black Profile picture
3 Nov, 25 tweets, 4 min read
"చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలని కలలుగన్న ఇరవై రెండేళ్ల కుర్రాడు తనే ఒక చరిత్రను సృష్టిస్తాడని ఆనాడు ఊహించలేదు."

చిరంజీవి కెమెరాను ఫేస్ చేసిన మొదటి సినిమా పునాది రాళ్లు, కానీ విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. ఈ రెంటికీ నిర్మాత క్రాంతికుమార్ కావటం విశేషం. 78లో బాపుగారి మనవూరి
పాండవులు షూట్ జరుగుతున్నప్పుడు చిరంజీవి అక్కడున్న గడ్డి, మన్ను తీసి ఒంటి మీద పూసుకున్నారు. ఇది గమనించిన లక్ష్మీ దీపక్ (AD) ఏం చేస్తున్నావ్ అని అడిగితే 'పొలం పని చేసొచ్చినట్టు కనిపించాలి కదండీ, అందుకే..' అని చిరంజీవి చెప్పగానే నువ్వు గొప్ప నటుడవుతావ్ అని ప్రశంసించారు. తరువాత ఆయనతో
'ధైర్యవంతుడు' లాంటి హిట్ సినిమా చిరంజీవి చేశారు.

షూటింగ్లో బ్రేక్ దొరికితే సాధారణంగా ఆర్టిస్టులు పేకాడతారు లేదా వేరే కథలు వింటారు. కానీ చిరంజీవి మాత్రం మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేసేవారు.. తన తోటి నటీనటులను ఎంటర్టైన్ చేసేవారు. ఇవన్నీ గమనిస్తున్న క్రాంతికుమార్ గారు చిరంజీవిని
స్వయంగా చాలా మంది నిర్మాతలకు, దర్శకులకు పరిచయం చేసారు. స్వతహాగా చాలా చురుగ్గా ఉండే చిరంజీవి అందివచ్చిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నారు. కె. బాలచందర్ లాంటి లెజెండ్ దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేయటం అంటే ఆషామాషీ కాదు. ఎటువంటి పాత్రయినా పరిధి పట్టించుకోకుండా నటిస్తూ
మెల్లగా తనదైన ముద్ర వేయటానికి ప్రయత్నించారు చిరంజీవి.

అప్పటికి సినీ పరిశ్రమ కమ్మవర్గం చేతిలో ఉండేది. అందుకే తన సామాజిక వర్గమైన టాప్ డైరెక్టర్ దాసరి లాంటి వాళ్ళు చిరంజీవిని ప్రోత్సహించలేదు సరికదా ఆయనకు వచ్చిన అవకాశాలకు గండికొట్టే ప్రయత్నం కూడా చేసారు. టాలెంట్ ఉన్నవాడ్ని ఎవ్వరూ
ఆపలేరు అనటానికి నిదర్శనం చిరంజీవి ప్రస్థానం.

ఏ.కోదండరామి రెడ్డితో చేసిన "ఖైదీ" సినిమా చిరంజీవిని స్టార్ చేసింది, ప్రేక్షకుల మనసులో ఆయన్ను ఖైదు చేసింది. వారివురి కాంబోలో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. ఐతే అప్పటి స్టార్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావుతో (హీరోగా) అవకాశం
చిరంజీవికి దాదాపు 80 చిత్రాలు చేసాకే లభించింది. ఇక అక్కడ్నుంచి తెలుగు సినిమా బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు చిరంజీవి. తెలుగు సినిమా పది కోట్లు కలెక్ట్ చేయగలదని నిరూపించిన చిత్రం 'ఘరానా మొగుడు'. ఎన్టీఆర్ రెగ్యులర్ నిర్మాతలైన కె. దేవివరప్రసాద్, సీ. అశ్వనీదత్ లాంటి వాళ్ళు చిరంజీవి
డేట్ల కోసం వేచి చూసేవారు, చిరంజీవితో బ్లాక్ బస్టర్స్ కూడా తీశారు.

ఘరానామొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత ఆయన ఇమేజ్ లార్జర్ దాన్ స్కై రేంజుకు వెళ్లటంతో ఆ తరువాత వచ్చిన చిత్రాలు ఆశించినంతగా ఆడలేదు. పునరాలోచనలో పడ్డ చిరంజీవి దాదాపు ఏడాదిపాటు మేకప్ వేసుకోలేదు. అలాంటి సమయంలోనే
ఎడిటర్ మోహన్ మలయాళ చిత్రం 'హిట్లర్' గురించి చెప్పటం, ఆ సినిమా చూసి చిరంజీవి ఓకే చేయటం జరిగాయి. చిరంజీవి సినిమా అంటే డ్యాన్సులు, డూప్ లేని ఫైట్స్ అన్న బ్రాండ్ నుంచి హుందాగల పాత్రలోకి ఆయన పరకాయ ప్రవేశం చేశారు. మళ్ళీ ఆయన జైత్రయాత్ర మొదలుపెట్టాడు. వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇస్తూ
ప్రేక్షకులను, అభిమానులను అలరించారు.

తన ఉన్నతికి కారణమైన సమాజం కోసం ఏదైనా చేయాలన్న సత్సంకల్పంతో రక్తనిధిని నెలకొల్పారు, జాతీయస్థాయిలో అవార్డులు కూడా అందుకున్నారు. ఆ తరువాత ఐ బ్యాంక్ కూడా నెలకొల్పి తన సామాజిక బాధ్యతను నెరవేరుస్తూ అందులో తన అభిమానులను కూడా పాలుపంచుకునేలా చేశారు.
ఫలితాలతో సంబంధం లేకుండా చిరంజీవి చిత్రాలు సామాన్యులను అలరిస్తాయి అన్నది జగద్విదితం. 'మా హిట్ సినిమాల కలెక్షన్ చిరంజీవి గారి ప్లాప్ సినిమాలతో సమానం' అని ఒక సందర్భంలో నాగార్జున అన్నారంటే ప్రేక్షకుల్లో చిరంజీవి సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఊహించుకోవచ్చు.

80వ దశకం చివరలో చిరంజీవి మీద
విషప్రయోగం జరిగిన సంగతి ఎంత మందికి తెలుసు? ఆయన సక్సెస్ చూసి ఓర్వ లేకపోయిన ప్రత్యర్ధులు అభిమాని ముసుగులో కిరాయి వ్యక్తిని పంపి చిరంజీవికి కేకు తినిపించబోయారు. కానీ సహజంగానే జాగ్రత్తపరుడైన మధ్యతరగతి 'శంకరం బాబు' ప్రమాదాన్ని పసిగట్టి విజయవంతంగా ఆ కుట్ర నుంచి బయటపడ్డారు.
భారతదేశంలో ఒక నటుడి పేరు మీద దశాబ్దం పైగా సినీపత్రిక వెలువడిన చరిత్ర, ఘనత చిరంజీవికి మాత్రమే సొంతం. దక్షిణ భారతదేశం నుండి ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న గౌరవం కూడా ఆయనకే దక్కుతుంది.

'మీరు వచ్చిన తరువాత ప్రేక్షకులు మా చిత్రాలను చూడటం మానేశారు' ౼ ఎన్టీఆర్
'అతను డ్యాన్స్ చేస్తుంటే ఆ శరీరంలో స్ప్రింగులున్నాయా అన్న అనుమానం వచ్చింది' ౼ ఏఎన్నార్

'చిరంజీవి మంచి నటుడు. మాస్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయారు లేకుంటే ఆయన్నుంచి మనం ఎన్నో వైవిధ్యమైన పాత్రలను చూసే వాళ్ళం' - కమల్ హాసన్

'ఇంతలా కష్టబడే నటుడ్ని నేనింత వరకూ చూడలేదు ౼మహేష్ బట్
'చిరంజీవి పైకొస్తాడని అనుకున్నాం గానీ మొత్తం ఇండస్త్రీకే రంకు మొగుడవుతాడని ఊహించలేదు' ౼ మాగంటి మురళీమోహన్

'రెండు మూడు హిట్స్ ఇచ్చి చిరంజీవి తరువాత మేమే అనుకునే వాళ్ళు లైట్ దగ్గర పురుగుల్లాంటోళ్లు' ౼ ప్రకాష్ రాజ్

'వన్ & ఓన్లీ చిరంజీవి' ౼ మహేష్ బాబు

'ఆయనే మాకు స్ఫూర్తి' ౼ తారక్
చిరంజీవి సాధించిన విజయాలు, అధిరోహించిన శిఖరాలు రాత్రికి రాత్రే సంభవించిన పరిణామాలు కావు. వాటి వెనుక ఎన్నో ఏళ్ల పట్టుదల, కృషి, అకుంఠిత దీక్ష దాగి ఉన్నాయి. ప్రేక్షకులను అలరించాలన్న ఒకేఒక్క కారణంతో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన సందర్భాలున్నాయి.

ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం (tableau) పై చిరంజీవి 'పోతురాజు' వేషం వేసిన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

ఎన్నో రకాలుగా ప్రత్యర్ధులు చిరంజీవి పై విషప్రచారం చేసినా, తన వాళ్లే తనను తూలనాడినా అన్నీ భరించిన నీలకంఠుడు.. శివశంకరుడు.

చిరంజీవి వ్యక్తిత్వం
గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోకపోతే ఈ రైటప్'కి అర్ధం లేదు. అభద్రతాభావాలు, అహంకారాలు అధికంగా ఉండే సినీపరిశ్రమలో దాదాపు నలభై ఏళ్లకు పైగా నంబర్ వన్ స్థానంలో కొనసాగడం అంటే అనితరసాధ్యం. దానికి కారణం ఆయన విజయాలు, ప్రొఫెషనలిజం మాత్రమే కాదు, మచ్చలేని వ్యక్తిత్వం కూడా ఒక కారణమే. చిన్నా
పెద్దా అని తేడా లేకుండా అందరితో కలిసిపోయి, కలివిడిగా మాట్లాడటం.. ఎవరైనా ఆపదలో ఉంటే తక్షణమే స్పందించి సహాయం చేయటం ఆయనలో ఉన్న సహజగుణాలు. స్టార్'గా వెలుగుతున్న సమయంలో స్నేహితుల కోసం ఉచితంగా సినిమా (యముడికి మొగుడు) చేయటం, తొలిరోజుల్లో తనను ప్రోత్సహించిన క్రాంతికుమార్ గారికి డబ్బులు
తీసుకోకుండా సినిమా చేయటం, తనతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసిన కె. రాఘవేంద్రరావు గారికి ఒక్కరూపాయి తీసుకోకుండా సినిమా చేయటం, ఆపదలో ఉన్న అభిమానులను, కళాకారులను ఆదుకోవడం.. ఇలా ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి తార్కాణాలు ఎన్నెన్నో.

పద్మభూషణ్ అందుకున్న సందర్భంలో తెలుగు సినీపరిశ్రమ ఆయన్ను
సన్మానించినప్పుడు కళ్యాణ్ తన స్పీచ్'లో అన్నట్టు 'మీరు ఆయన్ను ఎంతైనా ద్వేషించండి, ఆయన మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు'. సమకాలీకులకు అందనంత ఎత్తులో సింహాసనం పై కూర్చున్న మెగాస్టార్ చిరంజీవిని చూసి ఇప్పటికీ కుళ్లుకునే సహచరులున్నారు, సినీపరిశ్రమలో తమ ఆధిత్యానికి గండికొట్టిన
చిరంజీవిని చూసి ఇప్పటికీ అభద్రతాభావంతో రగిలిపోయే వర్గం ఉంది. కోట్లాది మందికి మెగాస్టార్ చిరంజీవి అంటే అదొక పేరు కాదు, స్ఫూర్తి. చిరంజీవి అంటే ఒక ధైర్యం. చిరంజీవి అంటే ఒక నమ్మకం. ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని నిరూపించిన "హీరో" చిరంజీవి.

రాజకీయాలకు స్వస్తి పలికి
'ఖైదీ నెం.150' చిత్రంతో పునరాగమనం చేసినపుడు ప్రేక్షకులు ఆయన రాకను పండగ చేసుకున్నారు. ఆ చిత్రాన్ని ఆదరించి తమ ప్రేమను చాటుకున్నారు. వెంటనే 'సైరా' లాంటి చారిత్రాత్మక చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించారు.

నాలుగు దశాబ్దాలుగా తరాలు మారినా, తారలు మారినా ఆయన మాత్రం ఆకాశంలా నిశ్చలంగా
నిర్మలంగా అలానే ఉన్నారు. తమ్ముడితో పోటీ పడ్డారు, ఇప్పుడు కొడుకుతో కూడా పోటీ పడుతున్నారు. ఈ రోజున ఇండస్ట్రీ కళకళలాడుతోందంటే ఆ క్రెడిట్ మెగాస్టార్ కుటుంబానికి సింహభాగం చెందుతుంది. ఇది నేను చెప్తోంది కాదు గణాంకాలు నిరూపిస్తున్నాయి.
చిరంజీవిని గురించి ఆలోచిస్తే నాకు శ్రీశ్రీగారి మహాప్రస్థానంలో లైన్స్ గుర్తొస్తాయి.

నేనొక దుర్గం
నాదొక స్వర్గం
అనర్గళం అనితరసాధ్యం
నా మార్గం.

తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు చిరంజీవి రాక ముందు చిరంజీవి వచ్చిన తరువాత అంటారు. అదీ చిరంజీవంటే!

౼ డెలివరీ ఆఫ్ థాట్స్

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with black

black Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @27dots_

2 Nov
నా జీవితంలోంచి అతన్ని పంపేయటం చాలా సులువుగా జరిగింది. కానీ నా ఆలోచనల్లోంచి..!? ప్రేమంటే అవతలి వ్యక్తి బలాన్ని, బలహీనతను ప్రేమించడం. మరి అతన్ని నేను ఇన్నాళ్లు ప్రేమించలేదా? ప్రేమించి ఉంటే వదిలేసేదాన్నా?

వీకెండ్ కదా ఏంటి ప్రోగ్రాం? అని కృష్ణకు కాల్ చేస్తే నథింగ్ నువ్వే చెప్పు
అన్నాడు. సరే, మా రూమ్మేట్స్ ఈ రోజు తిరుపతి వెళ్తున్నారు. మార్నింగ్ వచ్చేయి. కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. లంచ్ నీకు ఇష్టమైన మటన్ బిర్యానీ చేసి పెడతాను. సరేనా అన్నాను. ఓకే బంగారం అన్నాడు సినీ ఫక్కీలో.

రాత్రి చాలా సేపు కృష్ణతో చాట్ చేయటం వల్ల లేచేసరికి ఎనిమిదిన్నర అయ్యింది. ఇప్పుడు
వచ్చేస్తాడు! అనుకుంటూ ఫ్రెష్ అవుతూ కిచెన్'లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఇంతలో డోర్ బెల్ మోగింది. కృష్ణ! అనుకుంటూ తలుపు తీసాను. 'ఈ నెల మెయింటెనన్స్ బిల్ మేడమ్' అని ఎదురుగా నిలబడి ఉన్నాడు సెక్యూరిటీ గార్డ్. సరే, నువ్వెళ్ళు అని డోర్ వేసి కృష్ణకు కాల్ చేసాను. వెయిటింగ్ అంటోంది.
Read 22 tweets
1 Nov
ఐశ్వర్యరాయ్.

ప్రపంచ సుందరిగా, చక్కని నటిగా చాలా మందికి తెలుసు. కానీ ఒక 'Abusive Relationship' నుంచి బయటపడి, మీడియా వేధింపులు ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన విజేత ఆమె.

ఒక సినిమా షూట్ సందర్భంగా సల్మాన్ ఖాన్'తో ప్రేమలో పడిన ఐశ్వర్య "తాళ్" లాంటి సూపర్ హిట్స్ రావడంతో పరిశ్రమలో చక్కగా
నిలదొక్కుకుంది. అప్పుడే సల్మాన్ ఖాన్ అభద్రతాభావం కూడా బయటపడసాగింది. షారుఖ్ ఖాన్'తో నటించడానికి వీల్లేదు" అన్న సల్మాన్ ఖాన్ ఆదేశాన్ని బేఖాతరు చేయడంతో "చల్తే చల్తే" షూటింగ్ స్పాట్'కి వెళ్లి ఆమెను కొట్టడమే కాక అక్కడ నుంచి ఆమెను బరబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కార్'లో పడేసాడు సల్మాన్.
ఆ మరుసటిరోజు యధావిధిగా షూట్'కి వెళ్లిన ఆమెతో "మిమ్మల్ని లోనికి రానివద్దని చెప్పారమ్మ. మీ స్థానంలో రాణీ ముఖర్జీని తీసుకున్నారు" అన్న వాచ్ మేన్ మాటలు ఆమెలో తీవ్ర నిరాశ కలిగించినా, సల్మాన్ ఖాన్ని వదిలించుకోవాలి అని అప్పుడే దృఢంగా నిర్ణయించుకుంది.

అదే సమయంలో వివేక్ ఒబెరాయ్ లాంటి
Read 7 tweets
24 Oct
'నీ ఉనికిని కాపాడుకోవాలంటే ఒకటి నువ్వు గొప్పగా బ్రతుకు లేదా వేరే వారి బ్రతుకును కించపరుచు. ఈ రెండూ ప్రపంచానికి తెలియాలంటే అటెన్షన్ అవసరం'
౼ హరీష్ మీనన్

ట్విటర్ వల్ల ఉపయోగాలు ఏంటి? తమ తమ భావాలను వ్యక్తపరచటానికి ఒక చక్కని వేదిక. చాలా మంది ఇంట్రవర్ట్స్ తమ పేర్లు మార్చుకుని ఇక్కడ
చెలరేగిపోతుంటారు. నా లోంటోళ్లు ఏదైనా ఆలోచన వస్తే కథ, కవితా రూపంలో ఇక్కడ ట్వీట్ చేస్తుంటారు. మన సోషల్ సైడ్ బయటపెట్టే ప్లేస్ మాత్రమే కాకుండా తమలా ఆలోచించే మరో వ్యక్తి ఈ భూమ్మీద ఉన్నారా? అని తెలుసుకోవటానికి ఉపయోగపడే ఒక మాధ్యమం ట్విటర్.

ఈ మధ్య ఒక వ్యక్తితో సంవాదం జరిగినప్పుడు
'ఎన్నడైనా పిల్లికి బిచ్చం వేశావా' అని అడిగాడు. సాయం చేస్తే ఇక్కడ ట్విట్టర్లో పెడితేనే అది సాయం అన్న ఒకరకమైన స్టేట్ ఆఫ్ మెంటల్ థింకింగ్'లో ఉన్నాడు అని అర్ధమైంది. అతని నేపథ్యం (pun intended) నాకు తెలుసు కాబట్టి నేను అతన్ని తప్పుపట్టను. ఒకరి వ్యక్తిత్వాన్ని కొలవటానికి డబ్బు సాయాన్ని
Read 10 tweets
23 Oct
విషయాన్ని బోధించే వాడు ఉపాధ్యాయుడు అయితే విషయాన్ని తార్కికంగా ఆలోచించేలా చేసే వాడు గురువు.

గరికపాటి నరసింహారావుగారి లాంటి అవధానులు, గురువులు నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు, దైనందిన జీవనంలో అప్లై చేసుకోవచ్చు. 'నేను ఆయన చెప్పేది నమ్మను, మా ఇంట్లో ఇలా చెయ్యం' అని మీరంటే అది మీ
ఖర్మ అంటాను. ఆ మధ్య మెడిసిన్ చేసిన బ్రాహ్మణ అమ్మాయి 'కేరళ వాళ్లకు హిందూ మతం మీద ఇంత ద్వేషం ఎందుకు' అని కామెంట్ చేసింది. కేరళ వాళ్లంతా క్రిస్టియన్స్ అని ఆ అమ్మాయి ఉద్దేశ్యం. నేను కల్పించుకునే సరికి కాసేపు వాదించి నన్ను బ్లాక్ చేసింది. ఇలాంటి సూక్ష్మజీవులు వేరే బావి తవ్వుకుని అక్కడ
బతకాలి. దేనికి పనికొచ్చింది ఆ డాక్టర్ చదువు?

గరికపాటిగారు చెప్పేదంతా నిజమే అని నేను అనను. చాలా విషయాల మీద ఆయనకున్న పరిజ్ఞానాన్ని తార్కిక బుద్దితో విశ్లేషించి వివరిస్తారు. ఏది మంచిది అన్నది మన విజ్ఞతకే వదిలేస్తారు. ఉదాహరణకు అమ్మాయిల వస్త్రధారణ గురించి ఆయన చేసిన ప్రసంగం నాకు
Read 5 tweets
22 Oct
'ఇప్పుడు ఆస్ట్రేలియాలో టైమ్ ఎంతో తెలుసా? రాత్రి 12 అయింది. నా ప్రోగ్రామ్స్ సోఫియాని కనుక్కుని కాల్ చేయమని ఇప్పటికి నీకు వంద సార్లు చెప్పాను. రేపు ఇక్కడ కాన్ఫరెన్స్ అయ్యాక ఇండియాకి స్టార్ట్ అవుతాను. బై' అని భారతదేశంలోనే అత్యంత సంపన్నురాలైన తల్లి చిరాకుపడి కాల్ కట్ చేయడంతో నిరాశగా
బెడ్ మీద వాలిపోయాడు రాహుల్. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో సింగిల్ పేరెంట్ అయింది ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘనా వర్మ. ఎవరెంత ప్రయత్నించినా ఆమె జీవితంలో మరొకరికి చోటివ్వలేదు.

రాకేష్ వర్మ జీవించి ఉన్నప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మొదలైన వ్యాపారం కేవలం ఆమె అంకితభావంతో ఈ రోజు
లక్షల కోట్ల టర్నోవర్ చేస్తున్న మహా వ్యాపార సామ్రాజ్యంగా వివిధ రంగాల్లోకి విస్తరించింది. 'రెజెంట్స్ యూనివర్సిటీ'లో చేసిన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ఆమెకు అక్కరకొచ్చింది. కిచెన్ నుంచి లక్సరీ కార్ వరకూ.. భారతీయలు వాడే వస్తువులు 'వర్మ గ్రూప్' తయారుచేసేవే అంటే అతిశయోక్తి కాదు.
Read 26 tweets
22 Oct
1. మీ నాన్నగారిలో మీకు బాగా నచ్చిన ఒక క్వాలిటీ ఏంటి?
2. ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ ఏంటి?
3. మీ ఫేవరిట్ హీరో ఎవరు?
Read 25 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(