నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా.. కాదే..
ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు
నిరాకరించారు. ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో..
పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు..
పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు..
ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది..
ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే..
నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే.. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన
ఉండటం తప్పెలా అవుతుంది అని అడిగాడు కర్ణుడు...
దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు...
నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను.. నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది.. నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను.
చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు.. నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను..
నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి.. అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు.. కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను..
నా చుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా.. నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు..
మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ..
సాందీపుని ఋషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది.. నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు.. నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను.. పైగా నన్ను వివాహం చేసుకున్నవారు, వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ..
జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమున ఒడ్డు నుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది.. అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది.. సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచి పేరు వస్తుంది. అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు.
పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన..
ఒకటి గుర్తుంచుకో కర్ణా..
"జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి.. జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు. .అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు"..
దుర్యోధనుడు అవనీ, యుధిష్టరుడు అవనీ అందరూ
జీవితపు దెబ్బలు రుచి చూసినవారే.. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి, నీ బుద్ధికి తెలుసు.. మనకు ఎంత అన్యాయం జరిగినా.. మనకు ఎన్ని పరాభవాలు జరిగినా.. మనకు రావల్సినది మనకు అందకపోయినా.. మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజమైన వ్యక్తిత్వం.. జీవితంలో చాలా ముఖ్యమైనది..
జీవితంలో ఎన్నో ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో.. ఎవరో తప్పు చేశారనో.. ఏ కారణాలు కూడా మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు.. మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు..
ఏ పరిస్థితుల్లో అయినా #ధర్మాన్ని వదులుకోకూడదు.." అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు.
“శ్రీకృష్ణం వందే జగద్గురుం”
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
నా పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. నాన్నగారు కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు. అమ్మగారు కాశీనాథుని సరస్వతీ దేవి గారు. మేము ముగ్గురం సంతానం. నేను పెద్దవాడిని. నాకు ఇద్దరు చెల్లెళ్ళు. శ్యామలా దేవి, గిరిజా దేవి. మా స్వగ్రామం గుంటూరు జిల్లా,
రేపల్లె తాలూకాలోని ’పెదపులివర్రు’ అనే గ్రామం. మా తాతగారు పరమ నిష్ఠాగరిష్టుడు. మనదేశానికింకా స్వాతంత్ర్యం రాక ముందు జరిగిన సంఘటన. తాతగారు కాంగెస్ వాలంటీర్లకి భోజనం పెట్టారనే నెపంతో బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని అరెస్టు చేసి జైలులోపెట్టారు. అందుకు నిరసనగా జైలులో ఉన్నంతకాలం భోజనం
ముట్టకుండా కేవలం కొబ్బరినీళ్ళతోనే బ్రతికిన అభ్యుదయవాది. అలాంటి తాతగారికి మనవడిగా పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. వారి సద్గుణాలు అంతగా నాకు అబ్బకపోయినా ఇలాంటి సమయంలో వారిని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.
నా బాల్యం. ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో
ఒకరోజు, ఒక అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, అమ్మకు ఒక కవర్ ఇచ్చాడు. ‘అమ్మా.. ఈ లెటర్ నీకిమ్మంది మా టీచర్..’ అని చెప్పాడు. కవర్ చింపి ఆ ఉత్తరం చదివిన ఆ తల్లి కళ్ల నిండా నీళ్లు. కొడుకు వినడం కోసం దాన్ని మరోసారి బయటకు చదివింది.
థామస్ అల్వా ఎడిసన్… ఆమెరికాకు చెందిన గొప్ప ఆవిష్కర్త, పెద్ద వ్యాపారవేత్త. అతని ఆవిష్కరణలు ఎంతో సంచలనం సృష్టించాయి. నైట్ లైట్లు, గ్రామఫోన్, సినిమా ప్రొజెక్టర్.. విప్లవం సృష్టించిన విద్యుత్ బల్బు. నిజంగా అతనో అద్భుత మేధావి. అతని ఆవిష్కరణల్లో కొన్ని ఉన్నవాటినే ఇంకా అభివృద్ధి
పరచడమైతే, కొన్ని ఉద్దేశపూర్వకంగా కనుగొన్నవి. బల్బు, ప్రొజెక్టర్ ఆ కోవకు చెందినవే.
ఒకరోజు, పాఠశాల నుండి ఇంటికి వచ్చిన ఎడిసన్, వాళ్లమ్మకు ఓ లెటర్ ఇచ్చి, మా టీచర్ నీకిమ్మంది అని చెప్పాడు. ఆ తల్లి ఎంతో ఆత్రుతగా ఆ ఉత్తరం చదివింది. పూర్తవగానే అమ్మ కళ్లల్లో నీళ్లు.
ఐఎండీబీ టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో ‘కాంతార’ నంబరు 1గా నిలిచింది. ఇతర సినిమాల వివరాలివీ..
‘కాంతార’ (Kantara).. ప్రస్తుతం అన్ని చోట్లా ఈ పేరే మారుమోగుతోంది. నెట్టింట ఈ కన్నడ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం
హాట్ టాపిక్‌గా మారుతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది. అధిక వసూళ్లతోపాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంటోంది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ (IMDb) ప్రకటించిన ‘టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్’ (IMDb Top 250) జాబితాలో
తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. తమ యూజర్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించింది. సోషల్ మీడియా వేదికగా ఆ వివరాలు పంచుకుంది.
నంబర్ 1గా ‘కాంతార’ ఉండగా 2వ స్థానంలో రామాయణ (1993), 3లో రాకెట్రీ (2022), 4లో నాయకన్ (1987), 5లో అన్బే శివం (2003),
ఆంధ్రవిద్యా వయో వృద్ధులలో గణ్యులు. వీరు బహుభాషా కోవిదులు. ఆంధ్రాంగ్ల గీర్వాణములయందును, కన్నడము, తమిళము, హిందీ, ఉర్దూ, పారసీక భాషలయందు వీరు పాండిత్యము సంపాదించారు. వీరు "భారతి" వంటి సుప్రసిద్ధ సారస్వత పత్రికాముఖముల ప్రకటించిన వ్యాసములు శతాధికములు.
వీరు వ్రాసిన ప్రసిద్ధ వ్యాసములు - రామాయణము లోని వానరులు నరులు కారా? నిజముగా వానరులే అగుదురా? అను విషయములను గూర్చియు, ప్రాచీన కాలమున సంస్కృతము దేశభాషగా నుండెనా? ఆంధ్రులెవరు? అను సమస్యలనుద్ధేశించియు, ఆనందరంగరాట్చందమును గూర్చియు, శ్రీ పంతులు గారు వ్రాసిన వ్యాసములు అమూల్యములు.
వంగోలు వెంకటరంగయ్య
జననం : 1867, అక్టోబరు 18, నెల్లూరు
మరణం : 1949, జూన్ 9
ప్రసిద్ధి : పండితుడు, బహుశాస్త్రవేత్త
తండ్రి : వంగోలు శేషాచలపతి
తల్లి : సీతమ్మ
అతడు ఓషధులకు అధిపతి (సోమః ఓషధీనా మధిపతిః). అసమాన సౌందర్యం అతని స్వంతం. అయినా సూర్యోదయమవగానే చంద్రుడు తేజస్సును కోల్పోతాడు. అతనిలో ఉన్న అమృతము కూడా అతని కళలను నిలుపలేదు. రాత్రనేది చంద్రుని భవనమయితే, పగలు సూర్యుని భవనంగా చెపుతారు. పరాయి ఇంటిలో ఉండవలసి వస్తే ఎవరికయినా ఆశించిన
గౌరవం లభించదు. పరాయి పంచన బ్రతకడం ఎంతవారికయినా దుఃఖమయమే అంటాడు, #చాణక్యుడు.
మన ఇంటిలాంటిది "స్వధర్మం". ఇతరుల ఇంటిలాంటిది "పరధర్మం". ఎంత జాగ్రత్తగా, భయభక్తులతో ఉన్నా పరాయి ఇంటిలో ప్రశాంతత ఉండదు. అదే మన ఇంటిలో మనమెలా ఉన్నా సుఖంగా ఉంటుంది.
"కాంతార" అంటే అర్థం తెలియదు."రిషబ్ షెట్టి"ని మునుపు చూసింది లేదు.
థియేటర్లు మొదటి ఆట నుంచి ఫుల్ !!
ఏముంది "కాంతార"లో. కొత్త కథేం కాదు. గ్రామ రాజకీయాలు, అడవి నేపథ్యం. రంగస్థలం, పుష్ప కలిస్తే ఇది.
అంతేనా? అసలుది వేరే వుంది. అదే మ్యాజిక్. జానపద శైలిలో కథ చెప్పడం. మొదటి నుంచి ఆఖరి వరకూ ఒక మార్మికత వెంటాడడం. ఇదే దీని విజయ రహస్యం. మొదటి 15 నిమిషాలు, ఆఖరి 15 నిమిషాలు అద్భుతం, బీభత్సం. రసాస్వాదనకి పరాకాష్ట..
థియేటర్లకి ప్రేక్షకులు రావడం లేదనేది నిజం కాదు. ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించలేకపోతున్నారు. "కాంతార"కి జాతరలా ఎందుకొస్తున్నారు? ఆశ్చర్యం ఏమంటే 150 కెపాసిటీ వున్న థియేటర్‌లో కనీసం 50 మంది మహిళలు. ఆడవారు థియేటర్‌కి రావడం మానేసి, టీవీ, ఓటీటీ చూస్తున్నారనే