Discover and read the best of Twitter Threads about #సీమరుచులు

Most recents (10)

పులగం

రాయలసీమలో పులగం పేరు తెలియని వారు ఉండరు. శనివారాల్లో, పండగ దినాల్లో ( ముఖ్యంగా సంక్రాంతి పండుగకు) సీమ ఇండ్లల్లో ఎక్కువగా పులగం చేసుకుంటూ ఉంటారు. అందరూ సాధారణంగా చేసుకునే వంటకమైనా, పులగానికి చాలా పెద్ద చరిత్ర ఉంది.

పులాక అనే సంస్కృత పదము నుండి పులగము అనే పేరు వచ్చింది.
పులాకము అంటే అన్నపు మెతుకు అని అర్థము. పెసర పులాకము / పెసర పులగాన్నే సంక్షిప్తంగా పులగం అంటున్నారు. బియ్యానికి, పొట్టుతో కూడిన పెసరపప్పు (పెసర బేడలు) కలిపి చేసే అన్నమే పులగం. పులగాన్ని ముద్గాన్నాము లేదా ముద్గలాన్నాము అని కూడా అంటారు.
ముద్గలు అంటే పెసలు అని అర్థం. అందుకే పెసర పులగానికి ముద్గాన్నము అని కూడా పేరు. పిండిపదార్థం (carbohydrates) (బియ్యం) , మాంసకృత్తులు(preoreins) (పెసలు) కలగలిపి చేసే పులగం రుచిపరంగానే కాక, ఆరోగ్య రీత్యా కూడా శ్రేష్టమైనది.
Read 13 tweets
బియ్యపు వడలు

మ్మా.. మ్మా.. నేనేచ్చా మ్మా.. నూనెలో

నూనె బాగా కాలతాంది రా.. నీకు పొయ్యి అందదు.. ఎయినీకి రాదు.. నూనె ఎగిరి మీద పడతాది.. పొయ్యి కూర్చో పో.. నేను ఏసి తీసకచ్చా తిందువుగాని

ప్లీస్ మా.. ప్లీస్ మా..

సరే వెయ్.. సిన్నగా

అబ్బా (పెనం కాలి నేను)

సెప్పినా కదరా కాల్తాది అని ImageImageImage
నేనేస్తా.. నువ్వు తినుపో ..

(నేను ధనేల్ అని ఒకేసారి ఏచ్చే ఎగిరిపడిన కాలే నూనె సినుకులు అమ్మ సేతి మీద పడితే అయ్యేమ్ పట్టిచ్చుకోకుండా)

నా చెయ్యి తీసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతా అమ్మా..తగ్గిపోతాది లే.. పొయ్యు కూర్చోని తినుపో.

అమ్మ సేచ్చే రుచే గాదు ఎమోషన్స్ గునక జాచ్చే
#nostalgia
PS: ఇవి నేను చేసినవి

#సీమపదం #సీమరుచులు
Read 3 tweets
తడకనపల్లి కోవా - తంగెడుపల్లి హల్వా

ఆ మధ్య ఒకరు మా తిట్టు పలానా ఊర్లో పాలనా స్వీటు ఫేమస్, ఇంకో ఊరిది మరో స్వీటు ఫేమస్..మాకు ఇన్నిన్ని ఫేమస్ స్వీట్లు ఉండాయి.. మీకేం ఉండాయి అసలు అన్నారు (ఖచ్చితంగా అవే మాటలు కాకపోయినా భావం అదే). ఇది చాలా మంది భావన. ఎందుకంటే ఎప్పుడూ పేర్లు వినుండరు. Image
అన్నా,అంతలక్కలా వాళ్ల వాళ్ల స్పెషల్ ఐటమ్స్ ఉంటాయ్. సినిమాల్లో, పేపర్లలో రానంత మాత్రాన ఈడ స్పెషల్స్ లేవని గాదు. దర్శకుడో, మాటల/పాటల రచయితలో ఇక్కడోళ్లు అయ్యుంటే నీ వలపు 'తడకనపల్లి కోవా', నీ వగలు 'తంగెడుపల్లి హల్వా' అని డైలాగులు పెట్టేవారు. టీవీవాళ్లు స్పెషల్ ప్రోగ్రాములు వేసేవాళ్లు
ఆయా రంగాల్లో ఇక్కడోళ్లు లేకపాయ

సినిమాల్లో సూపిచ్చేయే స్వీట్లు కాదు, పేపర్లలో రాసేయే వంటలు కాదు

ఎవరి స్పెషల్స్ వాళ్లవి. మీకు పేర్లు తెలీదంటే లేవని కాదు అర్థం

PS:కర్నూలులోని తడకనపల్లి పాలకోవా బాగా ఫేమస్

కడప జిల్లాలోని తంగేడుపల్లి ఆ చుట్టుపక్కల స్వీట్స్ కి బాగా ఫేమస్

#సీమరుచులు
Read 3 tweets
రూపాయి దోశ - 5 రూపాయల దోశ

20 ఏళ్ల కింద మాట. మా ఊర్లో రమణమ్మ దోశలు (పేరు మార్చా) బాగా ఫేమస్. పొద్దున్నే రమణమ్మ దోశలంగట్లో దోశలు తినాలంటే అరగంటన్నా పడ్తాన్యాది. ఎప్పుడు సూడు జనాలు ఉంటాన్యారు. రమణమ్మ అంగట్లో మూడు రకాల దోశలు ఉంటాన్యాయ్. రూపాయి దోశ, రెండు రూపాయల దోశ, 5 రూపాయల దోశ. ImageImage
రూపాయి దోశలకు ఎర్రకారం ఏచ్చే బొంబాయి సెట్నీ ఉండదు. బొంబాయి సెట్నీ ఏచ్చే ఎర్రకారం ఉండదు. ఎప్పుడన్నా బుద్దిపుట్టి రెండు ఏసినాదంటే ఆపొద్దు పప్పుల పొడి ఉండదు. ఆ సిన్న పెనం మీదనే రెండు ఒక రూపాయి దోశలు ఇరికీడం రమణమ్మ టాలెంట్

ఇంక రెండు రూపాయల దోశలు. పెనం మీద ఒకతూరి ఒకటే దోశ.
కారం, బొంబాయి సెట్నీ, పప్పుల పొడి అన్నీ ఎచ్చాది గానీ అన్నీ ఆంటీ ముట్టనట్టు ఉంటాయి. రోన్త నూనె జాచ్చి ఏచ్చాది.

ఇంగ 5 రూపాయల దోశలోళ్లు. ఈళ్లు మిగతా వాళ్ల మాదిరి వెయిట్ సెయ్యాల్సిన అవసరం ల్యా. ఊర్లో పెద్దపెద్దోళ్లు అంతా ఆడ్నించి 5 రూపాయల దోశలు తెప్పించుకుంటాన్యారు.
Read 8 tweets
మా పల్లెల రుచులు- ఒట్టి సియ్యలు / ఒట్టి ముక్కలు / ఒట్టి మాంసం / ఎండు మాంసం / ఎండు సియ్యలు

సంక్రాంతి ఒచ్చాలుకు ఒక అన్న ఆడబిడ్డకు ఒక అర్ధ సేరు ఒట్టి సియ్యలు అంపిచ్చాడు

దేవర ఒచ్చాలకు పల్లెలో ఉండే ఓ అమ్మ టౌన్లో ఉండే కొడుక్కి ఒక సేరు ఒట్టి సియ్యలు అంపిచ్చాది #సీమరుచులు
#సీమపదం Image
అంకాలమ్మ జాతరకు యాటను కోశాలకు ఇంట్లోకి ఒక సేరు, సుట్టాలకు ఓ సేరు సియ్యలు ఎండబెట్టాల్సిందే

మాంసం ఎక్కువగా తినే ఇండ్లల్లో ఎప్పుడు తినాలనిపిచ్చే అప్పుడు యాటను కోయలేరు కాబట్టి, కోసినప్పుడు ఒక సేరో, రెండు సేర్లో సియ్యలు ఎండబెట్టి, మళ్లా యాటను కోసిందాంక ఆ ఒట్టి ముక్కలే తింటారు
ఎండబెట్టి, ఎగబెట్టడమేగాదు, వండడం కూడా శానా ఈజీ

ఇంత నూనె గాంచి, ఇన్ని వట్టిముక్కలు ఏసి ఏంచి ఉప్పు, కారం సల్లి తింటే సర్గమున్యట్టు ఉంటాది

కాదనుకుంటే కూర గునక సేస్కోవచ్చు

ఇన్ని వంకాయలు ఏసి పులుసు కూడా సేస్కోవచ్చు

సంగటితో కాంబినేషన్ బెమ్మండంగా ఉంటాది

ఫోటో-బామ్మర్ది అంపిచ్చినాడు Image
Read 3 tweets
Flavour of the Season - బంగినపల్లి మామిడి పండు

ఆంధ్ర రాష్ట్రంలో 'వ్యవసాయ ఉత్పత్తుల' విభాగంలో కేవలం మూడు వస్తువులకు మాత్రమే ప్రతిష్టాత్మక భౌగోళిక గుర్తింపు (GI tag)ఉంది. అందులో కేవలం ఒకటి మాత్రమే పండు.. అది పండ్లలో రారాజైన బనగానపల్లి / బేనీషా మామిడిపండు.

#సీమరుచులు #కర్నూలు
చిత్రంగా "గుర్తు లేనిది" అన్న అర్థం వచ్చే "బేనిషాన్" పేరు కలిగిన పండు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో "భౌగోళిక గుర్తింపు" కలిగిన ఏకైక పండు.

మామిడిపండ్లలో అనేక రకాలు ఉన్నా బంగినపల్లి మామిడి పండ్ల రుచే వేరు. పెద్ద పరిమాణం, పసిడి వర్ణం, మధురమైన రుచి, వైవిధ్య సువాసన వీటి ప్రత్యేకత
ప్రస్తుత రాయలసీమ మొత్తం ఒకప్పుడు బ్రిటీషు వారి పరిపాలనలో ఉన్నా, కర్నూలు జిల్లా బనగానపల్లె సంస్థానం మాత్రం బ్రిటీషువారి ప్రత్యక్ష పరిపాలనలో లేని 540 పైచిలుకు సంస్థనాలలో ఒకటి. బనగానపల్లె నవాబులు పండ్లతోటల పెంపకాన్ని బాగా ఆదరించారు. ఆ పండ్లతోటల నుండి వచ్చినదే బేనీషా రకం మామిడిపండు
Read 7 tweets
పులగం - నెయ్యి

అదేదో సిన్మాలో సెప్పినట్టు ఈ లాక్డౌన్ ఒచ్చినాక దిన్నామూ సేస్కోడం, సించుకోడం, పండుకోడం మళ్లా లేసి సేస్కోడం, సించుకోడం, పండుకోడం అన్యట్టే ఉండాది. ఆ సేస్కోడం గునక అప్పసం మనకు తెల్సినేటియే సేస్కుంటాండాం. ఇంగేదో సిన్మాలో తాగితే గదా తెల్సేది నచ్చుతాదో లేదో అని అన్యట్టు Image
మిగతావోల్ల వంటలు గునక సేస్కోని తింటేనే గదా తెలిసేది వాళ్ళేం తింటాండారో.

పులగం రాయలసీమలో ఎక్కువ తూర్లే సేస్కుంటాంటాం. భోగి పండాగాపొద్దు, బోనాలప్పుడూ పులగం ఉండాల్సిందే. మాకు మట్టుకు బోనాలంటేనే పులగం. శానామట్టుకు సీమ వంటకాల మాదిరి పులగం గూడా ఒంటికి మంచిది.

#సీమరుచులు #సీమపదం
పెసర బ్యాళ్లల్లో ప్రోటీన్ దండిగా ఉంటాది. అందుకే ఈ సారి మా పులగం - సెనిక్కాయ పచ్చడి ట్రై చేయండి

పులగం మేము ఎక్కువ సేస్కున్యా, అందరూ సేస్కోకున్యా సంగటి మాదిరి పేరన్నా తెల్సింటాది, సూడనన్నా సూసింటారు అనుకున్యా. శానా మందికి పులగం అనే పేరు గునక ఈ మధ్యనే తెల్సిండాది.
Read 10 tweets
దోసిత్తనాలు

పల్లెల్లో మాకు తెల్సిన టైం పాస్.. పొద్దుతిరుగుడు ఇత్తనాలు లేదంటే దోసిత్తనాలు

పొద్దుతిరుగుడు ఇత్తనాలు అంటే చెరగాల్ల, ఉప్పు నీళ్లు ఏసి ఏంచాల్ల.. పెద్ద యాసంగం.

దోసిత్తనాలు అట్టగాదు. నీళ్లు పోసి కడిగి ఎండపెడ్తే సాల్

మా నాయనకు బో ఇది దోసిత్తనాలంటే

#సీమపదం #సీమరుచులు Image
మా జేజి ఉన్యప్పుడు అప్పసం డబ్బాలకు డబ్బాలు పోసి పెడతాన్నింది. ఎండాకాలం ఒచ్చాలుకు పెద్దడబ్బా నిండుతా ఇంట్లో ఉంటాన్యాయ్

తిని మట్టసంగా బొప్పట్లు ఓసాట పెట్టండ్రా అని మాయమ్మ సెప్పను, మేం పిల్లకుశాలుతో ఇళ్లంతా సల్లను
కసువు దొబ్బిదొబ్బి ఇట్టాగాదని అమ్మ ఇత్తనాల డబ్బా ఎత్తి పెడతాన్యాది
మా జేజి ఇప్పుడు లేదు. మేము పెద్దోల్లం అయిపోయినాం. ఇప్పుడొచ్చే హైబ్రిడ్ కాయల్లో ఇత్తనాలు అన్నీ లొట్టలు ఉంటాండాయ్.. ఉన్యా కడిగి, ఎండబెట్టి, ఎత్తిపెట్టే ఓపికలు ఉండడం ల్యా. తినక శాన్నాళ్లాయ.

మంచియన్నీ జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయ్. మా జేజి ప్రేమకు, పిల్లప్పటి రోజులకు ఇయ్యి జ్ఞాపకాలు
Read 3 tweets
కేవలం రెండు నిముషాల్లో మా రాయలసీమ పచ్చడి తయారు - ఎర్రగడ్డ - కొబ్బరి పచ్చడి

మొన్న చెప్పా కదా పులగంలోకి సెనిక్కాయ పచ్చడి గానీ కొబ్బరి పచ్చడి గానీ బెమ్మాన్డంగా ఉంటాదని.

ఆ కొబ్బరి పచ్చడి 2 నిముషాలల్లోనే సేసుకోవచ్చు.

ఈ రోజు ఎట్టా సెయ్యాల్నో సూద్దాం

#సీమరుచులు Image
కావలసినవి: ఎర్రగడ్డలు (సిన్న ముక్కలుగా కోసుకోవాలి), కొబ్బెర, పచ్చి మిరపకాయలు, ఉప్పు, నానబెట్టుకున్న సింతపండు

అన్నీ కలిపి రోట్లో ఏసి దంచడమే. రోలు లేకపోతే మిక్సికి వేయండి.

మరీ పేస్టులా కాకుండా కచ్చ, పచ్చగా చేసుకోవాలి. అప్పుడే టేస్ట్. ImageImage
కొందరు కారం పొడి వేసుకుంటారు, కొందరు పప్పులు (పుట్నాలు) వేసుకుంటారు. కొందరు దీనికే తిరవాత గునక పెడతారు. అయ్యేమ్ సెయ్యాకపోయినా పచ్చడి బెమ్మాన్డంగా ఉంటాది.

వేడి వేడి అన్నం లోకి, పులగంలోకి నేయి ఏసుకొని తింటే ❤️❤️❤️ Image
Read 3 tweets
The All Purpose POWDER - పప్పుల పొడి

మైదాని all purpose flour అంటారు. అంటే చాలా రకాలుగా, చాలా వంటల్లో వాడొచ్చు అని.

అలాగే సీమ వంటకాల్లో పప్పుల పొడి (పుట్నాల పొడి)ని ఆల్ పర్పస్ పొడి అనొచ్చు. ఉల్లగడ్డ, వంకాయ, కొయిటాకు, మునగాకు..ఇలా దాదాపు అన్ని తాళింపుల్లో పప్పుల పొడి వేస్తారు Image
అది కాక ఉగ్గాని, పులుసన్నం లోకి పప్పుల పొడి బాగుంటుంది.

ఉప్మాకి పర్ఫెక్ట్ మాచ్. ఉప్మా చేస్తే చట్నీ చేసేదే లేదు. అయితే ఊరగాయన్నా లేదంటే పప్పుల పొడి.

వేడి అన్నంలో పప్పుల పొడి, నెయ్యి కాంబినేషన్ అదుర్స్.

కారం దోశ కు కూడా పప్పుల పొడి ఉండాల్సిందే (కారం లేని పప్పుల పొడి)
సీమలో దాదాపు ప్రతీ ఇంట్లో రెండు పొడులు ఎప్పుడూ నిల్వ ఉంటాయి. ఒకటి చిట్ల పొడి (పల్లీల పొడి) అయితే, ఇంకొకటి పప్పుల పొడి.

కొందరు పప్పుల పొడినే ముద్దుగా 'గన్ పౌడర్' అని అంటారు.

చేయడానికి కావలసినవి: పప్పులు, ఉప్పు, కారం పొడి (ఎండు మిరపకాయలు), తెల్లవాయలు

#సీమరుచులు
Read 3 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!