వైసిపి కి సోషల్ మీడియా నే బలం అని .....దేశంలోనే బిజెపి తరువాత ఒక ప్రాంతీయ పార్టీ వైసిపి సోషల్ మీడియా బలమైనదని ఏదో సర్వేలో తేలిందని చూశా.
ఏవిధంగా
వైసిపి సోషల్ మీడియా వ్యవస్థీకృతమైనది కాదు.ఇదొక గొర్రెల గుంపు కాదు.ఎవరి కిందా నడవదు.ఎవరికి ఇష్టమైన రీతిలో,ఎవరికి తోచిన విధంగా,ఎవరి దొరికిన ఖాళీ సమయానికి అనుగుణంగా,ఎవరి నాయకత్వం లేకుండా ఒకే కామన్ ఇంట్రెస్ట్ తో పనిచేసే ఒక కీచురాళ్ళ గుంపు.
ఏవిధంగా అయితే కీచురాళ్ళ అరుపులకు లయబద్దత ఉండదో,ఏవిధంగా అయితే అవి మీ రాత్రి నిద్రను పాడుచేయగలవో అలా.
వీరి కామన్ ఇంట్రెస్ట్ ఒకటే అది వైఎస్.వైఎస్ అనే రెండు అక్షరాలు.భాషా సినిమాలో రజనీకాంత్ అనుచరులు అతని చుట్టూ వివిధ వృత్తులలో బతుకుతుంటారు .
రజనీకాంత్ కు కష్టం వస్తే మూలమూలల నుంచి వచ్చేస్తారు.వీళ్ళూ అంతే ఎవరి పనుల్లో వారు ఎవరి జీవితాల్లో వారు బతుకుతుంటారు.
వైఎస్ అనే రెండక్షరాలకు కష్టం అని తెలిస్తే పంట పొలాల నుంచి,సాఫ్ట్‌వేర్ కూపాల నుంచి,వ్యాపార వ్యవహారాల నుంచి,వివిధ ఉద్యోగ బాధ్యతల నుంచి బంధాలను తెంచుకుని సోషల్ మీడియా యుద్ధ క్షేత్రం లో వాలిపోతారు.
వీరి దాడి మామూలుగా ఉండదు.వీరి దాడి రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ ల ఎయిర్ స్ట్రైక్ లాగా...వీరి డిఫెన్స్ అదే యుద్ధం లో రష్యన్ ల స్టాలిన్ గ్రాడ్ సిటి డిఫెన్స్ లాగా ఉంటుంది.అక్కడ నుంచే డిఫెన్స్ అంతం అయ్యి అటాక్ ప్రారంభం అయినట్లు.అక్కడ నుంచే నాజీల పతనం ప్రారంభమయినట్లు ఉంటుంది
.ఎవరికైనా రుచి చూడాలి అనిపిస్తే వైఎస్ లను అకారణంగా కెలకండి.తెలుసొచ్చుద్ది.
వైసిపి సోషల్ మీడియా నిరంతర నీటి ప్రవాహం లాంటిది.నిలిచిపోయిన మురుగు నీటి గుంట కాదు.నిరంతరం కొత్త నీటితో తొణికిసలాడుతుంది.మూస భావాలు ఉండవు.కొంగొత్త అలోచనలు.
ఇటీవల కొందరు వైసిపి నాయకులు చేస్తున్న మితిమీరిన జగన్ భజనను ప్రశ్నిస్తున్నది,వ్యతిరేకిస్తున్నది కరుడుగట్టిన వైఎస్ అభిమానులే.సచివాలయాలకు పార్టీ రంగులను వ్యతిరేకించింది వీళ్ళే,ఇసుక పాలసీ ని మార్చాలని వాదిస్తున్నది వీళ్ళే.
గత తెలుగు దేశం ప్రభుత్వం లో ఆ పార్టీ సోషల్ మీడియా ఏ ప్రజా వ్యతిరేక పాలసీనైనా వ్యతిరేకించినట్లు మీకు గుర్తుందా.....?
రాబోయే ప్రమాదాన్ని,ప్రభుత్వ వ్యతిరేకతను సామాన్యులలో ఒకరుగా ఉండి గమనిస్తూ ఎప్పటికప్పుడు ప్రభత్వానికి,పార్టీకి సమాచారాన్ని చేరవేసే ఎవరూ నియామకాలు జరపని రహస్య వేగులు వీరు.వైసిపి పెద్ద నాయకులు ఫేస్ బుక్ లో ఉంటూ తమ వారిని ఫాలో అవుతుంటే చాలు ప్రభుత్వం ఎలా నడుస్తుందో...
పార్టీ ఎలా నడుస్తుందో తెలిసిపోతుంది.
సోషల్ మీడియా ను వ్యవస్థీకృతం చేయలేరు.అది కొంతవరకే సాధ్యం. ఆ సాధ్యమైన మేరకే మిగతా అవ్యవస్థీకృత వైసిపి సోషల్ మీడియా ను కాపాడుకోండి.
అక్కడ నుండే మీకు ముప్పై ఏళ్ల కు సరిపడా పరిపాలనా ముడి సరుకు దొరుకుతుంది.ఏరుకోండి,సానబెట్టుకోండి,వాడుకోండి,నిలబడండి,ప్రజల ఋణం తీర్చుకోండి.మీరెప్పటికీ మీరు చూడని,ఎప్పటికీ కలవలేని వైసిపి సోషల్ మీడియా ఔత్సాహికుడి ఋణం తీర్చుకోవాల్సిన అవసరం లేదు.అది వారి కోరిక కూడా కాదు.
ప్రపంచ చరిత్రలో ఎన్నో యుద్దాలలో తన నాయకుడి కోసం చనిపోయిన అనామక సైనికుడి పేరు గుర్తుందా....?
గుర్తుండదు.అదంతే.
అయితే వారంతా అలెగ్జాండర్ సైన్యం, నెపోలియన్ సైన్యం, రెడ్ ఆర్మీ,వియత్నం యోధులు, బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని సృష్టించిన భారత సైన్యం అని పిలవబడతారు
మేము వైఎస్ సైన్యం అని పిలవబడతాం.మాకు అది చాలదా...!