Discover and read the best of Twitter Threads about #విజ్ఞానవిశేషాలు

Most recents (5)

పునరుద్ధీపనీయ అభినయాలను గ్రహించేటి వ్యోమగ్రాహకగోళమిది. గోళానికి సర్వదిశలా అమర్చిన కాలసమీకృత దీపాలు, గాఢత్వగ్రాహకాలు వినియోగించి ఉచ్ఛవివరణతలో త్రివిమబిందుమేఘం ఉత్పాదితమౌతుంది. యంత్రశిక్షణ ప్రక్రియల ద్వారా కాలసంయత రూపవిభాజనం జరిపి దృశ్యవస్తుధర్మాలను గణిస్తున్నారు. #విజ్ఞానవిశేషాలు
త్రివిమరూపాలను గ్రహించేటప్పుడు క్లిష్ట రూపానుసంధాన పరిణామాలను కాలసంయతంగా పరిగణించడం కష్టమైన పని. అభినేతల వస్త్రధారణ వలననూ, చేతులతో వస్తువులను పరస్పృశించు తీరుల వలననూ సరైన రూపానుసంధాన అమరికను త్రివిమరూపానికి అన్వయించడం కష్టమవుతుంది. ఈ కార్యాన్ని ఔచిత్యంగా రూపవిభాజనంచే నెరవేర్చారు.
గూగుల్ పరిశోధకుల నూతనావిష్కరణ ఈ వ్యోమగ్రాహకగోళం. గత 20 సంవత్సరాలుగా పరిశోధనాధిపతి పాల్ డెబెవెక్ గారు పునరుద్ధీపనీయాభినయగ్రహణంపై పనిచేస్తున్నారు. దీపరంగస్థలి (లైట్ స్టేజ్) అను గ్రాహకగోళంతో చలనచిత్రపాత్రధారుల అభినయాలను అభిలేఖించవచ్చు. ఇదాయనకు సాంకేతిక ఆస్కార్ పురస్కారం తెచ్చింది.
Read 7 tweets
పరివర్తకసమ్మేళనము అను ఈ తత్కలన త్రివిమప్రతిరూపణవిధి ఏకదృక్కోణ త్రివర్ణచిత్రికను ఇచ్చుబడిగా తీసుకుని పరివర్తకజాలం ద్వారా ఒక వ్యోమకణాత్మక మాత్రాచట్రంలో త్రివిమఘట్టంయొక్క రూపాన్ని సంకేతనపరుస్తుంది. ఈ మాత్రాచట్రం తరువాత నర్మత్రివిమరూపంగా విసంకేతనబడుతుంది. #విజ్ఞానవిశేషాలు
పరివర్తకంద్వారా త్రివిమప్రతిరూపణానికి చుట్టూరా వస్తువులపై ఎక్కడ దృష్టి పెట్టవలెనో నేర్చబడుతోంది. చిత్రమాత్రలలో ఎక్కడ విషయాత్మకమైన సమాచారముందో ఆ చిత్రకణాలు స్థూలాత్సూక్ష్మంగా సమ్మిళితబడుతాయి. సూక్ష్మచిత్రమాత్రలను కేవలం అవసరాన్నిబట్టి నిక్షిప్తపరచడంవలన విషయకోశపరిమాణం మితిలో ఉంటుంది
నేను తెలుగులో సమకాలీన శాస్త్రీయఫలితాలను అనువదించడం ద్వారా ఏమి చూపించాలని ఆశిస్తున్నానంటే తెలుగులో వైజ్ఞానిక సాంకేతిక అంశాలను శాస్త్రీయపత్రాలుగా ప్రచురించడం కూడా సాధ్యమని.ఒక విజ్ఞుల సమాజం ఏర్పడితే,సరైన కృషి చేస్తే ఆ విద్వద్గోష్టి ద్వారా అతిత్వరలోనే (ఐదారేళ్లలోనే) ఇది సాధ్యము.
Read 5 tweets
తంత్రికాజాలశిక్షణ ద్వారా జరిపిన అవకలనచిత్రణం వినియోగించి అతి భారీ త్రివిమరూపనిర్మాణాలను శరవేగంగా చిత్రణం చేయగల ప్రక్రియ ఇది! త్రివిమరూపాలను వస్తువర్ణధర్మాలను సంక్షిప్తపరిచినప్పుడు చిత్రభూమికపై కలుగు లోపాలను కనిష్టీకరించు ఉత్తమసంక్షిప్తాలను ఈ ప్రక్రియ గణిస్తుంది. #విజ్ఞానవిశేషాలు
Image-space error: చిత్రభౌమలోపము
Simplification of 3D assets: త్రివిమవస్తుసరళీకరణము
Rendering systems: చిత్రణవ్యవస్థలు
Surface representations: ఉపరితలప్రతిరూపాలు
Differentiable Renderer: అవకలనచిత్రణము

ఎన్విడియా పరిశోధకులు ప్రచురించిన విప్లవాత్మకమైన చిత్రణప్రక్రియ ఇది. 😀
నిజప్రపంచపు వస్తువుల త్రివిమప్రతిగ్రహణకు ఇటువంటి పద్ధతులు వాడేవాళ్లము. ఇలా కృత్రిమవస్తుచిత్రణకు, అతి భారీ సమరూపాల స్వసిద్ధసరళీకరణకు సంక్షిప్తీకరణకు యంత్రశిక్షణ ప్రక్రియలు ఉపయోగిస్తారని ఊహించలేదు. ఎంత త్వరగా మారిపోతోంది ఈ కాలం! కృత్రిమచిత్రణ పాఠ్యాంశాలను మొత్తం తిరగవ్రాయాలి. 😀
Read 4 tweets
భారతీయభాషలలో ఉచ్ఛారణాభిజ్ఞకై వాక్యాంశ్ అను పఠనీయమూలక్రమజాలం విడుదల చేస్తున్నారు. శ్రవణతరంగాలనుండి భావవిద్విషయాలుగా గుర్తించు తంత్రికాజాలాల ఆధారంగా ఈ క్రమజాలాన్ని నిర్మించారు. ఔత్సాహికులు వినియోగించుటకు ప్రయత్నించండి. #విజ్ఞానవిశేషాలు
Command sequence: ఆజ్ఞాక్రమం
Program: క్రమజాలం, క్రమకం
Source code: మూలక్రమం, మూలక్రమకం, మూలసంకేతనం
Open source: అనావృతమూల, విదితమూల, స్పష్టమూల, స్ఫుటమూల
Closed source: ఆవృతమూల,
Open-sourcing: మూలప్రచురణం, అనావృతమూలీకరణం
License: పరిమితి, సమ్మతి
Program లేదా command sequence ను ఆదేశక్రమం అని కూడా అనవచ్చును. కానీ, “క్రమకం” అంటే క్లుప్తంగా పదవిస్తృతికి అనుకూలంగా ఉంటుందని నా అభిప్రాయము.

Programming: క్రమీకరణ
Programmer: క్రమకారుడు
Programming language: క్రమకభాష
Programming construct: క్రమకనిర్మాణము, క్రమకకృతి
Read 4 tweets
జన్యుస్పర్థాత్మకజాలాల గూఢవ్యాప్తియందు దృశ్యసమ్మేళనం చేయుటకు సమచర్యాత్మక సాధనం ఇది. 👌

వివిధ దృశ్యాలలోని వివిధ విభాగాలను కత్తిరించి అతికించడం ద్వారా సహజసారూప్యమైన దృశ్యాలు ఉత్పాదించవచ్చును. నిజసమయంలో సమచర్యాత్మక ప్రతిపుష్టి చూడవచ్చును, చూసి సవరించవచ్చును. #విజ్ఞానవిశేషాలు
ఈ ప్రక్రియకు ఒక క్లుప్త వివరణ.

సమస్య ఏమిటి: ఒక అసంపూర్ణదృశ్యం లేదా సమ్మిళితదృశ్యం ఇచ్చినప్పుడు, వాస్తవికశీలమైన దృశ్యం ఉత్పాదించడం.

పరిష్కారం ఎలా:
1. ఒక అసంపూర్ణదృశ్యం ఇస్తే శైలీజస్పజాల సంకేతనం ఏమిటో సమలేఖించుతారు.

2. సమ్మిళితదృశ్యసంకేతనాన్ని జస్పజాలం ద్వారా విసంకేతనపరుస్తారు.
(జ)న్యు(స్ప)ర్థాత్మక(జా)(లం) అనగా జస్పజాలం (GAN) అని సంక్షిప్తీకరణము.

StyleGAN: శైలీ-జస్పజాలం

Regression: రేఖాగణనము (ఒక బిందువుల సమూహము ఎటువంటి రేఖపై ఉజ్జాయింపుగా నిలబడియుంటుందో,ఆ రేఖ యొక్క గణనము).

Regressor: రేఖాగణకము

Estimate (a regression model): సమలేఖించు
Read 4 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!