వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ, త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపో, కుంకుమో,
అక్షతలో వేయాలి. అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి. ఆరోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మనమీద పడినా చాలు. కీటాశ్చ - పురుగులు; మశకాశ్చ - దోమలు, ఈగలు మొదలైనవి, అంతే కాదు చెరువు ఉంది అనుకోండి అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి. అవి జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి. నీటిలో
ఉన్న పురుగులు, భూమిమ ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతోందో ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుగాక! వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగాక! అవి తొందరలో మనుష్య జన్మ
పొంది ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుష్ఠానము చేసి భగవంతుణ్ణి చేరుగాక!అని శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు.ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం.దీపపు కాంతి పడితేనే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక ఆ దీపం పెట్టిన వాడు ఎంత ప్రయోజనాన్ని పొందాలి?
ఎంత గొప్పగా ఆలోచించిందో కదా మన ధర్మం. అదీ ఋషి హృదయం. అదీ భారతీయ సనాతన ధర్మం🙏🙏🙏
సవరణ: పైన చెప్పిన శ్లోకం కార్తీక దీపారాధన చేసినప్పుడు ఎప్పుడైనా చెప్పొచ్చు, భావన చేయవచ్చు. కార్తీక పౌర్ణమి నాడే కాదు అని గమనించండి. ఈ మాసం అంతా ఎప్పుడు దీపారాధన చేసినా చెప్పవచ్చు అని నా అభిప్రాయం😊🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#తెలుగు #పంచపాషాణాలు
తెలుగులో పంచపాషాణాలు అని ఐదు పద్యాలు ఉన్నాయి.అవి తెలుసా మీకు? చదవడమే చాలా కష్టం.
ఆంగ్లంలో చెప్పాలి అంటే
Most difficult & tongue-twisting poems
చాలా బాగుంటుంది నేర్చుకుంటే.పెద్ద వాళ్లు కూడా ప్రయత్నం చేయవచ్చు.
అందులో ఒకటి కవి భారవి రచించారు. మరో నాలుగు మహాకవి వీరశైవకవి పాల్కురికి సోమనాధుడు రచించారు (శివతాండవము చూసిసినట్టే అనిపిస్తుంది చదువుతుంటే).
అవధరించి తరించండి👍
#శివుడేడి ఆశువుగా రాయబడినది
మొదట నువ్వెవరివి?
చిన్న కణమువి.సృష్టించబడిన జీవివి.తల్లి గర్భంలో పుట్టి పెరిగిన జీవివి.స్త్రీవో పురుషునివో నపుంసకునివో.అప్పుడు కులమెరుగవు మత మెరుగవు.కేవలం నవ్వు ఆనందం ఆటలు.నెమ్మదిగా కల్మషం అంటుతుంది.అరిషడ్వర్గాలు మొదలవుతాయి.నా కులం,నా మతం,నా నాయకుడు
నా హీరో,హీరోయిన్,నా దేవుడు,నాది, నావి,నాపార్టీ,నాగజ్జి,నా దురద.ఇలా 'నా'దులు పెరుగుతాయి.స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు చెదిరిపోతుంది. నిర్మలమైన నదిలో అలజడుల సుడులు చెలరేగుతాయి.ప్రశాంతత పోతుంది,శాంతము లేక సౌఖ్యము లేదు.
పుట్టినది పెరుగుతుంది,తిరుగుతుంది, తింటుంది.కొన్నాళ్ళకు శక్తి తగ్గి
బలము తగ్గి,నశించడం ప్రారంభమవుతుంది.వ్యాధులు పుట్టుకొస్తాయి.ముడతలు పడతాయి,జుట్టు తెల్లబడుతుండు.నొప్పులు.కొన్నాళ్లకు పడిపోతుంది.ఆత్మ నాశనము లేనిది అని కదా పరమాత్మ భగవద్గీతలో చెప్పారు.సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుంది.నరకమో స్వర్గమో ఏలోకమో,శిక్షలు అమలవుతాయి.అది రహస్యం.చేసిన కర్మలు