black Profile picture
24 Oct, 10 tweets, 2 min read
'నీ ఉనికిని కాపాడుకోవాలంటే ఒకటి నువ్వు గొప్పగా బ్రతుకు లేదా వేరే వారి బ్రతుకును కించపరుచు. ఈ రెండూ ప్రపంచానికి తెలియాలంటే అటెన్షన్ అవసరం'
౼ హరీష్ మీనన్

ట్విటర్ వల్ల ఉపయోగాలు ఏంటి? తమ తమ భావాలను వ్యక్తపరచటానికి ఒక చక్కని వేదిక. చాలా మంది ఇంట్రవర్ట్స్ తమ పేర్లు మార్చుకుని ఇక్కడ
చెలరేగిపోతుంటారు. నా లోంటోళ్లు ఏదైనా ఆలోచన వస్తే కథ, కవితా రూపంలో ఇక్కడ ట్వీట్ చేస్తుంటారు. మన సోషల్ సైడ్ బయటపెట్టే ప్లేస్ మాత్రమే కాకుండా తమలా ఆలోచించే మరో వ్యక్తి ఈ భూమ్మీద ఉన్నారా? అని తెలుసుకోవటానికి ఉపయోగపడే ఒక మాధ్యమం ట్విటర్.

ఈ మధ్య ఒక వ్యక్తితో సంవాదం జరిగినప్పుడు
'ఎన్నడైనా పిల్లికి బిచ్చం వేశావా' అని అడిగాడు. సాయం చేస్తే ఇక్కడ ట్విట్టర్లో పెడితేనే అది సాయం అన్న ఒకరకమైన స్టేట్ ఆఫ్ మెంటల్ థింకింగ్'లో ఉన్నాడు అని అర్ధమైంది. అతని నేపథ్యం (pun intended) నాకు తెలుసు కాబట్టి నేను అతన్ని తప్పుపట్టను. ఒకరి వ్యక్తిత్వాన్ని కొలవటానికి డబ్బు సాయాన్ని
ప్రామాణికంగా తీసుకోవటం అన్నది కేవలం అల్పులు చేసే పని, పైగా అది కారణంగా చూపి ఇతరులను ప్రపంచం ముందు 'వీళ్లు చాలా చిన్న మనుషులు' అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయటం మరీ దారుణం.

ఆ మధ్య "సోషల్ మీడియాకి దూరంగా ఎందుకు ఉండాలి" అన్న ఒక ఆర్టికల్ చదివాను. చాలా నిర్మాణాత్మకంగా
విశ్లేషణాత్మకంగా సాగిన చక్కని ఆర్టికల్ అది. అందులో కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. ఇక్కడి జనాలు మీ ట్వీట్స్ చూసి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు తప్ప ఇది మీ 'సోషల్ సైడ్' అని గ్రహించరు. మీ ఒక్క కామెంట్ వారికి నచ్చకపోతే మీ విజయాలను, వ్యక్తిత్వాన్ని దారుణంగా తీసి పడేస్తారు.
అలాగే ఎప్పుడైతే మీ అభిప్రాయాలతో అవతలి వారి గుడ్డి నమ్మకాలను ఖండిస్తారో అప్పుడు ప్రత్యర్ధులు ఓ కూటమిలా ఏర్పడి మీ మీద 'స్మియర్ క్యాంపెన్' లాంచ్ చేస్తారు. దానికి కారణం భావజాలం లేదా సేమ్ కమ్యూనిటీ ఏస్పెక్ట్. వీటిని తట్టుకోలేక చాలా మంది ట్విటర్ వదిలేసి వెళ్ళిపోతారు. ఇందాక
ఆర్టికల్ గురించి చెప్తూ ఒక విషయం ప్రస్తావించడం మర్చిపోయాను. ఇక్కడ ఎవరైనా ఎవరికో సాయం చేసినప్పుడు "అయ్యో, డబ్బులుంటే నేను కూడా సాయం చేసేవాణ్ణి / చేసేదాన్ని కదా" అన్న ఫీలింగ్ మీకొచ్చిందంటే వెంటనే సోషల్ మీడియా క్విట్ చేసేయండి. ఎందుకంటే అది పెరిగి పెద్దదై మీరు ఎవరికైనా సాయం చేసాక
ఇతరులను కించపరిచే హక్కు వచ్చేసిందనే భావనకు లోనయ్యే అవకాశాలున్నాయి. సహాయాలు చేసే వాళ్ళ 'ఉద్దేశ్యాలు' ఏమన్నా కావచ్చు కానీ వారికి తెలియకుండానే ఇతరుల్లో ఒకరకమైన ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ బిల్డ్ అవుతోందని ఆ 'హెల్ప్' పోస్ట్ కింద రిప్లైస్ చూస్తే అర్ధం అవుతోంది.

రకరకాల మనస్తత్వాలు,
విభిన్న వ్యక్తిత్వాల సమ్మేళనమే ట్విటర్. నచ్చని విషయానికి, మనిషికీ దూరంగా వెళ్లే హక్కు మాత్రమే మనకుంది తప్ప ఆ మనిషిని జడ్జ్ చేసే హక్కు లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి చెప్పినట్టు మనందరరికీ కొన్ని బలాలు, ఇంకొన్ని బలహీనతలూ ఉంటాయి. మన ప్లస్ పాయింట్స్ మాత్రమే ప్రపంచానికి చూపిస్తాం.
మనలో కొందరు ట్విటర్ ఎలా వాడాలో ప్రపంచానికి లెక్చర్ ఇస్తుంటారు. ఇది ఇంకో రకమైన కాంప్లెక్స్. చాలా లైట్'గా తీసుకోవాల్సిన సోషల్ మీడియాకు అక్కర్లేని సీరియస్నెస్ ఆపాదించకండి. రొంబ ఓవరప్పా సిద్ధప్ప!

సో, జడ్జ్ చేయటం మానేసి హ్యాపీగా ట్వీట్ చేయండి కామ్రేడ్స్ 🤘

౼ డెలివరీ ఆఫ్ థాట్స్

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with black

black Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @27dots_

23 Oct
విషయాన్ని బోధించే వాడు ఉపాధ్యాయుడు అయితే విషయాన్ని తార్కికంగా ఆలోచించేలా చేసే వాడు గురువు.

గరికపాటి నరసింహారావుగారి లాంటి అవధానులు, గురువులు నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు, దైనందిన జీవనంలో అప్లై చేసుకోవచ్చు. 'నేను ఆయన చెప్పేది నమ్మను, మా ఇంట్లో ఇలా చెయ్యం' అని మీరంటే అది మీ
ఖర్మ అంటాను. ఆ మధ్య మెడిసిన్ చేసిన బ్రాహ్మణ అమ్మాయి 'కేరళ వాళ్లకు హిందూ మతం మీద ఇంత ద్వేషం ఎందుకు' అని కామెంట్ చేసింది. కేరళ వాళ్లంతా క్రిస్టియన్స్ అని ఆ అమ్మాయి ఉద్దేశ్యం. నేను కల్పించుకునే సరికి కాసేపు వాదించి నన్ను బ్లాక్ చేసింది. ఇలాంటి సూక్ష్మజీవులు వేరే బావి తవ్వుకుని అక్కడ
బతకాలి. దేనికి పనికొచ్చింది ఆ డాక్టర్ చదువు?

గరికపాటిగారు చెప్పేదంతా నిజమే అని నేను అనను. చాలా విషయాల మీద ఆయనకున్న పరిజ్ఞానాన్ని తార్కిక బుద్దితో విశ్లేషించి వివరిస్తారు. ఏది మంచిది అన్నది మన విజ్ఞతకే వదిలేస్తారు. ఉదాహరణకు అమ్మాయిల వస్త్రధారణ గురించి ఆయన చేసిన ప్రసంగం నాకు
Read 5 tweets
22 Oct
'ఇప్పుడు ఆస్ట్రేలియాలో టైమ్ ఎంతో తెలుసా? రాత్రి 12 అయింది. నా ప్రోగ్రామ్స్ సోఫియాని కనుక్కుని కాల్ చేయమని ఇప్పటికి నీకు వంద సార్లు చెప్పాను. రేపు ఇక్కడ కాన్ఫరెన్స్ అయ్యాక ఇండియాకి స్టార్ట్ అవుతాను. బై' అని భారతదేశంలోనే అత్యంత సంపన్నురాలైన తల్లి చిరాకుపడి కాల్ కట్ చేయడంతో నిరాశగా
బెడ్ మీద వాలిపోయాడు రాహుల్. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో సింగిల్ పేరెంట్ అయింది ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘనా వర్మ. ఎవరెంత ప్రయత్నించినా ఆమె జీవితంలో మరొకరికి చోటివ్వలేదు.

రాకేష్ వర్మ జీవించి ఉన్నప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మొదలైన వ్యాపారం కేవలం ఆమె అంకితభావంతో ఈ రోజు
లక్షల కోట్ల టర్నోవర్ చేస్తున్న మహా వ్యాపార సామ్రాజ్యంగా వివిధ రంగాల్లోకి విస్తరించింది. 'రెజెంట్స్ యూనివర్సిటీ'లో చేసిన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ఆమెకు అక్కరకొచ్చింది. కిచెన్ నుంచి లక్సరీ కార్ వరకూ.. భారతీయలు వాడే వస్తువులు 'వర్మ గ్రూప్' తయారుచేసేవే అంటే అతిశయోక్తి కాదు.
Read 26 tweets
22 Oct
1. మీ నాన్నగారిలో మీకు బాగా నచ్చిన ఒక క్వాలిటీ ఏంటి?
2. ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ ఏంటి?
3. మీ ఫేవరిట్ హీరో ఎవరు?
Read 25 tweets
15 Oct
"మనిషి భావోద్వేగాల వలనే సమాజం, వ్యవస్థ మనుగడ సాగించేది అని ప్రజలు అనుకుంటారు. కానీ, అది అబద్ధం. వ్యవస్థను ఆపరేట్ చేసేది చట్టం".

దాదాపుగా ఇదే అర్ధం వచ్చేలా ఒక లైన్ 'రీడర్' ఇంగ్లీషు సినిమాలో ఉంది. ఆర్యన్ ఖాన్ కేసు ఫాలో అవుతుంటే అది నిజం అనిపిస్తోంది. అదే సమయంలో మరి లక్షల కోట్ల
కుంభకోణాలు చేసిన.. చేస్తున్న రాజకీయ నాయకుల పట్ల చట్టాలు ఎందుకు కఠినంగా వ్యవహరించట్లేదు అని నా లాంటి సామాన్యులకు సందేహం రావటం చాలా సహజమే.

సాధారణ పౌరుల పై ఒక్క పోలీస్ కేసు రిజిస్టర్ అయ్యున్నా పాస్ పోర్టు జారీ చేయరాదు, అలాగే వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అంటోంది మన చట్టం. మరి
మన నాయకులు ఆర్ధిక నేరాలకు పాల్పడతారు, దర్యాప్తులో బయటపడ్డ వాళ్ళ అక్రమాస్తులను ED జప్తు చేసుకుంటుంది. కానీ ఆ నేరస్తులు జైల్లో శిక్షలు అనుభవిస్తూ.. బెయిల్ మీద బయటకు వస్తారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు! ఆ హక్కు ఎవరు కల్పించారు? మళ్ళీ మన రాజ్యాంగమే!

ఆర్థిక నేరాలు చేసే వాళ్ళకు,
Read 4 tweets
15 Oct
'అదుపూ పొదుపూ లేని ఆనందం కావాలి' నాకిష్టమైన ఒక తెలుగు పాటలో పల్లవి లైన్స్ అవి. ఈ భూమ్మీద ఊపిరి తీసుకుంటున్న ప్రతీ మనిషి లక్ష్యం అదే. అయితే సుఖం వేరు ఆనందం వేరు. సౌకర్యం సుఖాన్నిస్తే సుఖం ఆనందాన్నిస్తుంది.

'ఆనందంగా జీవించటం ఎలా'

హిట్ సినిమా సూత్రం (formula) ఏంటో ఇంత వరకు ఎవరూ
కనుగొనలేదు అలాగే ఇది కూడా. కొందరికి ఆనందం అంటే అప్పులు లేకపోవడం, ఇంకొందరికి అప్పులు పుట్టటం.. మరికొందరికి తమ హీరో సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడటం. మొక్కలకు నీరు పోస్తూ ఆనందించే వాళ్ళు, సంగీతం వింటూ ఇదే ఆనందం అనే వాళ్ళు కూడా ఉంటారు. సాయంత్రం అఫిస్ నుంచి తిన్నగా తమ 'అడ్డా'కు చేరి
చిన్ననాటి స్నేహితులతో కలిసి రెండు పెగ్గులు వేసి, నాలుగు దమ్ములు కొట్టడం కూడా ఒక వర్గం ఆనందం అనే అంటారు! నిజానికి మనం జీవించే ఉన్నాం అన్నది 'రియలైస్' అయితే ప్రతీ క్షణం ఆనందంగా ఉండటానికి ఒక చక్కని కారణం దొరికినట్టే. రియలైస్ అవ్వాలి అంతే!

బ్రతకటం వేరు జీవించటం వేరు అని చాలా మందికి
Read 21 tweets
13 Oct
ఒక సమాజంగా మనకు ఏం కావాలి అని ఆలోచించటం మానేసి అనేకానేక అంశాల వలన కులాలుగా.. వర్గాలుగా విడిపోయి 'మాకు' ఏం కావాలి అని మనుషులు ఆలోచించటం మొదలుపెట్టాక వర్గాల మధ్య ఆధిపత్య పోరు అనివార్యమైంది, ప్రజాస్వామ్యం కొత్తరూపు దిద్దుకుంది.

సమకాలీన రాజకీయాలను చూస్తే వర్గాల స్థాయి దాటి 'నాకేంటి'
అనే దగ్గరకు చేరింది.. పోరు వ్యక్తిగతమైపోయింది. ఒక విధమైన అనిశ్చిత వాతావరణం కనిపిస్తోంది.

ఒకనాడు చంద్రబాబు చేసిన అవే తప్పుల్ని జగన్ పునరావృతం చేస్తున్నాడు అని చెప్పొచ్చు. అవేంటంటే తమ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లోనూ, వ్యాపారల్లోనూ (కాంట్రాక్ట్స్) పెద్దపీట వేయటం. మార్కెట్
యార్డు చైర్మన్ లాంటి నామినేటెడ్ పోస్టుల నుంచి అన్నీ స్థానాల్లోనూ వారి మనుషుల్ని నియమించడం. ఈ పిచ్చి ఎంత వరకూ వెళ్లిందంటే ఇది వరకెన్నడూలేని విధంగా లెక్కకు మించి ప్రభుత్వ సలహదారులను నియమించి వారికి లక్షల్లో జీతభత్యాలు చెల్లిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థను
Read 21 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(