'అదుపూ పొదుపూ లేని ఆనందం కావాలి' నాకిష్టమైన ఒక తెలుగు పాటలో పల్లవి లైన్స్ అవి. ఈ భూమ్మీద ఊపిరి తీసుకుంటున్న ప్రతీ మనిషి లక్ష్యం అదే. అయితే సుఖం వేరు ఆనందం వేరు. సౌకర్యం సుఖాన్నిస్తే సుఖం ఆనందాన్నిస్తుంది.
'ఆనందంగా జీవించటం ఎలా'
హిట్ సినిమా సూత్రం (formula) ఏంటో ఇంత వరకు ఎవరూ
కనుగొనలేదు అలాగే ఇది కూడా. కొందరికి ఆనందం అంటే అప్పులు లేకపోవడం, ఇంకొందరికి అప్పులు పుట్టటం.. మరికొందరికి తమ హీరో సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడటం. మొక్కలకు నీరు పోస్తూ ఆనందించే వాళ్ళు, సంగీతం వింటూ ఇదే ఆనందం అనే వాళ్ళు కూడా ఉంటారు. సాయంత్రం అఫిస్ నుంచి తిన్నగా తమ 'అడ్డా'కు చేరి
చిన్ననాటి స్నేహితులతో కలిసి రెండు పెగ్గులు వేసి, నాలుగు దమ్ములు కొట్టడం కూడా ఒక వర్గం ఆనందం అనే అంటారు! నిజానికి మనం జీవించే ఉన్నాం అన్నది 'రియలైస్' అయితే ప్రతీ క్షణం ఆనందంగా ఉండటానికి ఒక చక్కని కారణం దొరికినట్టే. రియలైస్ అవ్వాలి అంతే!
బ్రతకటం వేరు జీవించటం వేరు అని చాలా మందికి
తెలియకపోవచ్చు.. ఎందుకంటే తెలిసుంటే చాలా మంది 'బతుకులు' వేరేలా ఉండేవి. ఊపిరి తీసుకుంటున్న వాళ్లలో చాలా మంది జీవించి ఉన్నట్టు కాదు, బ్రతికే ఉన్నట్టు, బ్రతుకును ఈడుస్తున్నట్టు. ఎందుకంటే వీళ్ళలో చాలా మందికి అన్ని సౌకర్యాలు ఉంటాయి, సుఖాలు కూడా ఉంటాయి కానీ ఆనందం దొరకదు. ఎందుకంటే వీళ్ళ
జీవితాన్ని 'పైసా' చాలా వరకు ఆక్రమించుకుంది కాబట్టి. పైగా వీళ్ళు సమాజం ఏర్పరచిన నార్మ్స్ ప్రకారం బ్రతుకుతున్న వాళ్లే తప్ప తమ కోసం కాదు. ఈ విషయం వాళ్లకు అర్ధమయ్యేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. అలా 'జీవం' లేని జీవితాలు ఎన్నో మన చుట్టూ.
ఫలానా టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి పోతుంది
అని డాక్టర్ చెప్పినట్టు ఆనందంగా జీవించడానికి ఏం చెయ్యాలో నేను చెప్పను. కానీ, నెగటివ్ ఆలోచనలకు ఆస్కారం ఇవ్వకపోవడం, దురాశకు దూరంగా ఉండటం వల్ల నిరాశ నిస్పృహలు దరిచేరవు అని చెప్పగలను.
ప్రతీ వ్యక్తి ప్రత్యేకం అని నేను నమ్ముతాను. చాలా మంది తమకు నచ్చిన అభిరుచిని అలవాటుగా మార్చుకోవటం..
సాధన చేయటం ద్వారా కూడా ఆనందాన్ని పొందుతారు, అలాగే మరి కొందరికి వృత్తిపరమైన విజయాలు ఆనందాన్ని అందిస్తాయి. ఇక్కడొక విషయం చెప్పాలి. కొందరు క్లబ్ హౌస్, స్పేస్'లో మనం అడగకపోయినా పాటలు పాడటానికి ఉత్సాహం చూపిస్తారు (నేను కూడా ఈ కేటగిరీలో ఉంటాను) దానికి కారణం తెలుసా? పాడటం ద్వారా తమను
నలుగురూ గుర్తించాలని కాదు అలా పాడటం ద్వారా కలిగే అలౌకిక ఆనందాన్ని పొందాలని. సో, తమకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే విషయం, అభిరుచి ఏంటో ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే తప్ప వేరే దారి లేదు.
'డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం అలా కాదు'
ఈ మాట మనం చిన్నతనం నుంచీ వింటున్నాం
గానీ ఆచరిస్తున్నామా?
ఒక అనుభజ్ఞుడు చెప్పిన విషయం ప్రస్తావిస్తాను. 'ఒకప్పుడు మనిషి బ్రతకటానికి తినేవాడు కాబట్టి రోగాలు వచ్చేవి కావు, కానీ ఇప్పుడు! 'రుచులు' కోసం తింటున్నాడు కాబట్టి రకరకాల జబ్బుల బారిన పడుతున్నాడు'. ఆరోగ్యంగా లేనప్పుడు ఎంత డబ్బున్నా, సౌకర్యాలున్నా మనిషి ఆనందంగా
జీవించలేడు. మెషిన్ ఫిట్'గా ఉండాలంటే 'మెయింటెనన్స్' ఎంత అవసరమో 'మెయింటెనన్స్'కి రాకుండా ఉండాలంటే మనిషి శరీరానికి వ్యాయామం అంతే అవసరం. వ్యాయామం మనల్ని శారీరకంగా ఫిట్‌గా ఉంచటమే కాక మానసికంగా గ్రౌండడ్'గా (మెంటల్ బ్యాలన్స్) ఉంచుతుంది. ఇవన్నీ కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదనపు బోనస్.
*'జిమ్మీస్'తో మాట్లాడేటప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించారా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు! అదే ఫిట్నెస్ ఇచ్చే కిక్కు!
'సెక్స్'
సెక్స్ అంటే బయోలజికల్ నీడ్, శారీరక అవసరం.. ఇలా ఎవరు ఎన్ని విధాలుగా నిర్వచించినా ఒక్కొక్క వ్యక్తి థింకింగ్ కెపాసిటీ బట్టి
దానికున్న అర్ధం (Intrinsic value అని చదువుకోండి) మారిపోతుంది. ఏదేమైనా శృంగారం అంటే బూతు అనుకునే స్థాయి నుంచి సోషల్ మీడియాలో పీరియడ్స్ గురించి, ఆర్గసం గురించి, ఓరల్ సెక్స్ (ముఖరతి) గురించి బాహాటంగా చర్చించే స్థాయికి చేరుకున్నాం. ఐ వెల్కమ్ దిస్
ఛేంజ్. అయితే ఇది మంచి పరిణామమేనా?
అని ప్రశ్నిస్తున్న వర్గం కూడా ఒకటుంది. ఈ విషయం మనం వేరుగా ప్రస్తావిద్దాం.
'మేకింగ్ లవ్ వేరు మరియు సెక్స్ వేరు' అని నేను అన్నప్పుడు ఎలా అని అడిగాడు మా ప్రసాద్. సెక్స్ శారీరక అవసరానికి, సుఖానికీ మాత్రమే పరిమితమైతే మేకింగ్ లవ్ టు యువర్ పార్ట్నర్ మానసిక బంధాన్ని 'కూడా' దృఢంగా
ఉంచుతుంది అన్నాను. నా వైపు చూసి ఏదైతే ఏంటిలే అన్నాడు మా ఫ్రెండ్. మా సంభాషణ అక్కడితో ఆగిపోయింది, కానీ నా ఆలోచనలు ఆగలేదు.
మగాళ్లకు ప్రేమించడం చేతకాదు అని అమ్మాయిల్లో MALEజాతికి ఒక రెప్యూటేషన్ ఉంది, అలాగే బెడ్ మీద ఎలా ఉండాలో అమ్మాయిలకు తెలియదని అబ్బాయిలు కూడా అంటుంటారు.
కారణం సెక్స్ అంటే "మగాళ్ళు చేసే పని" అని నమ్మే స్త్రీలు మన చుట్టూ ఇంకా ఉన్నారు (not generalizing here & urban ladies are not exception). బయట ఎంత స్వతంత్రంగా ఉన్నా 'అక్కడకి' వచ్చేసరికి శరీరం అప్పజెప్పేసి యూట్యూబ్'లో కోడిపాప కొత్త రెసిపీ వీడియో చూస్తుంటారు. అతను తన
పనవ్వగానే 'దిగిపోతాడు'. అక్కడ ప్రేమ ఉండదు, కేవలం శారీరక అవసరం మాత్రమే ఉంటుంది. త్వరలోనే వాళ్ళు విడివిడిగా పడుకుంటారు లేదా వేరే భాగస్వామిని చూస్కుంటారు.
స్త్రీలకు భావప్రాప్తి కలుగుతుందనే విషయం తెలియని ఎడ్యుకేటెడ్ అర్బన్ మేల్స్ మన మధ్య ఉన్నారు. హస్తప్రయోగం చేసుకుంటే అబ్బాయిలు
సన్నగా అయిపోతారని, అమ్మాయిలైతే యోని వదులవుతుందని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత టెక్నాలజీ, ఇన్ని రిసోర్సస్ అందుబాటులో ఉండీ కూడా విషయ పరిజ్ఞానంలో వెనకబడి ఉండటం దారుణం అనే అంటాను.
స్త్రీల పై అత్యాచారాలకు / నేరాలకు సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవటం కూడా ఒక కారణం అని ఇండియా టుడే గతంలో
ప్రచురించిన ఒక ఆర్టికల్'లో ప్రస్తావించిన విషయం చాలా మందికి తెలిసుండొచ్చు. హ.ప్ర చేసుకుంటే నరాల వీక్నెస్ వస్తుందని అత్యాచారానికి ఒడిగట్టిన క్రిమినల్ మీకు తెలుసా?
సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఫోర్-ప్లే, ఇంటర్'కోర్స్ వగైరా అనుకుని చాలా మంది నరాలు జివ్వుమనే అవకాశాలున్నాయి, కానీ అది కాదు.
మన శరీరం గురించి, శరీరంలో ఉన్న భాగాలు మరియు వాటి 'ఫంక్షనింగ్' గురించి తెలుసుకోవడమే సెక్స్ ఎడ్యుకేషన్. దీని వల్ల చాలా అపోహలు తొలగటమే కాక తమను తాము కొత్తగా స్వీయపరిచయం చేసుకుంటారు.
సెక్స్ అనేది ఖచ్చితంగా సుఖాన్ని, ఆనందాన్ని కలగలిపి అందించే ఒక అద్భుతమైన అనుభవం.. దాన్ని ఒక
అందమైన అనుభూతిగా మిగుల్చుకోవాలంటే మాత్రం మీ గురించి మీరు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో మీ భాగస్వామి గురించి తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం.
- డెలివరీ ఆఫ్ థాట్స్
....
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
"మనిషి భావోద్వేగాల వలనే సమాజం, వ్యవస్థ మనుగడ సాగించేది అని ప్రజలు అనుకుంటారు. కానీ, అది అబద్ధం. వ్యవస్థను ఆపరేట్ చేసేది చట్టం".
దాదాపుగా ఇదే అర్ధం వచ్చేలా ఒక లైన్ 'రీడర్' ఇంగ్లీషు సినిమాలో ఉంది. ఆర్యన్ ఖాన్ కేసు ఫాలో అవుతుంటే అది నిజం అనిపిస్తోంది. అదే సమయంలో మరి లక్షల కోట్ల
కుంభకోణాలు చేసిన.. చేస్తున్న రాజకీయ నాయకుల పట్ల చట్టాలు ఎందుకు కఠినంగా వ్యవహరించట్లేదు అని నా లాంటి సామాన్యులకు సందేహం రావటం చాలా సహజమే.
సాధారణ పౌరుల పై ఒక్క పోలీస్ కేసు రిజిస్టర్ అయ్యున్నా పాస్ పోర్టు జారీ చేయరాదు, అలాగే వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అంటోంది మన చట్టం. మరి
మన నాయకులు ఆర్ధిక నేరాలకు పాల్పడతారు, దర్యాప్తులో బయటపడ్డ వాళ్ళ అక్రమాస్తులను ED జప్తు చేసుకుంటుంది. కానీ ఆ నేరస్తులు జైల్లో శిక్షలు అనుభవిస్తూ.. బెయిల్ మీద బయటకు వస్తారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు! ఆ హక్కు ఎవరు కల్పించారు? మళ్ళీ మన రాజ్యాంగమే!
ఒక సమాజంగా మనకు ఏం కావాలి అని ఆలోచించటం మానేసి అనేకానేక అంశాల వలన కులాలుగా.. వర్గాలుగా విడిపోయి 'మాకు' ఏం కావాలి అని మనుషులు ఆలోచించటం మొదలుపెట్టాక వర్గాల మధ్య ఆధిపత్య పోరు అనివార్యమైంది, ప్రజాస్వామ్యం కొత్తరూపు దిద్దుకుంది.
సమకాలీన రాజకీయాలను చూస్తే వర్గాల స్థాయి దాటి 'నాకేంటి'
అనే దగ్గరకు చేరింది.. పోరు వ్యక్తిగతమైపోయింది. ఒక విధమైన అనిశ్చిత వాతావరణం కనిపిస్తోంది.
ఒకనాడు చంద్రబాబు చేసిన అవే తప్పుల్ని జగన్ పునరావృతం చేస్తున్నాడు అని చెప్పొచ్చు. అవేంటంటే తమ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లోనూ, వ్యాపారల్లోనూ (కాంట్రాక్ట్స్) పెద్దపీట వేయటం. మార్కెట్
యార్డు చైర్మన్ లాంటి నామినేటెడ్ పోస్టుల నుంచి అన్నీ స్థానాల్లోనూ వారి మనుషుల్ని నియమించడం. ఈ పిచ్చి ఎంత వరకూ వెళ్లిందంటే ఇది వరకెన్నడూలేని విధంగా లెక్కకు మించి ప్రభుత్వ సలహదారులను నియమించి వారికి లక్షల్లో జీతభత్యాలు చెల్లిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థను
తెలివైన వాడు అవకాశాల కోసం ఎదురుచూడడు, అవకాశాలను తనే సృష్టించుకుంటాడు.
1995లో ఆగష్టులో ఆం.ప్ర. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే రాత్రికి రాత్రే ప్రభుత్వ అధినేత మారిపోయాడు. ఎన్ టీ ఆర్ లాంటి అత్యంత శక్తివంతమైన వ్యక్తిని గద్దె దించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడు. తరువాతి కాలంలో
ఆ పరిణామాలు 'ఆగష్టు సంక్షోభం'గా చరిత్రకెక్కింది.
లక్ష్మీపార్వతిని బూచీగా చూపి ఎమ్మెల్యేలను కూడగట్టడం ఒక ఎత్తైతే సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా తన వైపుకు లాక్కోవడం చంద్రబాబు చాణక్య నీతికి తార్కాణం. ఇలాంటి ప్రయత్నమే 84లో నాదెండ్ల భాస్కర్‌రావు కూడా చేసారు కానీ ప్రజలు అంగీకరించ లేదు.
తిరిగి 'అన్నగారు' సీఎం కుర్చీ మీద కూర్చునేంత వరకు పోరాటం చేశారు. అప్పట్లో నాదెండ్లకు వ్యతిరేకంగా గవర్నర్‌కు, రాష్ట్రపతికి అందిన టెలిగ్రాములు ఒక రికార్డు.
కానీ ఈ సారి అలాంటిదేమి జరగలేదు. కారణం లక్ష్మీపార్వతిని అన్నగారు ద్వితీయ వివాహం చేసుకోవటం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
దేశవ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు?
స్టార్ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో ఎవరు?
అత్యధిక పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరో ఎవరు?
ప్రేక్షకుల చేత అనిపించుకున్నాడు ఆరడుగుల ప్రభాస్. మూడో చిత్రం #వర్షం ఒక సంచలనం అప్పట్లో. ప్రభాస్ చేసిన డేర్ డెవిల్ స్టంట్స్ ప్రేక్షకులను అలరించింది. సినిమా పెద్ద హిట్ అవ్వటమే కాక చిరంజీవికి #ఖైదీ లా ప్రభాస్'కి #వర్షం స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
#ఛత్రపతి తో తనలో ఉన్న నటుడిని బయటకు తీసుకొచ్చాడు రాజమౌళి. స్టార్'గా ప్రభాస్'ని మరో లెవెల్'కి తీసుకెళ్లిన చిత్రం ఛత్రపతి. తరువాత వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైతే, #మిర్చి అన్ని వర్గాలనూ ఆకట్టుకుంది.