@Gajapati (ଗଜପତି) Profile picture
ଅନାଲୋଚିତ ଓଡିଶାର ପ୍ରଚାର ଓ ପ୍ରସାର #polyglot_Techie_Researcher_Odisha_Bharata handle by: BM Adhikari

Sep 25, 2020, 5 tweets

Uttara Andhra ~
Where you can find sweets rather than spicy and tangy food
************
ఈ ఉత్తరాంధ్ర ఊరింపులు ఉత్తరాంధ్రగా పిలిచే విశాఖ ,విజయనగరం , శ్రీకాకుళం జిల్లాల వంటల్లో ఎక్కువగా తీపి ప్రసిద్ధి. ఇక్కడ బెల్లం ఆవకాయ , ఆవపెట్టిచేసే పనసపొట్టు కూర బాగా పేరు.
1/n
Pc: మండసా sweet

స్వీట్లలో మాడుగుల హల్వా , మందస కోవా చాలా ఫేమస్ హల్వా .
*ఈ పేరు వింటే టక్కున గుర్తుకొచ్చేది విశాఖ జిల్లా మాడుగుల .
హల్వా అంటే మాడుగుల , మాడుగుల అంటే హల్వాగా కీర్తి పొందింది .
*వివిధ పదార్థాలతో వివిధ హల్వాలు తయారవుతున్నా , గోధుమలతో తయారయ్యే ఈ హల్వా ఒక్క మాడుగులకే సొంతం
2/n

మాడుగులలో దంగేటి ధర్మారావు ద్వారా హల్వా తయారీ వందేళ్ల క్రితమే ప్రారంభమైంది . ప్రస్తుతం ఈ గ్రామంలో 16 మంది మాత్రమే తయారీ దారులు ఉన్నారు . ఈ హల్వా తయారీ చాలా కష్టంతోనూ , ఓపికతోనూ కూడుకున్న పని . కోవా కేరాఫ్ మందస పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడేది పాలకోవా .
3/n

ఇది చాలాచోట్ల లభిస్తున్నా శ్రీకాకుళం జిల్లా మందస కోవా మరో ప్రత్యేకం . సాధారణంగా కోవా అంటే బిళ్లల్లాంటివే గుర్తుకొస్తాయి . మందస కోవా ఇందుకు ప్రత్యేకం . బిల్లల రూపంలోనే కాదు , ద్రవరూపంలోనూ ఇక్కడ లభిస్తుంది . ఇక రుచి విషయానికొస్తే లొట్టలేసుకొని మరీ తినాల్సిందే !
4/n

భీమాళి తాండ్ర చూడగానే నోరూరించే మామిడి తాండ్రకు విజయనగరంజిల్లా లక్కవరపుకోట మండలంలోని భీమాళి, గనివాడ గ్రామాలు ప్రసిద్ధి.తీయ తీయగా, పుల్లపుల్లగా నోరూరించే మామిడి తాండ్రను దుబారు వంటి దేశాలకు ఏటా ఎగుమతి చేస్తుంటారు.తాండ్ర తయారీపై ఆధారపడి గ్రామంలోని సుమారు 300కుటుంబాలు జీవిస్తున్నాయి

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling