Discover and read the best of Twitter Threads about #మనదేవాలయాలు

Most recents (5)

విజయనగరం జిల్లా రామతీర్ధం శ్రీ రామచంద్రమూర్తి ఆలయం. సాధారణంగా శ్రీరామ కళ్యాణం ఏడాదికి ఒకసారి శ్రీరామనవమి రోజు అభిజిత్ లగ్నం అందు దేశంలోని వివిధ రామాలయాలలో కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కానీ ఏడాదికి రెండుసార్లు కళ్యాణం జరిగే రామాలయం ఇది
#మనదేవాలయాలు
రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు.
సీతారాముల విగ్రహాలను మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు రామతీర్థంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల ఏటా భీష్మ ఏకాదశి రోజు సీతారాముల వారికి ఎంతో అంగ రంగ వైభవంగా తిరుకళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం ఆనవాయితీగా వస్తోంది
Read 11 tweets
విజయనగరం జిల్లా పుణ్యగిరి లోని శ్రీ ధారగంగమ్మ ఈశ్వరాలయము
పచ్చటి ప్రకృతి కొండలపై పుణ్యగిరి పరమ పవిత్రమైన క్షేత్రం. పచ్చటి ప్రకృతి మధ్య కొండలపై పరమేశ్వరుడు ఉమా కోటిలింగేశ్వర స్వామిగా వెలసి భక్తుల నీరాజనాలందుకుంటున్న అద్భుత పుణ్యక్షేత్రం.

#మనదేవాలయాలు
ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ క్షేత్ర పరిసరాలన్నీ వనభోజనాలకు వచ్చే వారితోనూ, పర్యాటకుల శివనామస్మరణతో మారు మోగిపోతాయి. పరమేశ్వరుని దర్శనంతో జన్మ పునీతం చేసుకోవాలన్న తలంపుతో వచ్చే భక్త జనులతో పుణ్య గిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతం కిక్కిరిసిపోతుంది.
ఈ ఆలయం పర్వత పంక్తి నుండి వచ్చే జలధారపై నిర్మింపబడినది కనుక ధారగంగమ్మ ఈశ్వరాలయముగా పేరుగాంచినది.
ఇది తొలుత ధారగంగమ్మ ఆలయం, ఆ తరువాత ఇచట ఈశ్వరుడు గూడ ప్రతిష్టింపబడ్డాడు.
అందుచే ఈ ఆలయాలు ధారగంగమ్మ, ఈశ్వరాలయముగా ప్రసిద్ధమైనది
Read 12 tweets
విశాఖపట్నం జిల్లా : బల్లిగిరి
⚜ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం
💠 కలియుగ వరదుడు ఎన్నో స్థలాలలో స్వయంభూగా వెలసి భక్తులకు తమ సేవా భాగ్యం ప్రసాదిస్తున్నారు.

#MANADEVALAYALU #మనదేవాలయాలు
శ్రీవారి కృపాకటాక్షాలకు ప్రాంతీయత లేక మతం ప్రతిబంధకాలు కావని, అదే విధంగా సర్వాంతర్యామి ఏ రూపంలోనైనా తనను శరణు కోరిన వారు ఎవరైనా ఎక్కడ ఉన్నా కరుణించి కష్టాల కడలి నుండి తీరం చేరుస్తారు అన్నదానికి నిదర్శనంగా నిలిచే క్షేత్రం శ్రీ బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం.
💠 విశాఖ నగర మధ్యలో ఉన్న డాభా గార్డెన్స్ ప్రాంతంలో చిన్న కొండ (స్థానికంగా వెంకటేశ్వర గుట్ట అని పిలుస్తారు)బల్లిగిరి అనే పేరు రావడానికి, ఇక్కడ బ్రహ్మాండ నాయకుడు కొలువు తీరడానికి వెనుక నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్నది అని తెలియవస్తోంది.
Read 7 tweets
#మనదేవాలయాలు

పంచ లింగేశ్వర స్వామి దేవాలయం, రాజోలి
జోగులాంబ జిల్లా రాజోళి గ్రామం లో కొలువైన పురాతన శివాలయం ఇది .ఈ దేవాలయం లో ఒకే పనవట్టం పై 5 లింగాలు కొలువై ఉన్నాయి..ఇలాంటి దేవాలయాలు చాలా అరుదు..చాలా పురాతనమైన దేవాలయం. Image
2009 వరదల్లో పూర్తిగా కొట్టుకొని పోయి ..ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో ఉంది..దేవాలయం లో ధూపదీపా లకు కష్టంగా ఉంది అని తెలియడం తో #మనదేవాలయాలు ద్వారా ప్రతి నెల ధూపదీపా లకు అయ్యే సామగ్రి ప్రతి నెల అందిస్తున్నాము..ఈ నెల కూడా ధూపదీప సామగ్రి అందించడం జరిగింది .
ప్రస్తుతానికి #మనదేవాలయలు ద్వారా నెలకు 17 దేవాలయమలకు ధూప దీప నైవేద్యం కార్యక్రమం ద్వారా సామాను అందచేయటం జరుగుతోంది. ఈ గొప్ప కార్యక్రమనికి ప్రతి ఒక్కరు చేయూత అందించాల్సిందిగా మనవి.
మన దేవాలయాలు :
G Pay /Phone pe:- 9866933582
Read 5 tweets
#మనదేవాలయాలు

పేష్వ మహారాజులు పునర్నిమాణము , జీర్ణోద్ధరణ గావించిన ప్రసిద్ధమైన అష్ట వినాయక మందిరాలు- మహారాష్ట్ర-

1) శ్రీ మయూరేశ్వర్ గణపతి- మోర్గోన్ గ్రామం , బారామతి తాలూకా-:- పూణే నుండి 65 కిమీలు! Image
2) శ్రీ సిద్ధి వినాయక్- సిద్ధతేక్ , అహ్మద్ నగర్- గోండా పట్టణానికి సమీపంలోని ప్రాంతం- పూణే నుండి 110 కిమీలు!
3) శ్రీ బల్లాలేశ్వర్ గణపతి- పాళీ-:- పూణే నుండి 110 కిమీలు!
4) శ్రీ వరద వినాయక్- మహాద్- పూణే నుండి 80 కిమీలు!
5) శ్రీ చింతామణి గణపతి-తేయు- గ్రామం- పూణే నుండి 22 కిమీలు!
6) శ్రీ గిరిజాత్మక్ వినాయక్- లేహ్యాద్రి కొండలు- పూణే నుండి 90 కిమీలు!
7) శ్రీ విఘ్న హరవినాయక్- రిద్ధి- సిద్ధి- సమేత వినాయక్- ఓజార్- పట్టణం-:- పూణే నుండి 100 కి.మీ.
8) శ్రీ మహా గణపతి- రంజన్ గావ్- పూణే నుండి 50 కిమీలు! శ్రీ 'విజయ సిద్ధి ప్రదాత'గా ప్రసిద్ధి
Read 4 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!