మొదట నువ్వెవరివి?
చిన్న కణమువి.సృష్టించబడిన జీవివి.తల్లి గర్భంలో పుట్టి పెరిగిన జీవివి.స్త్రీవో పురుషునివో నపుంసకునివో.అప్పుడు కులమెరుగవు మత మెరుగవు.కేవలం నవ్వు ఆనందం ఆటలు.నెమ్మదిగా కల్మషం అంటుతుంది.అరిషడ్వర్గాలు మొదలవుతాయి.నా కులం,నా మతం,నా నాయకుడు
పుట్టినది పెరుగుతుంది,తిరుగుతుంది, తింటుంది.కొన్నాళ్ళకు శక్తి తగ్గి
నమ్మితే ఇవన్నీను. నమ్మకపోతే నేనేమైనా చెయ్యొచ్చు,నేనెలాగైనా ఉండొచ్చు,ధర్మమో అధర్మమో, నన్నడిగే వాడెవ్వడు అని విర్రవీగొచ్చు.విశృంఖలత్వం పెరుగుతుంది. పాపభీతి ఉండదు.పాపపుణ్యం లేదు.
పోయాక జరిగేవి రహస్యాలు.అప్పుడే అనుభవంలోకి వస్తాయి.మాయ తెలిస్తే నువ్వు జ్ఞానివి.సత్యం తెలిస్తే నీ కర్మలు చేసే పనులు వాటికవే నిన్ను మోక్షానికి అర్హున్ని చేసేస్తాయి.ఎందుకంటే మాయలో నువు పడవు కనుక నా లాగా