ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 18, 2022, 10 tweets

#వంగోలు_వెంకటరంగయ్య..

ఆంధ్రవిద్యా వయో వృద్ధులలో గణ్యులు. వీరు బహుభాషా కోవిదులు. ఆంధ్రాంగ్ల గీర్వాణములయందును, కన్నడము, తమిళము, హిందీ, ఉర్దూ, పారసీక భాషలయందు వీరు పాండిత్యము సంపాదించారు. వీరు "భారతి" వంటి సుప్రసిద్ధ సారస్వత పత్రికాముఖముల ప్రకటించిన వ్యాసములు శతాధికములు.

వీరు వ్రాసిన ప్రసిద్ధ వ్యాసములు - రామాయణము లోని వానరులు నరులు కారా? నిజముగా వానరులే అగుదురా? అను విషయములను గూర్చియు, ప్రాచీన కాలమున సంస్కృతము దేశభాషగా నుండెనా? ఆంధ్రులెవరు? అను సమస్యలనుద్ధేశించియు, ఆనందరంగరాట్చందమును గూర్చియు, శ్రీ పంతులు గారు వ్రాసిన వ్యాసములు అమూల్యములు.

వంగోలు వెంకటరంగయ్య

జననం : 1867, అక్టోబరు 18, నెల్లూరు
మరణం : 1949, జూన్ 9
ప్రసిద్ధి : పండితుడు, బహుశాస్త్రవేత్త
తండ్రి : వంగోలు శేషాచలపతి
తల్లి : సీతమ్మ

#విశేషాలు

వీరు పండిత వంశములో వంగోలు శేషాచలపతి, సీతమ్మల మువ్వురు సంతానంలో కనిష్ఠ పుత్రుడిగా 1867, అక్టోబరు 18వ తేదీన

జన్మించారు. వీరు నెల్లూరులోని హిందూ స్కూలు (వెంకటగిరి రాజా స్కూలు)లో మెట్రిక్యులేషన్ వరకు చదివి, తరువాత బి.ఎ. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలోను, బి.ఎల్. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోను చదివారు. ఇరువది రెండేండ్లలోపునే వీరు బి.ఏ, బి.యల్ కాగలిగి నెల్లూరులో న్యాయవాదిత్వములో ప్రవేశించారు

కేవలం చదువులో మాత్రమే కాక వీరు శారీరక వ్యాయామములలో ముఖ్యముగా కత్తిసాము, కర్రసాము, కుస్తీ విద్యలలో ప్రావీణ్యులు.

వీరు తమ స్నేహితులు కొందరితో అమెచ్యూర్ డ్రమెటిక్ సొసైటీ అనే నాటకరంగ సంస్థను స్థాపించి ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత నాటకాలను ప్రదర్శించారు. వేదము వెంకటరాయశాస్త్రిగారి

ప్రతాపరుద్రీయము నాటకాన్ని మొదటిసారి ప్రదర్శించినది ఈ సంస్థే. వీరు ప్రత్యేకంగా నాటకాలలో నటించకున్నా నటులను తీర్చిదిద్దడంలో, నాటకాల ఎంపికలో ప్రధాన పాత్రను పోషించేవారు. 1917లో నెల్లూరులో జరిగిన ఐదవ ఆంధ్రజనమహాసభకు ఆహ్వానసంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సభలలో వీరి స్వాగతోపన్యాసం చాలా

ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నది.

వీరు గొప్ప పరిశోధకులు. బ్రాహ్మణక్రాకశాసనము, వెలిచర్ల శాసనము, మున్నగు శాసనములను వీరు ప్రకటించిరి. ఆయుర్వేదసూత్రములు అనే చిన్న గ్రంథాన్ని సవరించి సటీకతో ప్రకటించారు. చారిత్రికదృష్టితో "కొందరు నెల్లూరు గొప్పవారు" అను శీర్షికతో

'రాజమంత్రప్రవీణ - పల్లె చెంచల్రావుగారు', 'వేదము వేంకటరాయశాస్త్రులు గారు' , 'వెన్నెలకంటి దరరామయ్య గారు', 'శనగవరపు పరదేశిశాస్త్రులు గారు' వంటి మహనీయుల పవిత్రజీవిత చరిత్రములను వ్రాసి ప్రచురించారు. మరియు భరతముని ప్రణీత నాట్యశాస్త్రములోని చతుర్ధాధ్యాంతర్గత తాండవ లక్షణమును విలక్షణముగా

వివరములతో ఆంగ్లేయ భాషలోకి అనువదించారు. ఈ గ్రంథము 1936సం. లో అన్నామలై ఆచార్యునిగా నుండిన మాన్యులు శ్రీ. బిజయేటి నారాయణస్వామి నాయుడు గారు ప్రకటించినారు. సంస్కృత రామాయణంలోని లోకోక్తులు, శబ్దరత్నాకరములో లేని కొన్ని మాటలు వాటి అర్థములు వీరి అముద్రిత రచనలలో కొన్ని.

వీరు ఆజానుబాహువులు. మంచి దేహపుష్ఠి కలవారు. నిరంతర విద్యావ్యాసంగ పరాయణులు. వీరు తమ 82వ యేట 1949, జూన్ 9న మరణించారు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling