Discover and read the best of Twitter Threads about #Chittoor

Most recents (20)

Molester caught, woman rescued within 9 mins of #DishaApp trigger: A 20 y/o woman from #Chittoor was sexually attacked by a molester while she was asleep alone in her house. Alerted, she screamed & pushed the molester out of her house & triggered the SOS button at 1:17 am. (1/2)
The woman recently downloaded #DishaApp through an awareness campaign. Receiving the information, @ChittoorPolice rushed to the location late in the night within 9 mins & arrested the accused. DGP Gautam Sawang appreciated the effective awareness campaigns & quick rescue. (2/2)
Read 3 tweets
Attention! The state of #AndhraPradesh has implemented a facial recognition system to help identify “criminals” in #Chittoor 👁‍🗨

Sub-divisions in question: Chittoor, Puttur, Palamaner and Madanapalle. 1/3

Follow this thread! 👇🏽 #ProjectPanoptic Andhra Pradesh deploys invasive facial recognition technolog
This is an ambitious digital surveillance project — 730 high resolution cameras have been installed, and nearly 60% of the work has been completed. But does this cloud-based surveillance system have any privacy or security SOPs? #AndhraPradesh #ProjectPanoptic 2/n
In fact, there's talk of expanding this system to the lesser covered rural areas too. But we must first ensure legal safeguards for the functioning of such a system, so that its misuse can be prevented. #ProjectPanoptic

Read more about the project 👇🏽 3/3

panoptic.in/andhra-pradesh…
Read 3 tweets
Read 259 tweets
Read 284 tweets
The double murder incident at Madanapalle, Chitoor is shocking to say the least. Two young girls burgeoned to death by dumbbells and tridents by the mother, while the father looked on, because a Swamiji adviced is beyond horrific. Evidences of tantric pooja all over. #Chittoor
The elder daughter Alekhya is an MBA, younger one Divya BBA grad and also student of AR Rahman Music School in Mumbai. Divya was killed in the afternoon, Aekhya later in the night. Apparently, entire family has been brainwashed to believe that they will be reborn in Satyayuga.
Scary visuals of the incident. Both were killed in the pooja room, heads were half tonsured, small silver kalasam (pots) in their mouths, naked when killed & then draped in red sarees. Parents didn’t allow police to shift the bodies, kept saying they will be reborn by morning.
Read 5 tweets
కార్వేటినగరం

పద్మావతీ అమ్మవారి తండ్రి ఆకాశరాజు. వారి వంశస్థులు నారాయనవనం రాజధానిగా చేసుకుని పాలించేవారు. ఒకనాడు నారాయనవనం రాజులు వేటకు అడవికి వెళ్లగా అక్కడ ఒకచోట వారి వేటకుక్కలని ఒక కుందేలు తరమడం చూసి, రాజధాని నిర్మించడానికి అదే ఉత్తమమైన ప్రదేశంగా భావించి అక్కడ అడవిని నరికించి ImageImage
ఒక నగరం నిర్మించారు. 'కాడు' (తమిళంలో అడవి ) 'వెట్టి' (తమిళంలో నరికి) నిర్మించిన 'నగరం' కాబట్టి కాడువెట్టినగరం అయ్యి అదే కాలక్రమేణా కార్వేటినగరం అయ్యింది.

మరొక కథనం ప్రకారం 'కాడు' లో 'వేట్టై' (తమిళంలో వేట) వెళ్లిన తరువాత నిర్మించిన 'నగరం' కాబట్టి కార్వేటి నగరం అయ్యింది.
ఇంకొక కథనం ప్రకారం నగర పొలిమేరల్లో ఉన్న 'కార్వేటమ్మ' పేరు మీద కార్వేటి నగరం అయ్యింది.

కార్వేటినగరం ముందు ఉత్తర ఆర్కాటు జిల్లాలో ఆ తరువాత చిత్తూరు జిల్లాలోని ఒక జమీందారీ. ఇక్కడి సంతాన వేణుగోపాల స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం.
#సీమపట్టణాలు #సీమచరిత్ర #chittoor
Read 3 tweets
కాళహస్తి కాలంకారీ

పత్తిపోగు దారాలతో నేతనేసి
కరక్కాయ పాలాలో నానబెట్టి
స్వర్ణముఖి నీళ్లల్లో మరగబెట్టి
అంబళ్లపొద్దు ఎండకెండబెట్టి

చింతబొగ్గుతో బొమ్మలు గీసి
వెదురు -గుడ్డల కలముతో రాసి
బెల్లం సిలుముల కసిమి అద్ది
వేవేల పూలా రంగులు పూసి Image
రామయ్య తేజాలు
సీతమ్మ అందాలు
రామాయణ వైనాలు
కురుక్షేత్ర యుద్దాలు

కళ్ళకింపుగా
చేతితో దిద్దగా
ఆవిష్కృత అద్భుతమీ
కాళహస్తి కాలంకారీ

#NationalHandloomDay #NationalHandloomDay2020 #Chittoor #Kalahasti #kalamkari #సీమకళలు #కలంకారీ
చిత్రం : rajaraman sundaram

commons.wikimedia.org/wiki/File:KALA…
Read 3 tweets
A tweet thread with the list of Hospitals treating #COVID19 Positive people in each district in #AndhraPradesh.

If you are looking for immediate assistance/help call 104 toll-free number i.e., available 24 X 7
#APFightsCorona #COVID19Pandemic
List of Hospitals treating #COVID19 Positive people in #Anantapur district.
#APFightsCorona #COVID19Pandemic
List of Hospitals treating #COVID19 Positive people in #Chittoor district.
#APFightsCorona #COVID19Pandemic
Read 14 tweets
గర్వాంగా చెప్పరా సీమనాదని
రాయలేలిన రతనాల సీమనాదని

కరువు నేల నీదంటే
రాళ్ళ బతుకు మీదంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
రతనాల రాశులమ్మిన నేల నాదని

నీ మాటే మొరటంటే
నీ యాసే వెగటంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
తెలుగు భాష తొలి శాసన గడ్డ నాదని Image
నీ వాళ్ళు రౌడీలని
ఫ్యాక్షనిస్టులు మీరంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
దేవుళ్ళు కొలువైన పుణ్య భూమి నాదని

వెనుకబాటు నీదని
పేదరికం మీదంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
చల్లకొస్తే పాడిపడ్డ దానమిచ్చు చరితమాదని Image
సదువుసంజెలు లేవని
అనాగరికులు మీరంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
ఈడ ఆలిసెల్లి తప్ప ఆడోళ్లు అమ్మలక్కలేనని

గర్వాంగా చెప్పరా సీమనాదని
రాయలేలిన రతనాల సీమనాదని

#సీమకవిత #Rayalaseema #Kadapa #Kurnool #Anantapur #Chittoor #Tirupati Image
Read 3 tweets
రక్షా బంధన్ - రాఖీ పూర్ణిమ - రాయలసీమ దేవాలయాలు

సోదర - సోదరి బాంధవ్యాలు, ఆడబిడ్డకు సారె పెట్టే సంప్రదాయాలు మానవులలోనే కాదు దేవుళ్లలోనూ చూడొచ్చు. అటువంటి కొన్ని ఆలయాలు రాయలసీమలో Image
మోపూరు భైరవేశ్వర ఆలయం (భైరవుడి సోదరి అక్కపప్పూరమ్మ ) - కడప జిల్లా

భైరవాచలం మెట్ల మార్గం ప్రారంభంలోనే భైరవేశ్వరుడి సోదరి అక్కపప్పూరమ్మ ఆలయం ఉంటుంది. భైరవేశ్వర స్వామి విగ్రహం రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో అక్కపప్పూరమ్మ తలపై చేయి పెట్టగా,
ఆగ్రహించిన భైరవేశ్వరుడు భైరవాచలం వదిలి వెళ్లాలని ఆదేశించాడని అందుకే అక్కపప్పూరమ్మ ఆలయం కింద ఉందని చెబుతారు.అయితే స్వామి తరువాత శాంతించి అక్కపప్పూరమ్మకు తొలి పూజ భాగ్యం కల్పించాడని స్థల పురాణం.

చిత్రం : నల్లచెరువుపల్లిలో అక్కపప్పూరమ్మ ఆలయం Image
Read 8 tweets
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలి అనగానే గుర్తుకు వచ్చే పేరు - భానుమతి రామకృష్ణ గారు

తెరపైన కథ -స్క్రీన్ ప్లే- మాటలు - పాటలు - సంగీతం - దర్శకత్వం అన్నిటికీ ఒకే పేరు కనపడితే వెంటనే గుర్తుకు వచ్చేది SV కృష్ణారెడ్డి గారు Image
ఆ బహుముఖప్రజ్ఞ, అలాగే ఒకేచిత్రంలో ఒకరే కీలక విభాగాలలో పనిచేయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదలయ్యింది తొలితెలుగు సూపర్ స్టార్, పాల్ ముని ఆఫ్ ఇండియా, దక్షిణాదిన పద్మశ్రీ అవార్డు పొందిన తొలి నటుడు, జాతీయఅవార్డు గ్రహీత, చిత్తూరు నాగయ్యగా ప్రసిద్ధి చెందిన ఉప్పలదడియం నాగయ్య శర్మ గారితో
1946లో విడుదలైన త్యాగయ్య చిత్రం లో స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడమేకాక, ఆ చిత్రానికి కథ, సంగీతం, స్క్రీన్ ప్లే (ఇతరులతో పాటు) కూడా పాలుపంచుకున్నారు. ఆ చిత్రంలో అద్భుతమైన పాటలు కూడా పాడారు. Image
Read 4 tweets
ఇది కథ కాదు - సీమ సిత్రాలు

కాళహస్తి కలంకారీకి చిత్తూరు చాక్లెట్ న్యూట్రిన్ కి సంబంధం ఏమిటి?

కలంకారీ కళను పునరుత్తేజం కల్పించి అంతర్జాతీయ ఖ్యాతి లభించేలా చేయడంలో ఇద్దరు స్త్రీలు ప్రధాన భూమిక పోషించారు. ఒకరు కమాలదేవి ఛటోపాధ్యాయ కాగా మరొకరు ఎవరు? ImageImage
బెంగళూరు మహానగరం. ఒక రోజు మూటలో వస్త్రాలు పెట్టుకుని, ఇంటటింటికీ తిరిగి అమ్ముతున్న ఒక వృద్ధుడు ఒక ఇంటి తలుపు తట్టాడు. ఈ నగరంలో అంతటా తాము నిరాదరణకు గురవుతున్నామని, తమని బిచ్చగాళ్లని చూసినట్టు చూస్తున్నారని, సహాయం చేయాలని అర్థించాడు ఆ వృద్ధుడు.
ఆ మూటలోని వస్త్రాలను, వాటి పనితనాన్ని, వాటిని అమ్మడానికి ఆ వృద్దుడు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు ఆ ఇంటి యజమాని. ఆ ఇంటి యజమాని కూతురు పెట్టిన భోజనం తిన్నాక తనలాంటి కళాకారులు చాలామంది ఉన్నారని వారి దీనగాథని వారికి వివరించాడు ఆ వృద్ధుడు.
Read 10 tweets
తిరుమల తిరుపతి దేవస్థానముల-తొట్ట తొలి శాసనం

తిరుమల క్షేత్రం ఎంత పురాతనమైనది? అక్కడి ఆలయాలపై శిలాశాసనాలు ఏమి చెప్తున్నాయి? తిరుమలలో లభ్యమవుతున్న శాసనాలలో అత్యంత పురాతన శాసనం ఏది?

దాదాపు 2000వేల సంవత్సరాల ప్రాచీన తమిళ సంగం సాహిత్యంలో తిరుమల ప్రస్తావన ఉంది.

-ప్రతీకాత్మక చిత్రం ImageImage
ఈ కావ్యాలలో తిరుమలను వేంగడం గా పేర్కొనడం జరిగింది. పురాణాలు తిరుమలను ఆదివరాహ క్షేత్రంగా పేర్కొన్నాయి.

ఇక శాసనాల విషయానికి వస్తే తిరుమల- తిరుపతి ఆలయాల్లో లభ్యమవుతున్న శాసనాల్లో మొట్టమొదటి శాసనం పల్లవుల కాలంలో వేయించినది .

#TTD #Tirumala #Inscriptions #Chittoor
51సంవత్సరాలు సుదీర్ఘంగా పాలించిన పల్లవ రాజు దంతివర్మ అధికారులు తిరుచానూరులో వేయించిన రెండు శాసనాలు అత్యంత పురాతన శాసనాలుగా తిరుమల శాసనాల పరిష్కర్త శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పేర్కొన్నారు. దంతివర్మ క్రీ.శ. 795 నుండి 846 ( 830?) సంవత్సరం వరకు పాలించారు.
Read 8 tweets
చదువులమ్మ సేవలో చౌడేపల్లి

చిత్తూరు జిల్లా ఎందరో విద్యావేత్తలు, తత్వవేత్తలకు జన్మస్థానం. అసలు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునేదే ఈ గడ్డ మీద పుట్టిన సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారి జయంతిని పురస్కరించుకుని. రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థుల భవితను తీర్చిదిద్దడంలోనూ, #chittoor Image
వారి పాఠ్యాంశాలను వారు సులభ రీతిలో అర్థం చేసుకునేలా తోడ్పడడంలోనూ చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లిది దశాబ్దాల చరిత్ర

బడికి వెళ్లే పిల్లల నేస్తంగా, వారిలో పఠనాశక్తి పెంపొందించుతూ పరీక్షలలో వారు మంచి ప్రతిభతో ఉత్తీర్ణులు అయ్యే లక్ష్యంతో దశాబ్దాలుగా వెలువడుతున్న పత్రికలు మాబడి, పాఠశాల
ఈ రెండు పత్రికలను ప్రారంభించింది నాయుని కృష్ణమూర్తి గారు. 7 వ తరగతి విద్యార్ధుల కోసం మాబడి మాసపత్రిక, 10వ తరగతి విద్యార్ధుల కోసం పాఠశాల మాసపత్రిక 1970ల నుండి ప్రచురితం అవుతున్నాయి. విజయవాణి ప్రింటర్స్ ఈ రెండు పత్రికలు చిత్తూరు జిల్లా చౌడేపల్లి నుండి ప్రచురిస్తోంది.
Read 6 tweets
పాపవినాశనం

శ్రీవారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో ప్రతీ రాయి, రప్ప, వాగు - వంక, కొండ - కోన పవిత్రమే. తిరుమలలో ఉన్న అనేక దివ్య తీర్థాలలో ఒకటి పాపవినాశనం తీర్థం. ఈ తీర్థంలో స్నానామాచరిస్తే సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ తీర్థానికి 'పాపవినాశనం' అన్న పేరు వచ్చింది.
ఒకప్పుడు స్వామివారి కైంకర్యాలకు పాపవినాశనం జలాన్నే వాడేవారట.

సంకీర్తనాచార్యుడు అన్నమయ్య 'పావినాశనం' తీర్థాన్ని తన కీర్తనలలో ఈ విధంగా వర్ణించాడు

ప్రఖ్యాతి చెందిన పాపవినాశనం తీర్థంలో పాపాలు పగిలి పరుతున్నాయని ఒక చోట, పామరులను అమరులు చేయు పాపవినాశనం అని మరో చోట రాశారు. Image
“అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము” అన్న కీర్తనలో ( అధ్యాత్మ సంకీర్తన - రేకు: 37-1 సంపుటము: 1-227) అన్నమయ్య 'పావినాశనం' ఈ విధంగా వర్ణించాడు

ప్రాకటంబైన పాపవినాశనములోని
భరితమగు దురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగ తోయములు సోఁకిన భవము
లంతంత వీఁడి పారఁగను

#Ravishing_Rayalaseema Image
Read 8 tweets
నీటి ప్రాజెక్టులు-వాటి పేర్లు

తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య
తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలంసంజీవరెడ్డి
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య
తొలి కడప లోక్సభ సభ్యుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి
జలరంగ నిపుణులు కుడితిపూడి శ్రీరామకృష్ణయ్య

వీరి మధ్యన ఉన్న సారూప్యం ఏమిటి ? Image
వివిధ కాలాలు, రంగాలకు చెందిన వీరి పేరు చిరస్థాయిగా నిలిచేలా సీమలోని అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు వీరి పేరు పెట్టడం జరిగింది. సాధారణంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకువాడుకలో ఒక పేరు (సాధారణంగా ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం/నది పేరు మొ. ) ఉంటె అధికారికంగా మరో పేరు ఉంటుంది.
ఆ ప్రాంతానికి నీరు తేవడానికి కృషి చేసిన రాజకీయ నాయకుడి పేరు అయుండొచ్చు లేదా ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అయుండొచ్చు లేదా ఆ ప్రాంతానికి సంబంధం లేని గొప్ప వ్యక్తి అయినా అయుండొచ్చు. ఇప్పుడు రాయలసీమలోని కొన్ని ప్రధాన ప్రాజెక్టులకు ఎవరెవరి పేర్లున్నాయో చూద్దాం
Read 21 tweets
రాయలసీమ - దశావతార ఆలయాలు

“ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవత్గీతలో.
అంటే ధర్మాన్నిస్థాపించడంకోసం/నిలబెట్టడంకోసం ప్రతీయుగంలోనూఅవతరిస్తానుఅనిఅర్థం

దశావతారాలలోని రామ, కృష్ణ, నరసింహ అవతారాలకు విశేషంగా ఆలయాలుఉన్నాయి.
కానీ. మత్స్య, కూర్మ వంటి అవతారాలకు దేశం మొత్తంలో చాలా అరుదుగా మాత్రమే ఆలయాలు ఉన్నాయి.

అయితే దశావతారాలకు సంబంధించి రాయలసీమలోని అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యంత అరుదైన ఆలయాల విశేషాలు

మత్స్యావతారం:

సృష్టికర్త బ్రహ్మ వద్ద నుండి సోమకాసురుడు వేదాలు తస్కరించి సముద్రగర్భంలో దాక్కుంటే
శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి వధించి వేదాలను రక్షిస్తాడు.

దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతార మూర్తికి ఆలయాలు అత్యంత అరుదు. అటువంటి ఆలయాలలో ఒకటి చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం నాగలాపురం పట్టణంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం.
Read 23 tweets
దేఖో అప్నా దేశ్ - Top 15 Tourist Destinations in Rayalaseema

రాయలసీమ గురించి పెద్దగా తెలియని వాల్లకు రాయలసీమలో తప్పక చూడవలసిన ప్రదేశాల గురించి ఈ థ్రెడ్

గమనిక:
1.The List given below is strictly according to my Personal Opinion
2. The List is in no particular order
Top 15 Spiritual Destinations

చిత్తూరు

1. తిరుపతి - తిరుమల ఆలయాలు
2. సురుటుపల్లి పల్లికోండేశ్వర స్వామి ఆలయం
3. కాణిపాకం - వినాయక ఆలయం
4. శ్రీకాళహస్తి (శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి ఆలయం)

కర్నూలు

5. శ్రీశైలం ఆలయాలు (జ్యోతిర్లింగ క్షేత్రం)
6. అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
7. నవనందులు/మహానంది
8. యాగంటి
9. మంత్రాలయ శ్రీ మఠం

కడప

10. పుష్పగిరి ఆలయాలు
11. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం
12. అమీర్ పీన్ దర్గా(పెద్దదర్గా)

అనంతపురం

13. కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
14. తాడిపత్రి ఆలయాలు
15. పుట్టపర్తి
Read 7 tweets
మన చిత్తూరు

తిరుమల శ్రీవారి వైభవం కాళహస్తి వాయులింగం
సురుటుపల్లి శివుడు నాగలాపురం నారాయణుడు
అప్పలాయగుంట వెంకన్న అర్ధగిరి అంజన్న
కాణిపాకం గణపతి కార్వేటినగర రుక్మిణీపతి

గంగమ్మ కొలువైన బోయకొండ
అలనాటి పౌరుషాల గుర్రంకొండ
మదనపల్లి ఏనుగు మల్లమ్మ కొండ 
తంబల్లపల్లి గంప మల్లయ్య సామి కొండ
నగరి కైలాస కోన శేషాచల తలకోన 
గుంజన జలపాతం పవిత్ర కపిల తీర్థం
రాష్ట్రమంచున మల్లప్ప కొండ కుప్పం
విజయనగర శౌర్యం చంద్రగిరి దుర్గం

పాపవినాశిని పాపాఘ్ని పరమ పవిత్ర అరణి
కాళంగి కుశస్థలి జలకళతో మెరిసె  కల్యాణి 
స్వర్ణముఖీ సత్యవతి పాలారు పీలేరు
వ్యవసాయానికి ఊతం హంద్రీ-నీవా, చెయ్యేరు
ఏర్పేడు సత్యవేడు పారిశ్రామిక రాచవీడు
ఆలయాల సౌరభం పర్యటకానికిదే తోడు
ఎర్రబంగారం  మన శేషాచల చందనం 
జిల్లా వృద్ధికై ముందుకెల్లాలి మన్నవరం

పూతలపట్టు, ఈసలాపురం కట్టు
కాళహస్తి కలంకారికి చెయ్యిత్తి జైకొట్టు
అరుదైన సంపద సహజ శిలాతోరణం
అతి ప్రాచీనం గుడిమల్లం శివలింగం
#Chittoor #Tirupati
Read 4 tweets
రాయలసీమ నదులు - ద్వితీయ భాగం
మొదటి భాగంలో కృష్ణా, తుంగభద్రా, పెన్నా, బాహుదా, కుందేరు, స్వర్ణముఖి, పాపాఘ్ని, హగరి, మాండవ్య నదుల గురించి రాయడమైనది. ఈ భాగంలో చిత్రావతి, సగిలేరు, పావనీ, అర్జున, గార్గేయ, కౌండిన్య, పాండ్య, అరుణా, కాళంగి నదుల గురించి, సీమ నదీ సాహిత్యం గురించి రాశాను1/n
చిత్రావతి - దేవ కన్యా అని కూడా అంటారు - పవిత్ర పుట్టపర్తి క్షేత్రం ఈ నదీ తీరంలోనే ఉంది. చిత్రావతి నది పెన్నా నదికి ఉపనది. గండికోట వద్ద చిత్రావతి నది పెన్నా నదిలో కలుస్తుంది. ఈ నది మీదే పర్నపల్లి వద్ద చిత్రావతి బాలన్సింగ్ రిజర్వాయర్ ఉన్నది. 2/n
సగిలేరు(స్వర్ణబాహు) - సకిలినాటి సీమలో (గిద్దలూరు -బద్వేల్ ప్రాంతం ) ప్రవహించే నది కాబట్టి సగిలేరు అయింది. ఈ నదినే స్వర్ణబాహు అని కూడా అంటారు. ఈ నది పెన్నా నదికి ఉపనది. ఎగువ సగిలేరు, దిగువ సగిలేరు ప్రాజెక్టులు ఈ నది మీద ఉన్నవి. 3/n
Read 13 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!