చపాతీతో పాటు కొంచెం అన్నం కూడా తినాలి అంటే OK అంటాం. కానీ అన్నంతో పాటు చపాతీ కంపల్సరీ తినాలి అంటే కోపం వస్తది కదా? ఎందుకంటే అన్నం మన ప్రైమరీ intake. చపాతీ optional. మన ప్రైమరీ intake కానిదాన్ని కంపల్సరీ అంటే ప్రతిఘటిస్తాం కదా?
(1/5)
తెలుగు, హిందీ రెండూ మాట్లాడుతాం!
తెలుగు మన మాతృభాష, హిందీ పక్కోడి భాష. పక్కోడి భాష కంపల్సరీ చేసి మనమీద బలవంతంగా రుద్దుతుంటే ఎందుకని రియాక్ట్ అవట్లేదు? మరి మనకు ఇంగ్లీష్ ఎందుకు అనే వితండవాదులు కూడా ఉంటారు.
(2/5)
బ్రిటీషోళ్ళు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచం అంతా అంటగట్టి వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఇంగ్లీషుని యూనివర్సల్ లాంగ్వేజ్ గా యాక్సెప్టు చేసింది. English నేర్చుకోక తప్పదు కాబట్టి నేర్చుకుంటున్నాం. హిందీ అటు మాతృభాష కాదు, ఇటు నేర్చుకోక తప్పనిభాష కూడా కాదు.
(3/5)
ఎందుకు మరి కేంద్రానికి ఈ బలవంతపు రుద్దుడు అలవాటు? కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా.. బీజేపీ ఉన్నా.. ఇదే రుద్దుడు.
హిందీ అడ్డుపెట్టుకొని మనపై ఉత్తరాది ఆధిపత్య భావదారిద్రాన్ని చూపించటం కాకపోతే ఏంటి?
(4/5)
వాళ్ళు మాత్రం English, Hindi నేర్చుకుంటారట.. మనం English, Teluguతో పాటు Hindi నేర్చుకోవాలంట! మరి వాళ్ళకు కూడా ఏదో ఒక సౌత్ ఇండియన్ భాష కంపల్సరీ చేయొచ్చుగా? #StopHindiImposition
(5/5)
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh