అశోక వనంలో #రావణుడు, #సీతమ్మ వారి మీదకోపంతో కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.. #హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి' అని..
కానీ మరుక్షణంలోనే #మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు!
ఆశ్చర్య చకితుడయ్యాడు.
"నేనే కనుక ఇక్కడ లేకపోతే, సీతమ్మను రక్షించే వారెవరు? అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు!
బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, 'నేను లేకపోతే ఎలా?' అని.
సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు.
అప్పుడు హనుమంతుడుకి అర్థమైంది 'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో, వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని..
మరింత ముందుకు వెళితే
త్రిజట.. తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ, దాన్ని నేను చూశాను అనీ చెప్పింది.
అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు.
తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం? అనుకున్నాడు
అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు.
తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు..
హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు, హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు.
అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని పై ఉంచాడు అని.
ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే, విభీషణుడు ఆ మాట చెప్పగానే, రావణుడు ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం . తోకకు నిప్పు పెట్టండి' అన్నాడు.
అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది
#త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. "ప్రభువు నాకే చెప్పి ఉంటే, నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి!" ఆలోచనల పరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు.
పరమాశ్చర్యం ఏంటంటే! వాటన్నిటికే ఏర్పాట్లు
#రావణుడే స్వయంగా చేయించాడు.
అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు, తనకు "లంకను చూసి రా" అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది!
అందుకే ప్రియ మిత్రులారా! ఒకటి గుర్తుంచుకోండి.
ప్రపంచంలో జరుగుతున్నదంతా #ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది.
మనమంతా కేవలం నిమిత్తమాత్రులం.
అందువల్ల..
నేను లేకపోతే ఏమవుతుందో..
అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు
'నేనే గొప్పవాడి'నని గర్వపడవద్దు.
భగవంతుడి కోటానుకోట్ల దాసులలో
అతి చిన్నవాడను అని ఎఱుక కలిగి ఉందాం..
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
వెన్నెలకంటి రాఘవయ్య..
(జూన్ 4, 1897 - నవంబరు 24, 1981)
నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా శింగపేట గ్రామంలో 1897, జూన్ 4 న జన్మించారు.
తల్లిదండ్రులు సుబ్బమ్మ, పాపయ్యలు. అయిదో యేట తల్లిని పోగొట్టుకున్నారు. అక్క దగ్గర పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం శింగపేట, అల్లూరు. 1909లో నెల్లూరు వెంకటగిరి రాజా ఉన్నత పాఠశాల. మద్రాసు పచ్చియప్ప కళాశాలలో 1918లో బి.ఎ. చదివారు.
తొలి కార్యదర్శి .పొణకా కనకమ్మ, బాలసరస్వతమ్మ, వేమూరి లక్ష్మయ్య, చతుర్వేదుల వెంకటకృష్ణయ్య వంటి వారిని సంఘటితంచేసి 'స్వరాజ్య సంఘం' స్థాపించారు. 1928లో బి.ఎల్. పట్టా పొంది న్యాయవాద వృత్తి చేపట్టారు.
వెంకటగిరి రాజాకు, రైతులకు మధ్య కొనసాగిన వివాదాల్లో ఆచార్య ఎన్. జి. రంగా గారితో కలసి
‘తెలుగు, తమిళ భాషల్ని ఉత్తర దేశీయులకి కూడా నేర్పించాలి’ అని, భారత ప్రధాని సెలవిచ్చారు. ‘పెద్ద దానికి పెళ్లి లేదు, కడదానికి కల్యాణం’ అన్నట్టుంది. తెలుగు వాళ్లే తెలుగును పట్టించుకోకుండా వుంటే, ఇతర భాషల వాళ్లు నేర్చుకుంటారా? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ
తెలుగుకి ఎంత గౌరవం ఇస్తున్నాయో చూస్తున్నాం. గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమం కొనసాగించాలంటున్నారు గానీ, తెలుగు గురించి కాదు. తమిళ రాష్ట్రం తమ భాషకి ఇచ్చే ప్రాధాన్యాన్ని చూసి మనం తలదించుకోవాలి. ఇంగ్లీషు దినపత్రికల్లో కూడా, ప్రభుత్వ ప్రకటనలు – పూర్తి పేజీ – తమిళంలోనే వుంటాయి.
ఎక్కడ చూసినా తమిళం ప్రముఖంగా వుంటుంది. ఆంగ్లం రెండోది. విదేశీయులు కూడా వచ్చి చదువుకుంటున్న #మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో బోర్డులన్నీ తమిళంలోనే వుంటాయి. కింద ఇంగ్లీషు! #తెలుగు వారికి ఆంగ్లం మీద మోజు. తెలుగు అక్కర్లేదు ఏ ఇంట చూసినా, చక్కని తెలుగు పదాలున్నా – ఇంగ్లీషే పలుకుతారు.