ఇది #GHMCElections2020
కి సంబంధించిన త్రెడ్. సవ్యంగా మాట్లాడగలిగితేనే దీనికి స్పందించమని విజ్ఞప్తి.

ఈ క్రింది ట్వీట్ కి వచ్చిన కొన్ని సమాధానాల్లో, ఆంధ్ర నాయకులు ప్రచారానికి వస్తే, టీఆరెస్ మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతుంది అన్నారు. అందుకని ? నోరు మూసుకుని కూర్చోవాలా ?
నోరేసుకుని పడిపోయేవాడిదే రాజ్యం అని ఎన్నాళ్ళు లొంగి పడుండాలి ?
ఇప్పుడు భాజపా విద్వేషాలు రెచ్చగొడుతూంటే పాపం టీఆరెస్ నాయకులకు నొప్పి తెలుస్తోందే, అసలు ఆ పార్టీ పుట్టిందే విద్వేషపు పునాదుల మీద, అధికారంలోకి వచ్చిందే ఆ విద్వేషం కారణంగా పోయిన మనుషుల శవాల మీద అని మరిచారా ?
ఒకసారి సవ్యంగా ఆలోచించి చూడండి. తెలుగు ప్రజలు కలిసి ఉంటేనే ఇరు రాష్ట్రాలకు సంతోషం, సంక్షేమం, ఆరోగ్యం, ఆదాయం అన్నీనూ. ఒక్క అంటువ్యాధి వస్తే దాదాపు నగరం మొత్తం ఖాళీ అయిపోయిన రోజులు గుర్తున్నాయా? అందువల్ల తెలంగాణ పోగొట్టుకున్న ఆదాయం ఎంత? పొద్దున్న పేస్టు నుంచీ రాత్రి దుప్పటి వరకూ..
ప్రతీ పౌరుడూ కట్టే పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి దశాబ్దాల క్రితమే వచ్చి తెలంగాణలో స్థిరపడిన ప్రజల పాత్ర ఎంత ఉందో తెలంగాణ ప్రభుత్వానికి కనీస అంచనా ఉందా అసలు ?

గత ఎనిమిది నెలల్లో, ఎన్ని షాపింగ్ మాల్స్ మూత పడ్డాయో, ఎన్ని చిన్నా పెద్దా హోటళ్ళు మూతపడ్డాయో, ఎన్ని వ్యాపారాలు శాశ్వతంగా
మూతపడ్డాయో, అందువల్ల తెలంగాణ పోగొట్టుకున్న ఆదాయం ఎంతో, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడిన వారు వెనక్కు వెళ్ళిపోయినందువల్ల జరిగిన నష్టం ఎంతో ఏమైనా ఒక అంచనా ఉందా అసలు?

ఇదేమీ ఎక్కువ తక్కువలు చెప్పే ఉద్దేశ్యం కాదు, ఐకమత్యంగా ఉంటే వచ్చే బలం గురించి మాత్రమే చెప్పడం..
అసలు కరోనా లాంటి ఉపద్రవం వచ్చినంత మాత్రాన, హైదరాబాద్ నుంచి మా సొంతవూరికి వెళ్ళిపోవాలనే ఆలోచన రావడమే తెలంగాణ సాధనకు ఎంత సిగ్గుచేటు అన్న విషయం ఏనాడైనా ఎవరికైనా స్ఫురణకు వచ్చిందా అసలు ? అంతటి అభద్రతా భావం పెంచి పోషించినదెవరు ? వారివల్ల గత ఆరేళ్ళలో నగరానికి నిజంగా ఒరిగినదేమిటి ??
గత ఆరు సంవత్సరాలుగా నేను టీఆరెస్ ప్రభుత్వం పైన కానీ, నాయకులపైన కానీ ఏనాడూ తీవ్ర విమర్శలు చేయలేదు. దానికి కారణం ఒకటే. ఆ పార్టీ, అందులోని నాయకులూ తెదేపాలో పురుడు పోసుకున్నవారే. కాబట్టి, అంతో ఇంతో ప్రజాసమస్యల పైన వారికి కూడా కనీస అవగాహన పట్టింపూ ఏనాటికైనా రాకపోతాయా అని ఎదురు చూశాను
కానీ నా ఆశలు, నాలాంటి కోట్లాదిమంది ప్రజల ఆశలూ అడియాసలైన మాట కఠోర సత్యం. వారు కేవలం అధికారం కోసం, బంధుప్రీతి కోసం మాత్రమే తెలుగు ప్రజల మనసుల్లో విద్వేషం పెచ్చరిల్లేలా రెచ్చగొట్టి తెలంగాణ సాధించుకున్నట్టూ, అంతకుమించి ప్రత్యేకంగా వారేమీ సాధించనట్టూ చాలా స్పష్టంగా అనిపిస్తోంది.
ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న అసలు సిసలు కారణం ఏమిటి ? గత పాలకులెవ్వరూ చేయనంత అభివృద్ధి చేయడానికి, మన సంపద పక్కవాడెవరో దోచుకుపోతున్నాడనే మసిగుడ్డను ఆంధ్ర ప్రజలమీద వేసి మరీ రాష్ట్రం సాధించుకున్నాం. ఫలితం ??
అధమం హైదరాబాద్ ను కూడా ఇంకా బాగుచేసుకోలేదు..
సిగ్గనిపించడం లేదా అసలూ?
ఇప్పటికీ తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్‌దే సింహభాగం. అందులోనూ సైబరాబాద్ ఆదాయందే అగ్రస్థానం. మనం కొత్తగా సాధించింది ఏమిటి ?
ముఖ్యంగా హైదరాబాద్ లో కనీస అవసరాలైన రోడ్లూ, మరుగుదొడ్లూ, మంచినీరూ, మురుగునీటి వ్యవస్థ, వాన నీటి నిర్వహణ.. ఒక్కటంటే ఒఖ్ఖ సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపించారా ?
నేను, నా కుటుంబం కడప జిల్లా నుంచి హైదరాబాద్ కి 1994లో, తెలంగాణ రాకముందు 20 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడినవాళ్ళం. 1995 నుంచి 2008 వరకూ ఏమి అభివృద్ధి జరిగిందో, మొత్తం నగరాభివృద్ధి అక్కడే ఆగిపోయింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం. కేవలం మెట్రోరైలు తప్ప కొత్తగా సాధించిందేమిటి?
నేనేమీ తెలుగుదేశం సానుభూతిపరుడిగా ఇదంతా వెళ్ళగక్కడం లేదు.

మీరు దేశం మొత్తం ఎన్ని నగరాలైనా తిరగండి. మీకు ఎక్కడా దొరకనన్ని సౌకర్యాలు, వెసులుబాటు, తక్కువ ధరల్లో
కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమే దొరుకుతున్నాయి. అలాంటి హైదరాబాద్ నగరం మీద అభిమానంతో నా ఆక్రోశం వెళ్ళబుచ్చుకుంటున్నానంతే.
నేను గత పదిహేను సంవత్సరాలుగా నివసిస్తున్న పద్మారావునగర్ ముఖ్యమైన రోడ్ల ఫోటోలు ఈరోజు తీశాను. వీటిల్లో చాలా వరకూ ఆ గుంతలూ, పాడైన రోడ్లూ నేను గత పది సంవత్సరాలుగా ఎటువంటి మార్పుకీ నోచుకోనివే.

తెలుగుదేశం పార్టీలో పుట్టి, పెరిగి మేము వేసిన ఓట్లతో ఒక స్థాయికి ఎదిగి, కేవలం అధికారం,
ధనబలం, సొంత అవసరాల కోసం పాలు తాగిన తల్లి రొమ్ము గుద్దిన ౘందాన ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి సిగ్గు లేకుండా దూకేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడి శాసనసభ్యుడు. అతను నియోజకవర్గానికి చేసిన మేలు శూన్యం. కనీస అవసరాలు తీర్చింది శూన్యం. ప్రజలకు అందుబాటులో ఉన్నది శూన్యం.
పద్మారావు నగర్ రోడ్ల సౌందర్యం చూసి తరించండి..🙄
ఇందుకే వేయాలా ఓట్లు ?

కాదు. కుదరదు. వీల్లేదు.
కాస్త బుద్ధి ఉపయోగించండి. కేవలం మీ మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, ప్రభుత్వంలో పలుకుబడి కోసమో మీ అంతరాత్మను తాకట్టు పెట్టేసి అధికార పక్షానికి ఓటు వేయకుండా #VoteForTDP
అని నినదించండి.
ఇంకా చూడండి...
పని రాక్షసుడైన @ncbn బారినుండి బైటపడ్డాం బ్రతుకుజీవుడా అని కాళ్ళుజాపుకు పడుకున్న @GHMCOnline నిర్వాకాన్ని చూడండి..

ఇవి కూడా పద్మారావు నగర్ చిత్రాలే.
కాబట్టి, హైదరాబాద్ నగర ప్రజలారా, నిద్ర లేవండి. ప్రాంతీయ, మత విద్వేషాలు రెచ్చగొట్టే టీఆరెస్ భాజపా మాయలో పడకండి. వాళ్ళతో పాటు గోతికాడ నక్కలా కూర్చున్న కాంగ్రెస్ ని అసలే నమ్మకండి.

తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురండి. సమిష్టిగా అందరి భవిష్యత్తు బాగుచేసుకోండి.
🙏🙏
#VoteForTDP
ఇంకా గొప్ప తమాషా ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల్లో మిగతా అన్నిచోట్లా ఉన్నట్టే ఇక్కడ కూడా హాయ్ హైదరాబాద్, ఓయ్ హైదరాబాద్, ఏయ్ హైదరాబాద్ ఇలా నగరం పేరెట్టుకుని ఓఓఓ అధికారపక్ష నాయకులకీ, అధికారులకూ చమ్చాగిరీ చేసుకుంటూ, పుట్టిన్రోజులకీ పెళ్ళిరోజులకీ మొక్కుబడి గ్రీటింగులు చెప్పుకుంటూ,
తద్వారా పెరిగే ఫాలోయర్ కౌంట్ చూసుకుంటూ బతికేసేవాళ్ళు కూడా ఉన్నారు.. అందులో ఒకరైతే పాపం, నా బాధ పడలేక నాకు నేరుసందేశం పంపి మరీ వేడుకున్నారు..
"ప్లీజ్ అన్‌ఫాలో మీ" అని.
వాళ్ళ కళ్ళకు అసలు సమస్యలే కనబడవు. నగరం మొత్తం కేబుల్ బ్రిడ్జీలుంటే చాలు. మొజాంజాహీ మార్కెట్ వెలిగితే చాలు,
ఉస్మానియా ఆసుపత్రి ఏమైపోయినా పట్టదు, మొక్కుబడిగా ఒకట్రెండు ట్వీట్లు వేసి చేతులు దులుపుకుంటారు. అదే కంటికి ఇంపుగా ఉండే ఫోటోలైతే ఒకటికి వందసార్లు పంచుతారు. నేను సంవత్సరం పైనే రేతిఫైల్ సిగ్నల్ కోసం వేస్తున్న ట్వీట్ మాత్రం వారికంట పడదు.
కేవలం @CIVILKHAN1 అనే హ్యాండిల్ మాత్రం ఆ రేతిఫైల్ సిగ్నల్ విజ్ఞప్తిని గత 450 రోజులకు పైగానే బ్రతికించుకుంటూ @HYDTP ని అడుగుతూనే ఉన్నారు. వేలాది విద్యార్థులు, లక్షలాది ప్రజల రద్దీప్రదేశంలో ఆల్రెడీ ఉన్న సిగ్నల్‌ని సరిజేసి పెట్టడానికి వాళ్ళకు ఇంతవరకూ తీరడంలేదు..
అందుకే వేయాలా ఓట్లు?
ఇంకా @GHMCOnline ని 16-08-2020 నాడు 👇 ఇంకుడుగుంత గురించి బాగుచేసుకోమని చెప్పాను. తర్వాత పెద్ద వరదలు వచ్చాయి, ఆ వర్షపునీరు అంతా వృధా పోయింది. ఇప్పటికీ చర్యలు శూన్యం.
ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఆ ? 😠

తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి. జవాబుదారీతనం పొందండి.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with తెలుగు తీపి

తెలుగు తీపి Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!