black Profile picture
7 Nov, 26 tweets, 4 min read
"సర్జరీ అయిపోయింది. మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి. వాకర్ సహాయంతో నడవాలి. కాలి మీద ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు" డాక్టర్ చెప్తోంటే మౌనంగా వింటున్నాడు రిషి. కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర జరిగిన ప్రమాదంలో అతని పాదానికి దెబ్బతగిలింది. స్కాన్ చేసాక ఫ్రాక్చర్ అని తేల్చి ప్లేట్ పెట్టి సర్జరీ
చేశారు.

హాయ్ రిషి, ఎలా ఉందిప్పుడు వస్తూనే హెచ్ ఆర్ మేనేజర్ అడిగాడు. చిన్నగా నవ్వేడు రిషి. డాక్టర్'ని కలిసొస్తున్నాను. రేపు డిశ్చార్జ్ చేస్తాం అంటున్నారు. టికెట్ బుక్ చేయనా అన్నాడు. 'ఎక్కడకి' అని అడుగుదాం అనుకున్నాడు రిషి. కారణం అతనికి ఈ ప్రపంచంలో నా అనే వాళ్ళెవ్వరూ లేరు.
ఇట్స్ ఓకే నేను మేనేజ్ చేస్తాను అన్నాడు. సరే, ఏ అవసరం ఉన్నా కాల్ చెయ్ అని అతను వెళ్లిపోతుంటే సంజయ్ అని పిలిచాడు రిషి. హా చెప్పు అన్నాడు హెచ్ ఆర్ మేనేజర్. నాకు ఇక్కడ అసిస్టెన్స్ అవసరం లేదు అండ్ నా అకౌంట్స్ త్వరగా సెటిల్ చేస్తావా అడిగాడు. యూ మీన్! అని ఆగిపోయాడతను. యెస్, రిజైన్
చేస్తున్నాను చాలా నింపాదిగా చెప్పాడు రిషి. బట్ వై అన్నాడు సంజయ్ ఆశ్చర్యపోతూ. కారణాలు అడగొద్దు ప్లీస్ అన్నాడు రిషి. సరే అని అక్కడ్నుంచి కదిలాడతను.

వాకర్ సాయంతో మెల్లగా కిటికీ దగ్గరకు నడిచాడు. సాయం సంధ్య వేళ కావడంతో ఆకాశంలో పక్షులు గుంపులుగా ఎగురుతూ తమ గూటికి చేరుకునే తొందరలో
ఉన్నాయి. సూర్యుడు ఎప్పటి కంటే ఎర్రగా ఉన్నాడు. అతనికి ముత్యాలముగ్గులో రావుగోపాలరావు డైలాగ్ గుర్తొచ్చి నవ్వుకున్నాడు. ఇంతలో ఫోన్ మోగడంతో కాల్ అటెండ్ చేసాడు. హలో అని అటు నుంచి జేమ్స్. చెప్పు అన్నాడు రిషి. రిజైన్ చేసావంట! ఏమైందిరా నీకు? హాస్పిటల్'కి వస్తున్నాను. మాట్లాడుదాం అని
ఫోన్ పెట్టేసాడు జేమ్స్.

రిషికి కాస్తో కూస్తో క్లోస్ అంటే అతనొక్కడే. గత ఆరేళ్లుగా ఇద్దరూ ఒకే కంపెనీలో కలిసి పని చేయటం, ఇద్దరికీ డ్రింక్స్, బుక్స్ కామన్ ఇంట్రెస్ట్ కావటం వల్ల ఈజీగా ఫ్రెండ్స్ అయ్యారు. 'ఏంట్రా, ఏమైంది' వస్తూనే అడిగాడు జేమ్స్. ఏం లేదు. బ్రేక్ కావాలనిపించింది అంతే
అన్నాడు కిటికీ నుంచి బయటకు చూస్తూ. ఇంతలో నర్స్ వచ్చి పడుకోండి ఇంజెక్షన్ చెయ్యాలి అనటంతో జేమ్స్ పక్కకు జరిగాడు. ఆమె వెళ్లిపోగానే ల్యాప్ టాప్ బ్యాగ్ నుంచి వాటర్ బాటిల్ తీసి ఇదిగో తాగు అన్నాడు. రిషి బాటిల్ అందుకోగానే ఇది వాటర్ కాదు, వోడ్కా, జాగ్రత్తగా తాగు అన్నాడు మెల్లగా. ఇక్కడ
ఎందుకురా అన్నాడు రిషి. నాకు హాస్పిటల్ స్మెల్ పడదు సో, రెండు పెగ్గులేసి నీకు కూడా తీసుకొచ్చాను. తాగు పర్లేదు అన్నాడు బ్యాగ్ నుంచి మూంగ్ దాల్ ప్యాకెట్ తీస్తూ. అరే, స్పెషల్ వార్డుని బార్ చేయకు, నువ్వు బయలదేరు అన్నాడు బాటిల్ తిరిగిచ్చేస్తూ. సరే, రేపు డిశ్చార్జ్ చేస్తారట కదా! కాల్
చెయ్ వచ్చి ఇంటికి తీసుకెళ్తాను బై అని వెళ్ళిపోయాడు జేమ్స్.

'అతను రాత్రే వెళ్ళిపోయాడు. మాతో ఏం చెప్పలేదు. ఏదో ట్యాక్సీ వచ్చింది. వెళ్లే ముందు మాకు థాంక్స్ చెప్పి అందరికీ డబ్బులిచ్చాడు' హెడ్ నర్స్ చెప్తోంటే జేమ్స్'కి ఏం అర్ధం కాలేదు. రిషి ఫోన్ కూడా స్విచ్డ్ ఆఫ్ వస్తోంది.
***********************

చీకటిని చీల్చుకుంటూ కారు అరకు వైపు పరిగెడుతోంది. డ్రింక్ సిప్ చేస్తోంటే గత నాలుగేళ్ళ జీవితం రిషి కళ్ళ ముందు మెదలసాగింది. ఎందుకంటే అతని తల్లిదండ్రులు చనిపోయి నాలుగేళ్ళయింది. అది మరువక ముందే ప్రేమించినమ్మాయి కూడా దూరం అయ్యింది. హైదరాబాద్ కన్నా
ఇక్కడ చలి బాగా ఎక్కువ సార్ అన్నాడు డ్రైవర్. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీస్తూ విండో దించండి అన్నాడు రిషి. గట్టిగా దమ్ములాగి వదులుతుంటే శ్వేతతో పాటు తనతో జరిగిన చివరి సంభాషణ కూడా గుర్తొచ్చింది.

'ఏ అమ్మాయి అయినా మంచి ఫ్యామిలీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉన్న లైఫ్ కోరుకుంటుంది రిషి.
అది నీకు తెలియంది కాదు. మన పెళ్లికి మా వాళ్ళు ఒప్పుకోరు' అని ఆమె అంటుంటే మరి ప్రేమించానన్నావ్ అడిగాడతను. ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారా? అని ఆమె కొనసాగించబోతుంటే అతను అడ్డుపడి 'మరి ప్రేమ దేనికి'? అని అడిగాడు. ఆమె ఏం మాట్లాడకపోయేసరికి అతను వెళ్ళిపోయాడు.

సార్, చాయ్
తాగుదామా అని డ్రైవర్ అనేసరికి ఆలోచనల్లోంచి బయటపడ్డాడు రిషి. మీరు తాగి రండి అంటూ మరో పెగ్ ఫిక్స్ చేసుకున్నాడతను. అమ్మా నాన్న చనిపోయాక అతనెప్పుడూ మళ్ళీ సొంతూరు వెళ్ళలేదు.. ఇకపై వెళ్ళడు. ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి అతనికి ఏడాది పైనే సమయం పట్టింది. ఆ తరువాత పూర్తిగా ఇంట్రవర్ట్
అయిపోయాడు. అన్నవరం దాటుతుంటే రిషికి ఆకలేసింది. ఏదైనా దాబా కనిపిస్తే ఆపండి అన్నాడు ఖాళీ సీసా బయటకు పడేస్తూ. సరే సార్ అన్నాడు డ్రైవర్. ఓ హోటల్ కనిపిస్తే ఇద్దరూ తిన్నారు. మళ్ళీ ప్రయాణం కొనసాగింది. 'Welcome To The City Of Destiny' బోర్డు వైపు చూస్తూ సిగరెట్ వెలిగించాడు రిషి. రేయి
మూడో జాము కావడంతో నగరం నిద్రమత్తులో జోగుతోంది. దూరం నుంచి సముద్రపు అలల హోరు చెవిని తాకుతోంటే రాజు, బీచ్ దగ్గరే ఉందనిపిస్తోంది వెళదాం పద అన్నాడు డ్రైవర్'తో. అతను ముందు కొంచెం ఆశ్చర్యపోయినా సరే సర్ అని మ్యాప్ ఆన్ చేసాడు.

తనలో ఎన్నో రహస్యాల్ని, కల్లోలాన్ని దాచుకున్న సముద్రానికీ,
వాటితో పాటు ఎన్నో అనుభవాలను, అనుభూతులను రహస్యంగా దాచుకున్న మనిషికీ పెద్ద తేడా లేదనుకున్నాడు కాళ్ళను ముద్దాడి వెనక్కి వెళ్లిపోతున్న అలలను చూస్తూ. ఇంతలో ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి పక్కకి తిరిగి చూసాడు. హాయ్ అంది ఎదురుగా నిలబడ్డ అమ్మాయి. ఆశ్చర్యపోతూ వేళ్ళ మధ్య మండుతున్న సిగరెట్ని
పడేసాడు. హా.. అన్నాడు. ఆ కార్ మీదేనా అడిగింది మెల్లగా. కాదు హైర్ చేసుకున్నాను అన్నాడు. సరే, మీరెటు వెళ్తున్నారు? అంది. అరకు.. ఏం? అన్నాడు. నేను పెద్ద ప్రాబ్లమ్'లో ఉన్నాను. నాకు హెల్ప్ చేస్తారా అంది రిక్వెస్ట్ చేస్తున్నట్టు. దూరం నుంచి వీళ్లను గమనించిన రాజు పరిగెత్తుకుంటూ వచ్చి
ఏమైంది సార్? అన్నాడు. ఏం లేదు, మీరు వెహికల్ దగ్గర ఉండండి అన్నాడు రిషి.

మా మావయ్య వాళ్ళింట్లో నుంచి వచ్చేసి ఇక్కడే సితమ్మధార'లో ఫ్రెండ్ ఫ్లాట్'లో ఉంటూ జాబ్ చేసుకుంటున్నాను. కానీ వాళ్ళు ఇక్కడకీ వచ్చేసారు అని ఆగింది. మరి పోలీస్ స్టేషన్'కి వెళ్లాల్సింది కదా అన్నాడు. వాళ్లంతా మా
మావయ్యకు తెలిసిన వాళ్లే. నాకు హెల్ప్ చేయరు అని తలదించుకుంది. సరే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఏమో తెలియదు అంది ఏడుస్తూ. పోనీ మీకు తెలిసిన వారెవరైనా ఉంటే చెప్పండి అక్కడ డ్రాప్ చేస్తాను అన్నాడు అనునయంగా. తలెత్తి అతని వైపు చూసి నేను మీతో వస్తాను. ఏదైనా ఉద్యోగం చూసుకుని తరువాత
వెళ్లిపోతాను అంది బ్రతిమలాడుతున్నట్టు. అటాచ్మెంట్స్ వద్దనుకుంటే ఇదేంటి మళ్ళీ అనుకుని సరే పదండీ అన్నాడు.

మా అమ్మానాన్నలకు నేనొక్కతినే. నా చిన్నతనంలోనే వాళ్ళు ఆక్సిడెంట్లో చనిపోయారు. అప్పట్నుంచి మావయ్య దగ్గరే పెరిగాను. నాకిష్టం లేకపోయినా వాళ్ళ కొడుకుతో పెళ్లి చేయాలని చూసాడు అని
ఆగి రిషి ఇచ్చిన మంచి నీళ్ళ బాటిల్ తీసుకుని తాగింది. అర్ధమైందండీ అన్నాడు.
మీరెక్కడకి వెళ్తున్నారు అంది నెమ్మదిగా. సూసైడ్ చేసుకోవటానికి అన్నాడు. వెనుక సీట్లో ఉన్న ఆమె కంగారుపడిందని అర్ధమై కంగారుపడకండీ ఊరికే అన్నానని చిన్నగా నవ్వేడు. ఆమె ఏం మాట్లాడలేదు. కాసేపయ్యాక ఒకటి అడగనా అంది.
అడగండి అన్నాడు. మీ కాలికి ఏమైంది అంది. చిన్న యాక్సిడెంట్ అన్నాడు. వెంటనే మీకెవరూ లేరు కదా అని అడిగింది. రాజు కారాపు అన్నాడు. ఆమె భయపడసాగింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అని వాకర్ తీసుకుని హోటల్ వైపు నడవసాగాడు.

తినటం అయ్యాక కాఫీ? అని అడిగాడు. హా అని అతని వైపే చూస్తోందామె.
ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎగరేశాడు. ఏం లేదు అంది. చెప్పండి పర్లేదన్నాడు. నేను మీకు భారం కాను కదా? అని తలదించుకుంది. పరిచయం లేని నాతో వచ్చేంత ధైర్యం ఉన్న నిన్ను చూస్తే మంచి ఫీలింగ్ కలుగుతోంది. నాతో ఉండిపోతావా అని అడగాలనుంది, కానీ.. అని ఆగిపోయాడు. ఆమె కూడా ఏం మాట్లాడలేదు. కాసేపు
ఇద్దరి మధ్య మౌనం తాండవించింది. 'నిన్న చూసిన ఉదయం కాదిది' పాట ఎక్కడి నుంచో వినిపిస్తోంటే వెళదామా అన్నాడు. సరే అని అతడిని నెమ్మదిగా అనుసరించింది.

డోర్ తీసి పట్టుకుని కూర్చోండి అన్నాడు. థాంక్యూ అని సీటు చివరికి జరిగి కూర్చుని మీరు కూడా ఇక్కడే కూర్చోండి అంది. డ్రైవర్ ముసిముసిగా
నవ్వుకోవడం రిషి గమనించాడు. రండి అని ఆమె మళ్ళీ అనేసరికి మొహమాటపడుతూనే కూర్చున్నాడు.

పక్కకు తిరిగి ఆమె వైపు చూస్తూ 'ఇంతకీ మీ పేరు చెప్పలేదు' అన్నాడు.

'పద్మప్రియ' అంది గాలికి ఎగురుతున్న ముంగురులను సరిచేస్తూ.

కథ: ఆమెతో నా ప్రయాణం..

హరీష్ మీనన్ ద్వారా

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with black

black Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @27dots_

9 Nov
అద్దం ముందు నిలబడి ఆమె తన ప్రతిబింబాన్ని చూస్తూ చేత్తో దాన్ని తాకుతోంటే సరిగ్గా అప్పుడే దూరం నుంచి "వేణువై వచ్చాను భువనానికి" పాట వినిపిస్తోంది. సిట్యుయేషనల్ సాంగ్ అంటే ఇదేనేమో! కంటి కింద చారలు వెక్కిరిస్తోంటే నీరసంగా నవ్విందామె. నిజానికి స్త్రీ జీవితం ముప్పై ఐదు ఏళ్ళు నిండాకే
మొదలవుతుందని ఎక్కడో చదివిన జ్ఞాపకం. 'మరి నేనెందుకు ముప్పై ఆరేళ్లకే జీవితం ముగించాలనుకుంటున్నాను?' అని ఆలోచిస్తుంటే తన పన్నెండేళ్ల వైవాహిక జీవితం ఆమె కళ్ళ ముందు కదలాడింది.

'నేనేదైనా ఫ్రాంక్'గా మాట్లాడతాను. నువ్వు కూడా నాతో అలానే ఉండాలి సరేనా' అని మొదటిరాత్రి భర్త తనతో అన్నప్పుడు
మంచి మొగుడు అని తెగ మురిసిపోయి తొమ్మిదో తరగతిలో తనకు లవ్ లెటర్ రాసిన సూరిబాబుతో మొదలుపెట్టి డిగ్రీలో తను ఇష్టపడ్డ ఆనంద్ వరకు అన్నీ చెప్పేసింది. నవ్వుతూ ఆమె చెప్పేవి విన్న అతను మనసులో ఏమనుకుంటున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో అప్పుడు పసిగట్టలేకపోయిందామె.

'ఏదో ఉద్యోగం ఉందని కట్నం
Read 25 tweets
3 Nov
"చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలని కలలుగన్న ఇరవై రెండేళ్ల కుర్రాడు తనే ఒక చరిత్రను సృష్టిస్తాడని ఆనాడు ఊహించలేదు."

చిరంజీవి కెమెరాను ఫేస్ చేసిన మొదటి సినిమా పునాది రాళ్లు, కానీ విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. ఈ రెంటికీ నిర్మాత క్రాంతికుమార్ కావటం విశేషం. 78లో బాపుగారి మనవూరి
పాండవులు షూట్ జరుగుతున్నప్పుడు చిరంజీవి అక్కడున్న గడ్డి, మన్ను తీసి ఒంటి మీద పూసుకున్నారు. ఇది గమనించిన లక్ష్మీ దీపక్ (AD) ఏం చేస్తున్నావ్ అని అడిగితే 'పొలం పని చేసొచ్చినట్టు కనిపించాలి కదండీ, అందుకే..' అని చిరంజీవి చెప్పగానే నువ్వు గొప్ప నటుడవుతావ్ అని ప్రశంసించారు. తరువాత ఆయనతో
'ధైర్యవంతుడు' లాంటి హిట్ సినిమా చిరంజీవి చేశారు.

షూటింగ్లో బ్రేక్ దొరికితే సాధారణంగా ఆర్టిస్టులు పేకాడతారు లేదా వేరే కథలు వింటారు. కానీ చిరంజీవి మాత్రం మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేసేవారు.. తన తోటి నటీనటులను ఎంటర్టైన్ చేసేవారు. ఇవన్నీ గమనిస్తున్న క్రాంతికుమార్ గారు చిరంజీవిని
Read 25 tweets
2 Nov
నా జీవితంలోంచి అతన్ని పంపేయటం చాలా సులువుగా జరిగింది. కానీ నా ఆలోచనల్లోంచి..!? ప్రేమంటే అవతలి వ్యక్తి బలాన్ని, బలహీనతను ప్రేమించడం. మరి అతన్ని నేను ఇన్నాళ్లు ప్రేమించలేదా? ప్రేమించి ఉంటే వదిలేసేదాన్నా?

వీకెండ్ కదా ఏంటి ప్రోగ్రాం? అని కృష్ణకు కాల్ చేస్తే నథింగ్ నువ్వే చెప్పు
అన్నాడు. సరే, మా రూమ్మేట్స్ ఈ రోజు తిరుపతి వెళ్తున్నారు. మార్నింగ్ వచ్చేయి. కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. లంచ్ నీకు ఇష్టమైన మటన్ బిర్యానీ చేసి పెడతాను. సరేనా అన్నాను. ఓకే బంగారం అన్నాడు సినీ ఫక్కీలో.

రాత్రి చాలా సేపు కృష్ణతో చాట్ చేయటం వల్ల లేచేసరికి ఎనిమిదిన్నర అయ్యింది. ఇప్పుడు
వచ్చేస్తాడు! అనుకుంటూ ఫ్రెష్ అవుతూ కిచెన్'లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఇంతలో డోర్ బెల్ మోగింది. కృష్ణ! అనుకుంటూ తలుపు తీసాను. 'ఈ నెల మెయింటెనన్స్ బిల్ మేడమ్' అని ఎదురుగా నిలబడి ఉన్నాడు సెక్యూరిటీ గార్డ్. సరే, నువ్వెళ్ళు అని డోర్ వేసి కృష్ణకు కాల్ చేసాను. వెయిటింగ్ అంటోంది.
Read 22 tweets
1 Nov
ఐశ్వర్యరాయ్.

ప్రపంచ సుందరిగా, చక్కని నటిగా చాలా మందికి తెలుసు. కానీ ఒక 'Abusive Relationship' నుంచి బయటపడి, మీడియా వేధింపులు ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన విజేత ఆమె.

ఒక సినిమా షూట్ సందర్భంగా సల్మాన్ ఖాన్'తో ప్రేమలో పడిన ఐశ్వర్య "తాళ్" లాంటి సూపర్ హిట్స్ రావడంతో పరిశ్రమలో చక్కగా
నిలదొక్కుకుంది. అప్పుడే సల్మాన్ ఖాన్ అభద్రతాభావం కూడా బయటపడసాగింది. షారుఖ్ ఖాన్'తో నటించడానికి వీల్లేదు" అన్న సల్మాన్ ఖాన్ ఆదేశాన్ని బేఖాతరు చేయడంతో "చల్తే చల్తే" షూటింగ్ స్పాట్'కి వెళ్లి ఆమెను కొట్టడమే కాక అక్కడ నుంచి ఆమెను బరబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కార్'లో పడేసాడు సల్మాన్.
ఆ మరుసటిరోజు యధావిధిగా షూట్'కి వెళ్లిన ఆమెతో "మిమ్మల్ని లోనికి రానివద్దని చెప్పారమ్మ. మీ స్థానంలో రాణీ ముఖర్జీని తీసుకున్నారు" అన్న వాచ్ మేన్ మాటలు ఆమెలో తీవ్ర నిరాశ కలిగించినా, సల్మాన్ ఖాన్ని వదిలించుకోవాలి అని అప్పుడే దృఢంగా నిర్ణయించుకుంది.

అదే సమయంలో వివేక్ ఒబెరాయ్ లాంటి
Read 7 tweets
24 Oct
'నీ ఉనికిని కాపాడుకోవాలంటే ఒకటి నువ్వు గొప్పగా బ్రతుకు లేదా వేరే వారి బ్రతుకును కించపరుచు. ఈ రెండూ ప్రపంచానికి తెలియాలంటే అటెన్షన్ అవసరం'
౼ హరీష్ మీనన్

ట్విటర్ వల్ల ఉపయోగాలు ఏంటి? తమ తమ భావాలను వ్యక్తపరచటానికి ఒక చక్కని వేదిక. చాలా మంది ఇంట్రవర్ట్స్ తమ పేర్లు మార్చుకుని ఇక్కడ
చెలరేగిపోతుంటారు. నా లోంటోళ్లు ఏదైనా ఆలోచన వస్తే కథ, కవితా రూపంలో ఇక్కడ ట్వీట్ చేస్తుంటారు. మన సోషల్ సైడ్ బయటపెట్టే ప్లేస్ మాత్రమే కాకుండా తమలా ఆలోచించే మరో వ్యక్తి ఈ భూమ్మీద ఉన్నారా? అని తెలుసుకోవటానికి ఉపయోగపడే ఒక మాధ్యమం ట్విటర్.

ఈ మధ్య ఒక వ్యక్తితో సంవాదం జరిగినప్పుడు
'ఎన్నడైనా పిల్లికి బిచ్చం వేశావా' అని అడిగాడు. సాయం చేస్తే ఇక్కడ ట్విట్టర్లో పెడితేనే అది సాయం అన్న ఒకరకమైన స్టేట్ ఆఫ్ మెంటల్ థింకింగ్'లో ఉన్నాడు అని అర్ధమైంది. అతని నేపథ్యం (pun intended) నాకు తెలుసు కాబట్టి నేను అతన్ని తప్పుపట్టను. ఒకరి వ్యక్తిత్వాన్ని కొలవటానికి డబ్బు సాయాన్ని
Read 10 tweets
23 Oct
విషయాన్ని బోధించే వాడు ఉపాధ్యాయుడు అయితే విషయాన్ని తార్కికంగా ఆలోచించేలా చేసే వాడు గురువు.

గరికపాటి నరసింహారావుగారి లాంటి అవధానులు, గురువులు నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు, దైనందిన జీవనంలో అప్లై చేసుకోవచ్చు. 'నేను ఆయన చెప్పేది నమ్మను, మా ఇంట్లో ఇలా చెయ్యం' అని మీరంటే అది మీ
ఖర్మ అంటాను. ఆ మధ్య మెడిసిన్ చేసిన బ్రాహ్మణ అమ్మాయి 'కేరళ వాళ్లకు హిందూ మతం మీద ఇంత ద్వేషం ఎందుకు' అని కామెంట్ చేసింది. కేరళ వాళ్లంతా క్రిస్టియన్స్ అని ఆ అమ్మాయి ఉద్దేశ్యం. నేను కల్పించుకునే సరికి కాసేపు వాదించి నన్ను బ్లాక్ చేసింది. ఇలాంటి సూక్ష్మజీవులు వేరే బావి తవ్వుకుని అక్కడ
బతకాలి. దేనికి పనికొచ్చింది ఆ డాక్టర్ చదువు?

గరికపాటిగారు చెప్పేదంతా నిజమే అని నేను అనను. చాలా విషయాల మీద ఆయనకున్న పరిజ్ఞానాన్ని తార్కిక బుద్దితో విశ్లేషించి వివరిస్తారు. ఏది మంచిది అన్నది మన విజ్ఞతకే వదిలేస్తారు. ఉదాహరణకు అమ్మాయిల వస్త్రధారణ గురించి ఆయన చేసిన ప్రసంగం నాకు
Read 5 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(