black Profile picture
9 Nov, 26 tweets, 4 min read
అద్దం ముందు నిలబడి ఆమె తన ప్రతిబింబాన్ని చూస్తూ చేత్తో దాన్ని తాకుతోంటే సరిగ్గా అప్పుడే దూరం నుంచి "వేణువై వచ్చాను భువనానికి" పాట వినిపిస్తోంది. సిట్యుయేషనల్ సాంగ్ అంటే ఇదేనేమో! కంటి కింద చారలు వెక్కిరిస్తోంటే నీరసంగా నవ్విందామె. నిజానికి స్త్రీ జీవితం ముప్పై ఐదు ఏళ్ళు నిండాకే
మొదలవుతుందని ఎక్కడో చదివిన జ్ఞాపకం. 'మరి నేనెందుకు ముప్పై ఆరేళ్లకే జీవితం ముగించాలనుకుంటున్నాను?' అని ఆలోచిస్తుంటే తన పన్నెండేళ్ల వైవాహిక జీవితం ఆమె కళ్ళ ముందు కదలాడింది.

'నేనేదైనా ఫ్రాంక్'గా మాట్లాడతాను. నువ్వు కూడా నాతో అలానే ఉండాలి సరేనా' అని మొదటిరాత్రి భర్త తనతో అన్నప్పుడు
మంచి మొగుడు అని తెగ మురిసిపోయి తొమ్మిదో తరగతిలో తనకు లవ్ లెటర్ రాసిన సూరిబాబుతో మొదలుపెట్టి డిగ్రీలో తను ఇష్టపడ్డ ఆనంద్ వరకు అన్నీ చెప్పేసింది. నవ్వుతూ ఆమె చెప్పేవి విన్న అతను మనసులో ఏమనుకుంటున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో అప్పుడు పసిగట్టలేకపోయిందామె.

'ఏదో ఉద్యోగం ఉందని కట్నం
కూడా తక్కువే తీసుకున్నాం. అప్పటికీ చెప్పాను చదువు, ఉద్యోగం ఉన్న పిల్ల వద్దురా అని. వింటేనా వాడు!" తమ ప్రహరీ గోడకు అటువైపునున్న పద్మజతో అత్తగారు అన్న మాటలు ఆఫీసుకి తయారవుతున్న ప్రణవి చెవిన పడ్డాయి. ఆమె గుండె చివుక్కుమంది. వివాహానికి ముందు తెల్లవారుజామున ఇంట్లో వినిపించే సుప్రభాతం
బదులు ఆమెకిక్కడ అత్తగారి సూటిపోటి మాటలు వినిపించసాగాయి. 'అత్తగారింట్లో ఎవరేమన్నా నువ్వు అణిగిమణిగుండాలని' యుక్త వయసు నుంచే ఆమె మెదడు ప్రోగ్రామ్డ్ చేయటం వల్ల ఆదేశాలు తీసుకోవటమే తప్ప అభిప్రాయాలను చెప్పలేదామె. వెళ్ళొస్తానత్తయ్య అని 'యాక్టివా' తీస్తుంటే ఆవిడేం మాట్లాడలేదు.
పాపను స్కూలులో డ్రాప్ చేసి ఆఫీస్'కి బయలుదేరింది ప్రణవి.

శేఖర్ క్యాంప్ నుంచి రాగానే అత్తయ్య గురించి ఓ సారి మాట్లాడాలనుకుంటూ తల వెనక్కి వాల్చి తన ఆఫీస్ సీలింగ్ వైపు చూస్తోంది. ఏంటండీ! ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు! అని వినిపించి వెంటనే సర్దుకుని కూర్చుంది. ఎదురుగా నవ్వుతూ కమల్.
సేమ్ డిపార్ట్మెంట్ కాకపోయినా గత నాలుగేళ్లుగా ఒకే బ్రాంచ్'లో జాబ్ చేయటం వలన ఇద్దరి మధ్య చక్కని స్నేహం ఉంది. ఏం లేదు కమల్ అంది చిన్నగా నవ్వేస్తూ. ఏదో ఉందని అర్ధమైంది. పదండీ భోం చేస్తూ మాట్లాడుకుందాం. మీ క్యారియర్'లో ఏముందో చూస్తాను అన్నాడు నవ్వుతూ.

ఇలాంటి సమస్యలు ప్రతీ ఇంట్లో
ఉంటాయి. ఒక సారి శేఖర్తో మాట్లాడి చుడండి అన్నాడు చేయి కడుక్కుంటూ. నేనూ అదే ఆలోచిస్తున్నాను అంది ప్రణవి. మాట్లాడేయండి అన్నాడు కమల్. 'అండీ' అనొద్దని ఎన్ని సార్లు చెప్పాను నీకు అంది కొంచెం కోపం నటిస్తూ. ఏమోనండీ అలా అలవాటైపోయింది పైగా నా కన్నా మూడేళ్లు పెద్ద కదా మీరు అన్నాడు లంచ్
బాక్స్ బ్యాగ్'లో పెడుతూ. ఇంకా నయం అక్కా అని పిలవలేదని నవ్వింది ప్రణవి. సరే బై అని డైనింగ్ రూమ్ నుండి బయటకు వెళుతూ ఆగి వెనక్కి తిరిగి థాంక్స్ అన్నాడు. దేనికీ అన్నట్టు చూసింది అతని వైపు. గోంగూర పప్పు చాలా బావుంది. మా అమ్మ గుర్తొచ్చింది అన్నాడు.

ప్రణవి చెప్పిందంతా విని ఇప్పుడేం
చేయమంటావ్ ఐతే అన్నాడు శేఖర్. మన విషయాలు వేరే వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పండి అందామె షర్ట్ ఇస్త్రీ చేస్తూ. అత్తాకొడలు ఉన్న దగ్గర ఇవన్నీ మామూలే కదా. నువ్వే కొంచెం అడ్జస్ట్ అవ్వు అన్నాడు లాప్టాప్ నుంచి తలెత్తకుండా. "ఎవరికీ ఏదీ మామూలు కాదు శేఖర్" అని గట్టిగా అరవాలనిపించినా వేడిగా ఉన్న
ఐరన్ బాక్స్ సోల్ ప్లేట్ మీద కోపంగా నీళ్లు చల్లి సరే అంది.

మరుసటి రోజు టీ బ్రేక్'లో కమల్ మన అకౌంట్స్ శేషగిరిగారమ్మాయి పెళ్లికి వస్తున్నారా అని అడిగాడు. కుదరకపోవచ్చు కమల్ ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ అంది ప్రణవి. ఆయన కూడా ఉండరు. అత్తయ్య ఒక్కరే ఉంటారు సో.. అని ఆగింది. సరే ట్రై
చేయండి. నాకైతే ఈ పెళ్లి వంకతో మా ఇంటికి కూడా వెళ్లే ఛాన్స్ దొరికింది.. కుదిరితే రండి మా ఇంటికి కూడా వెళదాం. మా నాన్నగారిని పరిచయం చేస్తాను అన్నాడతను ఆయనతో మాట్లాడి చూస్తాను బై అని వెళ్ళిపోయింది. శేఖర్ని అడిగి చూడాలి, నాకూ బ్రేక్ కావాలనిస్తోందనుకుంటూ ఇంటికొచ్చేసరికి పాప హోమ్
వర్క్ చేస్తోంది. అత్తయ్య కాళ్లకు తైలం రాస్తున్నాడు శేఖర్. ఏంటి లేటు అన్నాడు చాలా మామూలుగా. ఏం లేదండీ అంది హ్యాండ్ బ్యాగ్ టీవీ పక్కన పెడుతూ. ఓహ్.. నేనింకా నీ పాత కాలేజీ "ఫ్రెండ్" ఎవరైనా కలిసారేమో అనుకున్నానన్నాడు ఫ్రెండ్ని ఒత్తి పలుకుతూ. లోపలికి వెళ్లబోతున్న ఆమె ఠక్కున ఆగి వెనక్కి
తిరిగి చూసింది. తన టీనేజ్ కూతురు అయోమయంగా కళ్ళు చిట్లించడం ప్రణవి గమనించింది. అతని ముఖంలో ఏ భావనా లేదు.

కలీగ్ వాళ్ళింట్లో పెళ్లి వైజాగ్ వెళ్ళిరానా అని శేఖర్ని అడిగింది ప్రణవి. నా క్యాంప్ పోస్ట్ పోన్ అయ్యింది. నువ్వెళ్ళిరా అన్నాడు. కొంచెం ఆశ్చర్యపోయినా తరువాత తేరుకుని థాంక్స్
అంది. ఎలా వెళ్తున్నావ్ అనడిగాడు. అందరం కారులో వెళుతున్నాం అని చెప్పింది. అతనేం మాట్లాడలేదు.

ఒక వారం రోజుల తరువాత..

ఐపీసీ సెక్షన్ 497 కింద మీ వారు విడాకులు కోరుతున్నారు. మీరేమంటారని లాయర్ అనగానే "నేనే తప్పు చేయలేదు" అంది ప్రణవి సూటిగా అతని వైపు చూసి. చూడమ్మా, నువ్వొప్పుకుంటే
కోర్టు బయటే సెటిల్ చేద్దాం అండ్ ఆయన చేస్తున్న ఆరోపణలు తప్పని రుజువు చేయగలవా? అన్నాడు లాయర్. ఆమె మౌనంగా శేఖర్ని చూస్తోంది. "మీకు, మీ సహోద్యోగి కమల్'తో అక్రమ సంబంధం ఉందా" అని లాయర్ అడగ్గానే 'నో" అని గట్టిగా అరిచి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని రోదించసాగింది. మరి అతని కారులో 'మీరు
మాత్రమే వైజాగ్ ఎందుకు వెళ్లారు'? శేఖర్ గొంతు వినబడగానే నిర్లిప్తంగా అతని వైపు చూసింది. చెప్పు అని రెట్టించాడు.

**********

కంపెనీ వెహికల్ ఫుల్ అయిపోయింది నా కారులో వెళదాం రండి అని డోర్ తీసాడు కమల్. సరే అని కూర్చుంది.

తెల్లవారుజామున ముహూర్తం సమయానికి
కళ్యాణమండపం చేరుకున్నారు. ఆ పూట అక్కడే గడిపి సాయంత్రం అచ్యుతాపురం, కమల్ ఊరికి బయలుదేరారు.. అప్పుడే శేఖర్ కాల్ చేస్తే పెళ్లి దగ్గరే ఉన్నాం అని అబద్ధం చెప్పింది ప్రణవి. మరుసటి రోజు తిరిగి వైజాగ్ బీచ్'లో కాసేపు గడిపి హైదరాబాద్ బయల్దేరిపోయారు. కానీ ప్రణవికి తెలియని విషయం
ఏంటంటే శేఖర్ కజిన్ ఒకరు తమను బీచ్'లో చూసిన వెంటనే ఫోటోలు తీసి శేఖర్'కి వాట్సాప్ చేయటం. ఆఫీసులో శేఖర్ కనుక్కుంటే తను కమల్'తో వెళ్లిన విషయం తెల్సింది.

**********

కమల్'తో వెళ్లిన మాట వాస్తవమే కానీ మా మధ్య మీరనుకుంటున్న సంబంధం లేదు. అతను నాకు మంచి స్నేహితుడు
మాత్రమే అని కళ్ళు తుడుచుకుంటూ ఈయన అనుమానిస్తారనే భయంతో నేనబద్ధం చెప్పాను అంతే. "సర్, నాకు విడాకులు కావాలి" అంటున్న శేఖర్ని ప్లీస్ అండీ నన్ను నమ్మండి అని ఆమె బ్రతిమాలుతోంటే అతను నిర్దాక్షిణ్యంగా ఆమెను బయటకు తోసేశాడు. ఈ పరిణామాలన్నీ తెలిసి శేఖర్'తో మాట్లాడటానికి కమల్ ప్రయత్నిస్తే
అతను విన్నవి పచ్చిబుతులు.

'ఎవరి దగ్గర ఉంటావమ్మా' అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు అస్సలు ఆలోచించకుండా "డాడీతో" అని పాప చెప్పేసరికి ప్రణవి మాతృహృదయం ముక్కలైపోయింది. కోర్టు నుంచి బయటకొస్తుంటే కూతురు తన వైపు చూసిన చూపు జీవితాంతం ఆమెను వెంటాడుతుంది.

చూడండీ, మన కంట్రోల్లో లేని
విషయాల గురించి, మనం మార్చలేని విషయాల గురించి ఆలోచిస్తే బాధ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇదిగో కాఫీ తీసుకోండి అని కప్ అందించాడు కమల్. చేయని తప్పుకు శిక్ష మీరు మాత్రమే కాదు నేను కూడా అనుభవిస్తున్నాను. మీకో ఇల్లు దొరికే వరకు ఇక్కడే ఉండండని టవల్ అందించాడు. ప్రణవి మాత్రం హాల్లో గోడకున్న
కృష్ణుడి ఫోటో వైపు మౌనంగా చూస్తోంది. నేను చేసిన తప్పేంటని నిశ్శబ్దంగా ఆ విధాతను నిలదిస్తోంది.

**********

సమస్యల నుండి బయటపడ్డాక ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా? భలే ఉన్నారు మీరు! సమయానికి నేనొచ్చాను కాబట్టి సరిపోయింది.. లేకుంటే? సరే ముందు భోం చేయండని కమల్
ఆహారాన్ని ప్లేటులో సర్దసాగాడు. ఆమె ఆరాధనగా అతని వైపు చూస్తూ కళ్ళు తుడుచుకుంది.

నెలలు గడిచాయి..

ప్రణవి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? కమల్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి ఆమె ఆశ్చర్యపోలేదు. నిన్ను పెళ్లి చేసుకోవటానికి
నాకభ్యంతరం లేదు. కానీ, మూడు కండిషన్స్ ఉన్నాయి.

1. నన్ను "మీరు" అని పిలవడం మానేయ్యాలి
2. నీకిష్టం కదా అని రోజూ గోంగూర పప్పు వండి పెట్టను
3. నువ్వే నా ఫ్లాట్'కి షిఫ్ట్ అవ్వాలి.

రిప్లై సెండ్ చేసాక చిన్నగా నవ్వుకుంది ప్రణవి.

కథ: ప్రణయ కమలం

హరీష్ మీనన్ ద్వారా

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with black

black Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @27dots_

7 Nov
"సర్జరీ అయిపోయింది. మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి. వాకర్ సహాయంతో నడవాలి. కాలి మీద ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు" డాక్టర్ చెప్తోంటే మౌనంగా వింటున్నాడు రిషి. కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర జరిగిన ప్రమాదంలో అతని పాదానికి దెబ్బతగిలింది. స్కాన్ చేసాక ఫ్రాక్చర్ అని తేల్చి ప్లేట్ పెట్టి సర్జరీ
చేశారు.

హాయ్ రిషి, ఎలా ఉందిప్పుడు వస్తూనే హెచ్ ఆర్ మేనేజర్ అడిగాడు. చిన్నగా నవ్వేడు రిషి. డాక్టర్'ని కలిసొస్తున్నాను. రేపు డిశ్చార్జ్ చేస్తాం అంటున్నారు. టికెట్ బుక్ చేయనా అన్నాడు. 'ఎక్కడకి' అని అడుగుదాం అనుకున్నాడు రిషి. కారణం అతనికి ఈ ప్రపంచంలో నా అనే వాళ్ళెవ్వరూ లేరు.
ఇట్స్ ఓకే నేను మేనేజ్ చేస్తాను అన్నాడు. సరే, ఏ అవసరం ఉన్నా కాల్ చెయ్ అని అతను వెళ్లిపోతుంటే సంజయ్ అని పిలిచాడు రిషి. హా చెప్పు అన్నాడు హెచ్ ఆర్ మేనేజర్. నాకు ఇక్కడ అసిస్టెన్స్ అవసరం లేదు అండ్ నా అకౌంట్స్ త్వరగా సెటిల్ చేస్తావా అడిగాడు. యూ మీన్! అని ఆగిపోయాడతను. యెస్, రిజైన్
Read 26 tweets
3 Nov
"చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలని కలలుగన్న ఇరవై రెండేళ్ల కుర్రాడు తనే ఒక చరిత్రను సృష్టిస్తాడని ఆనాడు ఊహించలేదు."

చిరంజీవి కెమెరాను ఫేస్ చేసిన మొదటి సినిమా పునాది రాళ్లు, కానీ విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. ఈ రెంటికీ నిర్మాత క్రాంతికుమార్ కావటం విశేషం. 78లో బాపుగారి మనవూరి
పాండవులు షూట్ జరుగుతున్నప్పుడు చిరంజీవి అక్కడున్న గడ్డి, మన్ను తీసి ఒంటి మీద పూసుకున్నారు. ఇది గమనించిన లక్ష్మీ దీపక్ (AD) ఏం చేస్తున్నావ్ అని అడిగితే 'పొలం పని చేసొచ్చినట్టు కనిపించాలి కదండీ, అందుకే..' అని చిరంజీవి చెప్పగానే నువ్వు గొప్ప నటుడవుతావ్ అని ప్రశంసించారు. తరువాత ఆయనతో
'ధైర్యవంతుడు' లాంటి హిట్ సినిమా చిరంజీవి చేశారు.

షూటింగ్లో బ్రేక్ దొరికితే సాధారణంగా ఆర్టిస్టులు పేకాడతారు లేదా వేరే కథలు వింటారు. కానీ చిరంజీవి మాత్రం మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేసేవారు.. తన తోటి నటీనటులను ఎంటర్టైన్ చేసేవారు. ఇవన్నీ గమనిస్తున్న క్రాంతికుమార్ గారు చిరంజీవిని
Read 25 tweets
2 Nov
నా జీవితంలోంచి అతన్ని పంపేయటం చాలా సులువుగా జరిగింది. కానీ నా ఆలోచనల్లోంచి..!? ప్రేమంటే అవతలి వ్యక్తి బలాన్ని, బలహీనతను ప్రేమించడం. మరి అతన్ని నేను ఇన్నాళ్లు ప్రేమించలేదా? ప్రేమించి ఉంటే వదిలేసేదాన్నా?

వీకెండ్ కదా ఏంటి ప్రోగ్రాం? అని కృష్ణకు కాల్ చేస్తే నథింగ్ నువ్వే చెప్పు
అన్నాడు. సరే, మా రూమ్మేట్స్ ఈ రోజు తిరుపతి వెళ్తున్నారు. మార్నింగ్ వచ్చేయి. కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. లంచ్ నీకు ఇష్టమైన మటన్ బిర్యానీ చేసి పెడతాను. సరేనా అన్నాను. ఓకే బంగారం అన్నాడు సినీ ఫక్కీలో.

రాత్రి చాలా సేపు కృష్ణతో చాట్ చేయటం వల్ల లేచేసరికి ఎనిమిదిన్నర అయ్యింది. ఇప్పుడు
వచ్చేస్తాడు! అనుకుంటూ ఫ్రెష్ అవుతూ కిచెన్'లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఇంతలో డోర్ బెల్ మోగింది. కృష్ణ! అనుకుంటూ తలుపు తీసాను. 'ఈ నెల మెయింటెనన్స్ బిల్ మేడమ్' అని ఎదురుగా నిలబడి ఉన్నాడు సెక్యూరిటీ గార్డ్. సరే, నువ్వెళ్ళు అని డోర్ వేసి కృష్ణకు కాల్ చేసాను. వెయిటింగ్ అంటోంది.
Read 22 tweets
1 Nov
ఐశ్వర్యరాయ్.

ప్రపంచ సుందరిగా, చక్కని నటిగా చాలా మందికి తెలుసు. కానీ ఒక 'Abusive Relationship' నుంచి బయటపడి, మీడియా వేధింపులు ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన విజేత ఆమె.

ఒక సినిమా షూట్ సందర్భంగా సల్మాన్ ఖాన్'తో ప్రేమలో పడిన ఐశ్వర్య "తాళ్" లాంటి సూపర్ హిట్స్ రావడంతో పరిశ్రమలో చక్కగా
నిలదొక్కుకుంది. అప్పుడే సల్మాన్ ఖాన్ అభద్రతాభావం కూడా బయటపడసాగింది. షారుఖ్ ఖాన్'తో నటించడానికి వీల్లేదు" అన్న సల్మాన్ ఖాన్ ఆదేశాన్ని బేఖాతరు చేయడంతో "చల్తే చల్తే" షూటింగ్ స్పాట్'కి వెళ్లి ఆమెను కొట్టడమే కాక అక్కడ నుంచి ఆమెను బరబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కార్'లో పడేసాడు సల్మాన్.
ఆ మరుసటిరోజు యధావిధిగా షూట్'కి వెళ్లిన ఆమెతో "మిమ్మల్ని లోనికి రానివద్దని చెప్పారమ్మ. మీ స్థానంలో రాణీ ముఖర్జీని తీసుకున్నారు" అన్న వాచ్ మేన్ మాటలు ఆమెలో తీవ్ర నిరాశ కలిగించినా, సల్మాన్ ఖాన్ని వదిలించుకోవాలి అని అప్పుడే దృఢంగా నిర్ణయించుకుంది.

అదే సమయంలో వివేక్ ఒబెరాయ్ లాంటి
Read 7 tweets
24 Oct
'నీ ఉనికిని కాపాడుకోవాలంటే ఒకటి నువ్వు గొప్పగా బ్రతుకు లేదా వేరే వారి బ్రతుకును కించపరుచు. ఈ రెండూ ప్రపంచానికి తెలియాలంటే అటెన్షన్ అవసరం'
౼ హరీష్ మీనన్

ట్విటర్ వల్ల ఉపయోగాలు ఏంటి? తమ తమ భావాలను వ్యక్తపరచటానికి ఒక చక్కని వేదిక. చాలా మంది ఇంట్రవర్ట్స్ తమ పేర్లు మార్చుకుని ఇక్కడ
చెలరేగిపోతుంటారు. నా లోంటోళ్లు ఏదైనా ఆలోచన వస్తే కథ, కవితా రూపంలో ఇక్కడ ట్వీట్ చేస్తుంటారు. మన సోషల్ సైడ్ బయటపెట్టే ప్లేస్ మాత్రమే కాకుండా తమలా ఆలోచించే మరో వ్యక్తి ఈ భూమ్మీద ఉన్నారా? అని తెలుసుకోవటానికి ఉపయోగపడే ఒక మాధ్యమం ట్విటర్.

ఈ మధ్య ఒక వ్యక్తితో సంవాదం జరిగినప్పుడు
'ఎన్నడైనా పిల్లికి బిచ్చం వేశావా' అని అడిగాడు. సాయం చేస్తే ఇక్కడ ట్విట్టర్లో పెడితేనే అది సాయం అన్న ఒకరకమైన స్టేట్ ఆఫ్ మెంటల్ థింకింగ్'లో ఉన్నాడు అని అర్ధమైంది. అతని నేపథ్యం (pun intended) నాకు తెలుసు కాబట్టి నేను అతన్ని తప్పుపట్టను. ఒకరి వ్యక్తిత్వాన్ని కొలవటానికి డబ్బు సాయాన్ని
Read 10 tweets
23 Oct
విషయాన్ని బోధించే వాడు ఉపాధ్యాయుడు అయితే విషయాన్ని తార్కికంగా ఆలోచించేలా చేసే వాడు గురువు.

గరికపాటి నరసింహారావుగారి లాంటి అవధానులు, గురువులు నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు, దైనందిన జీవనంలో అప్లై చేసుకోవచ్చు. 'నేను ఆయన చెప్పేది నమ్మను, మా ఇంట్లో ఇలా చెయ్యం' అని మీరంటే అది మీ
ఖర్మ అంటాను. ఆ మధ్య మెడిసిన్ చేసిన బ్రాహ్మణ అమ్మాయి 'కేరళ వాళ్లకు హిందూ మతం మీద ఇంత ద్వేషం ఎందుకు' అని కామెంట్ చేసింది. కేరళ వాళ్లంతా క్రిస్టియన్స్ అని ఆ అమ్మాయి ఉద్దేశ్యం. నేను కల్పించుకునే సరికి కాసేపు వాదించి నన్ను బ్లాక్ చేసింది. ఇలాంటి సూక్ష్మజీవులు వేరే బావి తవ్వుకుని అక్కడ
బతకాలి. దేనికి పనికొచ్చింది ఆ డాక్టర్ చదువు?

గరికపాటిగారు చెప్పేదంతా నిజమే అని నేను అనను. చాలా విషయాల మీద ఆయనకున్న పరిజ్ఞానాన్ని తార్కిక బుద్దితో విశ్లేషించి వివరిస్తారు. ఏది మంచిది అన్నది మన విజ్ఞతకే వదిలేస్తారు. ఉదాహరణకు అమ్మాయిల వస్త్రధారణ గురించి ఆయన చేసిన ప్రసంగం నాకు
Read 5 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Thank you for your support!

Follow Us on Twitter!

:(