరబడి పవిత్ర హిందూ ఆలయాలపై వరుస పెట్టి దాడులు చేస్తున్న దుండగులను పట్టుకోవడంలో లేని ఉత్సాహం అమాయక హిందువుల అరెస్టులపై ఎందుకు?

ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలు కాక మరేమిటి?

అమాయక హిందువులపై దౌర్జన్యాలు, ఆలయాలు, పోలీస్ లపై దాడి చేసిన వారికి బిర్యానిలా?

ఇదేనా మీ నీతి?

ఓట్లేసి గెలిపించిన అన్ని మతాలవారిని ఒక్కటిగా చూస్తూ, సమన్యాయం చేయకుండా బురద రాజకీయాలు చేస్తున్న జగన్ ప్రభుత్వానికి సూటిగా చెబుతున్నా..

‘మీరు చేస్తున్న ఓటుబ్యాంకు బురద రాజకీయాల నుండి హిందూధర్మాన్ని రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ లో కమల వికాసం తప్పక జరుగుతుంది..’

ధర్మో రక్షతి రక్షతః

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling