ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 7, 2022, 14 tweets

#జంతుబలులు

కొన్ని సంప్రదాయాలలో మరియు కొన్ని ఇతర సనాతన ధర్మ ఆచారాలలో కొంతమంది దేవతలకు జంతు బలులు సమర్పిస్తారు. దానిలోని అంతరార్థం ఏమిటి..?

సనాతన ధర్మంలోని కొన్ని సంప్రదాయాలలో తమ కోరికలు నెరవేర్చుకోవడానికనీ, మొక్కుబడిగా కానీ జంతు బలులు ఇచ్చే ఆచారం ఉన్నది.

కానీ సనాతన ధర్మంలోని అన్ని విషయాలు మనుష్యుల మరియు ఇతర ప్రాణుల యొక్క హితం కోసం చెప్పబడ్డాయి. లోకమంతా సుఖంగా ఉండాలీ అన్న సనాతన ధర్మం.. దానికి మూలం ఐన ఆ భగవంతుడూ ఒకరి కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రాణాన్ని బలి కోరతాడా..?

#బలి_అంటే...

గుడిలోని బలి పీఠం సనాతన ధర్మంలో భూత బలి అనే ఆచారం

స్పష్టంగా చెప్పబడింది. ప్రజలు తాము ఇంటిలో వండిన అన్నమును కానీ, ఇతర పదార్థమును కానీ, #గుడిలో వివిధ దిక్కులలో కానీ #బలి_పీఠం వద్ద కానీ ఉంచుతారు. వాటిని జంతువులూ, ప్రకృతి లోని ఉగ్ర భూతములూ తింటాయి. ప్రకృతిలోని ఇతర ప్రాణులకూ కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశ్యముతో ఇది చెప్పబడినది.

ఇది గృహస్తులు కూడా ఇంటివద్ద చేయాల్సిన పనిగా చెప్పబడింది. ఐతే బలికి, హోమానికి తేడా ఉన్నది.. హోమం అగ్ని ద్వారా ఇస్తారు.

#ఆచరణలో_దోషం :

కొన్ని సంప్రదాయాలలో జంతు బలుల ప్రస్తావన ఉన్నది. అవి దేవతలకు ఒక పొట్టేలునో, మేకపోతునో, నల్లపిల్లినో, దున్నపోతునో బలి ఇవ్వమని చెప్పాయి.

ఐతే దాని అర్థం, ఒక అమాయకమైన జంతువును దేవుడి పేరు చెప్పి అన్యాయంగా హత్య చేయమని కాదు.

నల్ల పిల్లి దొంగతనానికి సంకేతం. అందుకే పిల్లిలా వచ్చాడురా అంటూ ఉంటారు. చప్పుడు చేయకుండా వచ్చి చీకట్లో దొంగతనం చేయడంలో పిల్లిని ఉదాహరణగా చెప్తారు. ఇక నల్ల పిల్లి ఐతే అసలే కనపడదు.

నల్ల పిల్లిని బలియ్యి అంటే నీలోని పరుల సొమ్ముపై ఉన్న #ఆశ అనే నల్ల పిల్లిని బలియ్యి అని.. అంతే కానీ.. ఒక నల్ల పిల్లిని చంపేయమని కాదు.

మేకపోతు లేక పొట్టేలు మూర్ఖత్వానికి ప్రతీకలు. ఒకటి ఎటు వెళితే మిగిలినవి కూడా అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాయి. నీలోని మూర్ఖత్వాన్ని బలి ఇవ్వడం ద్వారా

చేసిన కర్మ వలన మరలా పునర్జన్మ వస్తుంది అనే సత్యం తెలుసుకుని మోక్ష మార్గం లో ప్రయాణించవచ్చు.

దున్నపోతు పిరికితనానికీ బద్దకానికీ జడత్వానికి ( చైతన్యం లేకపోవుట) ప్రతీక.. నీలోని జడత్వాన్ని వదిలి చైతన్యం వైపూ, బద్దకాన్ని విడిచి ఉన్నతమైన జీవితం వైపూ, నాకేమౌతుందో అన్న పిరికితనంలో

ఉన్న శరీరం పైన మోహాన్ని త్యజించి మోక్షం వైపూ ప్రయాణించమని దాని అర్థం.

ఆ విధంగా మనలోని లోపాలను బలియ్యమని శాస్త్రాలు చెప్పాయి తప్ప జీవహింస చేయమని కాదు.

#మూఢనమ్మకం...

కోరికల కోసం జంతు బలులు ఇవ్వడం అనేది ఒక మూఢనమ్మకం మాత్రమే.

భాగవతంలో కృష్ణుడిచే.. పశూమ్ దృశ్యంతి విశబ్దా:.. అని

బలి పేరిట అన్యాయంగా చంపివేయబడ్డ జంతువులు స్వర్గంలో చంపిన వాడిపై పగతో ఎదురుచూస్తాయి అని చెప్పబడింది.

అదేవిధంగా భగవద్గీత (5-18) ప్రతి జీవి దేవుడి దృష్టిలో సమానం అని చెప్పినది.

ఒక కాలంలో చారిత్రక తప్పిదంగా ఏర్పడిందే తప్ప సనాతన ధర్మంలో జంతుబలి లేదు.

అశ్వం నైవా గజంనైవ వ్యాఘ్రం నైవచ నైవచ…
అంటూ పూర్వం చెప్పిన రీతిలో గుఱ్ఱమును, ఏనుగును, పులులను చంపలేరు కనుక లోకువగా దొరికిన మేకను దేవుని పేరుతో చంపినారు అని..

ఋగ్వేదంలో దున్నపోతుల, మేకపోతుల బలులు బ్రాహ్మణులు అర్పించి ఇంద్రుడిని తృప్తి పరిచారు అని ఉన్నది..

ఇంద్రుడు ఇంద్రియములకు దేవత. అంటే వారి ఇంద్రియాలలో మనసులో లోపాలను బలిగా సమర్పించారు అనే తప్ప చంపేశారు అని కాదు.

వేదాలు, ఇతర ఐతిహాసిక గ్రంథాలు పుస్తక రూపంలో రావడం వలన, గురువు వద్ద నేర్చుకోకుండా వారి వారి సొంత అభిప్రాయాలకు రావడం వలన ఏర్పడిన తప్పిదమే తప్ప మరొకటి కాదు.

ఇప్పుడు మనకు జంతు బలుల యొక్క అంతరార్థం తెలిసింది. కనుక ఇకనైనా విచక్షణతో ప్రవర్తిద్దాం.

అమాయకమైన జంతువులను బ్రతకనిద్దాం. ఇకనైనా నోరులేని మూగజీవాలని మొక్కుబడుల పేరుతో దారుణంగా హింసించకండి. దైవాన్ని ప్రసన్నం చేసుకునే ఉత్తమమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఆచరించండి.

ముందుగా బలి ఇవ్వవలసింది మనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని.

జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే
జీవునరసి కనుడు శివుడె యగును
జీవుడు శివుడనుట సిద్ధంబు తెలియరా
విశ్వదాభిరామ వినుర వేమ...!

జీవుడికి, శివుడి మధ్య బేధం లేదు. తరచి చూస్తే జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఏ జీవినీ హీనంగా చూడరాదు.

జీవిని చంపడమంటే శివభక్తి తప్పడమేననీ, జీవహింస మహాపాపమని ఈ పద్యంలో చెప్పారు వేమన మహాకవి.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling