వాక్కేళి Profile picture
తెలుగు కవిత+పాటల్రచైత #VakBharatam #Olymricks #EkapadyaRamayanam #శతపద్యపద్మం #సండేసైన్సుదశకం #వంటలు #తోటరయ్యదశకం #పెంకిపాటలు ఇక్కడంతా వ్యక్తిగత అభిప్రాయమే

May 16, 2022, 10 tweets

సోమవారం. చంద్రశేఖరుడికి ఇష్టమైన రోజు! నిండు పౌర్ణమి - ఆ కాశీవిశ్వనాథుడు జ్ఞానవాపి ఆలయప్రాంగణంలో బయల్పడ్డాడన్న సమాచారం. #కాశీదశకం తిరిగి పంచుకోవడంలో అడ్డేముంది? 🕉️🙏

హళాహళిగ గంగాఝరి
విశాలాక్షి దృశి వలిపిరి
జటాఝాటధారి నగరి
పావనకరి కాశీపురి!

1/10

#BabaMilGaye #HarHarMahadevॐ

కాలుపెడితె యదా భక్తి
కాలిపోతె సదా ముక్తి
ఆత్మకి వేదాంత భుక్తి
ఇహపర అద్వైత ఉక్తి 🕉️🙏

2/10

#కాశీదశకం

ప్రణవం పలికించు నాట
వేదం పాలించు కోట
ధర్మం వర్తించు బాట
జ్ఞానం వికసించు తోట🕉️🙏

3/10

#కాశీదశకం

జాతకరత్నాల సుధలు
మజిలీలుగ కొన్ని కదులు
వేలుగ హితబోధ కథలు
ఈ నేలనె మొదలు తుదలు

4/10

#కాశీదశకం

సన్యాసులు బైరాగులు
కల్పవాసి ఉదాసీలు
సాధు సంతు అఘోరీలు
పండిత పామరలు జనులు🕉️🙏

5/10

#కాశీదశకం

పీఠాలూ, పెను మఠాలు
అస్త్ర శాస్త్ర అఖాఢాలు
అడుగడుగున దేవళాలు
ఊర్ధ్వ లోక సారవాలు 🕉️🙏

6/10

#కాశీదశకం

బూది భంగు
కావి అంగు
హరిణి హంగు
నీలి పొంగు 🕉️🙏

7/10

#కాశీదశకం

సుగంధాలు, క్షీరధార
తాంబూలం పట్టుచీర
పసిడి మణుల మణిగ దోర
క్రయ విక్రయ విశ్వంభర 🕉️🙏

8/10

#కాశీదశకం

అగ్రసంధ్య అర్ఘ్యాలు
అపరాహ్ణం శ్రాద్ధాలు
అంధికలో హారతులు
ఆధ్యాత్మిక వీచికలు 🕉️🙏

9/10

#కాశీదశకం

భక్తియోగ బృందావని
సకల కళల మందాకిని
అవిచ్ఛిన్న సంస్కృతిగని
అజరామర జీవనవని 🕉️🙏

10/10

#కాశీదశకం

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling