ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 6, 2022, 12 tweets

#కాంతారావు ని తన సొంతతమ్మునిలా ఆదరించి ఎన్నో అవకాశాలు కల్పించి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎంతో సహకరించారు శ్రీ #యన్టీఆర్

#యన్టీఆర్ షూటింగ్ కు డుమ్మ కొట్టి #ఏఎన్నార్ షూటింగ్ కూ వెళ్ళిన #కాంతారావు.

నటరత్న శ్రీ యన్టీఆర్, కత్తి వీరుడు కాంతారావు దాదాపు 60 చిత్రాల్లో కలిసి

నటించారు. వినయ విధేయతులు, క్రమశిక్షణ, కలుపుగోలుతనం వంటి లక్షణాలు కాంతారావులో ఉండటంతో అవి రామారావు గారికి నచ్చి, ఆయన్ని మరింత ప్రోత్సహించేవారు. ఎన్నో పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుడు, అర్జునుడు వంటి కీలక పాత్రలు రామారావు గారి ఆశీస్సులవల్లే పోషించగలిగారు కాంతారావు గారూ.

రామారావు గారు కృష్ణుడుగా, కాంతారావు నారదుడిగా నటించి, పండించిన హాస్యం ప్రేక్షకులను ఎంతో అలరించింది. రామారావు గారి స్వంత చిత్రం జయసింహాలో తమ్ముడి వేషం కోసం మొదట జగ్గయ్యను అనుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ అదృష్టం కాంతారావుకి దక్కింది. అప్పటికి మూడు చిత్రాల్లో మాత్రమే నటించి

ఫ్లాప్స్ లో ఉన్న కాంతారావుకు తనతో సమానమైన పాత్ర ఇచ్చి రామారావు గారు ఆదుకున్నారు.

జయసింహా కాంతారావుకు తొలి కమర్షియల్ బ్రేక్. ఆయన జానపదాలకు పనికి వస్తాడని పరిశ్రమకు తెలిపిన సినిమా ఇది. దీపావళి చిత్రంలో రామారావు గారు కృష్ణుడి గా, కాంతారావు నారదుడిగా తొలిసారి కలిసి నటించారు.

నారదుడిగా కాంతారావు అభినయం. రామారావు గారికి నచ్చింది. బ్రదర్ కృష్ణుడి వేషం ఇక నుంచి నాది, నారదుడి పాత్ర మీది అన్నారు రామారావు గారు. ఆ మాటకు ఆయన కట్టుబడ్డారు. కాంతారావు కొన్ని చిత్రాల్లో శ్రీ కృష్ణుడిగా నటించినా తను మాత్రం నారదుడి పాత్ర జోలికిపోలేదు.

ఇక్కడ లవకుశ చిత్రం గురించి

ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో లక్ష్మణుడి పాత్ర కోసం చాలా మంది ప్రయత్నించారు. వారిలో కాంతారావు కూడా ఉన్నారు. ఆ చిత్ర దర్శకుడు సి.పుల్లయ్య కూడా కాంతారావు వైపే మొగ్గుచూపారు, కానీ రాజకీయాలు జరిగి తెలుగులోను, తమిళంలోను ఆ పాత్ర జెమినీ గణేషన్ తో చేయించాలని నిర్ణయించారు. ఆ విషయం

కాంతారావుకు తెలిసి నిర్వేదానికి లోనయ్యారు. అయిన ఈ విషయం రామారావు గారి దృష్టికి తీసుకెళ్ళాద్దామని మరునాడు ఉదయమే రామారావు గారి ఇంటికి వెళ్ళారు కాంతారావు. రామారావు గారికి ఈ విషయం చెప్పగానే వెంటనే నిర్మాత శంకర్ రెడ్డికి ఫోన్ చేసి
లక్ష్మణుడి వేషం కాంతారావుకీ ఇవ్వండి అన్ని చెప్పేసారు.

మేము ముగ్గురం అన్నదమ్ములం. కాంతారావు మా రెండవ తమ్ముడు అని కూడా చెప్పారు. అలా లక్ష్మణుడి వేషం కాంతారావుకు దక్కింది.

ఇదనే కాదు చాలా వేషాలు కాంతారావుకూ ఇలా ఇప్పించారు రామారావు గారు. కాంతారావు కూడా రామారావు గారంటే ఎంతో కృతజ్ఞత భావంతో ఉండేవారు. ఏ పని చేసిన రామారావు గారికి చెప్పే

చేసేవారు. అంతలా ఉండే కాంతారావు ఒక్క సినిమా విషయంలో మాత్రం రామారావు గారి అభిమాతానికి విరుద్ధంగా ప్రవర్తించి, ఆయన ఆగ్రహానికి గూరైయ్యారు. ఆ చిత్రం #శ్రీ_కృష్ణావతారం. ఇందులో నారదుడి వేషానికి మొదట కాంతారావును బుక్ చేశారు నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య. రేట్లు, డేట్లు మాట్లాడుకున్నారు.

షూటింగ్ రోజున కారు పంపిస్తే తనకు కడుపు నొప్పిగా ఉందని, తరువాత వస్తానని చెప్పి కారు తిప్పి పంపించేసారు. సరే అని ఆయన వర్క్ మధ్యహ్నం నుండీ ప్లాన్ చేసారు. అప్పుడు కారు పంపిస్తే రహస్యం షూటింగ్ కోసం హైద్రాబాద్ వెళ్ళిపోయారని ఇంట్లో చెప్పారు. అది విని అందరూ షాక్ అయ్యవారు. ఆ రోజు

రామారావు గారికి వర్క్ లేదు. షూటింగ్ కూ ప్యాకప్ చెప్పి ఆయన ఇంటికి వెళ్ళారు అట్లూరి పుండరీకాక్షయ్య. విషయం వినగానే రామారావు గారు కూడా షాక్ అయ్యారు. కాంతారావు ఇలా చేశాడా అని ఎంతో బాధపడ్డారు.

అప్పటికి అప్పడు నిర్ణయం తీసుకొని కాంతారావును తీసేసి, శోభన్ బాబును ఎన్నుకున్నారు.

నారదుడి వేషం అనగానే ఆయన మొదట భయపడ్డా, తరువాత ఆ పాత్రలో అద్భుతంగా నటించారు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling