black Profile picture
23 Nov, 25 tweets, 4 min read
ఉండు నాన్నతో చెప్తాను నీ సంగతి అని అతన్ని నెట్టేసి ఆమె వేగంగా వెళ్లబోతుంటే అంతే వేగంగా అతనామె రెండు చేతులను పట్టుకుని సున్నితంగా వెనక్కి నెట్టి గోడకు అన్చాడు. ఇద్దరి మధ్య గాలి జొరబడేంత చోటు మాత్రమే ఉంది. బావా మరదళ్లే అయినా అంత దగ్గరగా ఎప్పుడూ లేకపోవడం వలన ఇద్దరిలోనూ రసాయనిక
చర్య మొదలైంది. అతని పెదవులు ఆమె అధరాలను అందుకోవడానికి సమీపిస్తోంటే ఆమె మెల్లగా కళ్లు మూసుకుంది. లేతగులాబీ రంగులో మెరిసిపోతున్న ఆమె పెదాలు వణకడం చూసి చిన్నగా నవ్వుకుంటూ ముద్దు పెట్టబోయాడు. సరిగ్గా అప్పుడే డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో గతం నుంచి వర్తమానంలోకొచ్చాడు శేఖర్. ఒక్కసారి
అటుఇటు చూసి నవ్వుకున్నాడు. సిగరెట్ కాలుస్తూ దొరికిపోయిన రోజు సీతను మొదటిసారిగా ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు వారిద్దరికీ పదహారేళ్లే. ఆమె గుర్తొస్తే అతని పెదాల మీద చిరునవ్వు నాట్యం చేస్తుంది. ఇంతకీ సీత ఎవరో చెప్పలేదు కదూ.. అతని ముద్దుల మరదలు. చిన్నతనం నుంచీ ఇద్దరూ కలిసే
చదువుకున్నారు. బంధుత్వం కూడా ఉండటంతో ఇద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.

సీతతో కల్సి చేసిన అల్లరి, కోతికొమ్మచ్చి ఆటలు, ఊరిచెరువులో ఈత పోటీలు, ఉప్పుకారం నంజుకుని తిన్న మామిడికాయ ముక్కలు అన్నీ శేఖర్ కళ్ళ ముందు రీలులా తిరగసాగాయి. సీతను వదులుకుని తప్పు చేశానా అని గత
పన్నెండేళ్ళుగా మథనపడుతూనే ఉన్నాడతను.

ఒరేయ్ అబ్బాయి, అదేదో పెద్ద సదువే సదివావు. పట్నంలో ఉజ్జోగం సేత్తున్నావ్. ఇంకెందుకు ఆలస్యం? ఆ మూడు ముళ్లేవో తొందరగా ఏసేసి సీతను కూడా తీసుకుపో చుట్ట వెలిగిస్తూ అన్నాడు వెంకటేశ్వర్లు మావయ్య. ఆ రెండు కుటుంబాలకూ ఆయనెంత చెప్తే అంత. శేఖర్ తండ్రి
చెప్పరా మాయ అడుగుతున్నాడు కదా అని సైగ చేయగానే అంటే మావయ్య అదీ మేనరికం చేసుకుంటే పుట్టబోయే బిడ్డలకు ఏదైనా అంగ వైకల్యం రావచ్చు అని డాక్టర్లు చెప్పారు అని ఆగాడు. వెంటనే అక్కడున్న పెద్దోళ్ళందరూ గట్టిగా నవ్వేసి ఒరేయ్ మీ అమ్మ నాన్నది మేనరికమే మరి నీకేం రోగం వచ్చిందిరా!!? అని
లేస్తూ జగన్నాథమ్ అని సీత తండ్రిని పిలిచి రేపు పంతుల్ని పంపిస్తాను మాఘ మాసం వచ్చేస్తోంది కాబట్టి ముహుర్తాలు ఎట్టేసుకోండి అని పొగ వదులుతూ వెళ్ళిపోయాడు వెంకటేశ్వర్లు.

***

తాళ్లరేవు దిగాలండీ అని కండక్టర్ అనటంతో లగేజ్ తీసుకుని బస్ లోంచి కిందకు దిగాడు శేఖర్.
ఊరు చాలా మారిపోయింది అనుకుంటూ ఇంటి వైపు అడుగులేసాడు. గేటు తీసి లోపలికి వెళుతుంటే నాన్న ఏమంటాడో అన్న భయం మొదలైంది. శేఖరం అన్న పిలుపు విని పక్కకు చూసాడు. నాన్న! ఏమనాలో తెలియక అలానే నించున్నాడు. అంతే! శేఖర్ని వాటేసుకుని భోరున ఏడ్చేశాడాయన. నీ సిన్నప్పుడే మీ అమ్మపోతే ఏ లోటు రాకుండా
నిన్ను పెంచితే నన్నొదిలేసి పోతావా అని గట్టిగా పట్టుకుని ఏడవసాగాడు. ఇంతలో జగన్నాథమ్ మావయ్య, చుట్టుపక్కల ఉన్న బంధువులు రాసాగారు. ఏరా మీ ఆవిడ్ని తీసుకురాలేదా అని సుశీలత్త అడుగుతోంటే జగన్నాథమ్ కళ్ళలో అసహనం శేఖర్ గమనించాడు.

*****

మనకు పెళ్లి సెట్ అవ్వదు
సీత. ఎం.టెక్ చేసి పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నువ్వేమో మావయ్య వద్దన్నాడని ఇంటర్'తో చదువాపేశావ్. పైగా మనది మేనరికం! అని పెళ్లి తప్పించుకోవటానికి లాజిక్స్ మాట్లాడుతున్న శేఖర్ వైపు బ్లాంక్'గా చూస్తూ నాతో ఏదైనా చెప్పాలా బావా? అంది. సీత, నిజం చెప్తున్నాను నువ్వంటే నాకిష్టమే గానీ
మా ఆఫీసులో ఒకమ్మాయిని ప్రేమించాను, తనకు కూడా నేనంటే ప్రాణం, పేరు రేఖ. ఏదోలా నువ్వే మన పెళ్లి ఆపాలి ప్లీజ్ అన్నాడు బ్రతిమలాడుతున్నట్టు. ఆమె చిన్నగా నవ్వి బావా, నా చేతిలో ఏం లేదు. చిన్నప్పుడే అనుకున్నారు అని ఆగింది. మరెలా ఇప్పుడు? నిరాశగా అడిగాడు. ఆమె లేచి వెళ్లిపోతూ ఊరు వదిలేసి
వెళ్లిపో బావా. వేరే దారి లేదు అంది. అతను అమాంతం ఆమెను వాటేసుకుని థాంక్స్ సీత నేనూ ఇదే ఆలోచించాను అంటూ ఆమెను పట్టుకుని ఊపేసాడు. కానీ ఒక్కక్షణం అతను ఆమె కళ్ళలోకి చూసుంటే కరిగిన స్వప్నాలు, పగిలిన కలలు కన్నీరుగా మారి ఆమె చెంపల పై జారడం గమనించే వాడు.

****
ఆ మధ్య మన సర్పంచ్ వాళ్ళబ్బాయి నిన్ను బొంబాయిలో కలిసాడంట కదరా! అని మావయ్య అడుగుతుంటే అవును అన్నాడు తల దించుకుని. సీత.. అన్నాడు శేఖర్ మెల్లిగా. ఇంట్లో ఉందిరా పోయి కనబడు. తన పెళ్లి.. అని అడగేలోపే వెళ్తున్నావ్గా వెళ్లి దాన్నే అడుగు అని చేయి కడుక్కుని ఏరా వస్తావా నాతో అని అడిగాడు
జగన్నాథమ్. నువ్వెళ్ళు మావయ్య నేను వస్తాలే అన్నాడు. అయినా మమ్మల్ని వదిలేసి ఇన్నేళ్లు ఎలా ఉన్నావ్రా? అని కూర వడ్డిస్తూ తండ్రి అడుగుతుంటే ఏం మాట్లాడలేదు శేఖర్. ఇంతకీ మీ అవిడెక్కడ? వచ్చేప్పుడు తీసుకు రావాల్సింది కదరా! ఎంతో ఒత్తిడి సేత్తె తప్ప నీ ప్రేమ యవ్వారం మాకు సెప్పలేదురా గీత.
సరేలే ఎల్లి కలిసిరా పో! అని నా కంచం కూడా తీసుకుని లేచాడు నాన్న.

****

అలా ఆ రాత్రి హైదరాబాద్ బయల్దేరిన శేఖర్ తన ఫ్రెండ్ సాయంతో రేఖతో సహా ముంబై వెళ్ళిపోయాడు. అక్కడే గుడిలో పెళ్లి చేసుకుని ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. చురుకైన వాడు కావడంతో అనతికాలంలోనే
గొప్ప స్థాయికి చేరుకున్నాడు. భార్యాభర్తలు కలిసి సొంతంగా కంపెనీ ప్రారంభించారు. ఒకరోజు అనుకోకుండా సర్పంచ్ కొడుకు కలవడంతో తన ఊరు, తన మనుషులు.. సీత అందరూ గుర్తొచ్చారు.

****

సీత గది తలుపు తెరిచే ఉండటంతో మెల్లగా నెట్టాడు. మంచం మీద
పడుకుని ఏదో పుస్తకం చదువుతున్న సీత తల తిప్పి చూసింది. బా.. వా అనుకుంటూ లేచి ఎదురు వెళ్ళింది. ఇద్దరూ కాసేపు మౌనంగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోసాగారు. సీత అని పిలిచాడు శేఖర్.
ఆమె కళ్లు వర్షించటానికి సిద్ధంగా ఉన్న మబ్బుల్లా ఉన్నాయి. ఆమె భుజాలను పట్టుకోగానే సారీ బావ అని కళ్ళు
తుడుచుకుంటూ అక్కడున్న కుర్చీ అతని వైపు నెట్టింది. నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు సూటిగా అడిగాడు శేఖర్. నీకు తెలియదా అని సీత వెంటనే అడిగే సరికి ఛెళ్లున చెంప మీద కొట్టినట్టైంది అతనికి. జీవితం ఆగిపోకూడదు కదా అని పాజ్ ఇచ్చాడు. ఆగిపోయిందని ఎవరు చెప్పారు బావా? నువ్వెళ్ళిపోయాక కాకినాడ
కాలేజీలో జాయిన్ అయ్యాను. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను తరువాత ఏయూలో ఇంగ్లీష్ లిటరేచర్ చేసాను. ట్యూషన్స్ చెప్తున్నాను. చాలా బిజీగా ఉన్నాను. నీ సంగతి చెప్పు బావ. మా అక్క ఎలా ఉంది? అని అతని కళ్ళలోకి చూస్తూ నౌకర్ తెచ్చిన కాఫీ కప్ అందించింది. హా బావుంది అన్నాడు మామూలుగా. తీసుకురాలేదేం
మరి ? అని అడిగింది. మౌనంగా ఉండిపోయాడు. ఆమె కొనసాగించింది. తనను చూడాలంటే మనమే అక్కడకు వెళ్ళాలి కదూ బావా? అంది గద్గద స్వరంతో. అతను షాకయ్యాడు. ఆమెనే చూస్తున్నాడు. నాకు తెలుసు బావా ఆ ఆక్సిడెంట్ న్యూస్ నేను నేషనల్ ఛానెల్లో చూసాను అంది ఏడుస్తూ. అతను ఆమెను ఓదారుస్తుంటే ఒక్కడివే ఆ బాధను
భరిస్తూ ఎలా ఉన్నావ్ బావా ఇన్నేళ్లు అని రోదించసాగింది. సీత ప్లీజ్.. ఈ నిజం ఎవరికీ తెలియదు. నువ్వెవరికీ చెప్పలేదు కదా అన్నాడు. లేదు నేనేవరికీ చెప్పలేదు అంటూ కళ్ళు తుడుచుకుని తలుపు వైపు చూస్తే అక్కడే నిలబడి అంతా విన్న జగన్నాథమ్ కుప్పకూలిపోయాడు.

****

నేనీ
పెళ్లి చేసుకోను అని ధృడంగా చెప్తున్న సీత వైపు అందరూ ఆశ్చర్యంగా చూసారు. ఏంటే నువ్వనేది? వాడి కోసమే కదా నువ్వు పెళ్లే వద్దనుకుని ఇన్నాళ్లు బ్రతికావ్! ఇప్పుడు వాడే వస్తే వద్దంటావా? ఇదేం పైత్యమే అన్నాడు వెంకటేశ్వర్లు మావయ్య. శేఖర్ ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. సీత అందరి వైపు చూసి
నేను బావతో కొంచెం మాట్లాడాలి. తరువాత బావకు ఓకే అయితే నాకూ అభ్యంతరం లేదు అంది. అందరూ మొఖాలు చూసుకున్నారు.

మనకు పెళ్లి సెట్ అవ్వదు బావ. తప్పుగా అనుకోకు. ఆ రోజు నేను పెద్దగా చదువుకోలేదని పైగా మేనరికమని వద్దన్నావ్. నీ ప్రేమ వ్యవహారం సరేసరి! ఇప్పుడు నాతో నువ్వు పెళ్లికి సిద్ధపడ్డావ్.
నేను జాలిపడి నీతో పెళ్లికి ఒప్పుకున్నానని ఏదో రోజు నీకనిపిస్తే? నీకు దిక్కు లేకే మళ్ళీ మా ఊరొచ్చావ్, మా ఇంటికొచ్చావ్ అని నాకనిపిస్తే! మనం ఆనందంగా బ్రతకలేం అందుకే ఈ పెళ్లి వద్ధంటున్నాను. అతనేం మాట్లాడకుండా లేచి బయటకు వెళ్ళిపోయాడు.

***

పొద్దున్నే శేఖర్
కారులో లాగేజ్ పెడుతుంటే సీత వచ్చింది. ఎన్నింటికి ఫ్లయిట్ అంది. రాత్రి పదింటికి.. హైదరాబాద్ వరకూ వస్తావా ఇదే కారులో తిరిగిరావచ్చన్నాడు. అంత వరకేనా అంది కొంచెం మొహమాటపడుతూ. చప్పున తలెత్తి ఆమె వైపు చూసాడతను.

కథ: నిరీక్షణ

హరీష్ మీనన్ ద్వారా

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with black

black Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @27dots_

23 Nov
రెండు సార్లు చేసాను, ఫోన్ ఎత్తవేం? అని అటు నుంచి భర్త అడిగిన ప్రశ్నకు హ్యాండ్ బ్యాగ్ టీవీ పక్కన పెడుతూ ఆ టైములో నేను డ్రైవ్ చేస్తుంటానని తెలియదా? అని చిరాగ్గా అంది వసుంధర. సర్లే, శనివారం వస్తున్నాను అని కాల్ కట్ చేసేసాడతను. పిల్లలకు హోమ్ వర్క్ చేయిస్తుంటే తన మొబైల్'కి ఏదో
మెసేజ్ వస్తే ఓపెన్ చేసింది. 'కంగ్రాట్స్ మేడమ్, మీ స్పీచ్ చాలా బావుంది ౼ విహారి' అని కొత్త నంబర్ నుంచి మెసేజ్ ఉంది. ఎవరాని ఆలోచిస్తూ థాంక్యూ అని రిప్లై ఇచ్చింది. ఒకసారి మిమ్మల్ని కలవచ్చా అని తిరిగి మెసేజ్ వచ్చేసరికి కొంచెం ఆశ్చర్యపోయినా సారీ అని టైప్ చేసి సెండ్ చేసింది. మోటివేషనల్
ట్రైనర్ వృత్తిలో ఉన్న ఆమెకు ప్రశంసలు కొత్తకావు కానీ ఇతనెందుకు కలవానుకుంటున్నాడు! మొఖం కడుక్కుని క్రీమ్ రాసుకుంటుంటే మళ్ళీ మెసేజొచ్చింది. 'నేను వేరే ఉద్దేశ్యాలతో మిమ్మల్ని కలవాలనుకోలేదు. మీతో పది నిమిషాలు మాట్లాడాలనిపించింది అంతే. చాలా రోజులుగా యూట్యూబ్'లో మీ వీడియోస్ చూస్తున్నాను
Read 26 tweets
22 Nov
కొడుకు సిగరెట్ కాలుస్తున్నాడని తెలియగానే సాధారణంగా ఇళ్లల్లో పెద్దవాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది?

"ఏరా సిగరెట్లు కాలుస్తున్నావంటా? *ఫెడెల్* ఇంకో సారి సిగరెట్లు కాల్చావని తెలిస్తే ఒళ్లు చీరేస్తాను"

అదే మందు కొడుతున్నాడని తెలిస్తే?

"అప్పుడే నీకు మందు కావాల్సొచ్చిందా? *మళ్ళీ ఫెడెల్*
నీ వయసేంటి.. ఆ అలవాట్లేంటి? అంత పెద్దోడివైపోయావా?"

చాలా సంప్రదాయబద్ధమైన రియాక్షన్స్ ఇవి. యుక్త వయసులో ఉన్న వాడు ఇలాంటి వాటికి భయపడి దురలవాట్లు మానేయడు సరికదా పేరెంట్స్ మీద గౌరవం తగ్గిపోతుంది. నిజానికి పెద్దవాళ్ళు చేయాల్సింది కొట్టడం, తిట్టడం కాదు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం
ఎందుకు పాడవుతుందో అర్ధమయ్యేటట్టు వివరించగలగాలి. సిగరెట్, మందు అంటే అదేదో పెద్ద విషయంలా ప్రాజెక్ట్ చేయటం
వల్లే అడ్వెంచర్'లా ఫీల్ అయ్యి సరదాగా స్టార్ట్ చేస్తారు చాలా మంది టీనేజర్స్. దీర్ఘకాలంలో వాటి వల్ల సామాజికంగా, ఆర్ధికంగా జరిగే నష్టాలను పిల్లలకు చెప్పాల్సింది పెద్దలే.

#dots
Read 4 tweets
21 Nov
నువ్వు రాసే కథల్లో చివరకు భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు శ్రీను? అని రాఘవ అడిగిన ప్రశ్నకు కాఫీ కప్ టీపాయ్ మీద పెట్టి 'నువ్వు చెప్పేంత వరకూ నేనీ విషయం గమనించలేదే' అని న్యూస్ పేపర్ సోఫా మీద పడేసి లేచెళ్లిపోతున్న శ్రీనివాస్ రాజు వైపు ఒకింత ఆశ్చర్యంగా చూసాడు అతని స్నేహితుడు.
"నా కథల్లో భార్యాభర్తలు చివరకు విడిపోతున్నారా లేక నేనే విడగొడుతున్నానా?" అని ఆలోచిస్తూ రెండో పెగ్ ఫిక్స్ చేసాడు ప్రముఖ రచయిత శ్రీనివాస్ రాజు. ఉదయం రాఘవ అడిగిన ప్రశ్న అతన్ని గతంలోకి లాక్కెళ్ళింది.

హాయ్ వినీలా అని వినిపించగానే తలతిప్పి చూసి హలో అంది. మీ ప్రెజెంటేషన్ చాలా బావుంది.
క్లైంట్స్ కూడా ఇంప్రెస్ అయినట్టే ఉన్నారు అని శ్రీనివాస్ అనగానే థాంక్యూ మీరు ఫార్వార్డ్ చేసిన డేటా వల్లే ఔట్-పుట్ అంత బాగా వచ్చింది. థాంక్స్ ఎగైన్ అంది. అలా వాళ్లిద్దరూ కలీగ్స్ నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఎక్కువ కాలం ప్రేమించి తరువాత పెళ్లి చేసుకుంటే లైఫ్ పార్ట్నర్ త్వరగా బోర్
Read 25 tweets
9 Nov
అద్దం ముందు నిలబడి ఆమె తన ప్రతిబింబాన్ని చూస్తూ చేత్తో దాన్ని తాకుతోంటే సరిగ్గా అప్పుడే దూరం నుంచి "వేణువై వచ్చాను భువనానికి" పాట వినిపిస్తోంది. సిట్యుయేషనల్ సాంగ్ అంటే ఇదేనేమో! కంటి కింద చారలు వెక్కిరిస్తోంటే నీరసంగా నవ్విందామె. నిజానికి స్త్రీ జీవితం ముప్పై ఐదు ఏళ్ళు నిండాకే
మొదలవుతుందని ఎక్కడో చదివిన జ్ఞాపకం. 'మరి నేనెందుకు ముప్పై ఆరేళ్లకే జీవితం ముగించాలనుకుంటున్నాను?' అని ఆలోచిస్తుంటే తన పన్నెండేళ్ల వైవాహిక జీవితం ఆమె కళ్ళ ముందు కదలాడింది.

'నేనేదైనా ఫ్రాంక్'గా మాట్లాడతాను. నువ్వు కూడా నాతో అలానే ఉండాలి సరేనా' అని మొదటిరాత్రి భర్త తనతో అన్నప్పుడు
మంచి మొగుడు అని తెగ మురిసిపోయి తొమ్మిదో తరగతిలో తనకు లవ్ లెటర్ రాసిన సూరిబాబుతో మొదలుపెట్టి డిగ్రీలో తను ఇష్టపడ్డ ఆనంద్ వరకు అన్నీ చెప్పేసింది. నవ్వుతూ ఆమె చెప్పేవి విన్న అతను మనసులో ఏమనుకుంటున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో అప్పుడు పసిగట్టలేకపోయిందామె.

'ఏదో ఉద్యోగం ఉందని కట్నం
Read 26 tweets
7 Nov
"సర్జరీ అయిపోయింది. మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి. వాకర్ సహాయంతో నడవాలి. కాలి మీద ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు" డాక్టర్ చెప్తోంటే మౌనంగా వింటున్నాడు రిషి. కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర జరిగిన ప్రమాదంలో అతని పాదానికి దెబ్బతగిలింది. స్కాన్ చేసాక ఫ్రాక్చర్ అని తేల్చి ప్లేట్ పెట్టి సర్జరీ
చేశారు.

హాయ్ రిషి, ఎలా ఉందిప్పుడు వస్తూనే హెచ్ ఆర్ మేనేజర్ అడిగాడు. చిన్నగా నవ్వేడు రిషి. డాక్టర్'ని కలిసొస్తున్నాను. రేపు డిశ్చార్జ్ చేస్తాం అంటున్నారు. టికెట్ బుక్ చేయనా అన్నాడు. 'ఎక్కడకి' అని అడుగుదాం అనుకున్నాడు రిషి. కారణం అతనికి ఈ ప్రపంచంలో నా అనే వాళ్ళెవ్వరూ లేరు.
ఇట్స్ ఓకే నేను మేనేజ్ చేస్తాను అన్నాడు. సరే, ఏ అవసరం ఉన్నా కాల్ చెయ్ అని అతను వెళ్లిపోతుంటే సంజయ్ అని పిలిచాడు రిషి. హా చెప్పు అన్నాడు హెచ్ ఆర్ మేనేజర్. నాకు ఇక్కడ అసిస్టెన్స్ అవసరం లేదు అండ్ నా అకౌంట్స్ త్వరగా సెటిల్ చేస్తావా అడిగాడు. యూ మీన్! అని ఆగిపోయాడతను. యెస్, రిజైన్
Read 26 tweets
3 Nov
"చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలని కలలుగన్న ఇరవై రెండేళ్ల కుర్రాడు తనే ఒక చరిత్రను సృష్టిస్తాడని ఆనాడు ఊహించలేదు."

చిరంజీవి కెమెరాను ఫేస్ చేసిన మొదటి సినిమా పునాది రాళ్లు, కానీ విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. ఈ రెంటికీ నిర్మాత క్రాంతికుమార్ కావటం విశేషం. 78లో బాపుగారి మనవూరి
పాండవులు షూట్ జరుగుతున్నప్పుడు చిరంజీవి అక్కడున్న గడ్డి, మన్ను తీసి ఒంటి మీద పూసుకున్నారు. ఇది గమనించిన లక్ష్మీ దీపక్ (AD) ఏం చేస్తున్నావ్ అని అడిగితే 'పొలం పని చేసొచ్చినట్టు కనిపించాలి కదండీ, అందుకే..' అని చిరంజీవి చెప్పగానే నువ్వు గొప్ప నటుడవుతావ్ అని ప్రశంసించారు. తరువాత ఆయనతో
'ధైర్యవంతుడు' లాంటి హిట్ సినిమా చిరంజీవి చేశారు.

షూటింగ్లో బ్రేక్ దొరికితే సాధారణంగా ఆర్టిస్టులు పేకాడతారు లేదా వేరే కథలు వింటారు. కానీ చిరంజీవి మాత్రం మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేసేవారు.. తన తోటి నటీనటులను ఎంటర్టైన్ చేసేవారు. ఇవన్నీ గమనిస్తున్న క్రాంతికుమార్ గారు చిరంజీవిని
Read 25 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Thank you for your support!

Follow Us on Twitter!

:(