ఒకరోజు, ఒక అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, అమ్మకు ఒక కవర్ ఇచ్చాడు. ‘అమ్మా.. ఈ లెటర్ నీకిమ్మంది మా టీచర్..’ అని చెప్పాడు. కవర్ చింపి ఆ ఉత్తరం చదివిన ఆ తల్లి కళ్ల నిండా నీళ్లు. కొడుకు వినడం కోసం దాన్ని మరోసారి బయటకు చదివింది.
థామస్ అల్వా ఎడిసన్… ఆమెరికాకు చెందిన గొప్ప ఆవిష్కర్త, పెద్ద వ్యాపారవేత్త. అతని ఆవిష్కరణలు ఎంతో సంచలనం సృష్టించాయి. నైట్ లైట్లు, గ్రామఫోన్, సినిమా ప్రొజెక్టర్.. విప్లవం సృష్టించిన విద్యుత్ బల్బు. నిజంగా అతనో అద్భుత మేధావి. అతని ఆవిష్కరణల్లో కొన్ని ఉన్నవాటినే ఇంకా అభివృద్ధి
పరచడమైతే, కొన్ని ఉద్దేశపూర్వకంగా కనుగొన్నవి. బల్బు, ప్రొజెక్టర్ ఆ కోవకు చెందినవే.
ఒకరోజు, పాఠశాల నుండి ఇంటికి వచ్చిన ఎడిసన్, వాళ్లమ్మకు ఓ లెటర్ ఇచ్చి, మా టీచర్ నీకిమ్మంది అని చెప్పాడు. ఆ తల్లి ఎంతో ఆత్రుతగా ఆ ఉత్తరం చదివింది. పూర్తవగానే అమ్మ కళ్లల్లో నీళ్లు.
ఏముందమ్మా అందులో అన్న కొడుకు ప్రశ్నకు సమాధానంగా దాన్ని గట్టిగా చదివి వినిపించింది. ‘‘ మీ అబ్బాయి ఒక మేధావి. తనకు ఈ స్కూల్ సరైంది కాదు. ఇక్కడ సమర్థులైన ఉపాధ్యాయులు కూడా లేరు. కాబట్టి ఇకనుంచి మీరే మీ అబ్బాయికి చదువు చెప్పండి’’. నిజానికి అప్పటికి మూడు నెలలే అయింది థామస్ బడికి
వెళ్లడం ప్రారంభించి. ఆనాటి నుండి అతనికి తల్లే గురువయింది. ప్రపంచమంతా గర్వపడే మేధావిని తయారుచేసింది. గణిత, భౌతిక శాస్త్రాల్లో ఉద్ధండుడయ్యాడు.
కొన్ని సంవత్సరాలకు వాళ్లమ్మ చనిపోయింది. థామస్ అల్వా ఎడిసన్ ఆ శతాబ్దంలోనే గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకడయ్యాడు. తన పేరు మీద దేశవిదేశాల్లో
వేలాది పేటెంట్లు నమోదయ్యాయి. ఎన్నో ప్రయోగశాలలు, పరిశ్రమలు స్థాపించాడు. ఆసక్తిగల సమకాలీన పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేసాడు. ఎన్నో రకాల ఉపకరణాలు, యంత్రాలు తయారుచేసాడు. ఒకనాడు దేనికోసమో తన ఇంట్లో ఉన్న పాత బీరువాను వెతుకుతుండగా, ఒక ఉత్తరం కంటబడింది. అది చిన్నప్పుడు తన టీచర్
అమ్మకు రాసింది. ఆ ఉత్తరం చదివిన థామస్ కదిలిపోయాడు. అందులో ఇలా ఉంది…
‘‘థామస్ అల్వా ఎడిసన్ అనబడే మీ అబ్బాయి, మానసిక వికలాంగుడు. ఈ స్కూల్ అతడిని ఇక ఎంతమాత్రం భరించలేదు. కాబట్టి అతడిని బహిష్కరించడం జరిగింది’’.
ఎంతో ఉద్వేగంతో, కళ్లనిండా నీళ్లతో ఎడిసన్, తన డైరీలో ఇలా
రాసుకున్నాడు..‘‘ థామస్ ఎడిసన్ ఒక మానసిక వికలాంగుడైన అబ్బాయి. అతడిని వాళ్లమ్మ ఈ శతాబ్దానికే మేధావిగా మార్చింది’’. అంటే, ఒక ప్రోత్సాహపు మాట, ఒకరి విధిని మార్చడంలో సహాయపడుతుంది. ఆ తల్లి చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మిన ఎడిసన్, తన బలహీనతలను తెలియకుండానే అధిగమించాడు. ఆలోచనలనే
ఆలంబనగా చేసుకున్నాడు. శోధించాడు. సాధించాడు.
1914 డిసెంబర్‌లో, తన ఫ్యాక్టరీలో పెద్దఎత్తున పేలుడు సంభవించింది. మంటలు మొత్తం ఉన్న పది భవనాలను అలుముకున్నాయి. థామస్ అల్వా ఎడిసన్ ఆ మంటలను అదుపు చేయడానికి ఎంతో కృషి చేసాడు. ఫైరింజన్లు కూడా వచ్చాయి. కానీ, రసాయనాల కేంద్రం కావడంవలన
మంటలను అదుపు చేయలేకపోయారు. తనిక ఏమీ చేయలేనని అర్థం చేసుకున్న ఎడిసన్, స్తబ్దుగా మంటలను చూస్తూ నిలబడ్డాడు. తన జీవితకాలపు శ్రమ కళ్లముందే బూడిదపాలు కావడం చూస్తున్నాడు.
ఇంతలో తన 24ఏళ్ల కుమారుడు చార్లెస్ కూడా వచ్చి తండ్రి పక్కన నిలబడి చూస్తున్నాడు. కొడుకుతో ఎడిసన్, ‘చార్లీ,
వెళ్లి మీ అమ్మను, స్నేహితులను పిలుచుకు రా.. ఇంత గొప్ప అగ్నికీలలను వారు తమ జీవితంలో చూసుండరు’ అన్నాడు. దాంతో షాక్ తిన్న చార్లెస్, ‘నాన్నా.. మన ఫ్యాక్టరీ మొత్తం బూడిదయింది’ అనగా, థామస్, ‘అవును.. మన ఫ్యాక్టరీ మొత్తం బూడిదగా మారింది. దాంతో పాటు ఇప్పటివరకు అందులో మనం చేసిన తప్పులు
కూడా భస్మమయ్యాయి. రేపటినుంచీ మనం మళ్లీ మొదటినుంచి మొదలుపెడదాం’ అన్నాడు.
తెల్లవారి తనను కలిసిన న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధితోనూ ఇవే మాటలన్నాడు ఎడిసన్. ‘‘నిజానికి నాకిప్పుడు 67ఏళ్లు. అయినప్పటికీ, మంటలను అదుపు చేయడానికి అటూఇటూ పరుగెత్తాను. చేయగలిగినంతా చేసాను. రేపు నేను మళ్లీ
మొదటినుండీ ప్రారంభిస్తాను’’ అన్నాడు. అన్నట్టుగానే థామస్, కొడుకు చార్లెస్ బూడిదవగా మిగిలిన ఫ్యాక్టరీని పునరుద్ధరించే పనిలో పడ్డారు. సాధించారు.
సాధారణంగా మనిషి జీవితంలో జరిగే విషాదాలు ఇవి. మన కలలు భగ్నమవుతాయి. మన ఆశలు గల్లంతవుతాయి. పడ్డ కష్టం వృధా అవుతుంది. కానీ,
గొప్పవాళ్లెప్పుడూ దుఃఖపడరు. వారు తిరిగి తమ కలల సౌధాలను నిర్మించడానికి ప్రయత్నిస్తారు. విజయులు దేన్నీ మధ్యలో వదిలేయరు. జీవితం విసిరిన పందేలను గెలవడానికి కష్టపడతారు. వారు కష్టాలలోనుండి ప్రయాణించరు. కష్టాలవల్ల ఎదుగుతారు. ఎన్నిసార్లయినా మొదటినుంచి ప్రారంభించడానికి గొప్ప పట్టుదలతో,
అంకితభావంతో పనిచేస్తారు. అదే వారిని విజయతీరాలకు చేరుస్తుంది.
థామస్ ఆల్వా ఎడిసన్- (ఫిబ్రవరి 11, 1847 – అక్టోబర్ 18, 1931) ఫిబ్రవరి 11, 1847న అమెరికాలో జన్మించిన థామస్ ఆల్వా ఎడిసన్ తల్లిదండ్రులు డచ్, స్కాట్లాండ్ కు చెందినవారు. 16 ఏళ్ళకే టెలిగ్రాఫ్ ఆపరేటర్ అయ్యాడు.
ఆటోమేటిక్ టెలిగ్రాఫ్ కోసం ట్రాన్స్‌మీటర్, రిసీవర్లను కనిపెట్టడం ఆయన మొదటి ఆవిష్కరణ. 1877లో ఫోనోగ్రాఫ్‌ను కనుగొన్నాడు. 40 గంటలపాటు పనిచేసే కార్బనైజ్‌డ్ కార్బన్ త్రెడ్ ఫిలమెంట్‌ను తయారు చేసి 1879 అక్టోబర్ 21న ప్రయోగాత్మకంగా ప్రదర్శించాడు. థామస్ అల్వా ఎడిసన్ మానవ జాతిని
ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త.
1882లో న్యూయార్క్‌లో విద్యుత్ స్టేషన్‌ను స్థాపించాడు. కైనెటోస్కోప్ ప్రాసెస్ ద్వారా 1890లో మోషన్ పిక్చర్స్‌ను తీయడం మొదలుపెట్టాడు. మైనింగ్, బ్యాటరీ,
రబ్బర్, సిమెంట్ రక్షణోత్పత్తులు - మన జీవితంలో భాగమైపోయిన ఎన్నింటికో ఎడిసన్ ఆద్యుడు. ఆయన ఆవిష్కరణలు సమాజం రూపురేఖలనే మార్చివేశాయి. ఆవిరి యంత్ర దశ నుండి విద్యుత్ కాంతుల్లోకి నాగరికత ప యనించడానికి ఆయన పరిశోధనలే కారణం. 1300 ఆవిష్కరణలపై పేటెంట్ హక్కులు పొందాడు.
ఆయన అంత్యక్రియల రోజు ఆయన గౌరవార్ధం అమెరికా ప్రజలు తమ గృహాల్లో లైట్లను ఆర్పివేసి నివాళి అర్పించారు.
ఎడిసన్ మొదటగా న్యూజెర్సీలోని నెవార్క్ లో పరిశోధకుడిగా తన ప్రస్థానాన్ని ఆరంభించాడు. ఆయన మొదట పని చేసినవి ఆటోమాటిక్ రిపీటర్ మరియు టెలిగ్రాఫిక్ పరికరాలు కానీ అతనికి పేరు
తెచ్చి పెట్టినది మాత్రం 1877 లో కనిపెట్టబడిన ఫోనోగ్రాఫ్. ఈ పరికరాన్ని కనిపెట్టినపుడు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆయనకు మెన్లో పార్క్ మాంత్రికుడు అనే పేరు పెట్టారు..
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ప్రపంచంలో తొలి విశ్వవిద్యాలయం #నలంద. అది భారతదేశంలో ఉండటం మనందరికి గర్వకారణం. #హర్షవర్ధనుడు క్రీ.శ.647లో మరణించాడు. ఇతని ఆస్థానంలో దీర్ఘకాలంగా ఉన్న చైనా యాత్రికుడు #హ్యూనాంగ్ తొలుత పశ్చిమోత్తరంగుండా భారతదేశంలో ప్రవేశించాడు. కాశ్మీర్, నియాల్కోట్,
జలంధర్ మీదుగా కనోజ్ చేరుకున్నాడు. హరుని సన్మానాలు అందుకుని, ప్రయాగ, కాశీ, బుద్ధగయలు సందర్శించి, అస్సాం, బెంగాలు, ఒరిస్సా మీదుగా ఆంధ్రాలో నాగార్జునకొండను, శ్రీపర్వతాన్ని చూసి, కంచి వెళ్లి, మైసూరు మీదుగా మహారాష్ట్రా వెళ్లి, చాళుక్య రాజధాని వాతాపి చూసి #నలంద చేరుకున్నాడు.
అతను భారతదేశం వదలివెళ్లే సమయంలో బుద్ధుని అస్తికలతో పాటు పలు విలువైన తాళపత్ర గ్రంధాలు ఇరవై గుర్రాలపై చైనాకు తీసుకు వెళ్లాడు.
వోల్టేర్, ఏయరిడిసోన్నెరేట్, ఫైలింగ్, జాన్సోల్వెల్వంటి ఐరోపాలోని చాలామంది ప్రముఖ మేధావులు భారతదేశాన్ని “నాగరికత యొక్క ఊయల" గా పిలుస్తారు.
#సురవరం_ప్రతాపరెడ్డి గారు ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారికి కొంత ఆర్థిక సహకారం అందిద్దామనే సదుద్దేశంతో ఆయనను ఒక సంస్థానాధీశురాలి దగ్గరికి తీసుకెళ్లారు. నాడు సంస్థానాధీశులకు సివిల్, క్రిమినల్ అధికారాలు ఉండేవి. నాటి మర్యాదలను అనుసరించి ఆమె పరదాకు ఆవైపు,
ఇవతలివైపు విశ్వనాథ కూర్చున్నారు.
‘‘మీరు చాలా సంప్రదాయికులనీ, మంచి కవిత్వం వ్రాస్తారనీ విన్నాను. కానీ మీరు ‘సాని’ పాటలు కూడా వ్రాశారేమిటండీ?’’ అని ప్రశ్నించిందామె.
ఆమె తన #కిన్నెరసాని పాటలను గూర్చి అడుగుతున్నదని విశ్వనాథకు అర్థమైంది. ‘‘అమ్మా! అది ఈ ప్రాంతంలో ఒక వాగు పేరు.
ఆ పేరుతో పాటలు వ్రాశానే గాని, వాటిల్లో ఎలాంటి అశ్లీలమూ లేదని, ఎంతచెప్పినా ఆమె వినిపించుకోలేదు. ‘మీరు ఎన్నైనా చెప్పండి సాని సానే’ అని ముక్తాయించింది. ఇది విశ్వనాథ అహాన్ని దెబ్బ తీసింది. ‘‘అమ్మా, ఇందాకటినుంచీ పనివాళ్లు మిమ్మల్ని దొరసానీ! అని పిలుస్తున్నారు గదా, దాని సంగతేవిటి?
నా పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. నాన్నగారు కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు. అమ్మగారు కాశీనాథుని సరస్వతీ దేవి గారు. మేము ముగ్గురం సంతానం. నేను పెద్దవాడిని. నాకు ఇద్దరు చెల్లెళ్ళు. శ్యామలా దేవి, గిరిజా దేవి. మా స్వగ్రామం గుంటూరు జిల్లా,
రేపల్లె తాలూకాలోని ’పెదపులివర్రు’ అనే గ్రామం. మా తాతగారు పరమ నిష్ఠాగరిష్టుడు. మనదేశానికింకా స్వాతంత్ర్యం రాక ముందు జరిగిన సంఘటన. తాతగారు కాంగెస్ వాలంటీర్లకి భోజనం పెట్టారనే నెపంతో బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని అరెస్టు చేసి జైలులోపెట్టారు. అందుకు నిరసనగా జైలులో ఉన్నంతకాలం భోజనం
ముట్టకుండా కేవలం కొబ్బరినీళ్ళతోనే బ్రతికిన అభ్యుదయవాది. అలాంటి తాతగారికి మనవడిగా పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. వారి సద్గుణాలు అంతగా నాకు అబ్బకపోయినా ఇలాంటి సమయంలో వారిని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.
నా బాల్యం. ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో
ఐఎండీబీ టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో ‘కాంతార’ నంబరు 1గా నిలిచింది. ఇతర సినిమాల వివరాలివీ..
‘కాంతార’ (Kantara).. ప్రస్తుతం అన్ని చోట్లా ఈ పేరే మారుమోగుతోంది. నెట్టింట ఈ కన్నడ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం
హాట్ టాపిక్‌గా మారుతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది. అధిక వసూళ్లతోపాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంటోంది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ (IMDb) ప్రకటించిన ‘టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్’ (IMDb Top 250) జాబితాలో
తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. తమ యూజర్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించింది. సోషల్ మీడియా వేదికగా ఆ వివరాలు పంచుకుంది.
నంబర్ 1గా ‘కాంతార’ ఉండగా 2వ స్థానంలో రామాయణ (1993), 3లో రాకెట్రీ (2022), 4లో నాయకన్ (1987), 5లో అన్బే శివం (2003),
ఆంధ్రవిద్యా వయో వృద్ధులలో గణ్యులు. వీరు బహుభాషా కోవిదులు. ఆంధ్రాంగ్ల గీర్వాణములయందును, కన్నడము, తమిళము, హిందీ, ఉర్దూ, పారసీక భాషలయందు వీరు పాండిత్యము సంపాదించారు. వీరు "భారతి" వంటి సుప్రసిద్ధ సారస్వత పత్రికాముఖముల ప్రకటించిన వ్యాసములు శతాధికములు.
వీరు వ్రాసిన ప్రసిద్ధ వ్యాసములు - రామాయణము లోని వానరులు నరులు కారా? నిజముగా వానరులే అగుదురా? అను విషయములను గూర్చియు, ప్రాచీన కాలమున సంస్కృతము దేశభాషగా నుండెనా? ఆంధ్రులెవరు? అను సమస్యలనుద్ధేశించియు, ఆనందరంగరాట్చందమును గూర్చియు, శ్రీ పంతులు గారు వ్రాసిన వ్యాసములు అమూల్యములు.
వంగోలు వెంకటరంగయ్య
జననం : 1867, అక్టోబరు 18, నెల్లూరు
మరణం : 1949, జూన్ 9
ప్రసిద్ధి : పండితుడు, బహుశాస్త్రవేత్త
తండ్రి : వంగోలు శేషాచలపతి
తల్లి : సీతమ్మ
అతడు ఓషధులకు అధిపతి (సోమః ఓషధీనా మధిపతిః). అసమాన సౌందర్యం అతని స్వంతం. అయినా సూర్యోదయమవగానే చంద్రుడు తేజస్సును కోల్పోతాడు. అతనిలో ఉన్న అమృతము కూడా అతని కళలను నిలుపలేదు. రాత్రనేది చంద్రుని భవనమయితే, పగలు సూర్యుని భవనంగా చెపుతారు. పరాయి ఇంటిలో ఉండవలసి వస్తే ఎవరికయినా ఆశించిన
గౌరవం లభించదు. పరాయి పంచన బ్రతకడం ఎంతవారికయినా దుఃఖమయమే అంటాడు, #చాణక్యుడు.
మన ఇంటిలాంటిది "స్వధర్మం". ఇతరుల ఇంటిలాంటిది "పరధర్మం". ఎంత జాగ్రత్తగా, భయభక్తులతో ఉన్నా పరాయి ఇంటిలో ప్రశాంతత ఉండదు. అదే మన ఇంటిలో మనమెలా ఉన్నా సుఖంగా ఉంటుంది.