Discover and read the best of Twitter Threads about #పోతన

Most recents (3)

🚩కన్యాశుల్క మంటే, అచ్చ తెనుగులో ' ఉంకువ ' అని అంటారు

.#పోతన గారి రుక్మిణి కళ్యాణం లో ఈ పద్యం చూడండి .
.
*అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా
వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్"

.
👉🏿ఈ పద్యములో మరో విశేష మున్నది. కన్యాశుల్కము పందొమ్మిదవ శతాబ్దములో క్రొత్తగా రాలేదని ప్రాచీన కాలములో కూడా ఆ సాంప్రదాయమున్నదని యీ పద్యము వలన తెలుస్తున్నది.
Read 5 tweets
❤️🔻🙏🏿ఓం జై శ్రీ వినాయకాయ నమః -🙏🏿🔻❤️

ఉ.
*ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం
పాదికి, దోషభేదికిఁ, బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా
చ్ఛేదికి, మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్,
మోదకఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్.

(#పోతన తెలుగు భాగవతం .)

🤲🤲 Image
భావము:
పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ
అనే సంపదను సంపాదించిన వాడు,
సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు,
ఆపన్నుల విన్నపాలను ఆమోదించువాడు,
సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించు వాడు,
మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు,
నివేదించిన కుడుములూ ఉండ్రాళ్లూ కడపునిండా ఆరగించి
మూషకరాజును అధిరోహించి విహరించువాడు,
ముల్లోకాలకూ శుభాలు ప్రసాదించి విరాజిల్లువాడు
ఐన వినాయకునకు వంగి వంగి నమస్కరిస్తున్నాను.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Image
Read 3 tweets
❤️
శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళి లోల విలసదృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్ !!

💥
భావము:
సర్వలోకాలను సంరక్షించుట అందు గట్టి సంకల్పం కల వాడిని, భక్తజనులను కాపాడుటలో మిక్కిలి తొందర కల వాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండభాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని
(మహానందం దేహంగా గల ఆత్మీయుని) కైవల్య పదము (నీవుగానే తప్ప నాకంటూ వేరే ఉనికి లేనంతగా నీలో ఐక్యం అయ్యే పదవిని) అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను.
🚩🚩
Read 4 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!