ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 16, 2022, 18 tweets

తెలుగువారిలో లోపించిన #మాతృభాషాభిమానం

-- ముత్తేవి రవీంద్రనాథ్ గారి వ్యాసం

తెలుగుల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం మీద చర్చ ఇది. #తెలుగువారిలో లోపించిన #మాతృభాషాభిమానం వారిలో ఆత్మాభిమానం లోపించడానికి కూడా ఎంతోకొంత మేరకు కారణం అవుతున్నది.

#తెనాలి #ఇస్లామ్_పేటలో ఒకప్పుడు తమిళనాడుకు చెందిన లబ్బీ సాయిబులు ఉండేవారు. వారు పచ్చి తోళ్లను కొనుగోలుచేసి, ఊనడం కోసం తమిళనాడులోని #వాణియంబాడి వంటి కొన్ని ప్రదేశాలలో ఉన్న తోళ్ళు ఊనే టానరీలకు పంపేవారు. వారు #తమిళ భాషను తమ #మాతృభాషగానే భావించేవారు. వారు నిత్యం చక్కని

తమిళ భాషనే మాట్లాడేవారు. వారి కార్యాలయాలకు ' దినతంతి', 'దిన మణి ', ' అలై ఒషై', 'ఆనంద విగడన్' , 'కుముదం', 'కలకండు' వంటి తమిళ పత్రికలను క్రమం తప్పకుండా తెప్పించుకుని శ్రద్ధగా చదివేవారు. తమిళ దినపత్రికలు ఏ ఒక్కరోజు కాస్త ఆలస్యంగా వచ్చినా వారు ఎంతో తపనపడేవారు. వారి కార్యాలయాల

ముఖద్వారాల మీద సుస్వాగతం పలుకుతూ తమిళ లిపిలో 'వణక్కమ్' (నమస్కారం) అనే ఫలకాలు ఉండేవి. ' మీ మాతృభాష ఏది ?' అని ప్రశ్నిస్తే వారు ఎలాంటి సంకోచం లేకుండా 'తమిళం' అని చెప్పేవారు. తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలు తమ మాతృభాష ఉర్దూ అంటారు. చక్కని తెలుగులో మాట్లాడగలిగి, రచనలు చేయగలిగినవారూ

వీరిలో కొందరు ఉన్నప్పటికీ ఎక్కువమంది #తెలుగు నేర్చుకునే ప్రయత్నమే చేయరు. వారు #ఉర్దూను తమ మాతృభాష అని చెప్పుకునేందుకు ఎంతో గర్వపడతారు. ఇటీవలి కాలం వరకు తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలలో అత్యధికులు #తెలుగు సినిమాలకు బదులుగా #హిందీ చలనచిత్రాలు ఎక్కువగా చూసేవారు. ఇక #తెలుగుభాషా

సాహిత్యాల పట్ల వారిలోని అధిక సంఖ్యాకులకు ఆసక్తి చాలా తక్కువనే చెప్పాలి. విజయవాడలో మోడరన్ ఫుడ్స్, మోడరన్ సూపర్ మార్కెట్ వంటి ప్రఖ్యాత డిపార్టుమెంటల్ స్టోర్స్ లు పశ్చిమ కర్ణాటకలోని భట్కల్ కు చెందిన ముస్లిం కుటుంబాలవారు నిర్వహిస్తారు. వారు కూడా తమ మాతృభాష కన్నడం అని సగర్వంగా

చెప్పుకుంటారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో పలుమార్లు పర్యటించిన నేను ఆ రాష్ట్రాల ప్రజల మాతృభాషాభిమానాన్ని ప్రత్యక్షంగా ఎరుగుదును. మరీ కర్ణాటకలోనైతే భాషా పండితులకు, సాహితీవేత్తలకు గుడులు కట్టి ఆరాధించడం కూడా నాకు తెలుసు. కె. వి. పుట్టప్ప (కువెంపు), మాస్తి వెంకటేశ అయ్యంగార్,

శివరామ కారంత, వి.కె.గోకక్ , డి.ఆర్.బెంద్రే, చంద్రశేఖర కంబార, యు.ఆర్.అనంతమూర్తి, గిరీష్ కర్నాడ్, టి. నరసింహాచారియర్, లంకేశ్, పూర్ణచంద్ర తేజస్వి వంటి ప్రముఖ రచయితలంతా కన్నడిగులకు దైవసమానులు. తమిళనాడులో తిరువళ్ళువర్, సుబ్రహ్మణ్యభారతి, కణ్ణదాసన్ వంటి కవులను తమిళులందరూ ఆరాధిస్తారు.

దీనికి కారణం తమిళులకున్న విపరీతమైన భాషాభిమానం. గొప్ప తమిళ పండితుడు, రచయిత అయినట్టి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కీ.శే. ముత్తువేల్ కరుణానిధిని తమిళులు ఆరాధనా భావంతో చూడడానికి కూడా తమిళుల ఈ ఆపారమైన భాషాభిమానమే కారణం. కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ఒక వ్యక్తి నటుడిగా, రచయితగా ప్రజామోదం

పొందడానికి అతను ముస్లింగా పుట్టడం ఒక అడ్డంకి కాదు. ఎందుకంటే వారంతా స్థానిక భాషలను తమ మాతృభాషలుగా భావించి వాటిలో ప్రావీణ్యం కలిగిఉంటారు. కేరళకు చెందిన మహమ్మద్ ఉమర్ కుట్టి ( మమ్ముట్టి), రఘు (రెహమాన్), బబ్లూ పృథ్వీ వంటి వారు ముస్లింలే. మలయాళీలు కూడా విపరీతమైన మాతృభాషాభిమానానికి

పేరొందారు. ముస్లిం లీగ్ నేత, మాజీ ముఖ్యమంత్రి సి.హెచ్.మహమ్మద్ కోయా గొప్ప మలయాళీ భాషా పండితుడు. ఆయన ' చంద్రిక' అనే సుప్రసిద్ధ మలయాళీ దినపత్రికకు సంపాదకునిగా వ్యవహరించారు. ఇలా తమిళ, కన్నడ, మలయాళీ భాషాసముదాయాలకు గొప్ప మాతృభాషాభిమానం ఉందనేందుకు ఎన్ని ఉదాహరణాలైనా చెప్పవచ్చు.

మన తెలుగువారిలో అది లోపించడం తీవ్రమైన విచారం కలిగిస్తుంది. పొరుగువారిని చూసైనా మనవాళ్ళు భాషాభిమానాన్ని అలవర్చుకోకపోవడం బాధాకరం. కులమతాల అడ్డుగోడలను అధిగమించి అందరిచేత ఆరాధించబడుతున్న తెలుగు సాహితీవేత్తలు, కళాకారులు తెలుగునేలపై అతి తక్కువగా కనిపిస్తారు. నిన్న మొన్నటి వరకు రెండు

తెలుగు ప్రాంతాల ప్రజలు ఒకరి భాషా సంస్కృతులను మరొకరు గేలి చేసుకోవడం తెలుగుభాషా సాహిత్యాలకు తగినంత ప్రాముఖ్యం లభించకపోవడానికి ప్రధాన కారణమనీ, రెండు భిన్నమైన భాషా సంస్కృతులు కలిగిన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కృత్రిమంగా ఒకటి చేసిన కారణంగానే ఒకరి పట్ల మరొకరికి వ్యతిరేకత ఏర్పడి,

అది తెలుగుభాషా సాహిత్యాలు ఇతరుల దృష్టిలో పలుచన కావడానికి దారితీసిందని కొందరి వాదన. ఇది సత్యదూరం. కర్ణాటక రాష్ట్రం 1948 లో ఏర్పరచబడిన మైసూర్ రాష్ట్రానికి పొరుగున ఉన్న మద్రాస్, బొంబాయి ప్రావిన్స్ ల నుంచి, నిజాం రాజ్యం నుంచి కన్నడం మాట్లాడే ప్రాంతాలను ఒకటిగా గుదిగుచ్చి 1956 లో

భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ లాగే ఏర్పరచారు. మరి అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ప్రాంతాల కన్నడిగులు కలిసిమెలిసి జీవిస్తూ చక్కటి మాతృ భాషాభిమానాన్ని పెంపొందించుకున్నారు కదా? మన తెలుగు ప్రజలకు మాతృ భాషాభిమానం ఎప్పటికి కలుగుతుందో? ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే వారు తమ

మాతృభాషైన తెలుగులో కాక ఆంగ్లంలో మాట్లాడుకుంటారనే నానుడి మనందరం విన్నదే. దానిలో కొంత నిజమూ ఉంది. ఎందుకో తెలియదు కానీ #తెలుగువారిలో చాలా మంది #తెలుగులో మాట్లాడడాన్ని చిన్నతనంగా భావిస్తారు. మాట్లాడినా, రాసినా తమకు వచ్చీరాని ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని అందరిముందూ ప్రదర్శించజూస్తారు.

ఇది దాదాపు తెలుగువారందరిలో ఉండే సగటు బలహీనత అని చెప్పుకోవచ్చు. ఈ బలహీనతను విమర్శిస్తూనే మహాకవి #కాళోజీ_నారాయణరావుగారు తెలుగువారందరికీ ఇలా చురకేశారు.

#తెలుగువాడవురోరి #తెలుగు మాట్లాడుటకు ..
సంకోచపడెదవు సంగతేమిటిరా ?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు ..

సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా ?

మనకి సిగ్గురావాలంటే, మనకీ పొరుగువారందరిలా మాతృభాషాభిమానం రావాలంటే ఇలాంటి #కాళోజీలు ఎందరు, ఎన్ని చురకలు వేయాలో మరి ?

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling