Discover and read the best of Twitter Threads about #రాయలసీమస్త్రీలు

Most recents (2)

రాయలసీమ చరిత్రలో స్త్రీలు - విఠ్ఠలాదేవి /విఠ్ఠలాంబ

సంగమ వంశ విజయనగర చక్రవర్తి రెండవ హరిహరరాయల భార్య; కాదంబుల యువరాణి పద్మలదేవి మరియు చాళుక్య రాజు రాజేంద్రుడి కుమార్తె విఠ్ఠలాదేవి. ఈవిడ శ్రీశైలం దర్శించి అక్కడ పాతాళగంగకు మెట్ల దారి ఏర్పరిచినది.

#రాయలసీమచరిత్రలోస్త్రీలు Image
శ్రీశైలంలోని శాసనాలప్రకారం శాలివాహక శకం 1315 శ్రీముఖ నామ సంవత్సరం (క్రీ.శ 1393) విఠ్ఠలాదేవి పాతాళగంగకు మెట్లదారి నిర్మించింది. విఠ్ఠలాదేవి శ్రీశైల మల్లిఖార్జున స్వామి కలలో తనకిచ్చిన ఆదేశాల మేరకు పాతాళగంగకు మెట్లదారి నిర్మిస్తున్నట్టు శాసనంలో తెలిపింది.
#రాయలసీమస్త్రీలు
శాలివాహక శకం 1318 (క్రీ.శ 1396)లో విఠ్ఠలాదేవి విఠలేశ్వర ఆలయాన్ని / విఠలేశ్వర మండపాన్ని నిర్మించి విఠలేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసింది.

#సీమచరిత్ర #Srisailam #Kurnool_Temples #Raayalaseema_Temples

చిత్రం: వికీపీడియా
Read 3 tweets
తొలి తెలుగు మహిళా రాజ్యసభ సభ్యురాలు ఎవరో తెలుసా ?

కర్నూలుకు చెందిన శ్రీమతి డి. యశోదా రెడ్డి గారు

తొలి తెలుగు మహిళా రాజ్యసభ సభ్యురాలు (03-04-1956 నుండి 27-02-1962 వరకు తిరిగి 23-03-1967 నుండి 02-04-1972 వరకు) & తొలి రాయలసీమ మహిళా లోక్సభసభ్యురాలు (3 లోక్సభ - కర్నూలు నియోజకవర్గం)
శ్రీమతి డి. యశోదా రెడ్డి రెండు సార్లు రాజ్యసభ సభ్యరాలిగా, ఒకసారి లోక్సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆగష్టు 5, 1925 లో జన్మించారు. వీరి తండ్రి జి. నాగిరెడ్డి. శ్రీ డి రంగె రామానుజం గారిని వివాహం చేసుకున్నారు. 18-02-1983 న పరమపదించారు

#రాయలసీమచరిత్రలోస్త్రీలు #రాయలసీమస్త్రీలు
Read 3 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!