ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 5, 2022, 59 tweets

#దసరా_ప్రత్యేకం

వెండి తెర కళా సింహాసనం అధిష్టించిన అభినయ సామ్రాజ్ఞి #కన్నాంబ గారి కొలువులో కొలువైన నట దిగ్గజాలు

దసరా పండగ సందర్భంగా ఒక విలక్షణమైన సమీక్ష మీ కోసం:

భారతీయ చలనచిత్ర రంగంలో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు ప్రాంతీయ సినిమా ఒక ప్రత్యేకమైనది. ప్రపంచ ఫిల్మ్ ఫీల్డ్ లో

తెలుగు సినిమా తెలుగు కళాకారులది విభిన్న శైలిలో పోలిక లేకుండా విశ్వవ్యాప్తంగా ఉనికి చాటుకుంది.

ఈనాడు మన పేజీలో ఒక విలక్షణమైన సమాచార సమాహారం అందజేస్తున్నాము ఆస్వాదించండి, ఆనందించండి అందరితో పంచుకోండి. తొలినాటి నుండి మధ్య తరం వరకు తమ వైవిధ్య నటనతో వెండితెరపై అభినయానికి చిరునామా

అయిన మన నటిమణులు #కన్నాంబ గారి నుంచి #రమాప్రభ దాకా సినిమా పరిశ్రమలో వివిధ విలక్షణమైన పాత్రలు పోషించి తెలుగు సినిమాకు మకుటంలేని వారయ్యారు. ప్రతి వారిది ఒక ప్రత్యేకమైన పద్దతి విన్నూత్న నటనతో తెలుగు సినిమాను బతికించారు. ఇక మనం వారి యొక్క కళా ఔన్నత్యాన్ని నట విశ్వరూపాన్ని వేరే

కోణాల్లో పోలిక లేకుండా పూర్తి స్థాయిలో ఆవిష్కరించారు.

(1) #కన్నాంబ కళా నికురంబ_నట విభాగ శారదాంబ

తొలినాటి నట సామ్రాజ్ఞి #పసుపులేటి_కన్నాంబ గారు. నటనకు, అభినయానికి పెట్టింది పేరు. ఆవిడకు ఉన్న కళారూప జిజ్ఞాస కళాకారులపై నిశ్చిత అభిప్రాయ సంవిధానం కళను గుర్తురెరిగి ప్రోత్సాహం,

అవకాశం ఇచ్చే మంచి మనసు భారతీయ సినిమా పరిశ్రమలో ఎవ్వరికి లేదు. ఎందరో గొప్ప ఆర్టిస్టులు ఒక వెలుగు వెలిగిన వారంతా కన్నాంబ గారే ఆశ్రయం ఇచ్చి అవకాశం ఇచ్చి ముద్ద పెట్టిన బంగారు తల్లి. అందుకే మా కన్నాంబ గారు మహిళా నటిమణుల మహారాణిగా నిలిచారు. అందుకే నా దృష్టిలో ఆవిడ సినీ సామ్రాజ్ఞి.

#నిర్మాత #నిర్వాహకురాలిగా ఎన్నో నాణ్యమైన విలువలున్న చిత్రాలు నిర్మించిన కళా పోషకురాలు.

ఆ గాంభీర్యం, వాచికం, ఆహార్యం, నడవడి, సాంప్రదాయం, క్రమశిక్షణ, కళ పట్ల అచంచల విశ్వాస భక్తి తత్పరత, ప్రోత్సహించే గొప్ప సుగుణం, అందిరికి అభయం ఇచ్చే హోదా, మంచి ఆదరణ, ఆప్యాయత మున్నగు సులక్షణాలతో

'రాచరికం' తొణికిస లాడుతుంది. ఎచటనైన, ఎక్కడైన సరే ఎదురుగా కన్నాంబ అమ్మ తారసపడితే ఎంతటివారైన చేతులు జోడించి నమస్కారం చేయించుకొని నిండైన మర్యాద విగ్రహం. బహుశా ఒక ఋష్యేంద్రమణి, ఒక భానుమతి, శాంతకుమారి గార్లు అలాంటి మాన్యతను పొందారు. అందుకే కన్నాంబ గారిని చూస్తే ఒక గౌరవప్రదమైన మర్యాద

పూర్వకమైన ఆలోచనే వస్తుంది. తమిళనాట తన వాగ్ధాటితో సుస్పష్టమైన తమిళ భాషా ప్రవాహంతో తమిళ ప్రాంతీయులకు వారికి ముచ్చెమటలు పట్టించి సవాల్ విసిరెటట్టు అనర్గళంగా తడుముకోకుండా డైలాగ్ చెప్పే మహోన్నత నటిమణి. కన్నంబ అమ్మ ఎప్పుడు సెట్స్ మీద సన్నివేశాల్లో సంభాషణలు విసురుతుంటే తమిళులుతంతా

తెల్లమోహం వేసుకొనేవారట. అందుకే కన్నాంబ అమ్మ అంటే దక్షిణాదిలో ఒక తిరగరాని చరిత్ర, నిత్య స్మరణం కావించుకొనే అధ్యాయం. ఏ నాటికి కన్నాంబ గారి స్థానం చేరుకోవాలంటే ఏ ఆర్టిస్ట్ కి అసాధ్యం గగన కుసుమం. కొద్ది కాలం తన పాత్రకు ప్లేబ్యాక్ పాడుకొని వేరే వారికి అవకాశం కోసం పాడటం మానేసారు.

అది మా తెలుగుతనానికి, రాచరిక ఠీవికి సాక్షి నిదర్శనం..

(2) #ఋష్యేంద్రమణి కళా మణి_నటనా మరకతమణి

మన ఋష్యేంద్రమణి అమ్మ కూడా తొలినాళ్ళలో వెండితెరపై నటనతో, పాటతో విజృంభణా ఆవిష్కరణ చేసిన గౌరవాన్ని యాదృచ్ఛికంగా పొందిన ఘనత కలిగివుంది. తెలుగుతనం ముఖ్యంగా కృష్ణానదీ పరివాహాక ప్రాంతీయ

సంస్కృతి #ఋషేంద్రమణి అమ్మలో తొణికిసలాడుతుంది. వాచిక గాంభీర్యం ఆమె సొత్తు ఒక విభిన్నమైన స్పష్టత కలిగిన మాట. ఈనాడు నటరత్న, నాటి సార్వభౌమ లాంటి సినీ దిగ్గజాలకు తల్లిగా నటించి అత్యంత ముఖ్యమైన ఆర్టిస్ట్ గా పరిగణిస్తారు. అలనాడు ఋషేంద్రమణి చిత్రాలలోకి వచ్చేప్పటికి, నటీనటులకు వేరేవారు

గాత్రంతో పాటలుపాడుట అనికి సాంకేతిక అభివృద్ధి జరుగలేదు. దాదాపుగా అందరు నటీనటులు తమ పాటలకు ప్లేబ్యాక్ తామే పాడుకొనేవారు. అదే వరవడిలో, ఋష్యేంద్రమణి తన పాటలను తానే పాడుకొనేది. కంఠస్వరం బాగుడంతో గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు.‌ 'మాయాబజార్' సినిమాలో అభిమన్యునితో పాటుగా

వెళ్తున్నప్పుడు ఘటోత్కచుడు వీరి మీద దాడిజరిపినప్పుడు, ఈమె పాడిన పద్యం ఇప్పటికి కూడ ఎంతగానో రసవత్తరం గావించి ఎంతో ప్రజదరణ పొందినది. పరిశ్రమలో ఎంతో గౌరవంతమైన మర్యాద పొందిన మహిళా ఆర్టిస్ట్ లో ఒక్కరుగా అందరిచే సత్కరింపబడ్డారు.

(3) #శాంతకుమారి నటనా ప్రతిభాశాలి_సినీరంగ కళా విశాలి

మన తెలుగు సినిమాలో అందరితో ఆప్యాయంగా అమ్మా అంటు అందరి చేత పిలిపించుకొనే అలనాటి నటి, నిర్మాణ సారథి మన #శాంతకుమారి గారు ఒకరు. సహజ సిద్ధమైన శాంతికరమైన పాత్రలు పోషించి పేరు సార్థకం చేసుకొన్నారు. విచిత్రం ఏమిటంటే కొన్ని సినిమాల్లో ప్రతికూల ఛాయలు ఉన్న పాత్రలను ధరించి

గొప్ప నటిమణీగా నిలిచారు.

తెలుగు సినీ పరిశ్రమలో టాప్ గ్రేడ్ మోస్ట్ వాంటెడ్ కథానాయకుల కెరియర్ కి గట్టి పునాది వేసి ప్రోత్సహించి ఆ హీరోల ఇమేజిని పెంపొందింపచేసినది. ఒక తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏకంగా ఒక తెరవేల్పైన నటుడికి ఇలవేల్పుగా మార్చిన పెద్ద మనసుగల సినీ పెద్దమ్మ. మరియు,

కళాభిమానిగా, సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానం చేరుకొన్న గౌరవ మర్యాదలు పొందిన కళాకారిణి #శాంతకుమారి గారు కావడం యాదృచ్ఛికం.

(4) #యస్_వరలక్ష్మి స్వర, రాగ నట కౌశల_గీతాభినయ సంగీత మేఖల

సుస్వర విలక్షణ గాయని ఎంతో పెద్ద శృతిలో గానావిలాసం అందించే సామర్థ్యం. ఒకవైపు నటిస్తు అదే చిత్రంలో

అత్యద్భుతంగా గళాన్ని చిందుస్తూ వెండితెరపై ప్రేక్షకులను ఉర్రూతలూగించే అజరామరం చేసిన నటి, గాయని మన #వరలక్ష్మి. నట, గీతాలతో రెండింటిని ఒకే వరుసలో ప్రయోగాత్మకంగా నైపుణ్యంతో విజయభేరి మ్రెగించినది. ఇలా నిజంగానే వరాలు కురిపించిన సినీ వర'మా'లక్ష్మి యస్. వరలక్ష్మి గారు. పరిశ్రమలో ఎంతో

గౌరవనీయమైన నటీమణి అందరిచే ఆదరింపబడిన నటీమణీ కళావాణి.

(5) #భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి_తెలుగు సినీ మొట్టమొదటి #సూపర్_స్టార్

సినిమా పరిశ్రమలో ఒక విభాగానికే పరిమితి పరిధి కలిగివుంటుంది. ఉంటే గానం, నిర్మాణం వ్యవహారాలు ఏదో ఒకటి లేక రెండింట దృష్టి కోణం కలిగివుంటారు.

#భానుమతి గారు మాత్రం నటన, గాత్రం, నాట్యం, సంగీత దర్శకత్వం, నిర్మాణం, దర్శకత్వం, స్టూడియో అధికారం, రచనా వ్యాసాంగం లాంటి కళాస్త్ర న్యాసం ఏకకాలంలో చేయగలిగిన సామర్థ్యం, నైపుణ్యం కలిగిన విశ్వజనితమైన సినిమా రంగంలో ఏకైక కళాకారిణి భానుమతి గారు. మొదటి తరంలో మాన్యత కలిగిన నటీమణులతో

కలిసిపోయి వారితో సరిసమానంగా నిలిచి తిరుగులేని విఖ్యాత కళామతల్లి అంశాస్వరూపంగా నిలిచారు.

హద్దు దాటని వ్యవహరం, పద్ధతి కలిగిన క్రమశిక్షణ, సాంప్రదాయం మీద అపార గౌరవాచరణం, ఆభిజాత్యం,‌ పారదర్శకత దార్శనికత‌ం, ఆత్మాభిమానం,‌ ఆత్మగౌరవం కలిగిన ఏకైక నటి ఏనాటికి భానుమతి గారు మాత్రమే మరియు

ఆవిడ స్థాయికి చేరడం అసంభవం. చూడంగానే గాంభీర్యం నడవడి సరిహద్దు దాటని వాచికం ప్రస్ఫుటంగా కనిపించే నిండైన విగ్రహం. ఎవ్వరికైనా #భానుమతి అమ్మతో మాట్లాడాలంటే స్పృహలో ఉండే మాట్లాడాలి వళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక నిష్కర్షమైన పద్ధతి, ఒక విలక్షణమైన వ్యవహార శైలి, బహుముఖ ప్రజ్ఞాశాలి

స్టేచర్, విలువను ఆత్మగౌరవం కాపాడుకొనే ఏ ఆర్టిస్ట్ తో వ్యవహారం కత్తి మీద సాము లాంటిదే. తెలుగు సినిమా మూల స్తంభాలుగా అభివర్ణించే టాప్ మోస్ట్ కథానాయకులను ఏక వచనంతో పిలిచే దమ్ము ధైర్యం వున్న ఏకైక నటీమణి #భానుమతి గారు. హాట్సాఫ్ భానుమతి రామకృష్ణ గారు.

(6) #హేమలతా నట పాదులో అల్లుకున్న తటిల్లత_అభినయ వేదికలో విలక్షణ కళాలతా

హేమలత సినిమా పరిశ్రమనే ఆధారంగా అల్లుకొన్న బంగారు అభినయ తీగగా పేరు సార్థకం చేసుకొన్నారు. హేమలత అంటేనే బంగారు మొలక. అచ్చ తెలుగుతపు ప్రతిరూపం మచ్చలేని అభినయానికి నిలువుటద్దంగా పరిశ్రమలో ఒక అమరురాలైన కళాకారిణి .

తెలుగు ప్రాంతీయ సంస్కృతి సంప్రదాయాలు మేకప్ వేసుకొన్న తరువాత హేమలత గారి ఆహార్యంలో ప్రతిచోట కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఒక ప్రత్యేకమైన విలక్షణమైన గొంతులో మధురంగా కదలాడే మర్యాద కలిగిన గౌరవించాలనే భావనం కలిగేలా #హేమలత గారి తీరు తెన్నులు వెండితెరపై ప్రేక్షకులను రంజింపచేసాయి.

(7) #షావుకారు_జానకి. నట మిథిలాపురిలో ఎక్కుపెట్టిన నటనాస్త్రం_కళాస్థలిలో విచ్చుకున్న విలువైన అభినయ మానిని.

పరిశ్రమలో ఉన్నత స్థాయి కళాకారిణిగా ఒక ఒరవడిని సృష్టించి, విలక్షణమైన నటనతో, వైవిధ్యభరితమైన పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన మరపురాని నటి #శంకరమంచి_జానకి ( షావుకారు జానకి )గారు.

కథానాయికగా బాగా పాపులర్ అయిన రోజుల్లో బిజీ షెడ్యూల్ లో నాడు కూడా 'డిగ్లామరైజ్డ్ రోల్స్' పోషించి నటనలో విలువను, ప్రత్యేకతను చాటుకున్నారు. ఏ పాత్ర చేసినా ఒక యజ్ఞంగా, నిబద్దతతో, పూజనియత భావంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని పాత్రని గౌరవించి నిష్క్రమించే అరుదైన మహానటి #జానకి గారు.

తన సినిమా తన పాత్ర తన సన్నివేశం పూర్తి కాగానే మౌనంగా గాంభీర్యంతో వెడలిపోయేవారు. సినిమా పరిశ్రమలో లోన బయట మరియు వ్యక్తిగత జీవితంలో విలువలకు కట్టుబడి ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వానికి మారు పేరుగా నిలిచారు. కొన్ని సందర్భాల్లో తన పాత్రను కొందరు నటీమణులు దక్కించుకొని తదుపరి సాధారణ

పాత్ర వచ్చిన కూడా నిష్కల్మషమైన ఆ పాత్రను న్యాయం చేసి మౌనంగా వెడలి వెళ్లేవారు జానకి గారు. విచిత్రం ఏమిటంటే ప్రథాన పాత్రకన్న తాను పోషించిన పాత్రకే ప్రేక్షకులు పట్టం కట్టారు. అవార్డులు, రివార్డులు సొంత మయ్యాయి. తమిళ పరిశ్రమ చాలా బాగా అవకాశాలు ఇచ్చి విన్నూత పాత్రలకు ఎన్నుకొన్నారు.

ఇలా, ఏ పాత్రనైన జానకి గారు పూర్తి స్థాయిలో జీవం పోయగలిగే సామర్థ్యం నైపుణ్యం కలిగిన ఆర్టిస్ట్ గా పరిశ్రమలో ఒక విలక్షణమైన కళాకారిణిగా ఉన్నత సంస్కారానికి ప్రతీకగా మిగిలారు. హాట్సాఫ్ షావుకారు జానకి గారు.

(8) #అంజలీదేవి తెలుగు చలనచిత్ర సీతాదేవి

తెలుగు సినిమా పరిశ్రమలో కథానాయికగా

ప్రస్థానం ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లి పాత్రలు పోషించిన విలక్షణ నటిగా నిలిచింది. అగ్ర నాయకుల సరసన నటించి మరల వారికే తల్లి పాత్రలో నటించడమే కాకుండా ఆ అగ్ర కథానాయికుల తరువాతి తరం కొడుకులకు కూడా అమ్మగా నిటించిన ఏకైక నాటి తరం నణీమణి #అంజలీదేవి గారు.

నటిగా,‌ నిర్మాతగా రెండు విభిన్న విభాగంలో తనదైన సొంత ఇమేజ్ సొంతం చేసుకుంది. పౌరాణిక పాత్రలు ముఖ్యంగా సీతాదేవి పాత్రకు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించి అభిమానించే పెద్ద ఆర్టిస్ట్ పరిశ్రమలో నిలిచిపోయింది.

(9) #దేవిక.. కళా స్నిగ్ధమనోహర దీపికా_ముగ్ద నటనాభినయ చేటికా

దేవిక ఒక ప్రత్యేకమైన

విభిన్న కథానాయికగా, ఆర్టిస్ట్ గా, ఒద్దికగా, సలక్షణ వారధిగా, చూడంగానే ఒక ప్రత్యేకత కూడిన ఆహార్యపు అవంతికగా దక్షిణాది వెండితెరపై శోభాయమానంగా వెలిగారు. తెలుగుతనం, నాగరికతనం, నెమ్మదితనం,‌ హుందాతనం, అణుకువ, ఒదిగిపోయే నిగ్రహంతో ప్రేక్షకుల చేత గౌరవించబడ్డ కళాకారిణి. ఎచ్చటను హద్దు దాటని

నటనతో పొందికగా ముఖంలో ప్రశాంతత కలిగి ఉంటారు. నటనలో, ఆహార్యంలో తొందరుపాటుతనం లేకుండా భేషజాలు లేకుండ పోషించే పాత్రానుగుణంగా పద్ధతిగా ఒద్దికగా సలక్షణ స్టేచర్ దేవిక గారిది. తెర‌ మీద చూడంగానే ఎంత సంస్కారవంతంగా ఉన్నారు దేవిక గారు అని ఒక సగటు ప్రేక్షకుడికి సుభావన కలుగుతుంది.

(10) #పద్మిని నృత్య కుముదిని_సంగీత నటనా మోహనాంగి_సౌందర్య కళా వాహిని దరహాసిని

పద్మిని గారు ఒక అత్యంత‌ సౌందర్య శోభయామాన మెరుపు తీగ. భరత నాట్య కళలావిష్కరణలో కులుకుల, సొగసుల, శృంగార నృత్యాభినయ సాలభంజిక. వెండితెరపై పద్మిని గారి నృత్యం ఒక సంచలనం, ఒక నూతన అధ్యాయం, ఒక నాట్యానిమేశిక.

అపర్సరస పాత్రకు సరియైన ఆహార్యం తళుకు బెళుకుతనం, లావణ్యం, ఆంగికం, అభినయం విలక్షణమైన సౌందర్య దేదీప్య కళిక. పద్మిని సోకుమార్యం నయాభినయం, ముద్రలు, జతులు గతులు మతులు పోగొట్టే కళా ప్రకర్ష, నాట్య విస్పోటనం అత్యంత శ్లాఘనీయం, అభినందనీయం. పద్మిని అంటే నృత్యం. నృత్యం అంటే పద్మిని అని

విడదీయలేని సంబంధం. పద్మిని గారి నాట్యం అంటే దక్షిణాదిలో ముఖ్యంగా ద్రావిడ దేశంలో బహుళ ప్రాచుర్యం పొంది కేవలం పద్మిని నృత్య కోసం బారులు తీరే వారు.

(11) #నిర్మలమ్మ అమూల్యమైన బామ్మా_తెలుగు సినిమారంగంలో పెద్దిరకపు పట్టుకొమ్మ

ఓ బందరు బామ్మ_నీవందరి దానివమ్మ...

తెలుగు చిత్ర పరిశ్రమలో బామ్మ పాత్రంటే ఠకీమని గుర్తొచ్చే ఆప్యాయత కలిగిన అనురాగం కలబోసిన పెద్దరికపు గౌరవంతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన నిర్మలమ్మ. పరిశ్రమలో తెర ముందు, వెనుక నిర్మలమైన మనస్తత్వం ప్రేమభరిత సుజల నిర్మల వెండి తెర వెన్నెల. వందల కొలది ఎన్నో విభిన్న క్యారెక్టర్ పాత్రలు

పోషించి సహజసిద్ధమైన నటిగా పరిశ్రమలో కీర్తిని సంపాదించుకొన్న గొప్ప నటిగా అజరామరం అయ్యింది ఈ వెండి తెర బామ్మ మా మామ్మ .. నిజంగా నిర్మలమ్మ షూటింగ్ సమయాల్లో కో ఆర్టిస్టులను అందరిని తల్లిలా ఆదరించేది

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారు 'ఏకవీర' నాటకంలో 'గిరిక' పాత్ర పోషించిన పాత్రను

చూసి 'పిచ్చి మొద్దు నీలో ఇంతటి నటన ఉందనుకోలేదు' అన్నారట. నిష్కల్మషంగా అమాయకంగా నవ్వింది మన నిర్మలమ్మ. ప్రముఖ బాలీవుడ్ తొలితరం నటుడు పృథ్విరాజ్ కపూర్ 'కరువు రోజులు' నాటకం చూసి చాలా పెద్ద నటివి అవుతానని చెప్పాడు.

(12) #సూర్యకాంతం కళా అరుణోదయ మాణిక్యం_ నటనాభినయ మణిరాగం

భారతీయ సినిమా చరిత్రలో నటనకు భాష్యం చెప్పిన పోలికలేని అసమాన అత్యుత్తమ నటనకు పట్టం కట్టిన నాటి దిగ్గజం సుర్యకాంతం అమ్మ. అబ్బబ్బా వెండితెరపై సూర్యకాంతం గారు రాగానే ఎక్కడలేని సందడి, హడావిడి, ఆర్భాటం మొదలై ప్రేక్షకులందురు

వళ్లంతా కళ్లు చేసుకొని ఎప్పుడెప్పుడు వస్తుందానని తాపత్రయం పడతారు. ఈ 'గజగామిని' అయిన సూర్యకాంతం గారు జన్మించడం కళామతల్లి చేసుకొన్న పుణ్యం. సూర్యకాంతం గారు రాగానే కెమెరా చాలా అప్రమత్తంగా అవుతుంది. ఎందుకంటే కెమెరా కన్ను ఎప్పుడు ఏ సమయంలో నటనావిష్కరణ జరుగుతుందోనని సూర్యకాంతం గారిని

చూస్తూ నిశ్చలం ఉంటుంది.

ఏదైనా తేడా వస్తే 'ఒసేయ్ ఒసేయ్ పిచ్చి మొద్దు నీ మోహం మండా దిక్కులు చూస్తు వెర్రి వెర్రి చూస్తావేంటే...' అంటూ తనదైన స్టైల్లో వాతలు, వెటకారం, దెప్పి పొడుపు, ఎడం చేతి వాటం చూపే సహజ నటి మహత్తర నాటి సూర్యకాంతం అమ్మ. సూర్యకాంతం గారితో నటించాలంటే ఎంతో కష్టం.

సహజంగా నట విశ్వరూపాన్ని చూపిస్తు ఒకే‌ సన్నివేశంలో ఎన్నెన్నో వ్యత్యాసపు ఆహార్యం పండించగల నట ఘనాపాఠి. కొన్ని సందర్భాల్లో ఇతర నటులు అభినయాన్ని మర్చిపోయినా తెలివిగా ఆ సన్నివేశానికి కొంగొత్త ఆవిష్కరణ చేస్తారు. దీని వలన ఇతర ఆర్టిస్టులు దర్శకుడు టెక్నీషియన్స్ బిత్తరపోయి పిడచ

కొట్టుకుపోతారు. ఆమెనే సూర్యకాంతం అమ్మ.

ఏ ఆర్టిస్టును అయినా మరచిపోయే అవకాశం రావొచ్చునేమోగాని సూర్యకాంతం గారిని మరచుట అనితర సాధ్యమైన విషయం.

(13) #ఛాయాదేవి నటనా చాతుర్యానికి గడసరి_ సన్నివేశ అభినయ సొగసరి

ఛాయాదేవి పేరు వినగానే అబ్బా ఒక్కోసారి నాలాంటి ప్రేక్షకుడు అలెర్ట్ అయ్యి ఈ

విన్నూత్న నటించే సన్నివేశం కొరకు కళ్లంతా విచ్చుకొని చూస్తుంటాడు. ఏం నటి అయ్య బాబోయ్ వెండి తెరపై అడుగు పెట్టిన క్షణం ఆ ప్రతి సన్నివేశంలో ప్రతి బిట్ లో విలక్షణమైన అభినయం కోసం ఎదురుచూస్తు తదేకంగా ఉంటాడు. ఛాయాదేవి గారి సన్నివేశం ఎంట్రీ ఇచ్చిందంటే పాత్ర నిడివి చిన్నదైన మరపురాని మహత్తర

నటన అలవోకగా వెండితెరపై మరిచిపోలేకుండా నటించి తాపీగా వెళ్లిపోయే గొప్ప నటి. గయ్యాళి పాత్రలు, చుప్పనాతి పాత్రలు, తగులవమారి పాత్రలు, దెప్పి పొడుపు హింసాత్మక పాత్రలు అలా అలా చిటికెలో చేసి సన్నివేశాన్ని రక్తి కట్టించడం ఛాయాదేవి గారికి వెన్నెతో పెట్టిన విద్య. ప్రతినాయిక ఛాయలు ఉన్న

పాత్రలకే కాక ఉదాత్తమైన, గాంభీర్యమైన, అణుకువగల పాత్రలు కూడా పోషించి అబ్బుర పరుస్తుంది. అందుకోసమే 'మాయాబజార్' చిత్రంలో కె.వి. రెడ్డి గారు 'బలరామదేవుడు' భార్య 'రేవతి' విభిన్న కోణాలు కలిగియున్న పాత్రకు ఛాయాదేవినే ఎంచుకొన్నారు. సహజ నటిగా తెరపై ఏ పాత్రను ఇచ్చినా కూడా సలక్షణ చేసి

మెప్పించే అరుదైన, పోల్చుకోని నట విన్యాసంతో మెప్పించే అసాధ్యురాలు మా ఛాయాదేవి ఎప్పటికైన గుర్తుతుండి పోతారు.

(14) #సంధ్య గారు సాత్విక నటనా ప్రతిభాశాలి_ ఉత్తమ అభినయ సుగుణ రాశి

సంధ్య గారు దక్షిణాది భాషల్లో నటించిన సినిమాలు తక్కువే అయినా ఆవిడ కూతురు 'జయలలిత' ఎంత పరిశ్రమలో, రాజకీయ

రంగంలో ఉన్నత స్థాయికి వెళ్లిందో మనందరి తెలిసిన విషయమే. సంధ్య గారిది విలక్షణమైన ఒదిగిన నిండైన చక్కదనం. కెరియర్ లో నుంచి చాలా ఉదాత్తమైన, అణుకువ, మర్యాద, గుంభనమైన పాత్రలే చేసారు. ఏనాడు హద్దు దాటని ఒక ఉత్తమ గృహిణి, సాత్వికమైన దేవి పాత్రలు, మర్యాద మన్నన కలిగిన పాత్రలనే ఎంచుకొని

చేసిన గొప్ప కళాకారిణి. సినిమాలో నటించడం ఇష్టం లేకున్నా కూడా కూతురు కెరియర్ కోసం దొరికిన అవకాశం దక్కినవి మంచి హుందాతనం నమ్రత అసలు హడావిడి లేని గౌరవంతమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా రుక్మిణీ దేవి పాత్రకు చాలా బాగా సరిపోయే ఆహార్యం నడవడి ఒడంబడిక మాట, పద్ధతి పాత్రకు జీవం పోసారు.

ఒక సాంప్రదాయం, మర్యాద పూర్వకమైన ఉత్తమ స్త్రీ పాత్రలకు సంధ్య గారు పెట్టింది పేరు. మోహంలో కొట్టొచ్చినట్లు ప్రశాంతత, నిర్లిప్తత కలిగిన ఏకైక నటి మణి. సినీ పరిశ్రమలో ఒక విన్నూత్న సౌందర్య భరిణి సంధ్య గారు.

(15) #గిరిజ గారు తెలుగు సినిమా రంగంలో ప్రత్యేక వైవిధ్యం సొంతం చేసుకున్నారు

పుట్టుక నుంచే తల్లి 'దాసరి తిలకం' వారసత్వపు నటనను పొందిన ఆర్టిస్ట్ గా పరిశ్రమలో రెండు పుష్కరకాలంపాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలిచి సొంత ఇమేజ్ సంపాదించుకున్న నటి. రేలంగికి వెండితెరపై సూపర్ కాంబినేషన్. ఎన్టీఆర్ ఎన్నార్ తో కూడా కలిసి నటించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోఎన్నో

విభిన్న పాత్రలు సెకెండ్ హీరోయిన్, హాస్య నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి 1950, 1960 దశకంలో హీరో హీరోయిన్లుకు సమానంగా గుర్తింపు పొందింది. పరిశ్రమలో ఒకనాటి బిజీయెస్ట్ ఆర్టిస్ట్ గా నిలిచారు గిరిజ గారు.

(16) #రమాప్రభ నటనాలయంలో వెలిగే ముర్తిప్రభ

ఏ ప్రాధమిక విద్య లేకుండానే

ఒక ఆర్టిస్టుగా పద్నాలుగు వందల(1400) పై చిలుకు సినిమాలు నటించిన ఏకైక క్యారెక్టర్ నటి మన రమాప్రభ గారు. అలాగే తమిళ నాటకం రంగంలో నాలుగువేల చిలుకు రంగస్థల ప్రదర్శనలు ఇచ్చిన వైవిధ్యభరితమైన నటిగా పేరుపొందినది రమాప్రభ గారు. దక్షిణాది భాషల్లోనే కాక బాలీవుడ్ హింది సినిమాలో కూడా నటించారు.

అమాయకత్వం, పసితనపు పోకడ, తండ్రి చాటు బిడ్డగా, పదహారణాల పడుచుగా,‌ తెలిసి తెలియని వ్యవహార లక్షణంతో తెరపై ఎన్నో పాత్రలకు జీవం పోసారు. అల్లు రామలింగయ్య, రాజబాబుతో బెస్ట్ కాంబినేషన్లో ఎన్నో సినిమాల్లో విజయవంతం అయ్యాయి. ఉదాత్తమైన, కరుణరస, హాస్య, విషాద ఛాయలు కలిగిన పాత్రలు కూడా సహజంగా

వెండితెరపై నటన శ్లాఘనీయం. సహాధ్యాయులతో మంచి మనసుతో కలివిడిగా ఉండటం రమాప్రభ లక్షణం. రాజబాబు గారిని సొంత అన్నయ్యల చూసుకొనే అనుబంధం వ్యక్తిత్వం కలిగిన ఏకైక ఆర్టిస్ట్. బంధాలు, సెంటిమెంటులు కలిగిన ప్రేమభరిత స్వభావం కలిగిన వ్యవహారతో పరిశ్రమలో చాలా మంది నాటి సహ కళాకారుల పట్ల బాంధవ్యం

ఏర్పరచుకొన్న నటిగా తెరముందు తెర వెనుక కూడా చాలా దాపరికంలేని మంచి మనసున్న నటి మన రమాప్రభ గారు ముందుంటారు.

(17) #గీతాంజలి కళా రంగాన ప్రత్యేకత_నటనా విభాగాన విలక్షణ

గీతాంజలి పరిశ్రమలో తొలిసారిగానే యన్టీఆర్ 'సీతారామ కల్యాణం' చిత్రంలో సీతాదేవి పాత్ర దక్కించుకొన్న అదృష్టవంతురాలు.

కథానాయికగా, సెకెండ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నృత్య కళాకారిణిగా, ప్రాముఖ్యం కలిగిన ఎన్నో విభిన్న తరహా పాత్రలు పోషించి మెప్పించారు. దాదాపుగా అందరి టాప్ గ్రేడ్ కథానాయకులతో నటించే అవకాశం దక్కించుకొన్నారు. పద్మనాభం గారితో గీతాంజలి కాంబినేషన్ అత్యంత ప్రజాదరణ పొందింది.

బాగా ఆదరించారు. తెలుగు సినిమాలో గీతాంజలి గారు అన్ని రకాల పాత్రలలో నటించి మంచి ఆర్టిస్ట్ గా పరిశ్రమలో పేరు పొందారు.

ఇవండి మన #కన్నాంబ గారి సినీ సామ్రాజ్యంలో కొలువైన #సామంత_నట_రాణుల విశేష కథనాలు విజయ కేతనాలు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling