Discover and read the best of Twitter Threads about #బొమ్మలకొలువు

Most recents (2)

మసకబారుతున్న పండగ సంప్రదాయాలలో #బొమ్మలకొలువు ఒకటి. బొమ్మ అంటే #బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ నుండి చీమ వరకు అన్నింటిలో భగవంతుడిని దర్శించవచ్చన్న భావనతో బొమ్మలకొలువును ఏర్పాటుచేసి, హారతి పట్టడం పూర్వీకులు మనకు అందించిన సంప్రదాయం.

ఈ సంప్రదాయం ప్ర‌స్తుత త‌రం వారికి పెద్ద‌గా తెలియ‌దు Image
అనే చెప్పాలి. కానీ ఒకప్పుడు బొమ్మలకొలువును ఏర్పాటు చేయడం లేదా వాటికి హాజరవడం అంటే ఎంతో సరదాగా ఉండేది. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అలనాటి నటి జమునగారికీ ఈ సరదా ఉంది. చిన్నతనంలో దుగ్గిరాలలో బొమ్మల పెళ్లిళ్లలో సేకరించిన తాటాకు బొమ్మలు మొదలుకొని, ఈ మధ్య అమెరికాలో కొన్న బొమ్మల Image
వరకు ఆమె బొమ్మల కొలువులో కొలువు తీరాల్సిందే.

జమునగారి ఉత్సాహానికి అప్ప‌ట్లో ఆమె తల్లిగారి ప్రోత్సాహం కూడా జత అయ్యేది. ఇద్దరూ ఎన్నో రకాల బొమ్మలను సేకరించేవారు. రామాయణ ఘట్టాలకు సంబంధించిన రామాయణం బొమ్మల సెట్, ఇంకా గజేంద్ర మోక్షం బొమ్మల సెట్, కైలాసం సెట్. అలాగే కొండపల్లి బొమ్మలు, Image
Read 6 tweets
#దసరా_దేవీ_నవరాత్రులు_శరన్నవరాత్రులు

శరదృతువు,ఆశ్వీయుజ మాసం మొదటి తొమ్మిది రోజులని "దేవీ నవరాత్రులు"గా జరుపుకుంటాం.

ఇది వర్షాకాలం,చలికాలంకి మధ్యలో వచ్చే సంధికాలం.వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే రోజులు.
యమధర్మరాజు దంష్ట్రలు(కోరలు) సంవత్సరంలో రెండు సార్లు బైట పెడతాడట!అందువల్ల
ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉంటాయి.కానీ ఆ బాధలు లేకుండా చెయ్యడానికి ప్రకృతిలో దొరికే ఆహారాన్నే ఔషధంగా ఉపయోగించవచ్చు.

ఉగాది సమయంలో,ఎండాకాలం మొదలయ్యే ముందు ఒకసారి,మళ్ళీ దసరా సమయంలో రెండో సారి ఇలా జరుగుతుంది.
వాటికి  నివారణగా ప్రకృతి ఇచ్చిన  ఓషధాలే -వేపపువ్వు &ఉసిరికాయలు.వీటిని ఆయా
సమయాల్లో ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటాము.
నవదుర్గ పూజ
అమ్మవారిని తొమ్మిది రూపాలుగా అలంకరణ చేసి, పూజిస్తాము. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం.
Read 20 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!