హెచ్ ఎం వి కంపెనీ పేరు వినగానే అందరికీ ఒక దృశ్యం స్పురణకు వస్తుంది.అది. #గ్రామఫోను రికార్డులో వస్తున్న సంగీతాన్ని శ్రద్ధగా వింటున్న కుక్కపిల్ల. హెచ్ ఎం వి కంపెనీ వారు తమ కంపెనీ 'లోగో' ని ఆ విధంగా రూపొందించటం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది.
ప్రఖ్యాత #హిందుస్థానీ #విద్వాంసులు
#ఉస్తాద్ #అబ్దుల్ #కరీం #ఖాన్ (11 నవంబర్ 1872 - 27 అక్టోబర్ 1937) గారికి ఒక పెంపుడు కుక్కపిల్ల ఉండేది. దానికి జన్మాంతర సంస్కారంతో సంగీతప్రియత్వం అలవడింది. ఉస్తాద్ గారు గాత్ర సాధన ఆరంభించగానే ఎక్కడ ఉన్నా పరుగున వచ్చి, చెంతనే కూర్చొని, ఎన్ని గంటలయినా సంగీతం వినేది. ఆయన సాధన పూర్తి
అయితేగానీ కదిలేది కాదు. కొన్ని సందర్భాలలో గానం పతాక స్థాయికి చేరుకున్నప్పుడు ఆకుక్క కంటి వెంట అశ్రువులు జారేవి! ఈ చిత్రం చూడటానికి ఎంతోమంది ఖాన్ గారి ఇంటికి వచ్చేవారు. ఖాన్ గారు కూడా ఈ విషయాన్ని ఎక్కడికి వెళ్లినా అందరితో పంచుకొనేవారు. క్రమంగా ఈవార్త హెచ్ ఎం వి కంపెనీ యాజమాన్యం
వరకు చేరింది. ఎంతో ఆశ్చర్యానికి లోనైన కంపెనీవారు, ఆ కుక్కకు ఒక పరీక్ష పెట్టదాలిచారు .'పియా బిన్ ఆవత్ న చైన్..' అనే గీతాన్ని ఖాన్ సాహెబ్ తో పాడించి, రికార్డ్ చేశారు.
ఖాన్ సాహెబ్ ఇంటిలో గ్రామఫోను రికార్డ్ పెట్టి, ఆ గీతాన్ని అందులో వినిపించారు. అంతే.. బయటనుండి పరుగుపరుగున
వచ్చింది ఆ కుక్కపిల్ల.. తన యజమాని ఎక్కడినుండి పాడుతున్నారో అని ఆశ్చర్యంతో గ్రామఫోనులో ముఖంపెట్టి తొంగిచూస్తూ, తన్మయత్వంతో గానాన్ని ఆస్వాదించసాగింది. ప్రక్కన రహస్యంగా కెమెరాలతో సిద్ధంగా ఉన్న హెచ్ ఎం వి కంపెనీ సిబ్బంది, ఆ దృశ్యాన్ని క్లిక్ మనిపించారు.
ఆ చిత్రం ఒక చరిత్ర సృష్టించింది. #HMV (HIS MASTER'S VOICE) #లోగో గా రూపుదిద్దుకొని, జగత్ప్రసిద్ధమైంది!!
వ్యాస రచన - మొదుమూడి సుధాకర్ గారు
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.