వెన్నెలకంటి రాఘవయ్య..
(జూన్ 4, 1897 - నవంబరు 24, 1981)
నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా శింగపేట గ్రామంలో 1897, జూన్ 4 న జన్మించారు.
తల్లిదండ్రులు సుబ్బమ్మ, పాపయ్యలు. అయిదో యేట తల్లిని పోగొట్టుకున్నారు. అక్క దగ్గర పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం శింగపేట, అల్లూరు. 1909లో నెల్లూరు వెంకటగిరి రాజా ఉన్నత పాఠశాల. మద్రాసు పచ్చియప్ప కళాశాలలో 1918లో బి.ఎ. చదివారు.
తొలి కార్యదర్శి .పొణకా కనకమ్మ, బాలసరస్వతమ్మ, వేమూరి లక్ష్మయ్య, చతుర్వేదుల వెంకటకృష్ణయ్య వంటి వారిని సంఘటితంచేసి 'స్వరాజ్య సంఘం' స్థాపించారు. 1928లో బి.ఎల్. పట్టా పొంది న్యాయవాద వృత్తి చేపట్టారు.
వెంకటగిరి రాజాకు, రైతులకు మధ్య కొనసాగిన వివాదాల్లో ఆచార్య ఎన్. జి. రంగా గారితో కలసి
రైతుల పక్షాన నిలిచి పోరాడారు. ప్రకాశం పంతులుతో కలిసి స్వరాజ్యోద్యమంలో ఉత్సాహంతో పాల్గొన్నారు. పెన్నార్-కృష్ణ ప్రాజెక్టు కోసం ఆందోళన జరిపారు. 1929లో 'ఆది-ఆంధ్ర ఉద్ధరణ సంఘం' ఏర్పాటు చేశారు. ఆ సంఘం పక్షాన హరిజన బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు ఏర్పరచారు.
1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర
శాసనసభకు ఎన్నికయ్యారు. 1947 వరకు ప్రకాశంపంతులుకి పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు. ప్రజలు ఆయన్ని "నెల్లూరు గాంధీ" అని పిలిచేవారు.
ఎరుకలు, యానాదులు, లంబాడీలు, చెంచులు, బుడబుక్కల, ఇతర సంచార, విముక్త ఆదిమ జాతుల్ని సంఘటితంచేసి వారిలో చైతన్యం తెచ్చాడు. గిరిజనుల జీవిత సమస్యలపై అనేక
గ్రంథాలు వ్రాశారు. వారి హక్కుల కోసం పోరాడారు. హాస్టళ్లు కాలనీలను ఏర్పాటు చేశారు. భారతీయ ఆదిమజాతి సేవక్ సంఘ్‌లో సభ్యులు. థక్కర్ బాపాతో కలసి గిరిజనులను మైదాన ప్రాంతాల వారి దోపిడీ నుంచి రక్షించడానికి కృషి చేశారు. క్రిమినల్ ట్రైబ్స్ చట్టం 1952లో రద్దు చేయించారు.
బాలికలను అమ్మే పనిమనుషులుగా మార్చే ఆచారాన్ని గిరిజనులు తిరస్కరించేలా చేశారు.
1973లో పద్మభూషణ్ అవార్డు పొందారు.
1981, నవంబరు 24 న తుదిశ్వాస విడిచారు..
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
అశోక వనంలో #రావణుడు, #సీతమ్మ వారి మీదకోపంతో కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.. #హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి' అని..
కానీ మరుక్షణంలోనే #మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు!
ఆశ్చర్య చకితుడయ్యాడు.
"నేనే కనుక ఇక్కడ లేకపోతే, సీతమ్మను రక్షించే వారెవరు? అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు!
బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, 'నేను లేకపోతే ఎలా?' అని.
సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు.
అప్పుడు హనుమంతుడుకి అర్థమైంది 'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో, వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని..
మరింత ముందుకు వెళితే
త్రిజట.. తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ, దాన్ని నేను చూశాను అనీ చెప్పింది.
‘తెలుగు, తమిళ భాషల్ని ఉత్తర దేశీయులకి కూడా నేర్పించాలి’ అని, భారత ప్రధాని సెలవిచ్చారు. ‘పెద్ద దానికి పెళ్లి లేదు, కడదానికి కల్యాణం’ అన్నట్టుంది. తెలుగు వాళ్లే తెలుగును పట్టించుకోకుండా వుంటే, ఇతర భాషల వాళ్లు నేర్చుకుంటారా? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ
తెలుగుకి ఎంత గౌరవం ఇస్తున్నాయో చూస్తున్నాం. గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమం కొనసాగించాలంటున్నారు గానీ, తెలుగు గురించి కాదు. తమిళ రాష్ట్రం తమ భాషకి ఇచ్చే ప్రాధాన్యాన్ని చూసి మనం తలదించుకోవాలి. ఇంగ్లీషు దినపత్రికల్లో కూడా, ప్రభుత్వ ప్రకటనలు – పూర్తి పేజీ – తమిళంలోనే వుంటాయి.
ఎక్కడ చూసినా తమిళం ప్రముఖంగా వుంటుంది. ఆంగ్లం రెండోది. విదేశీయులు కూడా వచ్చి చదువుకుంటున్న #మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో బోర్డులన్నీ తమిళంలోనే వుంటాయి. కింద ఇంగ్లీషు! #తెలుగు వారికి ఆంగ్లం మీద మోజు. తెలుగు అక్కర్లేదు ఏ ఇంట చూసినా, చక్కని తెలుగు పదాలున్నా – ఇంగ్లీషే పలుకుతారు.