2014 ఎన్నికలలో ప్రశాంత్‌కిషోర్ నేతృత్వంలో భాజపాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక కథనాన్ని సృష్టించారు. అదేమిటంటే, కాంగ్రెస్ హయాంలో ముస్లీములకే ప్రాధాన్యం ఇచ్చారనీ, హిందువులను చిన్నచూపు చూసారని, హిందువుల గుళ్ళు గోపురాలు దోచి ముస్లీములు ఇతర మైనారిటీలకు దోచిపెట్టారని..అలా.1
”హమ్ పాంచ్ హమారే పచ్చీస్” అని వ్యంగ్యంగా ముస్లీములను లక్ష్యంగా చేయటం, మతమార్పిడులను విరోధిస్తున్నామనే నెపంతో క్రైస్తవులను లక్ష్యంగా చేయటం, గోవథ గురించి హిందువులను ముస్లీములు, క్రైస్తవులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టం లాంటి మతవైషమ్యాలు పెంచే ప్రచారానికి తెరలెత్తారు.2
అంత దారుణమైన ప్రచారానికి చాలామంది హిందువులు బలైపోయారు (ఈ మీ విధేయుడితో సహా). భాజపాలు చెప్పిందల్లా నమ్మి, ముస్లీములు-క్రైస్తవుల వల్ల దేశానికి, హిందువులకు కలగబోయే విపరీత విపత్కర పరిణామల గురించి ఎవరికి వారు ఊహించేసుకుని ప్రచారాగ్నికి ఆజ్యం పోసారు.3
ఆ మతప్రచారపు మత్తులో జోగుతూ, రాబోయే భాజపా ప్రభుత్వం మతమార్పిడులు ఆపే చట్టం తెస్తుందని, గోవథ నిషేధిస్తుందని, హిందువుల గుళ్ళు గోపురాలపై ప్రభుత్వ అజమాయిషీ ఆపేస్తుందని, ప్రపంచంలోనే ఓ అద్భుతమైన హిందు సామ్రాజ్యం ఆవిష్కరిస్తుందని ఆవులిస్తూ కలలుగనటం మొదలేసాం.4
కాలక్రమంలో గొడ్డుమాంసం ఎగుమతి చేసే కంపెనీలలో హిందువులవే ఎక్కువనీ, అందులోనూ భాజపాల నాయకులవే ఎక్కువని అర్థమయ్యింది. మత మార్పిళ్ళకు సంబంధించి ఉన్న చట్టాలని కఠినంగా అమలుచేయగల ప్రభుత్వం తమ ఏలుబడిలోని అన్ని రాష్ట్రాలలో కూడా ఆ పని చేయలేకపోయిందని అర్థమయ్యింది.5
ఇతరపార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోని గుళ్ళ గోపురాల మీద భాజపాలు కార్చే మొసలి కన్నీళ్ళు, వారి ఏలుబడిలోని గుళ్ళ మీద అస్సలు కారవని అర్ధమయ్యింది. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలలో గుళ్ళను దోచుకోవచ్చు, గుళ్ళు పడగొట్టనూ వచ్చు.6
ఇతరపార్టీలప్రభుత్వాలు, హజ్‌యాత్రకో, జెరూసలెం యాత్రకో రాయితీలుఇస్తే పెద్దయెత్తున విమర్శించే భాజపాలు, ముస్లీంమహిళల వివాహానికి ’షాదీ క షగున్’ అంటూ మోడీ 51 వేలు ఇస్తుంటే, అది మాస్టర్ స్ట్రోక్ అని చంకలు గుద్దుకుంటాయి. మరి ఇతరమతాలలోని మహిళలకు ఎందుకు ఇవ్వరంటే, బూతులు తిడటం మొదలేస్తాయి.7
అప్పట్లో కొన్ని రాష్ట్రాలలో ముస్లీములకు రిజర్వేషనులు పెంచుతామని కొన్ని పార్టీలు ప్రకటిస్తే, వాళ్ళకి ఇస్తున్న రిజర్వేషనుల వల్ల, హిందువులు ఎంత అణగారిపోతున్నారో అంటూ, హిందువులను రెచ్చగొట్టిన భాజపాలు ఇప్పుడు యు.పి.ఎస్.సి పరీక్షలలో ముస్లీములకు చాలా మినహాయింపులు ఇస్తున్నారు!8
సి.ఎ.ఎ.కు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో జరిగిన గొడవలకు కారకులైన వాళ్లు భాజపాలో చేరారు! అంతకుముందు వరకు వాళ్ళు దేశద్రోహులని కేకలు పెట్టిన భాజ్పాలు, వారి మీడియాలు ఇప్పుడు వాళ్ళపై పల్లెత్తు మాట కూడా మాట్లాడటంలేదు.!9
వారి కథనాలనే నమ్మితే, కబీర్‌దాస్ నుండి-అబ్దుల్‌కలామ్ వరకు, మొహమ్మద్‌రఫీ నుండి-ఏఆర్.రెహమాన్ వరకు, అజీమ్‌ప్రేమ్‌జీ నుండి-యూసఫ్‌హమీద్ వరకు, బిస్మిల్లాఖాన్ నుండి-జకీర్‌హుస్సేన్ వరకు, ఖురాన్ చదువుకొని కాఫీర్లైన మనలని వేటాడి చంపుతూ కాలం గడిపారని నమ్మాల్సివస్తుంది!10
ముస్లీముల వ్యతిరేకిగా ముద్రపడ్డ భాజపాలకి, ఆ ముద్ర తప్పించి, ఫేస్‌లిఫ్ట్ ఇచ్చినవాళ్ళు ముస్లీము నాయకులే. పద్మవిభూషణ్ సికందర్‌భక్త్, షాన్వాజ్‌హుస్సెన్‌లు, ముక్తార్అబ్బాస్‌నక్వీల ఎదురుగా నిలబడి ముస్లీములు దుర్మార్గులని భాజపాలు చెప్పగలరా? వాళ్ళతో భాజపాకి ఉన్న సంబంధం తెంచుకోగలరా?11
ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, తాము చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అనే లేబుల్సు వేసే భాజపాలు, ఇప్పుడు అవే ఆలోచనలతో ఆంధ్రాలో అడుగుపెట్టారు. వీళ్ళ మాయలో పడకండి. మనం దూరం పెట్టాల్సింది భాజపాలని, వారి మద్దతుదార్లను.12 #SayNoToBhaJaPasInAP

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with సాయికిరణ్

సాయికిరణ్ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @kskk1968

21 Sep
కృత్రిమంగా రెచ్చగొట్టబడుతున్న ఈ మతవిద్వేషాల వల్ల, హిందువుల ఓట్లు భాజపాలకి చీలుతాయని, క్రైస్తవ తదితర మైనారిటీ ఓట్లు వైయస్సార్సీకి స్థిరపడతాయని, తెలుగుదేశం రెంటికీ చెడిన రేవడి అవుతుందని సంబరపడే దద్దమ్మలకు తెలుగు ఓటర్లు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చితీరతారు. ఎందుకంటే...1
భాజపాలలా, ఎక్కడపడితే అక్కడ వేలుపెట్టి వాసనవస్తున్నదని కంప్లయింట్లు ఇచ్చే దిక్కుమాలిన పార్టీ కాదు తెలుగుదేశం. తెదేపా విలువలున్న పార్టీ, మతాలకతీతంగా అందరికీ విలువనిచ్చే పార్టీ, అందరూ విలువైనదిగా భావించే పార్టీ. 2
ఏ మతం గురించైనా ఏనాడు నోరుపారేసుకోని ఒకేఒక్క పార్టీ తెలుగుదేశం. అధికారంలో ఉన్నంతవరకూ, ఏనాడు మతవిద్వేషాలు రగలనీయని పార్టీ తెలుగుదేశం. అన్ని మతాలను ఓకేరకంగా సమాదరించిన ఒకేఒక్క పార్టీ తెలుగుదేశం. 3
Read 6 tweets
21 Sep
1976వ సంవత్సరంలో 42వ సవరణ ద్వారా, మన రాజ్యంగపు ఉపోద్ఘాతంలో (ప్రస్తావన, ప్రవేశిక) ’సోషలిస్ట్’, ’సెక్యులర్’ అనే పదాలు ఇందిరాగాంధీ చొరవ వల్ల చేర్చబడ్డాయి. అసలు ఈ ’సెక్యులర్’ అన్న పదాన్ని ఏ అర్థంలో అక్కడ ప్రస్తావించారు? మనం అర్ధం చేసుకున్నదానికి ఈ అర్ధానికి తేడా ఏమైనా ఉన్నదా?1
మన రాజ్యాంగ నిర్మాతలు మొట్టమొదటి ప్రవేశికలో మన దేశాన్ని, సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగానే అభివర్ణించారు కానీ, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా వ్రాయలేదు. అంటే, అప్పటికి వాళ్ళకు ఆ పదాలు తెలియకనా? ఆ విషయాన్ని ఆ వాదులాటని ప్రస్తుతానికి పక్కనపెడదాం.2
’సెక్యులర్’ గురించి మాట్లాడుకుందాం. ’సెక్యులర్’ అన్న పదానికి తెలుగులో ’లౌకిక’ అని అర్ధం చెబుతారు కానీ, ప్రస్తుత సందర్భానికి అది సరైన అర్ధం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే, ’లౌకిక’ అన్న తెలుగుపదానికి అర్ధం లోకంలో తెలిసిన, లోకంలో ప్రసిద్ధి పొందిన అనే అర్ధాలే వస్తున్నాయి.3
Read 19 tweets
16 Sep
రాష్ట్రమంతా సస్యశ్యామలంగా ఉంది. ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. పాడిపంటలకు, ధన-ధాన్య-వస్తు-వాహనాలకు కొరత లేకుండా ప్రజలు శాంతిసౌభాగ్యాలతో కులాసాగా ఉన్నారు. పరిశ్రమలు పరిఢవిల్లుతున్నాయి. ఖజానాలో డబ్బులు ఏరులై పారుతున్నాయి. 2024 నాటికి పూర్తయ్యే కలగా 2014లో నేను ఊహించిన నవ్యాంధ్ర ఇది.1
ఆ కల ఓ కల్లయ్యింది 2019కి. ఉన్న ఆదాయ వనరులను ఒక్కటొక్కటిగా నరుక్కుంటున్న ప్రభుత్వం. ఇకపై అప్పులు పుట్టని పరిస్థితి. పుండుపై పుట్రగా, ఇప్పుడు కరోనా మహమ్మారి. ద్వేషంతో మొదలయ్యే ఆలోచనల పర్యవసానం దారుణంగానే ఉంటుంది. ఆంధ్రులం నేర్చుకోవాల్సిన పాఠం ఇది.2
కష్టపడి సంపాదించేవాడు ఒక్క పైసా ఖర్చు పెట్టాలన్నా పదిసార్లు ఆలోచిస్తాడు. రోజంతా అడుక్కుతినే వ్యక్తి కూడా మిగులు డబ్బులు ఉన్నా, తనకు అవసరమైనంత వరకు మాత్రమే ఖర్చులు చేస్తాడు. నిన్న వంద రూపాయలు వచ్చినప్పుడు ఏవి తిన్నాడో, ఈరోజు మూడొందలు వచ్చినా అవే తింటాడు.3
Read 14 tweets
9 Sep
హిందువుగా నా సంస్కృతి నాకు పరిచయం అయ్యింది నా తల్లి భాషలో. కొన్ని వేల సంవత్సరాల ప్రాచీనతతో, ఘనమైన సాహితీ చరిత్రతో, అద్భుతమైన విద్వత్‌సంపదతో, దేదీప్యమానంగా వెలుగొందుతున్న నా భాషను తొక్కి, నా మీద హిందీ పులమాలనుకునే నువ్వు నాకు నీతులు బోధించే హిందువువా?1
నా సంప్రదాయాలు నాకు పరిచయం అయ్యింది నా పండుగలతో. నా పండుగలను నన్ను జరుపుకోనీకుండా రంగులు లేని హోళీ పండుగలు చేసుకోమని, టపాసులు లేని దీపావళి జరుపుకోమని ఎవడో వేసిన కేసులకు కోర్టులు వత్తాసు పలుకుతుంటే, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నవాడిని, నాకు నీతులు చెప్పే హిందువువా?2
క్రిస్‌మస్‌కు కేకులు పంచిన నా స్నేహితుడే, సంక్రాంతికి నేనిచ్చిన పాయసం తిన్నాడు. రంజాన్‌కు సేమ్యా పంచిన నా స్నేహితుడే, దీపావళి నాతో కలిసి జరుపుకున్నాడు. చేతిలో డబ్బులు చాలకపోతే, గురుద్వారాలో లంగర్ తిన్న రోజులు నాకింకా గుర్తే.3
Read 9 tweets
1 Sep
ఈయనేమీ పండిత ప్రకాండుడు కాడు. స్ఫురద్రూపి కాడు. మహోపన్యాసకుడు అంతకన్నా కాడు. మనలానే, మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, చదువుకుంటే తప్ప వేరే బతుకుతెరువు ఉండదని తెలుసుకున్నవాడు, చదువుకున్నవాడు. అయినా, వ్యవసాయమంటే మక్కువ ఉన్నవాడు.1
నిరాడంబరుడు. మనలానే ప్యాంటు షర్టు తప్పించి డిజైనర్ సూట్లలో ఈయన్ని ఇంతవరకూ చూడలేదు. డాబుసరిగా ఏనాడు మాట్లాడటం నేనైతే వినలేదు. అన్నిటికీ మించి వివేకి. ఉత్త వివేకి కాదు. సదసద్వివేకి. ఎప్పుడు ఎలా, ఎంత మాట్లాడాలో తెలిసినవాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా తగ్గాలో కూడా తెలిసినవాడు.2
చదువుతోపాటు సంస్కారం ఉన్నవాడు. ఆ రెంటి విలువ తెలిసినవాడు. ఏదో చేయాలని, ఎంతో చేస్తానని, అన్నీ చేసేయాలనే ప్రగల్భాలు పలకలేదు.. ఏదిచేసినా సక్రమంగా చేయాలనే క్రమశిక్షణ ఉన్నవాడు. కాబట్టే, ఆయన పాతిన విత్తులు మొలకలై పూవులై పిందెలై ఫలాలిస్తుంటే, మరొకడు సంబరాలు చేసుకుంటున్నాడు. .3
Read 8 tweets
1 Sep
బయటివాళ్ళ మెప్పు కోసం ప్రయత్నించటం, ఇంటివాళ్ళని అలుసుగా తీసుకోవటం. బయటివాళ్ళ కోసం ఏమైనా చేయటం, ఇంటివాళ్ళ కోసం చేయి విదల్చటానికి కూడా మనసు రాకపోవటం. బయటివాళ్ళను నెత్తిన పెట్టుకోవటం, ఇంటివాళ్ళను ఆమడ దూరంలోనే ఆపేయటం.1
ఛీ కొట్టి దులపరించుకుపోయినోళ్ళని దేబిరించటం, శాలువాలు కప్పినవాళ్ళను కనీసం తలెత్తి చూడలేకపోవటం. ఆపదలోకి నెట్టినవాళ్ళని గౌరవించటం, ఆపదలో ఆదుకున్నవాళ్ళని గెంటేయటం. ఇవి రాజకీయాలా? విశ్వాసహీనమైన బతుకులా?2
ఇటువంటివాటిని మానసిక దౌర్బల్యం అనాలా లేక అదేమైనా మానసికరోగమా? ఆత్మన్యూనతా భావమా? లేక అతి ధైర్యమా? ఏది ఎలా ఏడ్చినా, ఇదో మాయరోగం అని మనం అర్ధం చేసుకోవచ్చు. మోడీకి ఉన్నా అనేక దౌర్భాగ్యాలలో ఈ మాయరోగం కూడా ఒకటి.3
Read 10 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!