@Gajapati (ଗଜପତି) Profile picture
ଅନାଲୋଚିତ ଓଡିଶାର ପ୍ରଚାର ଓ ପ୍ରସାର #polyglot_Techie_Art_Architucture_litrature_culture_Resercher handle by: BM Adhikari

Sep 30, 2020, 7 tweets

వంశధార నది~
*********
వంశధార నది ఒడిషా రాష్ట్రం లో , నియమగిరి పర్వత సానువులలో పుట్టింది . మొత్తం 230 కిలోమీటర్లు పొడవున పాఱుచున్నది.ఇందులో 150 కిలోమీటర్లు ఒడిషాలో ఉంది .ఆంధ్ర ప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా వద్ద మన ఆంధ్రలోనికి వచ్చి కళింగపట్నం అనే చోట బంగాళా ఖాతములో కలుస్తుంది
1/n

వంశధార దాదాపుగా 11,500 చదరపు కిలోమీటర్లు మేర ఆవరించి , శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధాన నీటి వనరులలో ఒకటిగా వాడుకోబదుతుంది . ఇప్పటిలోన దీనిపై కట్టించఁబడిన ఒకే యొక్క ఆనకట్ట గొట్టా ( శ్రీకాకుళం జిల్లా ) అను పిలువఁబడు చోటులో ఉంది . వంశధారానది గుఱించి చెప్పుకొనే ఒక కథ :
2/n

శ్రీకాకుళం జిల్లాలో పారాటునట్టి వంశధారానదియొక్క ఒక పాయకు కల కథనుఁబట్టి దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి ఏలుచుండేవాడు . ఆయనకు విష్ణుప్రియ అనే పేరుఁగల పెండ్లము ఉండేది . ఆమె మహా విష్ణు భక్తురాలు . ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా
3/n

ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను . అప్పుడు విష్ణుప్రియ మగనికి ముద్దుఁగా బ్రతిమాలి పిలిచి , కూర్చుండబెట్టి , పూజా గదికి పోయి విష్ణువును కొలించి , స్వామీ ! అటు నా మొగుఁడును నేను కాదనలేను , ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను . నువ్వే నన్ను కాఁపాడమని పరిపరి
4/n

పరిపరి విధముల వేడుకొంది . స్వామీ ! కూర్మరూపమున భూమిని దాలేదా ? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది . శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి , అక్కడనే గంగను వెలఁయింపఁసేసెను . ఆ గంగ గొప్ప ఉఱఁవడి పఱఁవడిఁగా రాగా మహారాజు జడిఁసి పరుగిడి ఒక కొండ మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా ,
5/n

ఆతను రాజుకు విషయమంతా వివరించెను . అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపేమునకు ప్రాయశ్చిత్తమని తలచి , శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను . అప్పుడు నారదుడు అటుగా వచ్చి , రాజును విషయమడుగగా , రాజు తన బాధను వివరించెను .
6/n

అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను . ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని , ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను .

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling