ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 15, 2022, 6 tweets

పాండవ ప్రథముడు #ధర్మరాజు దాన ధర్మాలకు పేరు. రాజ్యంలో ప్రజలకు ఎక్కువ ధర్మాలు చేశాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని #కృష్ణుడికి అనిపించింది. అందుకోసం #కృష్ణుడు #ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకువెళ్ళాడు.

ఆ రాజ్యం ఒక మహా చక్రవర్తి పాలనలో ఉండేది. అక్కడ వారు ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్ళు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు చెంబులో నీళ్ళు ఇచ్చింది. వారు తాగేశాక ఆమె ఆ చెంబును తిరిగి ఇచ్చేస్తూ మా రాజ్యంలో ఒకరికి ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోము అని బదులు చెప్పిలోనికి వెళ్ళిపోయింది !!!

ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు #ధర్మరాజు. ఇక రాజును కలవడానికి ఇద్దరూ వెళ్లారు.

రాజా.. ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు #ధర్మరాజు అని చెప్పాడు #కృష్ణుడు. అయినా ఆ మహారాజు #ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా #కృష్ణుడితో ఇలా అన్నాడు…

కృష్ణా.. మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ భిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు

ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు.. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో…ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు !!

తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తలదించుకున్నాడు ధర్మరాజు !!! ఇది ఒక మహాభారత నీతి గాధ..

ఉచితం లభించే దేనికైనా విలువుండదు..
కష్టపడి సంపాదించిన దానికే ఎప్పటికైనా విలువ.. ప్రజలకు పని కల్పించటం పాలకుల ధర్మం..

కష్టించి పని చేయటం ప్రజల ధర్మం..
అప్పుడు ఏ రాష్ట్రమైనా, దేశమైనా సుభిక్షమే..

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling