ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Sep 24, 2022, 17 tweets

అమృతం అంటే తెలియని వారు ఎంతమంది ఉంటారో అంతకన్నా ఎక్కువ #అమృతాంజన్ తెలిసిన వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు

కాశీనాధుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఎలకుర్రు గ్రామంలో 1867లో మే 1న జన్మించారు

తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య. స్వగ్రామంలోనూ, తరువాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం

కొనసాగింది.

1891లో 'మద్రాసు క్రిస్టియన్ కాలేజి'లో పట్టభద్రుడయ్యారు.

ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం ఆయనపై బడింది.

నాగేశ్వరరావు గారు కొద్దికాలం మద్రాసులోనూ, కలకత్తాలోనూ, బొంబాయిలోనూ ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించారు

వ్యాపారంపైన ప్రత్యేక ఆసక్తితో 1893లో #అమృతాంజన్_లిమిటెడ్ స్థాపించారు

ఆయన స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్దికాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది.

వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా అతనును ప్రభావితం చేశారు

స్వర్గీయ శ్రీ #కాశీనాథుని_నాగేశ్వరరావు పాత్రికేయుడు,

వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించిన #కృష్ణా_జిల్లా ఉద్యమకారుల్లో ఆయన ఒకరు

ఆయన్ని 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. దేశోధ్ధారక, విశ్వదాత అని ఆయన్ని అంతా గౌరవించేవారు

1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అతనును 'కళాప్రపూర్ణ' బిరుదుతో సత్కరించింది

ఆయనకి ఆంధ్ర మహాసభ వారు దేశోధ్ధారక అని బిరుదు ఇచ్చారు

నాగేశ్వరరావు గారు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు.

ఆంధ్ర పత్రిక, అమృతాంజనం సంస్థలను అతను స్థాపించింది ఆయనే

ఆంధ్రపత్రిక, భారతి,

ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసారు

అతను స్వయంగా రచయిత.. భగవద్గీతకు వ్యాఖ్యానం కూడా రాశారు

ఆయనకు విశ్వదాత, దేశోద్ధారక అనే బిరుదులు ఉన్నాయి.

ఆయన తలచుకొంటే లక్షలపై లక్షలు
ఆర్జించి కోట్లకి పడగలెత్తేవారు.

ఆడంబర రాజకీయాల జోలికి అసలు పోలేదు.

అమృతాంజనం ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్థులకి వేతనాలుగా ఇచ్చేసేవారు.

ఆయన దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు కూడా మెచ్చుకున్నారు

చెన్నై లోని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లోనే చారిత్రాత్మక శ్రీబాగ్‌ ఒడంబడిక కుదిరింది.

కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక

ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది

1907లో సూరత్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత ఆయన తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించారు.

పత్రికా రంగంలో నాగేశ్వరరావు ప్రవేశం పాశ్చాత్య దేశాలలో పులిట్జర్ ప్రయత్నంతో

పోల్చవచ్చును.

అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది. కనుక దేశీయ పత్రికలు నడపడానికి ధైర్యము, అంకితభావం చాలా అవసరం.

సెప్టెంబరు 1908లో బొంబాయినుండి ఆయన ప్రారంభించిన ఆంధ్ర పత్రిక వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది.

నాగేశ్వరరావు గారు వ్యాసాలు ఆయన సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై అతను అవగాహననూ ప్రతిబింబించాయి.

1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశంతో

ఆంధ్ర పత్రిక దిన పత్రికను ప్రారంభించారు.

1914 ఏప్రిల్ 1న మద్రాసునుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం.

1924లో భారతి అనే సాంస్కృతిక, సాహితీ పత్రికను ప్రారంభించారు

తెలుగు సాహితీప్రియులకు ఇది చాలాకాలం అభిమాన పత్రికగా నిలచింది.

మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభదశనుండి నాయకులుగా ఉన్నవారిలో పెద్దలు నాగేశ్వరరావు ఒకరు.

ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు

ఈ విషయంలోనూ, తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన ఇతర విషయాలలోనూ అతను తెలుగు

జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు అతనును దేశోధ్ధారక అని సత్కరించారు.

పత్రికా రంగంలోనే కాక ప్రచురణా రంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించారు

1926లో 'ఆంధ్ర గ్రంథమాల' అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించారు

ఈ సంస్థ 20 పైగా పుస్తకాలు ప్రచురించింది. వాటిలో

27 వ పుస్తకం, తిరుమల వెంకట రంగాచార్యులు సంకలనం చేసిన పారిభాషిక పదకోశము ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలను పునర్ముద్రించింది. సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల వెలను చాలా కొద్ది మొత్తంగా నిర్ణయించారు.

తెలుగునాట గ్రంథాలయోద్యమానికి నాగేశ్వరరావును పితామహునిగా వర్ణించవచ్చును.

కాలక్రమంగా 120 పైగా గ్రంథాలయాలు తెలుగునాట వెలశాయి.

టంగుటూరి ప్రకాశం సమకాలీనుడైన నాగేశ్వరరావు 1924 - 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా పనిచేశారు

ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించారు.

ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో నాగేశ్వరరావు గారు ఒకరు

నాగేశ్వరరావు గారిపై ప్రజలకు ఎంతో అభిమానం, నమ్మకం ఉండేవి.

ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా 1931లో ఒక సంవత్సరం జైలులో ఉన్నపుడు నాగేశ్వరరావు భగవద్గీత గురించి వ్యాఖ్య వ్రాసారు.

"గీత ఒక మతానికి పరిమితమైనది కాదనీ, దాని సందేశం సమస్తమానవాళికీ వర్తిస్తుందనీ సందేశం అందించారు

అమృతాంజన్ అనే అలనాటి గొప్ప ఔషధాన్ని ఆంద్రులకే కాక అందరికీ అందించిన నాగేశ్వర రావు గారు తెలుగు వారే !!

కృష్ణాజిల్లా నుండి ప్రజలకోసం పోరాటం చేసిన, ప్రజా సేవ చేసిన మాహానుభావుల్లో అయనకొరు..

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling