Discover and read the best of Twitter Threads about #భగవద్గీత

Most recents (6)

సేకరణ.. నారాయణ చిలుక..

భగద్గీత వేదాంతం.. మనకు బోధించేది ఏమిటి?
#త్వమేవాహమ్‌

కన్నతల్లి కడుపులోంచి బయటపడి
తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణంనుంచి..

పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు,
ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే #నేను..

నేను = నేనే..
ఈ నేను
ప్రాణశక్తి అయిన "ఊపిరి" కి మారుపేరు.
ఊపిరి ఉన్నంతదాకా #నేను అనే భావన కొనసాగుతూనే ఉంటుంది.

జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో
#నేను ఎన్నెన్నో పోకడలు పోతుంది.
మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.

#నేను లోంచే, #నాది అనే భావన పుడుతుంది..
#నాది లోంచి
1. నా వాళ్ళు,
2. నా భార్య,
3. నా పిల్లలు,
4. నా కుటుంబం,
5. నా ఆస్తి,
6. నా ప్రతిభ,
7. నా ప్రజ్ఞ,
8. నా గొప్ప...
అనేవి పుట్టుకొచ్చి,

చివరికి,
#నేను అనే భావన
భూమండలాన్ని కూడా మించిపోయి,
ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి,
నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి,
Read 11 tweets
#స్వధర్మాచరణయే_శ్రేయస్కరం

పాలకుర్తి రామమూర్తి గారి వ్యాసం..

అయ మమృత నిధానం నాయకో ఔషధీనాం
అమృతమయ శరీరః కాన్తియుక్తో౨పి చంద్రః
భవతి విగత రష్మిః మండలే ప్రాప్య భావః
పరసదన నివిష్టః కో లఘుత్వం న యాతి!
(చాణక్య నీతి)

చంద్రుని శరీరమే అమృతముతో నిండినది.
అతడు ఓషధులకు అధిపతి (సోమః ఓషధీనా మధిపతిః). అసమాన సౌందర్యం అతని స్వంతం. అయినా సూర్యోదయమవగానే చంద్రుడు తేజస్సును కోల్పోతాడు. అతనిలో ఉన్న అమృతము కూడా అతని కళలను నిలుపలేదు. రాత్రనేది చంద్రుని భవనమయితే, పగలు సూర్యుని భవనంగా చెపుతారు. పరాయి ఇంటిలో ఉండవలసి వస్తే ఎవరికయినా ఆశించిన
గౌరవం లభించదు. పరాయి పంచన బ్రతకడం ఎంతవారికయినా దుఃఖమయమే అంటాడు, #చాణక్యుడు.

మన ఇంటిలాంటిది "స్వధర్మం". ఇతరుల ఇంటిలాంటిది "పరధర్మం". ఎంత జాగ్రత్తగా, భయభక్తులతో ఉన్నా పరాయి ఇంటిలో ప్రశాంతత ఉండదు. అదే మన ఇంటిలో మనమెలా ఉన్నా సుఖంగా ఉంటుంది.
Read 9 tweets
❤️విలువయిన సంపద #భగవద్గీత గ్రంథం.🌹🌹
*ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది .*

*ఒక రోజు , ఆ గుడిలో నుంచి ఒక సాధువు గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందినవారు , మీ కొడుకు చాలా మంచివాడు కదా !*
*మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?*

*అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :- బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు .*

*నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు .*
*వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు 💰 ఇచ్చి వెళ్ళాడు .*

*ఆ డబ్బు 💵 మొత్తం నా అవసరాలకు అయిపోయింది .*

*నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు 💸💴 ను సంపాదించలేను .*

*అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను .*
Read 13 tweets
శ్రీమద్భగవద్గీత - అథ పఞ్చదశోऽధ్యాయః - పురుషోత్తమప్రాప్తియోగః

#శ్లోకం - 552

శ్రీభగవానువాచ |
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ || 15-01 ||

#సంస్కృతం
#భగవద్గీత
#తెలుగు
#503వరోజు
#Telugu

1/
భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము - 15.01

శ్రీ భగవానుడు చెప్పెను - దేనికి వేదములు ఆకులుగనున్నవో, అట్టి సంసారమను అశ్వత్థవృక్షము (రావిచెట్టు) ను పైన వేళ్ళుగలదిగను, క్రింది కొమ్మలు గలదిగను, (జ్ఞానప్రాప్తి పర్యంతము) నాశములేనిదిగను (పెద్దలు) చెప్పదురు.

2/
దాని నెవడు తెలిసికొనుచున్నాడో, అతడు వేదార్ధము నెఱింగినవాడు (అగుచున్నాడు).

#భగవద్గీత
#తెలుగు
#503వరోజు
#Telugu

3/
Read 3 tweets
ఒక తండ్రికి కొడుకు ఇచ్చిన సిసలైన గౌరవం👇

తండ్రి మృదంగంవాయిస్తూ భజనలు చేసేవాడు, తన చివరిరోజుల్లో 11ఏళ్ల కొడుక్కి సంగీతం గొప్పదనాన్ని చెప్పి సంగీత విద్వాంసుడిని అవ్వమని చెప్పి మరణించాడు,

కొడుకు తండ్రి ఆశయం నెరవేర్చాలని విద్వాంసులఇళ్ళల్లో పనిచేస్తూ సంగీతం నేర్చుకోవాలనుకున్నాడు1/7
రెండేళ్లకు బట్టలు ఉతకడం,వంట చేయడం నేర్చుకుని,ఆలస్యమైనా తనతప్పు తెలుసుకొని తనదగ్గరున్న 40₹ విలువగల ఉంగరాన్ని 8₹ కే అమ్మి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొని వారాలు చేస్తున్నాడు, ఐతే ఇతరుల వల్ల కాలేజీ నుండి సస్పెండ్ అయ్యాడు, దాని వల్ల వారాల వారు పొమ్మనారు..,
గత్యంతరంలేక ఎల్లమ్మ గుళ్లో తలదాచుకున్నపుడు ఆ గుడికి వచ్చిన ఓ శాస్త్రి ఇదంతా తెలుసుకొని తనఇంట ఉచితంగా సంగీతశిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు,

శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఇతనికి భోజనం కల్పించలేకపోయాడు. ఈ పిల్లాడికే సాధువు జోలెకట్టి మాధుకరం (ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించాడు 3/7
Read 7 tweets
శ్రీమద్భగవద్గీత - అథ చతుర్థోऽధ్యాయః - జ్ఞానయోగః

#శ్లోకం - 201

శ్రద్ధావాఁల్లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః |
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి || 4-39 ||

#సంస్కృతం
#భగవద్గీత
#తెలుగు
#188వరోజు
#Telugu
భగవద్గీత - జ్ఞాన యోగము - 4.39

(గురు,శాస్త్రవాక్యములందు) శ్రద్ధగలవాడును, (ఆధ్యాత్మికసాధనలందు) తదేకనిష్ఠతో గూడినవాడును, ఇంద్రియములను లెస్సగ జయించినవాడునగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును బొందినవాడై యతడు పరమశాంతిని శీఘ్రముగ బడయగల్గుచున్నాడు.

#భగవద్గీత
#తెలుగు
ప్రతిపదార్థం:4.39

శ్రద్ధావాన్=శ్రద్దగలవాడును;
తత్పరః=తదేక నిష్ఠతో గూడినవాడును;
సంయతేన్ద్రియః=ఇంద్రియములను లెస్సగ జయించినవాడును;
జ్ఞానమ్=(ఆత్మ)జ్ఞానమును;
లభతే=పొందుచున్నాడు;
జ్ఞానమ్ =జ్ఞానమును
లబ్ధ్వా= పొంది
పరామ్=గొప్పదైన
శాంతిమ్=శాంతిని
అచిరేణ=శ్రీఘ్రముగ
అధిగచ్ఛతి=పొందుచున్నాడు
Read 3 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!