1, గత 2 రోజులుగా పార్టీ కేంద్ర కార్యాలయంలో యాగం చేశాం. ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా అభివృద్ధి సంపూర్ణంగా జరగాలని యాగం చేసి దిగ్విజయంగా పూర్తి చేసి వారాహి విజయ యాత్ర మొదలు పెట్టాను
2, నన్ను పాలించేవాడు నాకంటే నిజాయితీపరుడు అయి ఉండాలి. ఒక సామాన్యుడి అవినీతి చేస్తే ACB పట్టుకుంటుంది, CM అవినీతి చేస్తే ఎవరు పట్టుకుంటారు?
3, ఈసారి నన్ను గెలవకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను, ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ బలమైన సంతకం చేస్తుంది , అసెంబ్లీలోకి అడుగుపెట్టి తీరుతాను
4, ముఖ్యమంత్రి @ysjagan కు చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు నన్ను ఎలా ఆపుతారో చూస్తాను
5, మాట్లాడితే జగన్ రెడ్డి క్లాస్ వార్ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ మాట్లాడుతాడు, క్లాస్ వార్ అంటే పేద, ధనిక మధ్య వ్యత్యాసం, జగన్ రెడ్డితో పోలిస్తే నేను చేయాలి ఆయన మీద క్లాస్ వార్
6, వచ్చే ఎన్నికల్లో ఒక్కడిగా పోటీ చే అంటారు. ఒక్కడిగా వస్తానా, కూటమిగా వస్తానా, ఇంకా నిర్ణయించుకోలేదు, ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న రోజు కుండబద్దలు కొట్టినట్టు చెప్పి ఎన్నికలకు వెళ్తాము
7, జగన్ రెడ్డి గెలిచాక ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే ఆయనకు ఫోన్లో చాలా మనస్పూర్తిగా అభినందనలు చెప్పి, నేను మీ వ్యక్తిగత జీవితం, విషయాల గురించి మాట్లాడను, మంచి పరిపాలన ఇవ్వండి అని చెప్పాను, కానీ భవన నిర్మాణ కార్మికుల గురించి తప్పు జరుగుతుంది అని మాట్లాడితే నా ఇంట్లొ ఉన్న 1/2
4 ఏళ్ల బిడ్డను కూడా వదలకుండా తిట్టించిన వ్యక్తి
8, పవన్ కళ్యాణ్ ఓడిపోగానే తోక ముడుచుకుని పార్టీ మూసేస్తాడు, రాజకీయాలు వదిలేస్తాడు అనుకున్నారు, కానీ 2 చోట్ల ఓడిపోయినా సరే నేను నిలబడ్డాను, 10సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను, ప్రజల కోసం నిలబడ్డాను
9, రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సమస్య, రోడ్ల దుస్థితి గురించి జాతీయ స్థాయిలో ఉద్యమం చేసింది జనసేన
10, మేము వస్తున్నామంటే సెక్షన్ 30అంటారు, పోలీసులు ఆంక్షలు పెడతారు, ఎందుకు మాకు ఇన్ని నిబంధనలు? వైసీపీ నాయకులకు నిబంధనలు వర్తించవా
11, నేను గత ఎన్నికల ముందు చెప్పాను వైసీపీ నాయకులను ఎన్నుకుంటే విశాఖను దొచేస్తారు అని, ఎందుకంటే హైదరాబాద్ లో జగన్ రెడ్డి కుటుంబం ఏం చేసిందో నాకు తెలుసు. ఇప్పుడు కొండలతో సహా దోచేశారు, కనీసం గాజువాకలో నన్ను గెలిపించి ఉంటే నేను అడ్డుకునే వాడిని
12, నేను కులాలకు వ్యతిరేకం కాదు, కానీ ఒక్క కులానికి మాత్రమే పదవులు ఇవ్వడం తప్పు, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఒక్క కులానికి పట్టం కట్టే వ్యవస్థను తీసేసి అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తాం
13, అధికారం లోకి రాక ముందు అమరావతి రాజధాని అని @ysjagan చెప్పి, ఇప్పుడు ఎందుకు మాట మార్చారు? ఆరోజు ఎందుకు ఇది ఒక కులానికి చెందిన వ్యక్తులు ఉన్నారు అని చెప్పకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు
14, జనసేన అధికారంలోకి వస్తే కొత్తగా పెళ్ళైన ప్రతీ జంటకు మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటు రేషన్ కార్డ్ ఇచ్చే భాధ్యత మాది
15, సంక్షేమ పథకాలు ఉండాలి. ఆత్మహత్య చేసుకున్న ప్రతీ కౌలు రైతుకు నేను లక్ష రూపాయల ఆర్థిక సాయం నా కష్టార్జితం ఇచ్చాను. ఇది నాకు తెలిసిన సంక్షేమం. ఒక బీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలు చేసి సంపాదించి నేను ఇవ్వగలిగాను. కానీ ముఖ్యమంత్రి సంపద క్రియేట్ చేయకుండా, 1/2
ప్రజల సొమ్మును బటన్ నొక్కి ఇస్తే అది సంక్షేమం కాదు
16, సొంత చిన్నాన్న ను చంపిన వ్యక్తులను వెనకేసుకు వచ్చే వ్యక్తి @ysjagan ఆయన పసివాడు ఎలా అవుతాడు? చెల్లి సునీత తండ్రి చావుకు న్యాయం చేయాలని పోరాడుతోంది
17, 2019 ఎన్నికల సమయంలో @ysjagan అమలాపురం వచ్చి నేను కాపులకు BC రిజర్వేషన్ ఇవ్వను, నాకు కాపుల ఓట్లు అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడితే, 60 శాతం పైగా కాపులు ఆయనకే ఓట్లు వేశారు, కాపు నాయకులు ఆయనకు అండగా ఉన్నారు
18, ఎన్నికలు వస్తున్నాయని @YSRCParty వారు BC సభలు పెడతారు. స్థానిక ఎన్నికల్లో 34% ఉన్న ప్రాతినిధ్యం 24% కి తగ్గించారు, దాదాపు 16,800 మంది బీసీ నాయకులకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇది బీసీలకు న్యాయం చేస్తూన్నట్లా
19, జనసేన షణ్ముఖ వ్యూహం ద్వారా, టాలెంట్ ఉండి, ఉపాధి కల్పించే ప్రణాళిక ఉండి, పెట్టుబడి లేక ఇబ్బందులు పడే యువతకు ప్రతీ నియోజకవర్గం నుండి 500 మంది యువతకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ క్రింద 10లక్షలు ఇస్తాము
20, కేరళలో పంచాయితీ వ్యవస్థ ఎంతో అభివృద్ధి చేశారు, నిధులు ఉన్నాయి. ఇక్కడ చెత్త మీద కూడా పన్ను వేస్తారు కానీ నిధులు ఇవ్వరు. జనసేన అధికారంలోకి వస్తే పంచాయతీ వ్యవస్థ నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తాం
21, గతంలో మేము ఇక్కడ వంతాడ మైనింగ్ గురించి మాట్లాడాం, లాట్రైట్ పేరు చెప్పి బాక్సైట్ దొచేస్తున్నరు. నేను మాట్లాడాక @ysjagan మాట్లాడి, అధికారంలోకి వచ్చాక ఎంక్వైరీ కమిషన్ అన్నారు, ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ రాలేదు
22, నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయను అని మాటిస్తున్నాను, దయచేసి ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీని ఆశీర్వదించండి, గోదావరి తల్లి సాక్షిగా మీకు అండగా ఉంటాను అని మాటిస్తున్నాను
Thread, WA Status Edits On Chief @PawanKalyan Speech !
1, "జనసేన పార్టీ యూత్ వింగ్ తో ప్రారంభమై, ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. జనసేన భావజాలానికి ఆకర్షితులైన యువత ప్రతీ గ్రామంలో ఉన్నారు. ఉనికిని కాపాడుకుంటూ బలమైన భావజాలానికి కట్టుబడి ఉంటే మంచి రోజులు వాటంతట అవే వస్తాయి.
2, తెలంగాణ అభివృద్ధి సాధించాలి, ఉద్యమ ఆకాంక్ష నెరవేరాలి అనేది జనసేన ఆకాంక్ష.
3, ఏ రాజకీయ పార్టీలోనూ ఇంతమంది కొత్తవారికి అవకాశం ఇవ్వరు. అవకాశాన్ని సరదాగా తీసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి
Thread, Yesterday Meeting, Senani @Pawankalyan Speech WA Status Edits
1, చాలామంది అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాను అని అంటారు, నేను కానీ జనసేన కానీ అధికారంలోకి వచ్చాక సాయం చేయడం కాదు, మనకు చేతనైన సాయం, మేమున్నాం అనే నమ్మకం కల్పించడానికి ఈరోజు వచ్చాను !
2, ఈరోజు దాదాపు 39 ఇప్పట్టం రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం, ఇది వారి నష్టాన్ని పరిహారం కాదు, వారికి మేము ఉన్నాం అనే భరోసా కల్పించేందుకు
3, మన ఇప్పటం గ్రామ గుండెలపై పడిన దెబ్బకు, జనసేన మందు రాస్తుంది
Thread, Yesterday Press Meet, Senani @PawanKalyan Speech WA Status Edits !
1, వైసీపీ లా, ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఓ మాటా, అధికారం లోకి వచ్చాక మరో మాట, అంత దిగజారుడు తనం మాకు లేదు !
2, భోగాపురం భూసేకరణ విషయంలో ఒక క్షత్రియ ఆడపడుచుతో వైసీపీ నాయకులు అప్పట్లో కేసులు వేయించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆమె దగ్గర కూడా భూమి లాక్కోవాలని చూస్తున్నారు.
3, నిన్న జనవాణి జరగకపోయినా మా నాయకులు 300కు పైగా అర్జీలు స్వీకరించారు. అందులో మంత్రి ధర్మాన గారు, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, విజయనగరంకు చెందిన ఒక నాయకుడు, అనకాపల్లికి చెందిన మరో నాయకుడు భూ కబ్జాలు, అవినీతిపైన ఎక్కువ అర్జీలు వచ్చాయి !