Discover and read the best of Twitter Threads about #సీమపదం

Most recents (16)

ఇంగసాలు

నారు మళ్లు ఎండుతాండాయ్
రైతు గుండెలు మండుతాండాయ్

కరువుపోయే కాలమేది?
కన్నీళ్లాగే మార్గమేది?

ఊర్లకూర్లు ఖాళీ అయినాయ్
కమతం బతుకులు కుదేలైనయ్

బీడు భూముల్లో ఎల్లవొచ్చే దారేది?
బీద బతుకుల్లో ఎలుగొచ్చే రూపేది? Image
ఆకలి కేకలు అలవాటయినయ్
అప్పులకుప్పలు ఉరితాళ్లయినయ్

పోయేటందుకు ఇంకేముంది?
చేసిన త్యాగానికి విలువాడుంది?

ఎడారి బతుకుల
తడారిన గొంతులు
నీటి కోసం నినదిస్తాండాయ్

కరువు వెతలను
కాచిన కండ్లు
సీమ ఎత్తిపోతలకై ఎదురు సూచ్చాండాయ్

వలస బాటల
నడిసే కాళ్ళు
సిద్దేశ్వరం అలుగుకై అడుగులేచ్చాండాయ్
ఆరుగాలం కట్టం
జేసిన చేతులు
పిడికిలి బిగిచ్చి పోరాటానికి సయ్యంటాండాయ్

‘ఇంగ సాలు’ అంటుండాయ్
అలసిన సొలసిన సీమ గుండెలు
‘ఇంగెప్పుడు’ అంటుండాయ్
ఆశ నిరాశల నడమ నలిగిన బతుకులు

#సీమకవిత #సీమపదం
Read 3 tweets
కొడుకా.. రుణం తీర్చేదెప్పుడు

నిన్ను కన్న నేల
బతుకునిచ్చిన భూమి
గుక్కెడు నీళ్ల కోసం 
గుక్కపెట్టి ఏడుచ్చాంటే

కన్న భూమి కోసం 
కదం తొక్కాల్సిన నువ్వు
ఏటి నీళ్ల కోసం
ఎలుగెత్తాల్సిన  నువ్వు
మాయదారి సినిమా మత్తులో 
మంచిగా నిద్రపోతాండావ్
ఆరుగాలం కష్టపడి
ఆశలన్నీ నీమీదుంచి
ఉన్నదంతా ఊడ్సి పెట్టి
ఉన్నతంగా సదుకోమంటే

అసలు నీ ఉనికే
తెలీని హీరో కోసం
అప్పు జేసి నువ్వు
డప్పు కొడతాండావ్
సదువు వదిలేసి
సినిమా కలెచ్చన్లు 
అప్పజప్తాండావ్

కొడుకా! అమ్మా నాయనల
ఆశలు ఎప్పుడు తీరుచ్చావ్?
కొడుకా! నేల రుణం
ఎన్నటికి తీర్చుకుంటావ్?
Read 3 tweets
బియ్యపు వడలు

మ్మా.. మ్మా.. నేనేచ్చా మ్మా.. నూనెలో

నూనె బాగా కాలతాంది రా.. నీకు పొయ్యి అందదు.. ఎయినీకి రాదు.. నూనె ఎగిరి మీద పడతాది.. పొయ్యి కూర్చో పో.. నేను ఏసి తీసకచ్చా తిందువుగాని

ప్లీస్ మా.. ప్లీస్ మా..

సరే వెయ్.. సిన్నగా

అబ్బా (పెనం కాలి నేను)

సెప్పినా కదరా కాల్తాది అని ImageImageImage
నేనేస్తా.. నువ్వు తినుపో ..

(నేను ధనేల్ అని ఒకేసారి ఏచ్చే ఎగిరిపడిన కాలే నూనె సినుకులు అమ్మ సేతి మీద పడితే అయ్యేమ్ పట్టిచ్చుకోకుండా)

నా చెయ్యి తీసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతా అమ్మా..తగ్గిపోతాది లే.. పొయ్యు కూర్చోని తినుపో.

అమ్మ సేచ్చే రుచే గాదు ఎమోషన్స్ గునక జాచ్చే
#nostalgia
PS: ఇవి నేను చేసినవి

#సీమపదం #సీమరుచులు
Read 3 tweets
రక్షాబంధన్ సందర్భంగా సీమలో అన్నదమ్ములకు అడబిడ్డలపైన ఉండే ప్రేమానురాగాలు అద్దంపట్టే కథ

పండగొచ్చినాది 👇 #సీమపదం

మొదటి భాగం Image
రెండవ భాగం Image
మూడవ భాగం Image
Read 4 tweets
ఎరికల్ - ఎర్రగుడిపాడు

'ఎరికల్' అన్న పదానికి తెలుగు భాషా చరిత్రలో, తెలుగువారి చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి తెలుగు శాసనం కలమళ్ల శాసనం ఎరికల్ ముతురాజు ధనుంజయుడు వేయించగా, ఎర్రగుడిపాడు శాసనంలో కూడా 'స్వస్తిశ్రీ ఎరికల్ముత్తుర్రాజు' అని ఉంటుంది.
తొట్టతొలి తెలుగు శాసనాల్లో (కలమళ్ళ, ఎర్రగుడిపాడు, తిప్పలూరు, ఇందుకూరు మొ.) మనకు ప్రధానంగా మూడు సారూప్యతలు కనిపిస్తాయి.

1. అన్నీ కడప జిల్లాలో లభ్యమైనవి
2. అన్నీ రేనాటి చోళులు వేయించినవి
3. వాటిల్లో 'ఎరికల్' అన్న పదం ఉండటం

రేనాటి ప్రాంతాన్ని పాలించిన చోళులు కాబట్టి రేనాటి చోళులు
వీరి రాజధాని చెప్పలి. అయితే వీరి శాసనాలలో ఎక్కువగా కనిపించే 'ఎరిగల్' వీరి తొలి రాజధాని అయ్యుంటుంది అని చరిత్రకారుల అభిప్రాయం. ఇప్పుడు 'ఎరిగల్' పేరుతో ఏ ఊరు లేదు. రేనాడులో ఉన్న ఊరు, రేనాటి చోడులకు సంబంధించిన ఊరు అని తప్ప మరే ఇతర ఆధారాలు లేవు.

వీటి ఆధారంగా చరిత్రకారులు
Read 13 tweets
రూపాయి దోశ - 5 రూపాయల దోశ

20 ఏళ్ల కింద మాట. మా ఊర్లో రమణమ్మ దోశలు (పేరు మార్చా) బాగా ఫేమస్. పొద్దున్నే రమణమ్మ దోశలంగట్లో దోశలు తినాలంటే అరగంటన్నా పడ్తాన్యాది. ఎప్పుడు సూడు జనాలు ఉంటాన్యారు. రమణమ్మ అంగట్లో మూడు రకాల దోశలు ఉంటాన్యాయ్. రూపాయి దోశ, రెండు రూపాయల దోశ, 5 రూపాయల దోశ. ImageImage
రూపాయి దోశలకు ఎర్రకారం ఏచ్చే బొంబాయి సెట్నీ ఉండదు. బొంబాయి సెట్నీ ఏచ్చే ఎర్రకారం ఉండదు. ఎప్పుడన్నా బుద్దిపుట్టి రెండు ఏసినాదంటే ఆపొద్దు పప్పుల పొడి ఉండదు. ఆ సిన్న పెనం మీదనే రెండు ఒక రూపాయి దోశలు ఇరికీడం రమణమ్మ టాలెంట్

ఇంక రెండు రూపాయల దోశలు. పెనం మీద ఒకతూరి ఒకటే దోశ.
కారం, బొంబాయి సెట్నీ, పప్పుల పొడి అన్నీ ఎచ్చాది గానీ అన్నీ ఆంటీ ముట్టనట్టు ఉంటాయి. రోన్త నూనె జాచ్చి ఏచ్చాది.

ఇంగ 5 రూపాయల దోశలోళ్లు. ఈళ్లు మిగతా వాళ్ల మాదిరి వెయిట్ సెయ్యాల్సిన అవసరం ల్యా. ఊర్లో పెద్దపెద్దోళ్లు అంతా ఆడ్నించి 5 రూపాయల దోశలు తెప్పించుకుంటాన్యారు.
Read 8 tweets
మా పల్లెల రుచులు- ఒట్టి సియ్యలు / ఒట్టి ముక్కలు / ఒట్టి మాంసం / ఎండు మాంసం / ఎండు సియ్యలు

సంక్రాంతి ఒచ్చాలుకు ఒక అన్న ఆడబిడ్డకు ఒక అర్ధ సేరు ఒట్టి సియ్యలు అంపిచ్చాడు

దేవర ఒచ్చాలకు పల్లెలో ఉండే ఓ అమ్మ టౌన్లో ఉండే కొడుక్కి ఒక సేరు ఒట్టి సియ్యలు అంపిచ్చాది #సీమరుచులు
#సీమపదం Image
అంకాలమ్మ జాతరకు యాటను కోశాలకు ఇంట్లోకి ఒక సేరు, సుట్టాలకు ఓ సేరు సియ్యలు ఎండబెట్టాల్సిందే

మాంసం ఎక్కువగా తినే ఇండ్లల్లో ఎప్పుడు తినాలనిపిచ్చే అప్పుడు యాటను కోయలేరు కాబట్టి, కోసినప్పుడు ఒక సేరో, రెండు సేర్లో సియ్యలు ఎండబెట్టి, మళ్లా యాటను కోసిందాంక ఆ ఒట్టి ముక్కలే తింటారు
ఎండబెట్టి, ఎగబెట్టడమేగాదు, వండడం కూడా శానా ఈజీ

ఇంత నూనె గాంచి, ఇన్ని వట్టిముక్కలు ఏసి ఏంచి ఉప్పు, కారం సల్లి తింటే సర్గమున్యట్టు ఉంటాది

కాదనుకుంటే కూర గునక సేస్కోవచ్చు

ఇన్ని వంకాయలు ఏసి పులుసు కూడా సేస్కోవచ్చు

సంగటితో కాంబినేషన్ బెమ్మండంగా ఉంటాది

ఫోటో-బామ్మర్ది అంపిచ్చినాడు Image
Read 3 tweets
👨 రావోయ్ ఆల్లుడూ ఇట్రా.
యాడ్నించి ఒచ్చాన్డావ్

🚶లెక్కలు ట్యూషన్ కి పొయ్యి ఒచ్చాన్డా మామా.

👨ఆట్నా.. అయ్యవారు బానే సెప్తానాడా

🚶హా మామా ఈ సారి సెంట్ గ్యారంటీ

👨ఏం జెప్పినారు ఈపొద్దు?

🚶సింపుల్ ఇంట్రస్ట్, కాంపౌండ్ ఇంటరెస్ట్ మామా

👨అంటే?

🚶బారు వడ్డీ, చక్ర వడ్డీ
#సీమపదం
👨అయితే ఒక నోట్లెక్క అడుగుతా సెప్పవోయ్. నెలకు నూటికి రూపాయిన్నర్ర వడ్డీ అయితే సంవత్సరానికి 10,000 కి వడ్డీ ఎంతయితాది సెప్పు?

**
👨ఏంది ఎతుక్కుంటాండావ్?

🚶పెన్ను, పేపర్ మామా. దానికి ఫార్ములా ఉండాది. Pnr/100

👨ఓరి సోమి,నువ్వు పెన్ను పేపరు తీసి లెక్కశారం ఏశాలకు పొద్దుగూకుతాదిగానీ
నేనే సెప్తా ఇను. నూటికి రూపాయిన్నార అయితే, ఎయ్యికి పదైదు, 10వేలకి 150. నెలకి 150 అయితే 12 నెళ్లకు 1800. దీనికి పోయి పెన్నూ పేపరు అంటావేంది సోమి?

యాడికి నువ్వు ట్యూషన్ కు పొయ్యేది? మీయమ్మకు నేను సెప్తా ఇంకాడన్నా జేరు..

దొరక్క దొరక్క నీకు దొర్కినానే అనుకుని 🤦🏼‍♂️

అట్నే మామా🏃🏃
Read 4 tweets
పులగం - నెయ్యి

అదేదో సిన్మాలో సెప్పినట్టు ఈ లాక్డౌన్ ఒచ్చినాక దిన్నామూ సేస్కోడం, సించుకోడం, పండుకోడం మళ్లా లేసి సేస్కోడం, సించుకోడం, పండుకోడం అన్యట్టే ఉండాది. ఆ సేస్కోడం గునక అప్పసం మనకు తెల్సినేటియే సేస్కుంటాండాం. ఇంగేదో సిన్మాలో తాగితే గదా తెల్సేది నచ్చుతాదో లేదో అని అన్యట్టు Image
మిగతావోల్ల వంటలు గునక సేస్కోని తింటేనే గదా తెలిసేది వాళ్ళేం తింటాండారో.

పులగం రాయలసీమలో ఎక్కువ తూర్లే సేస్కుంటాంటాం. భోగి పండాగాపొద్దు, బోనాలప్పుడూ పులగం ఉండాల్సిందే. మాకు మట్టుకు బోనాలంటేనే పులగం. శానామట్టుకు సీమ వంటకాల మాదిరి పులగం గూడా ఒంటికి మంచిది.

#సీమరుచులు #సీమపదం
పెసర బ్యాళ్లల్లో ప్రోటీన్ దండిగా ఉంటాది. అందుకే ఈ సారి మా పులగం - సెనిక్కాయ పచ్చడి ట్రై చేయండి

పులగం మేము ఎక్కువ సేస్కున్యా, అందరూ సేస్కోకున్యా సంగటి మాదిరి పేరన్నా తెల్సింటాది, సూడనన్నా సూసింటారు అనుకున్యా. శానా మందికి పులగం అనే పేరు గునక ఈ మధ్యనే తెల్సిండాది.
Read 10 tweets
నేను రెండో తర్తి లో ఉన్యప్పుడో మూడో తర్తిలో ఉన్యప్పుడో.. ప్రభవ, విభవాలు, ఇరవయ్యో ఎక్కమ్ వరకు బట్టిపట్టే సదువులు అయ్యి

మా నాయన మా ఇంటి సందమ్మడి పోయ్యే ఇంటరో / డిగ్రీయో సదివే పిల్లొళ్లను పట్టుకుని తటాల్కు 18 ఏడ్లు (18*7) ఎంత అనో 14 ఆర్లు (14*6) ఎంత అనో అడుగుతాన్యాడు
పాపం వాళ్లు నోట్లో లెక్కలేసుకుంటాంటే నువ్వు సెప్పు అన్యట్టు నాతిక్కు సూచ్చాన్యాడు.. అయ్యన్నీ స్కూల్లో నేను బట్టీ పట్టిండేటియే కాబట్టి బెరిక్కున సెప్తాంటి

అబ్బ ఇంటరోళ్లకు కూడా రానియి మా పిల్లనాయలుకు వచ్చానాయని మా నాయన మురిసిపోతాండ్య

నా అంతటి పెపంచ మేధావి లేడని నేనూ పొంగిపోతాన్య
రోజులు అట్నే ఉంటాయా.. నేనూ ఇంజినీరంగుకు వస్తి

60 ఏండ్లలో ప్రభవ విభవలు తప్ప ఏం గ్యాపకం ల్యా.. 16 ఆర్లు ఎంత అంటే 10 ఆర్లు అరవై, ఆరు ఆర్లు ముప్పైఆరు మొత్తం 96 అని నోట్లో అన్న లెక్కేసుకోవాల్ల.. ల్యాకుంటే సైంటిఫిక్ కాల్క్యులేటర్ అన్నా తియ్యాల్సి ఒచ్చాన్డ. 🤦🏼‍♂️

#సీమపదం
Read 4 tweets
దోసిత్తనాలు

పల్లెల్లో మాకు తెల్సిన టైం పాస్.. పొద్దుతిరుగుడు ఇత్తనాలు లేదంటే దోసిత్తనాలు

పొద్దుతిరుగుడు ఇత్తనాలు అంటే చెరగాల్ల, ఉప్పు నీళ్లు ఏసి ఏంచాల్ల.. పెద్ద యాసంగం.

దోసిత్తనాలు అట్టగాదు. నీళ్లు పోసి కడిగి ఎండపెడ్తే సాల్

మా నాయనకు బో ఇది దోసిత్తనాలంటే

#సీమపదం #సీమరుచులు Image
మా జేజి ఉన్యప్పుడు అప్పసం డబ్బాలకు డబ్బాలు పోసి పెడతాన్నింది. ఎండాకాలం ఒచ్చాలుకు పెద్దడబ్బా నిండుతా ఇంట్లో ఉంటాన్యాయ్

తిని మట్టసంగా బొప్పట్లు ఓసాట పెట్టండ్రా అని మాయమ్మ సెప్పను, మేం పిల్లకుశాలుతో ఇళ్లంతా సల్లను
కసువు దొబ్బిదొబ్బి ఇట్టాగాదని అమ్మ ఇత్తనాల డబ్బా ఎత్తి పెడతాన్యాది
మా జేజి ఇప్పుడు లేదు. మేము పెద్దోల్లం అయిపోయినాం. ఇప్పుడొచ్చే హైబ్రిడ్ కాయల్లో ఇత్తనాలు అన్నీ లొట్టలు ఉంటాండాయ్.. ఉన్యా కడిగి, ఎండబెట్టి, ఎత్తిపెట్టే ఓపికలు ఉండడం ల్యా. తినక శాన్నాళ్లాయ.

మంచియన్నీ జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయ్. మా జేజి ప్రేమకు, పిల్లప్పటి రోజులకు ఇయ్యి జ్ఞాపకాలు
Read 3 tweets
★ మామా సూడు నాకు స్కూల్ లో ఎన్ని మెడల్లు, షీల్డులు వచ్చినాయో.. నీకు గునక స్కూల్లో ఉన్యప్పుడు దండిగా ప్రయిజులు ఒచ్చిండాయని అమ్మ సెప్పింది కానీ మీ ఇంట్లో నేనిప్పటిదాంకా ఒక్కటి కూడా సూడలేదే 🤔

● అవున్వోయ్ అల్లుడూ. శానా ఉండాయ్.. ఇల్లంతా.. నువ్వు కూడా సూసినావ్

★ ల్యా మామా సూల్లే
● సూసినావ్ రా సోమీ అంటే.. మాకు మీ మాదిరి పనికిమాలిన మెడల్సు ఇచ్చాన్యారు అనుకున్యావా? అన్నీ బా పనికొచ్చేటి ఇచ్చాన్యారు. చంబులు, తప్యాలాలు, లోటాలు, క్యారీలు, పెన్నులు, జామెట్రీ బాక్సులు ఇట్టాంటివి. సూడ్డం ఏంది నువ్వు ఇంటికొచ్చినప్పుడు తినే పల్యాలు కూడా నాకొచ్చిన ప్రయజులే వోయ్ 😎😎
Read 3 tweets
సిన్నప్పుడు స్కూల్ కి పోతాన్యప్పుడు ఇంట్రెవల్లో బొంగులో, కమరకట్టలో కొనుక్కోనీకి పిల్లోళ్లకు ఇంట్లో పావాలనో, అర్ధరూపాయో ఇచ్చాన్యారు.

ఆదివారం సెలవు. స్కూల్ ఉండదు. అందుకే లెక్క గునక రాదు.

ఆదివారం అమ్మానాయన కాడ లెక్క రాబట్టనీకి అప్పట్లో పిల్లోళ్లకు ఒక టెక్నీకు ఉంటాన్యాది

అదేందంటే
ఆదివారం సాయంత్రం టీవీలో సినిమా ఒచ్చాది. దొంగోళ్లు ఒచ్చి ఊరంతా దోంచుకోనిపోతన్యా టీవీల కాన్నించి లెయ్యరు పెద్దోళ్లు. అట్టాంటప్పుడు లెక్క ఆడుగుతాన్యారు. సినిమా సూచ్చాన్యప్పుడు ఈళ్లతో బేజారు తీ అని అప్పుడేం అకుండా ఎంతో కొంత లెక్క ఇచ్చాన్యారు. అయితే సినిమా ఐపోయినాక పై పగలగొడతాన్యారు.
తరువాత రెండేట్లు పడ్తే పడతాయి. సినిమా బాగుంటే ఒక్కో తూరి మర్సిపోతారు గునక. అంగట్లో కొనుక్కోనీకి సేతిలో లెక్క ఉంటే సాల్ అని అప్పటి పిల్లనాయళ్లు దైర్యంగా లెక్కలు అడిగి ఈపు ఇమానం మోత మోపిచ్చుకుంటాన్యారు.

ఎట్టయినా అప్పటి పిల్లోళ్లకి బో ధైర్యమ్ 😄😄

#సీమపదం #fiction
Read 3 tweets
ఏం వోయ్ అల్లుడూ. ఎట్టున్డావ్?

~బాగుండా. సెప్పు మామ

ఫోన్లో అదేదో ఎయ్యాలంట వోయ్. నువ్వేమన్నా ఏచ్చవేమో అని

~రీఛార్జి చెయ్యలనా మామా

కాదువోయ్, ఈ కరోనా గురించి గవర్నమెంటోళ్లు ఫోన్లో ఏసుకోమని సెపుతాండారు సూడు. నాకు నోరు తిరిగి సావడం ల్యా

~ ఆరోగ్య సేతు ఆప్ ఆ మామ

ఆఆ. అదేవోయ్ ఆల్లుడూ
నా ఫోన్లో ఏచ్చావేమో అని

~ అది ఈడ్నించి ఎయ్యనీకి ల్యా మామా.. దానికి ఫోన్ గావాల్ల

నీకాడ ఉంది గదువోయ్ పోను

~నాది గాదు మామా. నీఫోను ఉండాల్ల. ల్యాకుంటే ఎయ్యలేం

ఏందివాయ్ ఆల్లుడూ. మాయమ్మి కొడుకు బెంగుళూర్లో ఇంత లావు ఉజ్జోగం సేచ్చానాడాని మేమందరికి సెప్పుకుంటాంటే, నీకు ఇదిగునక రాదే 🤷🏽‍♂️
Read 3 tweets
రేయ్! ఒక్కడివే ఉంటాండావ్
. బయట అంగళ్లు గునక లేవు. అసలే మజ్జోడివి. అన్నం పెట్టుకోనీకి గునక బరువు నీకు. ఏమన్నా సేసుకుంటాండావా? ల్యాక మజ్జుగా పచ్చు ఉంటండావా? నువ్వాడ తింటాండావో లేదో అని మాకు ఎట్నో ఉండాది. పోనీ నేనొచ్చేదా ఆడికి ? ఫోన్లో అమ్మ

~మ్మోవ్! యాడికొచ్చేది? ఎవర్నీ రానీడం ల్యా
--ఎట్నోకట్ట ఒచ్చామ్ లేరా. నేనొచ్చే నీకు సేసి పెడతాంటా.

~యాం రావొద్దు లేమ్మా. ఆడనే ఉండండి. నేను రోజు యాదో ఒకటి సేసుకుంటాండా లే.

ఔ. సిత్రాన్నం ఎట్ట సేసుకోవాల్నో సెప్పు.

మాయమ్మకు సంబరం అయ్యింది. అడుగుతాండాడు అంటే సేసుకుంటాడు అని. ఎట్టా సేసుకోవాల్నో ఇవరంగా సెప్పింది.
ఆ తర్వాత పులగం ఎట్టా సేసుకోవాలా అని అడిగినా

తరువాత తిరువాతన్నం

ఆ తర్వాత నూనేంకాయ..

నేను రోజుకోకటి అడుగుతాండా. ఆమ్మ ఇసుక్కోకుండా ఇవరంగా సేపుతా ఉండాది.

ఆ పులగం, పులుసన్నం అన్నీ నేను దిన్నామూ సేసుకునేటే.. ఎట్టా సెయ్యాలో నాకు బాగా తెల్సు.
Read 4 tweets
అన్నమయ్య - అల్లసాని పెద్దన

తెలుగు సాహిత్య చరిత్రలో అనేక విశేషాలుఉన్నాయి. మొన్న పోతనామాత్యుడికి, ఆతుకూరి మొల్లకు మధ్యగల సారూప్యతలు చూశాం. ఇవాళ తెలుగు సాహిత్యంలో ధ్రువతారల వంటి తాళ్ళపాక అన్నమాచార్యులు, అల్లసాని పెద్దనామాత్యుల మధ్య సారూప్యతలు చూద్దాం ImageImage
అన్నమాచార్యులు తెలుగు పదకవితా పితామహుడు
అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు

అన్నమయ్య తొలి తెలుగు వాగ్గేయకారుడు
అల్లసాని పెద్దన తొలి తెలుగు ప్రబంధ కర్త

అన్నమయ్య, పెద్దన ఇద్దరూ నందవరీక బ్రాహ్మణులు, ఇద్దరూ స్మార్తులు, ఇద్దరూ ఋగ్వేదులు. కానీ ఇద్దరూ వైష్ణవ మతం ఆచరించారు
అన్నమయ్య ఆ శ్రీహరి మీద 32000 వేల కీర్తనలు రచిస్తే
అల్లసాని పెద్దన హరికథాసారం రచించాడు

అన్నమయ్య తన కీర్తనలతో తెలుగులో సంకీర్తనా సాహిత్యానికి, భజన సంప్రాదయానికి, పదకవితా శైలికి ఆద్యుడుకాగా

పెద్దన తన స్వారోచిష మనుసంభవము / మను చరిత్రతో తెలుగులో ప్రబంధ సాహిత్యానికి ఆద్యుడైనాడు
Read 8 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!