‘తెలుగు, తమిళ భాషల్ని ఉత్తర దేశీయులకి కూడా నేర్పించాలి’ అని, భారత ప్రధాని సెలవిచ్చారు. ‘పెద్ద దానికి పెళ్లి లేదు, కడదానికి కల్యాణం’ అన్నట్టుంది. తెలుగు వాళ్లే తెలుగును పట్టించుకోకుండా వుంటే, ఇతర భాషల వాళ్లు నేర్చుకుంటారా? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ
తెలుగుకి ఎంత గౌరవం ఇస్తున్నాయో చూస్తున్నాం. గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమం కొనసాగించాలంటున్నారు గానీ, తెలుగు గురించి కాదు. తమిళ రాష్ట్రం తమ భాషకి ఇచ్చే ప్రాధాన్యాన్ని చూసి మనం తలదించుకోవాలి. ఇంగ్లీషు దినపత్రికల్లో కూడా, ప్రభుత్వ ప్రకటనలు – పూర్తి పేజీ – తమిళంలోనే వుంటాయి.
ఎక్కడ చూసినా తమిళం ప్రముఖంగా వుంటుంది. ఆంగ్లం రెండోది. విదేశీయులు కూడా వచ్చి చదువుకుంటున్న #మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో బోర్డులన్నీ తమిళంలోనే వుంటాయి. కింద ఇంగ్లీషు! #తెలుగు వారికి ఆంగ్లం మీద మోజు. తెలుగు అక్కర్లేదు ఏ ఇంట చూసినా, చక్కని తెలుగు పదాలున్నా – ఇంగ్లీషే పలుకుతారు.
వెజిటబుల్స్, ఆయిల్స్, షుగర్, కట్ చెయ్యడం, ఫ్రై చెయ్యడం ఈ మాటలే ఎప్పుడూ. కూరగాయలు, నూనెలు, పంచదార, తెలుగు మాటలు ఎందుకు ఉపయోగించరు? పనిమనిషి కూడా ‘లేటు’ అనే అంటుంది. ఆలస్యం అనే చక్కని తెలుగు మాట అంతరించిపోయింది. స్కూళ్ళల్లో ‘కమిన్’, ‘సిడ్డవున్’, ‘కమ్‌హియర్’ అంటున్నారు గానీ,
తెలుగు మాట్లాడరు. ప్రభుత్వం వారు – అధికార భాష అని పెట్టి, దానికి అధికారినీ, కార్యాలయాన్నీ ఏర్పాటు చేశారు. భాషకి ఒక మంత్రిత్వ శాఖ కూడా వుంది. భాష, సాంస్కృతిక మండలి వేరే వుంది. ఐనా, లేఖలన్నీ ఆంగ్లంలోనే వస్తాయి! అమరావతి ప్రారంభ ఫలకం మీద ఆంగ్ల భాషే వుంది! చాలా ప్రభుత్వ కార్యాలయాల మీద
బోర్డులు ఆంగ్లంలోనే వుంటాయి. తెలుగుకి ప్రాచీన హోదా కావాలని పోరాడారు తప్ప, భాషాభివృద్ధికి ఎవరేం చేస్తున్నారు గనక? మొన్నటిదాకా, ‘దేశంలో మాట్లాడే భాషల్లో తెలుగు రెండో స్థానంలో వుంది’ అని గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు మూడోస్థానానికి పడిపోయింది!
ఇద్దరు తెలుగువాళ్లు కలుసుకుంటే
ఇంగ్లీషులో మాట్లాడుకునే సంప్రదాయం మనది! అది జాడ్యమో, నామోషీయో తెలీదు. ఉన్న చక్కని తెలుగు మాటల్ని ఉపయోగించం గానీ, రబ్బరు, పెన్సిలు, కంప్యూటరు, బాల్‌పాయింట్ పెన్ లాంటి మాటలకి తెలుగు మాటలేమిటి అని ఆలోచిస్తాం.
అసలు, ముందు భాష ఇంట్లో ఆరంభం కావాలి. పిల్లలు బడికి వెళ్తున్నప్పుడు,
‘బై’లు, కనిపిస్తే ‘హై’లూ మారాలి. పిల్లలు బయల్దేరుతున్నప్పుడు, ‘వాటర్ బాటిల్ పెట్టుకున్నావా? ఫుడ్ బాక్స్, బుక్స్ సర్దావా? సాక్స్ వేసుకో’ అన్న తల్లుల మాటలు వింటున్నాం. వీటన్నింటికీ తెలుగు మాటలున్నాయి. తల్లులు, తండ్రులూ వాడరు; పిల్లల చేత పలికించరు!
ఇహ, మమ్మి, డాడీ, ఆంటీ, అంకుల్ సరేసరి!
ఇటీవలే కేరళ ప్రభుత్వం అన్ని స్కూళ్ళలోనూ మలయాళం కచ్చితంగా బోధించాలి – అని శాసనం చేసింది. ఇప్పుడు తామర తంపరగా పెరిగిపోతున్న ఎల్‌కేజీ, యూకేజీ స్కూళ్ళలో, ‘కచ్చితంగా తెలుగు చెప్పాలి, అలా అయితేనే అనుమతి ఇస్తాం’ అని విద్యాశాఖ శాసించాలి.
ఇంకా, ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్’, ‘రింగా రింగా రోజెస్’ పద్యాలే పిల్లలకి నేర్పుతున్నారు. ఒక వేమన పద్యమో, సుమతీ శతకమో ఎందుకు నేర్పరు – తెలుగు బడులే కదా. బడికి రాగానే వందేమాతరమో, మా తెలుగు తల్లికో – ఎందుకు పాడించరు? కామరాజ్ విశ్వవిద్యాలయంలో 10 గంటలకి తరగతులు ఆరంభమయ్యే
వేళకి వచ్చే విద్యార్థులందరూ, సమావేశమై ‘తమిళ్ తాయ్’ (తమిళ తల్లి) పాడి, తరగతులకి వెళ్ళాలి. ‘మన భాషని మనం కాపాడుకుందాం’ అని తెలుగువాళ్లం అంటున్నాము గానీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల వాళ్లు అనడం లేదు! ‘మాకు తెలుగు వద్దు, ఆంగ్లమే ముద్దు’ అంటారా –
‘మా తెలుగు తల్లికి ముళ్ల పూదండ, మా కన్నతల్లికి మంగళారతులూ’ అని పాడి, మంగళహారతి ఇచ్చేసి ‘స్వస్తి’ పలికేయండి. పీడా వదిలిపోతుంది!
- కీ. శే. రావి కొండలరావు గారు (11 ఫిబ్రవరి 1932 - 28 జులై 2020)
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
కృత్తికా నక్షత్రంపై #చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీకమాసంలో సూర్యుడు తులాసంక్రమణలో ప్రవేశించగానే గంగానదితో సరి సమానంగా సమస్త జలాలు విష్ణుమయం కావడంతో కార్తిక స్నానం చేసినవారు పుణ్యప్రదులు కావడమే కాకుండా, వాపీ కూప,
నదీ స్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన అశ్వమేధ ఫలాన్ని పొందుతారని #వసిష్ఠ మహర్షి వివరణ. చంద్రుని వారమైన #సోమవారం#శివునికి ఎంతో ప్రీతికరమైనది. కార్తిక మాసములో వచ్చే ప్రతి దినము అత్యంత పుణ్య ప్రదముగా చెప్పవచ్చు, ఈ మాసములో ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి తల మీద నుంచి స్నానం చేసి
శుభ సంప్రదాయకరమైన దుస్తులు ధరించి శివ దర్శనము కావించి ధూప దీప నైవేద్యములు సమర్పించి స్వామికి రుద్రాభిషేకం జరిపించిన, చేసిన పాపాలు పోయి మోక్ష ప్రాప్తి కలుగును అని కార్తీక పురాణాది ఇతిహాసములు తెలుపుతున్నవి. ఈ మాసంలో వస్త్రదానం, హిరణ్యదానం, కన్యాదానం, భూదానం చేస్తే విశేష ఫలితాలు
ఒక యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది.
ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన భార్య చెప్పింది. “నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది.”
ఇంటి యజమాని పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో
తాంబూలాన్ని ఉమ్మేశాడు. మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది. ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం.
బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు అన్నాడాయన. ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప. ఆయన భార్యకు ఇది నచ్చలేదు. “మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం” అని నచ్చచెప్పింది.