ప్రపంచ సుందరిగా, చక్కని నటిగా చాలా మందికి తెలుసు. కానీ ఒక 'Abusive Relationship' నుంచి బయటపడి, మీడియా వేధింపులు ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన విజేత ఆమె.
ఒక సినిమా షూట్ సందర్భంగా సల్మాన్ ఖాన్'తో ప్రేమలో పడిన ఐశ్వర్య "తాళ్" లాంటి సూపర్ హిట్స్ రావడంతో పరిశ్రమలో చక్కగా
నిలదొక్కుకుంది. అప్పుడే సల్మాన్ ఖాన్ అభద్రతాభావం కూడా బయటపడసాగింది. షారుఖ్ ఖాన్'తో నటించడానికి వీల్లేదు" అన్న సల్మాన్ ఖాన్ ఆదేశాన్ని బేఖాతరు చేయడంతో "చల్తే చల్తే" షూటింగ్ స్పాట్'కి వెళ్లి ఆమెను కొట్టడమే కాక అక్కడ నుంచి ఆమెను బరబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కార్'లో పడేసాడు సల్మాన్.
ఆ మరుసటిరోజు యధావిధిగా షూట్'కి వెళ్లిన ఆమెతో "మిమ్మల్ని లోనికి రానివద్దని చెప్పారమ్మ. మీ స్థానంలో రాణీ ముఖర్జీని తీసుకున్నారు" అన్న వాచ్ మేన్ మాటలు ఆమెలో తీవ్ర నిరాశ కలిగించినా, సల్మాన్ ఖాన్ని వదిలించుకోవాలి అని అప్పుడే దృఢంగా నిర్ణయించుకుంది.
అదే సమయంలో వివేక్ ఒబెరాయ్ లాంటి
వాళ్ళు ఆమెతో సన్నిహితంగా మెలగాలని ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ మీడియా మాత్రం సల్మాన్ ఖాన్ ప్రోద్బలంతో ఆమె పై witch hunting మొదలుపెట్టింది. ఇది చాలా కాలం కొనసాగింది. కానీ ఆమె అదరలేదు, బెదరలేదు. బాలీవుడ్ పరిశ్రమలో అత్యంత శక్తిమంతమైన స్టార్స్' లో సల్మాన్ ఒకరు (ఆయన అండర్ వరల్డ్
కనెక్షన్స్ అందరికీ తెలుసు). ఆమె తనకు దూరం అయ్యిందనే ఉక్రోషంతో అర్ధరాత్రి తాగి ఆమె ఇంటికి వెళితే అడ్డుకున్న వాచ్ మేన్'ని చితకబాదిన సంఘటన అప్పట్లో పెద్ద వార్తయ్యింది.
ప్రపంచ సుందరి పైగా ఒక వయలెంట్ స్టార్'తో లవ్'లో పడింది. ఇంత కంటే మంచి న్యూస్ ఏముంటుంది మీడియాకు? థర్డ్ రేటెడ్ సినీ
వీక్లి నుంచి ఫిల్మ్ ఫేర్ లాంటి ప్రముఖ మ్యాగజైన్ వరకూ ఎవరూ ఆమెను వదల్లేదు. బట్ ఈ మొత్తం వ్యవహారంలో ఆమె హుందాగా వ్యవహరించిన విషయం కొందరికైనా గుర్తుండే ఉంటుంది. ఒక్కరోజు కూడా తను ఎవరిపైనా విమర్శలు చేయలేదు, ఎవర్నీ నిందించలేదు. ఆమెను బాధపెట్టిన దర్శకనిర్మాతల గురించి కూడా ఎప్పుడూ
తప్పుగా మాట్లాడలేదు. ఆమె పర్సనల్ లైఫ్ గురించి మీడియా ఎన్ని సార్లు గుచ్చిగుచ్చి అడిగినా "అందరికీ అన్నీ తెలుసు. కొత్తగా ఏం చెప్పాలి" అని వ్యాఖ్యానించేది. చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఆమె సొంతం. It's not easy being Aishwarya Rai.
"చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలని కలలుగన్న ఇరవై రెండేళ్ల కుర్రాడు తనే ఒక చరిత్రను సృష్టిస్తాడని ఆనాడు ఊహించలేదు."
చిరంజీవి కెమెరాను ఫేస్ చేసిన మొదటి సినిమా పునాది రాళ్లు, కానీ విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. ఈ రెంటికీ నిర్మాత క్రాంతికుమార్ కావటం విశేషం. 78లో బాపుగారి మనవూరి
పాండవులు షూట్ జరుగుతున్నప్పుడు చిరంజీవి అక్కడున్న గడ్డి, మన్ను తీసి ఒంటి మీద పూసుకున్నారు. ఇది గమనించిన లక్ష్మీ దీపక్ (AD) ఏం చేస్తున్నావ్ అని అడిగితే 'పొలం పని చేసొచ్చినట్టు కనిపించాలి కదండీ, అందుకే..' అని చిరంజీవి చెప్పగానే నువ్వు గొప్ప నటుడవుతావ్ అని ప్రశంసించారు. తరువాత ఆయనతో
'ధైర్యవంతుడు' లాంటి హిట్ సినిమా చిరంజీవి చేశారు.
షూటింగ్లో బ్రేక్ దొరికితే సాధారణంగా ఆర్టిస్టులు పేకాడతారు లేదా వేరే కథలు వింటారు. కానీ చిరంజీవి మాత్రం మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేసేవారు.. తన తోటి నటీనటులను ఎంటర్టైన్ చేసేవారు. ఇవన్నీ గమనిస్తున్న క్రాంతికుమార్ గారు చిరంజీవిని
నా జీవితంలోంచి అతన్ని పంపేయటం చాలా సులువుగా జరిగింది. కానీ నా ఆలోచనల్లోంచి..!? ప్రేమంటే అవతలి వ్యక్తి బలాన్ని, బలహీనతను ప్రేమించడం. మరి అతన్ని నేను ఇన్నాళ్లు ప్రేమించలేదా? ప్రేమించి ఉంటే వదిలేసేదాన్నా?
వీకెండ్ కదా ఏంటి ప్రోగ్రాం? అని కృష్ణకు కాల్ చేస్తే నథింగ్ నువ్వే చెప్పు
అన్నాడు. సరే, మా రూమ్మేట్స్ ఈ రోజు తిరుపతి వెళ్తున్నారు. మార్నింగ్ వచ్చేయి. కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. లంచ్ నీకు ఇష్టమైన మటన్ బిర్యానీ చేసి పెడతాను. సరేనా అన్నాను. ఓకే బంగారం అన్నాడు సినీ ఫక్కీలో.
రాత్రి చాలా సేపు కృష్ణతో చాట్ చేయటం వల్ల లేచేసరికి ఎనిమిదిన్నర అయ్యింది. ఇప్పుడు
వచ్చేస్తాడు! అనుకుంటూ ఫ్రెష్ అవుతూ కిచెన్'లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఇంతలో డోర్ బెల్ మోగింది. కృష్ణ! అనుకుంటూ తలుపు తీసాను. 'ఈ నెల మెయింటెనన్స్ బిల్ మేడమ్' అని ఎదురుగా నిలబడి ఉన్నాడు సెక్యూరిటీ గార్డ్. సరే, నువ్వెళ్ళు అని డోర్ వేసి కృష్ణకు కాల్ చేసాను. వెయిటింగ్ అంటోంది.
'నీ ఉనికిని కాపాడుకోవాలంటే ఒకటి నువ్వు గొప్పగా బ్రతుకు లేదా వేరే వారి బ్రతుకును కించపరుచు. ఈ రెండూ ప్రపంచానికి తెలియాలంటే అటెన్షన్ అవసరం'
౼ హరీష్ మీనన్
ట్విటర్ వల్ల ఉపయోగాలు ఏంటి? తమ తమ భావాలను వ్యక్తపరచటానికి ఒక చక్కని వేదిక. చాలా మంది ఇంట్రవర్ట్స్ తమ పేర్లు మార్చుకుని ఇక్కడ
చెలరేగిపోతుంటారు. నా లోంటోళ్లు ఏదైనా ఆలోచన వస్తే కథ, కవితా రూపంలో ఇక్కడ ట్వీట్ చేస్తుంటారు. మన సోషల్ సైడ్ బయటపెట్టే ప్లేస్ మాత్రమే కాకుండా తమలా ఆలోచించే మరో వ్యక్తి ఈ భూమ్మీద ఉన్నారా? అని తెలుసుకోవటానికి ఉపయోగపడే ఒక మాధ్యమం ట్విటర్.
ఈ మధ్య ఒక వ్యక్తితో సంవాదం జరిగినప్పుడు
'ఎన్నడైనా పిల్లికి బిచ్చం వేశావా' అని అడిగాడు. సాయం చేస్తే ఇక్కడ ట్విట్టర్లో పెడితేనే అది సాయం అన్న ఒకరకమైన స్టేట్ ఆఫ్ మెంటల్ థింకింగ్'లో ఉన్నాడు అని అర్ధమైంది. అతని నేపథ్యం (pun intended) నాకు తెలుసు కాబట్టి నేను అతన్ని తప్పుపట్టను. ఒకరి వ్యక్తిత్వాన్ని కొలవటానికి డబ్బు సాయాన్ని
విషయాన్ని బోధించే వాడు ఉపాధ్యాయుడు అయితే విషయాన్ని తార్కికంగా ఆలోచించేలా చేసే వాడు గురువు.
గరికపాటి నరసింహారావుగారి లాంటి అవధానులు, గురువులు నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు, దైనందిన జీవనంలో అప్లై చేసుకోవచ్చు. 'నేను ఆయన చెప్పేది నమ్మను, మా ఇంట్లో ఇలా చెయ్యం' అని మీరంటే అది మీ
ఖర్మ అంటాను. ఆ మధ్య మెడిసిన్ చేసిన బ్రాహ్మణ అమ్మాయి 'కేరళ వాళ్లకు హిందూ మతం మీద ఇంత ద్వేషం ఎందుకు' అని కామెంట్ చేసింది. కేరళ వాళ్లంతా క్రిస్టియన్స్ అని ఆ అమ్మాయి ఉద్దేశ్యం. నేను కల్పించుకునే సరికి కాసేపు వాదించి నన్ను బ్లాక్ చేసింది. ఇలాంటి సూక్ష్మజీవులు వేరే బావి తవ్వుకుని అక్కడ
బతకాలి. దేనికి పనికొచ్చింది ఆ డాక్టర్ చదువు?
గరికపాటిగారు చెప్పేదంతా నిజమే అని నేను అనను. చాలా విషయాల మీద ఆయనకున్న పరిజ్ఞానాన్ని తార్కిక బుద్దితో విశ్లేషించి వివరిస్తారు. ఏది మంచిది అన్నది మన విజ్ఞతకే వదిలేస్తారు. ఉదాహరణకు అమ్మాయిల వస్త్రధారణ గురించి ఆయన చేసిన ప్రసంగం నాకు
'ఇప్పుడు ఆస్ట్రేలియాలో టైమ్ ఎంతో తెలుసా? రాత్రి 12 అయింది. నా ప్రోగ్రామ్స్ సోఫియాని కనుక్కుని కాల్ చేయమని ఇప్పటికి నీకు వంద సార్లు చెప్పాను. రేపు ఇక్కడ కాన్ఫరెన్స్ అయ్యాక ఇండియాకి స్టార్ట్ అవుతాను. బై' అని భారతదేశంలోనే అత్యంత సంపన్నురాలైన తల్లి చిరాకుపడి కాల్ కట్ చేయడంతో నిరాశగా
బెడ్ మీద వాలిపోయాడు రాహుల్. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో సింగిల్ పేరెంట్ అయింది ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘనా వర్మ. ఎవరెంత ప్రయత్నించినా ఆమె జీవితంలో మరొకరికి చోటివ్వలేదు.
రాకేష్ వర్మ జీవించి ఉన్నప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మొదలైన వ్యాపారం కేవలం ఆమె అంకితభావంతో ఈ రోజు
లక్షల కోట్ల టర్నోవర్ చేస్తున్న మహా వ్యాపార సామ్రాజ్యంగా వివిధ రంగాల్లోకి విస్తరించింది. 'రెజెంట్స్ యూనివర్సిటీ'లో చేసిన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ఆమెకు అక్కరకొచ్చింది. కిచెన్ నుంచి లక్సరీ కార్ వరకూ.. భారతీయలు వాడే వస్తువులు 'వర్మ గ్రూప్' తయారుచేసేవే అంటే అతిశయోక్తి కాదు.