"మనిషి భావోద్వేగాల వలనే సమాజం, వ్యవస్థ మనుగడ సాగించేది అని ప్రజలు అనుకుంటారు. కానీ, అది అబద్ధం. వ్యవస్థను ఆపరేట్ చేసేది చట్టం".
దాదాపుగా ఇదే అర్ధం వచ్చేలా ఒక లైన్ 'రీడర్' ఇంగ్లీషు సినిమాలో ఉంది. ఆర్యన్ ఖాన్ కేసు ఫాలో అవుతుంటే అది నిజం అనిపిస్తోంది. అదే సమయంలో మరి లక్షల కోట్ల
కుంభకోణాలు చేసిన.. చేస్తున్న రాజకీయ నాయకుల పట్ల చట్టాలు ఎందుకు కఠినంగా వ్యవహరించట్లేదు అని నా లాంటి సామాన్యులకు సందేహం రావటం చాలా సహజమే.
సాధారణ పౌరుల పై ఒక్క పోలీస్ కేసు రిజిస్టర్ అయ్యున్నా పాస్ పోర్టు జారీ చేయరాదు, అలాగే వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అంటోంది మన చట్టం. మరి
మన నాయకులు ఆర్ధిక నేరాలకు పాల్పడతారు, దర్యాప్తులో బయటపడ్డ వాళ్ళ అక్రమాస్తులను ED జప్తు చేసుకుంటుంది. కానీ ఆ నేరస్తులు జైల్లో శిక్షలు అనుభవిస్తూ.. బెయిల్ మీద బయటకు వస్తారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు! ఆ హక్కు ఎవరు కల్పించారు? మళ్ళీ మన రాజ్యాంగమే!
ఆర్థిక నేరాలు చేసే వాళ్ళకు,
అత్యాచారాలు చేసే వాళ్ళకు, దేశ వనరులను దోచుకునే వాళ్లకు కోట్ల మంది ప్రజలను పాలించటానికి ఏం ప్రత్యేక అర్హత ఉందో మీకు తెలిస్తే నాకు చెప్పండి. ప్లీస్.
౼ డెలివరీ ఆఫ్ డౌట్స్
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
'అదుపూ పొదుపూ లేని ఆనందం కావాలి' నాకిష్టమైన ఒక తెలుగు పాటలో పల్లవి లైన్స్ అవి. ఈ భూమ్మీద ఊపిరి తీసుకుంటున్న ప్రతీ మనిషి లక్ష్యం అదే. అయితే సుఖం వేరు ఆనందం వేరు. సౌకర్యం సుఖాన్నిస్తే సుఖం ఆనందాన్నిస్తుంది.
'ఆనందంగా జీవించటం ఎలా'
హిట్ సినిమా సూత్రం (formula) ఏంటో ఇంత వరకు ఎవరూ
కనుగొనలేదు అలాగే ఇది కూడా. కొందరికి ఆనందం అంటే అప్పులు లేకపోవడం, ఇంకొందరికి అప్పులు పుట్టటం.. మరికొందరికి తమ హీరో సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడటం. మొక్కలకు నీరు పోస్తూ ఆనందించే వాళ్ళు, సంగీతం వింటూ ఇదే ఆనందం అనే వాళ్ళు కూడా ఉంటారు. సాయంత్రం అఫిస్ నుంచి తిన్నగా తమ 'అడ్డా'కు చేరి
చిన్ననాటి స్నేహితులతో కలిసి రెండు పెగ్గులు వేసి, నాలుగు దమ్ములు కొట్టడం కూడా ఒక వర్గం ఆనందం అనే అంటారు! నిజానికి మనం జీవించే ఉన్నాం అన్నది 'రియలైస్' అయితే ప్రతీ క్షణం ఆనందంగా ఉండటానికి ఒక చక్కని కారణం దొరికినట్టే. రియలైస్ అవ్వాలి అంతే!
ఒక సమాజంగా మనకు ఏం కావాలి అని ఆలోచించటం మానేసి అనేకానేక అంశాల వలన కులాలుగా.. వర్గాలుగా విడిపోయి 'మాకు' ఏం కావాలి అని మనుషులు ఆలోచించటం మొదలుపెట్టాక వర్గాల మధ్య ఆధిపత్య పోరు అనివార్యమైంది, ప్రజాస్వామ్యం కొత్తరూపు దిద్దుకుంది.
సమకాలీన రాజకీయాలను చూస్తే వర్గాల స్థాయి దాటి 'నాకేంటి'
అనే దగ్గరకు చేరింది.. పోరు వ్యక్తిగతమైపోయింది. ఒక విధమైన అనిశ్చిత వాతావరణం కనిపిస్తోంది.
ఒకనాడు చంద్రబాబు చేసిన అవే తప్పుల్ని జగన్ పునరావృతం చేస్తున్నాడు అని చెప్పొచ్చు. అవేంటంటే తమ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లోనూ, వ్యాపారల్లోనూ (కాంట్రాక్ట్స్) పెద్దపీట వేయటం. మార్కెట్
యార్డు చైర్మన్ లాంటి నామినేటెడ్ పోస్టుల నుంచి అన్నీ స్థానాల్లోనూ వారి మనుషుల్ని నియమించడం. ఈ పిచ్చి ఎంత వరకూ వెళ్లిందంటే ఇది వరకెన్నడూలేని విధంగా లెక్కకు మించి ప్రభుత్వ సలహదారులను నియమించి వారికి లక్షల్లో జీతభత్యాలు చెల్లిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థను
తెలివైన వాడు అవకాశాల కోసం ఎదురుచూడడు, అవకాశాలను తనే సృష్టించుకుంటాడు.
1995లో ఆగష్టులో ఆం.ప్ర. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే రాత్రికి రాత్రే ప్రభుత్వ అధినేత మారిపోయాడు. ఎన్ టీ ఆర్ లాంటి అత్యంత శక్తివంతమైన వ్యక్తిని గద్దె దించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడు. తరువాతి కాలంలో
ఆ పరిణామాలు 'ఆగష్టు సంక్షోభం'గా చరిత్రకెక్కింది.
లక్ష్మీపార్వతిని బూచీగా చూపి ఎమ్మెల్యేలను కూడగట్టడం ఒక ఎత్తైతే సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా తన వైపుకు లాక్కోవడం చంద్రబాబు చాణక్య నీతికి తార్కాణం. ఇలాంటి ప్రయత్నమే 84లో నాదెండ్ల భాస్కర్రావు కూడా చేసారు కానీ ప్రజలు అంగీకరించ లేదు.
తిరిగి 'అన్నగారు' సీఎం కుర్చీ మీద కూర్చునేంత వరకు పోరాటం చేశారు. అప్పట్లో నాదెండ్లకు వ్యతిరేకంగా గవర్నర్కు, రాష్ట్రపతికి అందిన టెలిగ్రాములు ఒక రికార్డు.
కానీ ఈ సారి అలాంటిదేమి జరగలేదు. కారణం లక్ష్మీపార్వతిని అన్నగారు ద్వితీయ వివాహం చేసుకోవటం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
దేశవ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు?
స్టార్ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో ఎవరు?
అత్యధిక పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరో ఎవరు?
ప్రేక్షకుల చేత అనిపించుకున్నాడు ఆరడుగుల ప్రభాస్. మూడో చిత్రం #వర్షం ఒక సంచలనం అప్పట్లో. ప్రభాస్ చేసిన డేర్ డెవిల్ స్టంట్స్ ప్రేక్షకులను అలరించింది. సినిమా పెద్ద హిట్ అవ్వటమే కాక చిరంజీవికి #ఖైదీ లా ప్రభాస్'కి #వర్షం స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
#ఛత్రపతి తో తనలో ఉన్న నటుడిని బయటకు తీసుకొచ్చాడు రాజమౌళి. స్టార్'గా ప్రభాస్'ని మరో లెవెల్'కి తీసుకెళ్లిన చిత్రం ఛత్రపతి. తరువాత వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైతే, #మిర్చి అన్ని వర్గాలనూ ఆకట్టుకుంది.