Delhi #LiquorScam explained.
ఏమిటీ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం?
ఢిల్లీ ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియా మార్చ్ 2021 లో కొత్త మద్యం పాలసీ తయారు చేశారు.
కొత్త మద్యం పాలసీని నవంబర్ 2021 లో అమలు చేశారు.
➡️పాత పాలసీ ప్రకారం ఒక ఫుల్ బాటిల్ వెనుక ప్రభుత్వానికి దాదాపు ₹330 రాబడి ఉండగా,
➡️కొత్త పాలసీ ప్రకారం ₹8.32 మాత్రమే రాబడి.
➡️పాత పాలసీ ప్రకారం దుకాణదారుడు ₹33.34 మిగులు ఉండగా
➡️కొత్త పాలసీ ప్రకారం ₹363.27 మిగులుతుంది.
➡️ పాత మద్యం పాలసీ ప్రకారం డిల్లీ లో ఉన్న మొత్తం 864 మద్యం దుకాణాలలో నుంచి, 475 ప్రభుత్వం 389 ప్రైవేట్ ఆధీనంలో ఉండేవి
➡️60% మద్యం దుకాణాలను ప్రభుత్వం నడిపేది.
➡️కొత్త పాలసీ ప్రభుత్వ ఆధీనంలో "0" మద్యం దుకాణాలు,
➡️849 దుకాణాలు ప్రైవేట్ పరం
ప్రైవేట్ దుకాణాలను మనీష్ సిసోడియా కోట్లలో లంచం తీసుకుని, తనకి నచ్చిన వారికి కట్టబెట్టారు అని ఈడీ ఆరోపణ.
కోట్లలో లంచం ఇచ్చి, ఢిల్లీలో మద్యం దుకాణాలను దొడ్డి దారిన కొనుక్కుని, వాటిని నడిపి, ఇట్లా అడ్డగోలుగా కోట్లలో సంపాదించేందుకు ప్లాన్ వేసింది ఒక "లిక్కర్ రాణి".
ఈ వ్యవహారం మొత్తం, అరుణ్ రామచంద్ర పిళ్ళై అనే బినామీని మధ్యలో ఉంచి, ఇంటర్నెట్ ద్వారా కాల్స్ మాట్లాడుతూ, కొత్త కొత్త సాప్ట్ వేర్ లను వాడుతూ, మధ్య మధ్యలో ఎందుకైనా మంచిదని, 10 ఫోన్లను పగలకొట్టి, సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు కూడా ప్రయత్నం చేసింది
ఏప్రిల్ 2022లో, నరేష్ కుమార్ ఢిల్లీ కి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని, దీని వెనుక కుంభకోణం ఉందని ఢిల్లీ గవర్నరుకు ఫిర్యాదు చేశారు నరేష్ కుమార్.
ఢిల్లీ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించారు.
సీబీఐ విచారణకు ఆదేశించిన వెంటనే, ఢిల్లీ ప్రభుత్వం, వెంటనే అదే నెలలో కొత్త మద్యం పాలసీను రద్దు చేసి మరలా పాత మద్యం పాలసీనే కొనసాగించేలా మరలా చట్టం చేసింది.
ఒకవేళ స్కాం జరగకపోతే కొత్త మద్యం పాలసీని ఎందుకు రద్దు చేశారు? మరలా పాత మద్యం పాలసీని ఎందుకు తిరిగి తెచ్చారు?
స్కాం జరిగితే సీబీఐ విచారణ చేస్తుంది.
మనీ లాండరింగ్ జరగడం వంటి కోణాలు ఉన్నప్పుడు, ఆ కేసు ఈడీ చేతికి వెళుతుంది.
ఈ పెట్టుబడులకు సంబంధించిన డబ్బులో హవాలా డబ్బు ఉన్నట్టు తెలియడంతో, ఈడీ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఒకవేళ నిజంగానే మోదీ కవితక్కను ఇరికిస్తే, తెలంగాణలో ఏదో ఒక స్కాంలో ఇరికించి ఉండాలి. తనతో పాటు, మరో కొంత మందిని కూడా ఇరికించాల్సింది కదా?
ఢిల్లీ కేసులో ఎందుకు ఇరికిస్తాడు?
అందులో ఈమె A-1 కూడా కాదు.
పుట్ట తవ్వితే, ఢిల్లీ పాములతో పాటు, తెలంగాణ, ఆంధ్రకు చెందిన పాములు కూడా దొరికాయి.
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కొందరు నాయకులు ఈ లిక్కర్ స్కాంలో దొరకగా, అక్కడి ప్రభుత్వం దీని విషయంలో జోక్యం కానీ, ఎటువంటి డ్రామా చేయకుండా, దూరంగా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ రోడ్డెక్కారు.
స్వాతంత్ర సమరయోధురాలికి ఇచ్చిన ఎలివేషన్స్ ఇస్తున్నారు.!
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.