అరవై దాటేలోపు ఆరుసార్లు అమెరికాకైతే వెళ్ళగలిగాను కానీ ఫ్లైట్లో ఇచ్చిన చిన్నఫారమే సరిగ్గా నింపలేకపోయాను. ఆ ఫారమ్‌లో నేమ్ అన్న దగ్గర ఫస్ట్‌నేమ్, మిడిల్‌నేమ్, లాస్ట్‌నేమ్ అని మూడుగళ్ళున్నాయి.
మనకు తెలిసిందల్లా మనపేరు, దాని
వెనకాముందు ఓ ఇంటిపేరు. ఆది మధ్యాంతరాలు ఏవో తెలియక ఎలాగోలా ఆ గళ్ళు నింపి బయటపడ్డా. ఇంటిపేర్లు తెచ్చిన తంటా ఎలాంటిదంటే ఒకసారి భయస్తుడైన ఉద్యోగి సర్ నేమ్ అన్నకాలమ్ ఎదుట స్వామిభక్తితో వాళ్ళ బాస్ పేరు రాస్తే, అతి భయస్తుడైన భర్త ఎందుకొచ్చిన గొడవని సర్‌నేమ్ అన్న కాలమే కొట్టేసి
మేడమ్ నేమ్ అని రాసేసుకుని దాని ఎదురుగా వాళ్ళావిడ పేరు రాసేసి గొప్ప రిలీఫ్‌గా ఫీలయ్యాడట.
గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతిగా మేకా రంగయ్య అప్పారావు గారి తరువాత జస్టిస్ ఆవుల సాంబశివరావు గార్ని నియమిస్తే పత్రికల వాళ్ళు మేకలు పోయి ఆవులొచ్చాయి అని చమత్కరించారు.
ఏనుగు లక్ష్మణకవి,
కాశీయాత్ర రాసిన ఏనుగుల వీరాస్వామయ్య మనందరికీ పరిచయమే. గుంటూరు ప్రాంతంలో పూర్వం కొందరు ముర్రాజాతి గేదెపాలు అమ్మేవారట. ఆ గేదెకొమ్ములు జంగిలి (అడవి) దున్నల కొమ్ముల్లా ఉండటంతో వూరి వాళ్ళందరూ జంగిలి వాళ్ళింట్లో పాలు కొంటాం అనడంతో వాళ్ళ ఇంటిపేరు జంగిలి అయిపోయిందట.
మనదేశంలో ఇంటిపేర్లు అమెరికా పోయిన మన వాళ్ళకు పేర్లే కావడంతోనే ప్రమాదం. పోయినసారి అమెరికా వెళ్ళినప్పుడు మా బావ ఆనంద్ గారి ఇంట్లో ఫోన్ రింగైతే నేను ఎత్తితే అవతలి నుంచి ‘పిల్లి స్పీకింగ్’ అనగానే కంగారుపడ్డా. తరువాత మా బావ చెప్తే తెలిసింది వారు పిల్లి సురేష్ గారని.
అదే ఏ పులి వెంకటరెడ్డిగారో ఎత్తితే పులి గాండ్రింగ్ అనో, పాముల నర్సయ్యగారో ఎత్తితే పాములు బుస్సింగో అంటారేమో.
మిగిలిన వాళ్ళేం తక్కువ. వాళ్ళు దూడల స్పీకింగనో, ‘కోడి’ కేరింగనో, కాకి ‘కావిం’గనో అనేస్తే, అవి విని మనం కెవ్వుకెవ్వు అనాల్సొచ్చేది.
అమెరికాలో సైతం వృత్తులను ఆధారంగా చేసుకుని ఇంటిపేర్లు వస్తాయట. కమ్మరి పనిచేసేవాళ్ళు smith లు అయితే వడ్రంగి పనిచేసే కుటుంబాలు woods అవుతారు.
కంచి, మధురాంతకం, తిరువీధుల, రామేశ్వరం, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలతో పాటు గుడివాడ, బెజవాడ, గూడూరు, కడప, కావలి, చల్లపల్లి, కొండపల్లి, గుంటూరు, టంగుటూరు, దర్శి, తెనాలి వూళ్ళు ఇంటిపేర్లయ్యాయి.
నీళ్ళకు సంబంధించిన చెఱువు, బురదగుంట, కోనేరు, తూము, నూతి,
కడలి, రేవు, కలువ కొలను, కాలువ ఇంటిపేర్లయ్యాయి.
పక్షులైన డేగలు, కోడి, పిచ్చుకలు, కాకి, పావురాల, నెమలి, కొంగర, చిలక, పిట్టల, గువ్వల ఇంటిపేర్లే. కోడి రామ్మూర్తి గారు గతంలో గొప్ప మల్లయోధులు. ఇలాంటి ఇంటిపేర్లతో ప్రమాదమేమిటంటే డేగలవారింటి అబ్బాయికి పిచ్చుకల వారింటి అమ్మాయిని
ఇవ్వడానికి వెనుకాడతారేమో. అసలే మన జాతకాలు (హర్రర్‌స్కోప్) చూసేవాళ్ళు దేవగణం, రాక్షస గణం, మనిషిగణం అని లెక్కలేసి అమ్మాయి పులి అయితే అబ్బాయి పిల్లి అయ్యాడనో భయపడి పులి తినేస్తుందని (కాకపోయినా అదే జరిగేది) పెళ్ళికి వెనకాడతారు.
ఉత్తర భారతదేశంలో ఇంటిపేర్ల కథ వేరే విధంగా ఉంటుంది.
అగ్నిహోత్రం చేసే కుటుంబాలు అగ్నిహోత్రులు. వారణాశి ప్రాంతంలో నాలుగు వేదాలు చదివిన పండిత కుటుంబీకులు చతుర్వేదులైతే, మూడువేదాలు చదివినవారు త్రివేదిలు, రెండే చదివితే ద్వివేది. సామవేదం చదివితే సామవేదం వారౌతారు.
అదే ఫ్లోలో ఏ వేదమూ చదవని కుటుంబీకుల్ని నిర్వేదులనాలేమో.
బెంగాలీలో బంధోపాధ్యాయులు, చటోపాధ్యాయులు, ముకోపాధ్యాయుల్ని ఎక్కువగా చూస్తాం. నా పరిమిత జ్ఞానంతో ముకోపాధ్యాయులు అంటే ముక్కుతో చదివేవారేమో అనుకునేవాడ్ని. వాజపేయుల, సోమయాజుల ఇలాంటివే మరికొన్ని.
ఉత్తర భారతదేశంలోని పేర్లమీద మోజుతో ప్రగతిశీలులైన మన తెలుగు సోదరులు
కొందరు చాలాకాలం క్రిందటే వాళ్ళ పిల్లలకు టాగూరనో, రాయ్ అనో, ఛటర్జీ అనో, బెనర్జీ అనో, గాంధీ అనో, బోస్ అనో పేర్లు పెట్టేసారు. ఇలా పేర్లు పెట్టడం బాగానే ఉంది కాని నిజానికి అవి వాళ్ళ పేర్లుకావు. హౌస్‌నేమ్స్. ఇది గుర్రాన్ని వదిలి కళ్ళాన్ని పట్టుకున్నట్లే. పేరు ఏదైనేం లెండి అటువంటి
పెద్దల పట్ల మనవాళ్ళకు గల భక్తి, గౌరవాలను మనం మెచ్చుకుందాం.
సంగీత ప్రపంచానికి చెందిన సంగీతం, చిడతల, మేళం, అందెల, గజ్జెల, తప్పెట, సన్నాయిలతో పాటు రణరంగానికి చెందిన ఈటెల, బల్లెం, కత్తుల, ఉండేలు, బాణాల, కత్తి, రంపాల కూడా ఇంటిపేర్లయ్యాయి. వృక్ష సంపదనుండి అడవి, తోట, అరణ్య, టేకు,
సువాసనలైన గంథం, జవ్వాజి, కస్తూరిలు (‘ఇంటిపేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు’ అనే నానుడి తెలిసిందే) ఇంటిపేర్లే!
మా మేనమామ గారి ఇంటిపేరు కస్తూరేగాని వాళ్ళింట్లో గబ్బిబాలు లేవు. పూలకుటుంబం నుండి పూదోట, పుష్పాల, పువ్వుల సంపంగి, మల్లెల, మొగలి వచ్చి చేరాయి. పువ్వుల సూరిబాబు గొప్ప రంగస్థల నటులు. పాలకు పలురూపాలైన పాలపర్తి, మజ్జిగ, పెరుగు, వెన్న, నేతి, చల్లలు ఇంటిపేర్లే అల్లం, మిరియాలు,
శొంఠిలతోపాటు కారం, ఉప్పు, బెల్లపు కూడా ఇంటిపేర్లే. పాయసం, పానకం, గంజి కూడా ఇంటిపేర్లే.
పెద్దింటి, పెద్దిరెడ్డిలు ఇంటిపేర్లే. కరణం మల్లీశ్వరి గొప్ప క్రీడాకారిణి. తలారి అనంతబాబు గారు ప్రఖ్యాత న్యాయవాది. మనశరీరంలోని గెడ్డపు, మీసాల, గడ్డం, సవరం, కొప్పు, కొప్పుల, శ్రీపాద, బొడ్డు, బుర్రా, బొజ్ఞా, కడుపు, చెవి, మెడబలిమి, ముక్కు, తలతోటి, పచ్చిగోళ్ళు,
గుంటకండ్ల, మొండెం కూడా ఇంటిపేర్లే. న్యాయవాదులుగా ఖ్యాతిపొందిన కొందరికి ప్రతివాది, మహావాదిలుగా ఇంటిపేర్లయ్యాయట.
కొంతమంది అదృష్ట దీపక్‌లను చూస్తే ఆవగింజంత విద్వత్తు, ప్రతిభలేకపోయినా (కాకా) పట్టు పరిశ్రమలో శ్రమించడం వలన రాజ్యసభసభ్యులుగా, ఛైర్మెన్‌లుగా ఎదగడం చూసిన తరువాత వారి
ఇంటిపేర్లును ‘పట్టు’ గా మార్చేసి పట్టుప్రవీణ్, పట్టుప్రసాద్ అనాలపిస్తుంది. సాధారణంగా వీరికి ఏ పార్టీ సిద్ధాంతల మీద నమ్మకం ఉండదు. వీరు మేము ఎప్పటికీ రూలింగ్ పార్టీనే అని రూలింగ్ ఇచ్చుకున్నఘనులు కనుకనే ఎప్పుడూ ఏదో ఒక పదవిలో ఉండగలరు. వీరి చేత Great Art of Staying in power
అన్న పుస్తకం రాయిస్తే The Best Seller అయిపోతుంది. వీరు సిల్క్ బోర్డ్ అధ్యక్షులు కాదగినవారు. పట్టు తోబుట్టువు పుట్టు. కేవలం కొంతమందికి పుట్టినందుకు వీరు నటులైతే తెరంగేట్రం చేసేసి, నాయకులైతే యువనాయకులై పోయి మనల్ని వినోదింపజేస్తున్నామని, సేవించేస్తున్నామని భ్రమింపచేస్తారు.
వెనకటికి బ్యాట్ ఎటువైపు పట్టుకోవాలో కూడా సరిగ్గా తెలియని యువకుడు ముఖ్యమంత్రి కుమారుడైనందున ఏకంగా రంజీట్రోఫీనే ఆడేశాడు. ఇలాంటి వాళ్ళ ఇంటిపేరు ‘పుట్టి’ గా మార్చేస్తే సరిపోతుంది. నాట్యంలో ముద్రలంటే పోస్టాఫీస్ ముద్రలనుకునే వాళ్ళకు పద్మశ్రీలు వచ్చాయిగా. వీళ్ళూ పట్టు పారిశ్రామికులే.
వీరి పుణ్యాన పట్టు పరిశ్రమకున్న డిమాండ్ ఇంక దేనికీ లేదు.
ద్వాదశి, నమశ్శివాయ, విష్ణుమొలకల, సరస్వతుల, భాగవతుల, రామాయణం, గుడిసేవ, గుడిమెట్ల లు ఇంటిపేర్లు. పెళ్ళికి సంబంధించిన కళ్యాణం, మేళం, అగ్నిహోత్రం ఇంటిపేర్లే. కళ్యాణం రఘరామయ్యగారు మన తొలి సినిమా కృష్ణులు, ఈలపాటకు ప్రసిద్ధులు.
డాక్టరేట్ సాధించాడు. ఏది ఏమైనా ఇంటిపేర్లువాటిపుట్టు
పూర్వోత్తరాలు మంచి పరిశోధనా యోగ్యమైన విషయమే. అవి తెలుసుకునే కొద్దీ, చరిత్ర, సమాజం పరిణామాలతోపాటు వలసలు, వృత్తులు గురించి మరింత తెలుసుకోవచ్చు.
#మహాభారతంలోని ఈకథ చాలా విలువైనది, కాస్త పెద్దదైనా ఓపికగా చదివితే ఆంతర్యం అర్థమవుతుంది..
ఒకసారి #గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని
ఆశ్రమానికి తీసుకు వచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణ అది పెరిగి పెద్దదయింది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు. గౌతముడు “తల్లీ తండ్రీ లేని ఈ ఏనుగును నాసొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని
పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు” అని చెప్పాడు.
అప్పుడు ధృతరాష్ట్రుడు “నీవు అడిగినన్ని గోవులు కావలిసినంత బంగారము ఇస్తాను, ఈఏనుగును నాకు ఇవ్వు” అని అన్నాడు.
“రాజా! దీని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను, నీవు ఎన్ని
అశోక వనంలో #రావణుడు, #సీతమ్మ వారి మీదకోపంతో కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.. #హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి' అని..
కానీ మరుక్షణంలోనే #మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు!
ఆశ్చర్య చకితుడయ్యాడు.
"నేనే కనుక ఇక్కడ లేకపోతే, సీతమ్మను రక్షించే వారెవరు? అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు!
బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, 'నేను లేకపోతే ఎలా?' అని.
సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు.
అప్పుడు హనుమంతుడుకి అర్థమైంది 'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో, వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని..
మరింత ముందుకు వెళితే
త్రిజట.. తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ, దాన్ని నేను చూశాను అనీ చెప్పింది.
వెన్నెలకంటి రాఘవయ్య..
(జూన్ 4, 1897 - నవంబరు 24, 1981)
నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా శింగపేట గ్రామంలో 1897, జూన్ 4 న జన్మించారు.
తల్లిదండ్రులు సుబ్బమ్మ, పాపయ్యలు. అయిదో యేట తల్లిని పోగొట్టుకున్నారు. అక్క దగ్గర పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం శింగపేట, అల్లూరు. 1909లో నెల్లూరు వెంకటగిరి రాజా ఉన్నత పాఠశాల. మద్రాసు పచ్చియప్ప కళాశాలలో 1918లో బి.ఎ. చదివారు.
తొలి కార్యదర్శి .పొణకా కనకమ్మ, బాలసరస్వతమ్మ, వేమూరి లక్ష్మయ్య, చతుర్వేదుల వెంకటకృష్ణయ్య వంటి వారిని సంఘటితంచేసి 'స్వరాజ్య సంఘం' స్థాపించారు. 1928లో బి.ఎల్. పట్టా పొంది న్యాయవాద వృత్తి చేపట్టారు.
వెంకటగిరి రాజాకు, రైతులకు మధ్య కొనసాగిన వివాదాల్లో ఆచార్య ఎన్. జి. రంగా గారితో కలసి
‘తెలుగు, తమిళ భాషల్ని ఉత్తర దేశీయులకి కూడా నేర్పించాలి’ అని, భారత ప్రధాని సెలవిచ్చారు. ‘పెద్ద దానికి పెళ్లి లేదు, కడదానికి కల్యాణం’ అన్నట్టుంది. తెలుగు వాళ్లే తెలుగును పట్టించుకోకుండా వుంటే, ఇతర భాషల వాళ్లు నేర్చుకుంటారా? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ
తెలుగుకి ఎంత గౌరవం ఇస్తున్నాయో చూస్తున్నాం. గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమం కొనసాగించాలంటున్నారు గానీ, తెలుగు గురించి కాదు. తమిళ రాష్ట్రం తమ భాషకి ఇచ్చే ప్రాధాన్యాన్ని చూసి మనం తలదించుకోవాలి. ఇంగ్లీషు దినపత్రికల్లో కూడా, ప్రభుత్వ ప్రకటనలు – పూర్తి పేజీ – తమిళంలోనే వుంటాయి.
ఎక్కడ చూసినా తమిళం ప్రముఖంగా వుంటుంది. ఆంగ్లం రెండోది. విదేశీయులు కూడా వచ్చి చదువుకుంటున్న #మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో బోర్డులన్నీ తమిళంలోనే వుంటాయి. కింద ఇంగ్లీషు! #తెలుగు వారికి ఆంగ్లం మీద మోజు. తెలుగు అక్కర్లేదు ఏ ఇంట చూసినా, చక్కని తెలుగు పదాలున్నా – ఇంగ్లీషే పలుకుతారు.