మన '#నటసార్వభౌమ_యస్వీరంగారావు' అలనాటి ఒక అపురూపమైన ఫోటోను మీకోసం...
వర్కింగ్ స్టిల్ ఫోటో: బంగారు కలలు (1974)
ప్రముఖ నవలా రచయిత్రి #యద్దనపూడి_సులోచనారాణి గారి 'బంగారు కలలు' నవలాధారంగా అదే పేరుతో అన్నపూర్ణ వారు #ఆదుర్తి_సుబ్బారావు గారి దర్శకత్వంలో నిర్మించారు. సంగీతం సారధ్యం
#సాలూరి_రాజేశ్వరరావు మాస్టారు గారు.
దయగల వాడైన గొప్ప వ్యక్తిత్వం పాత్రలో మన నాటి సింహం 'యస్వీరంగారావు' గారు పోషించారు. విధి వంచిత అయిన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హిందీ నటి '#వహీదా_రెహమాన్' నటించారు. అందునా తొలిసారిగా యశస్వి #యస్వీఆర్ గారితో #వహీదా నటించారు.
1955 నాటి 'రోజులు మారాయి' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కెరియర్ ప్రారంభించిన #వహీదా_రెహమాన్ అడపాదడపా 2-3 సినిమాలు తెలుగులోనే చేసింది. మొట్టమొదటి అవకాశం ఇచ్చింది తెలుగు పరిశ్రమే కావడం విశేషం.
#యస్వీఆర్ #వహీదా మధ్య ఎన్నో రసవంతమైన సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది.
ఈ సినిమాకి సాలూరి వారి సంగీతం, సుశీలమ్మ, రామకృష్ణ దాస్ గానం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
యస్వీఆర్ గారు సెట్స్ లోని వివిధ సన్నివేశాలలో ఒకదాని తరువాత ఒకటి ఆ నటనను చూసి నివ్వెరపోయింది #వహీదా. ఏంటి ఇంతటి సహజ నటనా? అందునా కొత్త వారితో కూడా ప్రోత్సహించి నటిస్తుంటే వహీదాకు నోట మాట
రాలేదు. అందుకే, #యస్వీఆర్ గారంటే చాలా అభిమానం, అభిమాన నటుడని బాలీవుడ్ సక్సెస్ గ్రాఫ్ వచ్చిన తరువాత కొన్ని సందర్భాల్లో చెప్పేది.
ఎంతైనా తెలుగు అమ్మాయి #ఖమ్మం జిల్లా కావడం చేత తెలుగువారికి సుముఖంగా ఉండేది #వహీదా_రెహమాన్..
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.