#పాతాళభైరవి..
షావుకారు సినిమా కు అనుకున్నంత డబ్బు రాలేదు. దానితో జానపద చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు విజయా వారు. ఆ భాద్యత దర్శకుడు కే.వి.రెడ్డి, రచయిత పింగళి తమ భుజం పై వేసుకున్నారు. కధ, స్క్రీన్ ప్లే సిద్ధం. పాత్రలకు తగ్గ నటీనటుల అన్వేషణ ప్రారంభం.
ముందు కధానాయకుడు తోటరాముడు ఎవరు? అప్పటికి ఎన్టీఆర్ ఒక్క జానపదం పల్లెటూరి పిల్ల లో నటించాడు, కానీ అక్కినేని చాల జానపదాలలో నటించి వున్నాడు. ఆలోచిస్తూ గదిలోని కిటికీ దగ్గరకు వచ్చాడు దర్శకుడు రెడ్డి గారు. పక్కనే టెన్నిస్ కోర్ట్. ఎన్టీఆర్, అక్కినేని ఆడుతున్నారు. కిటికీ నుంచి స్పష్టంగా
కనిపిసుంది. పట్టుదలగా, కసిగా, దీక్షగా బంతిని కొట్టుతున్న ఎన్టీఆర్ ని చూడగానే తోటరాముడు ఎవరో రెడ్డి గారు డిసైడ్ అయిపోయారు. మరో ముఖ్య పాత్ర నేపాళమాంత్రికుడు. #చక్రపాణిగారు #ముక్కామల కు కబురు పెట్టగా , అయన చాల భారీ పారితోషకం అడిగారని పెండింగ్ లో పెట్టారు. అప్పుడే #ఎస్వీఆర్ గారు
రెడ్డి గారిని కలసి, ఆ పాత్ర తనకిమ్మని అడిగారు. ఒక సన్నివేశం చెప్పి, నటించి చూపించు అన్నారు రెడ్డి గారు. ఇష్టమైన దేవుడు శివుణ్ణి స్మరించి, పాత అనుభవాలను గుర్తుకు తెచ్చుకొని నటించి చూపించాడు. రెడ్డి గారికి తృప్తి కలిగింది. కొత్తవానికి అంత కీలకమైన పాత్రా అని అందరు విమర్శించారు.
రెడ్డి గారు ఒకసారి అనుకుంటే, ఇక మార్పు ఉండదు. మాలతి కధానాయిక. సి.ఎస్.అర్, రేలంగి , కొత్త నటుడు బాలకృష్ణ , పద్మనాభం కీలక పాత్రలలో నటించారు. రాజకుమారిని ప్రేమిస్తాడు తోటరాముడు. ఆస్తి, అంతస్తు సంపాదించు , పిల్లను ఇస్తానంటాడు రాజు. విషయం తెలిసిన నేపాళమాంత్రికుడు సాహసం చేసి తాను
చెప్పిన పని చేస్తే, రాజకుమారి దక్కేలా చేస్తానంటాడు. నమ్మి అతని వెంట పోతాడు తోటరాముడు. వాడిని బలి ఇచ్చి, పాతాళభైరవి అనే మహా శక్తిని సంపాదించాలని మాంత్రికుని ఆలోచన. ఒక యక్షిణి సాయం తో నిజం తెలుసుకున్న తోటరాముడు యుక్తిగా మాంత్రికునే బలి ఇచ్చి, పాతాళభైరవిని వాసం చేసుకొని, అతని
సాయంతో ఆస్తి, అంతస్తులు సంపాదించి , రాజున తమ వివాహానికి వప్పిస్తాడు. నేపాళమాంత్రికుని శిష్యుడు సంజీవని తో అతనిని బ్రతికిస్తాడు. రాణిగారి తమ్ముడు సాయంతో పాతాళభైరవి రూపాన్ని తస్కరించి, మాయమహల్, రాజకుమారి లతో పాటు తన రహస్య స్థావరానికి వెళ్ళిపోతాడు. విషయం గ్రహించిన తోటరాముడు అక్కడకు
చేరి, యుక్తిగా నేపాళమాంత్రికుని చంపి, రాజకుమారి, పాతాళభైరవి లతో ఉజ్జయిని నగరం చేరడం, రాజకుమారి, తోటరాముని కళ్యాణం తో సినిమా ముగుస్తుంది. మార్చ్ 15, 1951 లో విడుదల అయినా ఈ చిత్రం తోలి మూడు రోజులు మామూలుగానే వున్నది. నాలుగవ రోజు నుంచి తిరునాళ్ళు ప్రారంభం. జనం బ్రహ్మరధం పట్టారు.
100 రోజులు దాటి 175 రోజులకు పరుగుదీసింది. ఎన్టీఆర్ తిరుగులేని జానపద కథానాయకునిగా కీర్తి తెచ్చుకున్నారు. ఎస్వీఆర్ కీర్తి ఎవరెస్టు ఎత్తు ఎదిగింది. బాలకృష్ణ అంజిగాడిగా స్థిరపడ్డాడు. విజయావారి ఇంట కానక వర్షం కురిసింది.
జానపద చిత్రాలకు మంచి ఊపు వచ్చింది. ఇప్పటికి ఆ సినిమా కు అదే ఆదరణ ఉండడం విశేషం.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.